ఆదివారం 29 మార్చి 2020
Editorial - Feb 15, 2020 , 22:49:21

జయహో కేసీఆర్‌

జయహో కేసీఆర్‌

కేసీఆర్‌ పిలుపునిస్తే తెలంగాణ అంతా ఒక్కసారిగా కదిలి ప్రతిధ్వనించేది. ఆయన పిలుపు కోసం ఈ నేల ఎదురుచూసింది.రోడ్డుమీదనే ‘వంటావార్పు’ కార్యక్రమాన్ని నిర్వహించండని పిలుపునిస్తే తెలంగాణలోని కోటిన్నర మంది కదిలివచ్చివంటావార్పులో పాల్గొని విజయవంతం చేయటం మామూలు విషయం కాదు. తినే కంచాన్ని, గంటెను ఉద్యమ ఆయుధాలుగా మలిచి, పాటను ధూంధాంగా మార్చుకొని సాంస్కృతిక యుద్ధం కొనసాగించాడు. ఆమరణ నిరాహారదీక్ష చేబూని మృత్యువు ముఖద్వారం దాకా పోవటమేగాక మొత్తం దేశమే తెలంగాణ వైపు చూసేటట్లు చేసి ‘తెలంగాణ రాష్ట్ర ప్రక్రియ ప్రారంభం’అన్న ప్రకటన తెప్పించారు. తెలంగాణ వస్తదన్న విశ్వాసాన్ని ప్రజల్లో కలిగించి ఉద్యమాన్ని నడిపించారు. శ్రీకాంతాచారి ఆత్మార్పణ చేసుకుంటే గుక్కబెట్టి ఏడ్చారు. మీ కోసమే ఈ తెలంగాణ ఆత్మబలిదానాలు చేసుకోవద్దని యువతకు పిలుపునిచ్చారు.

కేసీఆర్‌..

తెలంగాణ సమాజంలో ఒక నామవాచకం కాదు..ఒక సర్వనామం

ఒక వ్యక్తి కాదు.. ఒక నిత్య చైతన్యవంతమైన సమాజం

జలజలా పూలు రాల్చే ఒక పొగడపూలచెట్టు కాదు..ఒక సతత హరితారణ్యం

ఎగసిపడిన ఒక ఉద్యమ కెరటం కాదు.. అభివృద్ధిని సమాజగతం చేసిన ఒక ఆచరణ సముద్రం.

ఒక జీవిత కాలాన్ని ప్రజలకు అంకితం చేసి, ప్రజల కోసం పనిచేస్తూ కొనసాగుతుండ టం అంత సులభమైంది కాదు. సమాజ మార్పుకోసం, సామాజిక అభివద్ధికి, ప్రజ ల రక్షకునిగా నిలిచి పనిచేయడానికి మిం చినది ఈ లోకంలో మరొకటి లేదు. అం దుకే వర్తమాన రాజకీయ చిత్రపటంలో కనిపించే నాయకులంతా నాయకులు కారు, ప్రజానాయకులమని ప్రకటనలు చేసుకునే వాళ్లంతా నాయకులుగా నిలువలేరు. ప్రజల మదిలో చెరగని సంతకం చేసిన నాయకునిగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు చరిత్రలో నిలిచిపోతారు. కేసీఆర్‌ అన్న మూడక్షరాలు తెలంగాణ అన్న నాలుగక్షరాలు చరిత్రలో శిలాక్షరాలుగా నిలిచిపోతాయి.


ఇప్పటివరకు చరిత్రకారులను చదువుకున్నాం. ఆ చరిత్ర నిర్మాతలను అధ్యయ నం చేసి వారి ఆచరణను చూసి ప్రేరణలు పొంది భవిష్యత్‌ తరాలు కొత్త అడుగు లు వేయటం జరుగుతూ వస్తుంది. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం ద్వారా తెలంగాణ నేల పులకించిపోయేవిధంగా అలుపెరగని ఉద్యమాన్ని చేపట్టి వెనుదిరిగి చూడకుండా, వెన్ను చూపకుండా ముందుకు సాగి రాష్ట్రం సాధించేదాకా విశ్రమించలేదు. రాజకీయ ప్రక్రియ ద్వారా టీఆర్‌ఎస్‌ను స్థాపించి మొత్తం తెలంగాణ సమాజం తరఫున ధీశాలిగా నిలిచిపోరాడిన రాజకీయ దురంధరుడిగా ప్రజల హృదయాల్లో కేసీఆర్‌ నిలిచారు. రాష్ట్ర సాధకునిగా గెలిచారు. రాష్ట్రం వచ్చాక తిరిగి ఉద్యమకారు డి చేతికే రాష్ట్ర పాలనాపగ్గాలు ప్రజలే తమ చేతులతో అందించారు. అది ఒక్కసారి కాదు, రెండవసారి కూడా అందించారు. ప్రజలకు ఆయనపై ఉన్న నమ్మకాన్ని ఎన్న డూ వమ్ము చేయలేదు. పాతాళగంగను నేలపైకి తెచ్చి నీళ్లకు ఎదురీతనేర్పి బీడుభూములపైకి కాళేశ్వరం ప్రాజెక్టు జలాలను మళ్లించారు. కోటి ఎకరాలకు నీళ్లందించే భగీరథ తపస్సును కొనసాగిస్తున్నారు. తెలంగాణ మట్టి బిడ్డలందరి తరఫున నిలి చి వాళ్లకోసం జలధారగా మారి ప్రవహిస్తున్న ప్రజా నాయకుడు కేసీఆర్‌.


కేసీఆర్‌ అపజయాలను ఓడించి, ఓడించి గెలిచిన వ్యక్తి. కమ్ముకొస్తున్న కారుచీకట్లను చీల్చుకుంటూ పోవటం, ఓడటం, పోరాడటం, కుట్రలను ఛేదించటం, గెలు వటం అన్నింటి రుచిచూసి వచ్చినవాడు. చివరికి చావు నోటిదాక పోయి తిరిగొచ్చి నవాడు కేసీఆర్‌. ఏదీ అనుకున్నంత సులభం కాదు, ఉద్యమమంటే ఒక జపంకాదు, అందుకోసం తపించటం, అందుకోసం అవసరమైతే తనను తాను హరించుకోవటానికి సిద్ధపడాలి. ఇదంతా కేసీఆర్‌ జీవితంలో చూడటం జరిగింది. తెలంగాణలో పధ్నాలుగేండ్లు ఉద్యమ వనవాసం చేసిన ఈ కాలం నాయకుడు కేసీఆర్‌. ఉద్యమకాలంలో కన్నీళ్లను దిగమింగి గుండె దిటువు చేసుకొని నిలిచాడు. ఉద్యమంలో ఎన్నెన్నో కలతలు, ఎన్నెన్నో ఒడిదుడుకులు, ఎన్నెన్నో కుట్రలు, కుతంత్రా లు, వెన్నుపోట్లు, మోసాలు, ద్రోహాలు వీటన్నింటిని ఎదుర్కొంటూ గుండెను దిటువుగా నిలుపుకొని నిలిచి రాజకీయ ప్రక్రియా ఉద్యమంలో కొనసాగటం అందరివల్లా అయ్యే పని కాదు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక చాలామంది చాలా చాలా మాట్లాడుతున్నారు. కానీ ఆ పధ్నాలుగేండ్ల ఉద్యమ తెలంగాణ కేసీఆర్‌ పిలుపు కోసం ఎదురుచూసింది నిజం, కేసీఆర్‌ ఒక్కమాట చెబితే తెలంగాణ సమాజం కదిలివచ్చింది సత్యం.


రాజకీయ ప్రక్రియారథాన్ని నడుపుకొంటూ ముందుకుసాగటం అంత సులభమేమీ కాదు. ఆ రథచక్రాలు నడువాలంటే ఎన్నెన్నో వ్యూహాలు, ఎత్తుగడలు కావా లి. ఉద్యమరథాన్ని ముందుకుసాగకుండా చేసే శక్తుల్ని ఎదుర్కొంటూ సాగాలి. మం త్రి హోదాలో సకల సౌఖ్యాలు కళ్లముంగట ఉంటే వాటిని విసిరికొట్టి రాజ్యాన్ని వదిలి ఉద్యమ జెండా చేతపట్టుకొని ముందుకురావటం అందరికీ సాధ్యమయ్యేది కాదు. ఉద్యమ జెండా చేతబట్టుకోవటానికి ముందు ఏడెనిమిది నెలలు ఒక పరిశోధక విద్యార్థిగా మారిపోయి చరిత్రనంతా చదువుకున్నారు. చరిత్ర చెప్పిన పాఠాల్లోంచి తెలంగాణ ఎక్కడెక్కడ నిర్లక్ష్యపు నీడల్లోకి పోయిందో లోతుల్లోకి వెళ్లి తెలుసుకున్నారు. గతంలో తెలంగాణ కోసం 1969లో గర్జించిన కంఠాలలో మిగిలి ఉన్న వాళ్లదగ్గరకు తానే స్వయంగా వెళ్లి మాట్లాడారు. 


అట్లా తనను తాను పదునుపెట్టుకుంటూ ఆలోచనాధారల్లో అధ్యయనాలు చేసుకుంటూ వెతుక్కుంటూ కొత్త ఉద్యమదారులు వేసుకుంటూ పోతున్న క్రమంలోనే ఆ తరం ఆలోచనాశీలి కొత్తప ల్లి జయశంకర్‌ దగ్గరికి వెళ్లి ఆయనను అక్కున చేర్చుకున్నారు. ఇక జయశంకర్‌ జీవిత లక్ష్యం తెలంగాణే. ప్రజలందరి ఏకైక లక్ష్యమైన తెలంగాణ రాష్ట్రం కేసీఆర్‌తో సాధ్యమవుతుందని నమ్మి ఆయన వెంటే జయశంకర్‌ ఉన్నారు. ‘తెలంగాణ రాష్ట్ర ప్రక్రియ ప్రారంభం’ అన్న కేంద్రం చెప్పిన మాట విని జయశంకరుడు కన్నుమూశారు. 1948 నుంచి 52 వరకు, 1969 నుంచి మొదలైన ఉద్యమం 369 మంది అమరులు, ఆ తర్వాత పెద్దమనుషుల ఒప్పందాలు, ఉద్యమ విరామాలు, తెలంగాణను అడుగడుగునా అణగదొక్కిన ఆధిపత్యాలను అన్నింటిని లోతుగా అవగాహన చేసుకున్నారు.


తనకుతాను కళ్లారా చూశారు. రోజులోని 15 నుంచి 16 గంటలవరకు ఉద్యమ చర్చలకు నెలలు నెలలు కేటాయించారు. ఏయే రంగాల్లో ఎక్కడెక్కడ ఎంతెంత నష్టం జరిగిందో లోతుల్లోకి పోయి చూసివచ్చారు. ఇంత కఠోర శ్రమ కేసీఆర్‌లో ఉన్నది. అందరి పేర్లు చెప్పటం సాధ్యం కాదుగానీ మలిదశ ఉద్యమానికి ముందు అన్నివర్గాల అన్ని రాజకీయపక్షాలు, తెలంగాణ మేధావులతో ఎన్నె న్నో గంటలు గడిపారు. అసెంబ్లీ దగ్గర్నుంచి ఆదిలాబాద్‌ అడవి చివరివరకు అన్ని కోణాలను పట్టిచూశారు. తెలంగాణ సమాజాన్ని విశ్లేషించుకుంటూ, సమాజ గమ న సూత్రాలను అవగతం చేసుకుంటూ అడుగులు వేశారు. 


నాగార్జునసాగర్‌ ఎడమకాలువ నుంచి పాలమూరు మారుమూల పల్లెవరకు కలియదిరిగారు. నీళ్లు, నిధులు, కొలువులు అన్న నినాదానికి ఊపిరిపోశారు. భావజాల వ్యాప్తిని, ప్రజాసంఘాల ఐక్యతను చూసుకుంటూనే కీలకమైన రాజకీయ ప్రక్రియ జెండాను దేశమంతా ఎగురవేస్తూ కార్ల ర్యాలీ చేశారు. 39 రాజకీయపార్టీల చేత జై తెలంగాణ అనిపించారు. వ్యూహాలు, ఎన్నికల ఎత్తుగడల్లో భాగంగా కరుడుగట్టిన తెలంగాణ వ్యతిరేకుల చేత తెలంగాణ అనిపించారు. కాంగ్రెస్‌తో ఒకసారి ఎన్నికల జతకట్టి కేంద్రాన్ని ప్రత్యేక తెలంగాణకు ఒప్పించారు. టీడీపీ చివరికి తెలంగాణ రాష్ట్ర సాధనకు ఒప్పుకుంటూ తీర్మానం చేసేదాకా కేసీఆర్‌ వదిలిపెట్టలేదు. 


ఎర్ర జెండాలన్నీ తలూపాయి. మరోపక్క ఎగిసిన ఉద్యమాలు, గ్రామస్థాయి నుంచి జిల్లాస్థాయి, రాష్ట్రస్థాయి వరకు జరిగిన సభలు మామూలివి కావు. దేశ చరిత్రలోని చిరస్థాయిగా నిలిచిపోయే సింహగర్జనల వంటి సభలు లక్షల మందిని ఏకం చేయటం అసాధారణమైన పని. ఈ మహత్తర కర్తవ్యాన్ని ఆ ఒక్క బక్కప్రాణమే కొనసాగించింది. ఇది కఠోరశ్రమ కాదు. తెలంగాణ రాష్ట్రసాధన ఉద్యమాన్ని ప్రపంచ అస్తిత్వ ఉద్యమ చరిత్రలో ఒక మహాపాఠంగా నిలిచిపోయే విధంగా చేసిన ఘనమైన చరిత్ర కేసీఆర్‌ది. తెలంగాణ తల్లిని రూపకల్పన చేశారు. టీఆర్‌ఎస్‌ భవనాన్ని నిర్మింపజేసి అన్ని సంఘాలను నడిపించే ఉద్యమ కార్యాలయాన్ని నడిపించి ఉద్యమ మనోధైర్యాన్ని, సడలని సంకల్పాన్ని ఈ మట్టికి అందించారు. పధ్నాలుగేండ్లు టీఆర్‌ఎస్‌ ఉద్యమపార్టీని కాపాడుకుంటూ కార్యకర్తలను రక్షించుకుంటూ ప్రతికూల సమయాన్ని అనుకూల సమయాలుగా మార్చుకొని ముందుకుసాగటమన్నది మహా పెనుగులాటే.


కేసీఆర్‌ పిలుపునిస్తే తెలంగాణ అంతా ఒక్కసారిగా కదిలి ప్రతిధ్వనించేది. ఆయన పిలుపు కోసం ఈ నేల ఎదురుచూసింది. రోడ్డుమీదనే ‘వంటావార్పు’ కార్యక్రమాన్ని నిర్వహించండని పిలుపునిస్తే తెలంగాణలోని కోటిన్నర మంది కదిలివచ్చి వంటావార్పులో పాల్గొని విజయవంతం చేయటం మామూలు విషయం కాదు. తినే కంచాన్ని, గంటెను ఉద్యమ ఆయుధాలుగా మలిచి, పాటను ధూంధాం గా మార్చుకొని సాంస్కృతిక యుద్ధం కొనసాగించాడు. ఆమరణ నిరాహారదీక్ష చేబూని మృత్యువు ముఖద్వారం దాకా పోవటమే గాక మొత్తం దేశమే తెలంగాణ వైపు చూసేటట్లు చేసి ‘తెలంగాణ రాష్ట్ర ప్రక్రియ ప్రారంభం’ అన్న ప్రకటన తెప్పించారు. తెలంగాణ వస్తదన్న విశ్వాసాన్ని ప్రజల్లో కలిగించి ఉద్యమాన్ని నడిపించారు. శ్రీకాంతాచారి ఆత్మార్పణ చేసుకుంటే గుక్కబెట్టి ఏడ్చారు. మీ కోసమే ఈ తెలంగాణ ఆత్మబలిదానాలు చేసుకోవద్దని యువతకు పిలుపునిచ్చారు.


ప్రత్యేక తెలంగాణ స్వప్నం సాకారమైన తర్వాత అసలు సిసలు యజ్ఞం మొద లైంది. అది అభివృద్ధి యజ్ఞం. నీటి పారుదల ప్రాజెక్టుల రీ డిజైనింగ్‌ మొదలుకొని కొత్త పంచాయతీరాజ్‌ చట్టం దాకా, రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన మొదలుకొని పల్లె పల్లెకు నల్లాల ద్వారా నీరందించటం దాకా అలుపు లేని ప్రయాణం. ఒకప్పుడు What Bengal Thinks today India will Think tomarrow అనేవాళ్లు. ఆ పరిస్థితి మారింది. ఇవాళ తెలంగాణ వైపు దేశం చూడటం మొదలుపెట్టింది. రైతు బంధును ఒడిషా ఒడిసిపట్టుకున్నది. రెవెన్యూ ప్రక్షాళనను పక్కనున్న ఆంధ్రప్రదేశ్‌ అందిపుచ్చుకుంటున్నది. తెలంగాణకు హరితహారం అంటే మహారాష్ట్రకు మణిహా రం అంటూ ఊరూరా వనం పెంచే కార్యక్రమానికి మహారాష్ట్ర శ్రీకారం చుట్టబోతున్నది. మత సామరస్యానికి అచ్చమైన ఉదాహరణగా ఇవాళ హైదరాబాద్‌ దేశమంతా తనవైపు చూసేలా ఎవరికీ అందనంత ఎత్తులో నిలబడి ఉన్నది. ఒకప్పుడు భయంభయంగా నేను తెలంగాణవాడిని అని చెప్పుకోవడానికి సైతం సంకోచించి న సగటు తెలంగాణ వాసి ఇవాళ నేను తెలంగాణోన్ని అని గర్వంగా చెప్పుకుంటూ అస్తిత్వ ప్రకటన చేసే సందర్భం కళ్లముందు కనపడుతున్నది. ఇదంతా ఒక నిరంతర శ్రమ సంస్కృతి వల్ల మాత్రమే సాధ్యమైంది.


దేశ గమనాన్ని మార్చివేయగలమన్న ఉద్యమశక్తులకు ఒక దారిదీపం

ఉద్యమాన్ని, అభివృద్ధిని కలగలిపి రచించిన ఒక చైతన్యగీతం

తననుతానూ తగ్గించుకొని తన జన్మభూమి ముందు వినమ్రంగా నిలిచిన సం స్కారగానం

ఏ విశేషణంలోనూ ఒకేఒక్క సామాన్యుడు

సామాన్యుడికి పట్టా కట్టిన అసామాన్యుడు.


రేపు కేసీఆర్‌ పుట్టినరోజు. వలస పాలకుల పరాయిపాలన నుంచి విముక్తి కలిగించిన ఒక ధీర నాయకుడికి తెలంగాణ సమాజం కృతజ్ఞతలు తెలిపేరోజు. బీడు భూముల్లోకి గలగలా పారిన నీటి సవ్వడుల్లో నుంచి జలతరంగిణులు మోగించి హర్షం వ్యక్తంచేసే రోజు. ఆకుపచ్చ అరణ్యాల సాక్షిగా పికిలి పిట్టలు. గోరువంకలు  శుభాకాంక్షలు చెప్పేరోజు.కేసీఆర్‌కు కలలు కనడం  తెలుసు. వాటిని సాకారం చేసుకోవడమూ  తెలుసు. కళలు కురిపించడమూ తెలుసు. కారుణ్యం ప్రదర్శించడమూ తెలుసు. పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు.. జయహో కేసీఆర్‌.

(రేపు ముఖ్యమంత్రి కేసీఆర్‌ పుట్టినరోజు సందర్భంగా..)


logo