శనివారం 28 మార్చి 2020
Editorial - Feb 14, 2020 , 23:08:42

విద్యార్థులూ.. మనోధైర్యం కోల్పోవద్దు

విద్యార్థులూ.. మనోధైర్యం కోల్పోవద్దు

విద్యార్థులు తమకు పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చాయని నిరుత్సాహపడటం, ఫెయిల్‌ అయ్యామని ఆత్మహత్యలకు పాల్పడటం మనం తరచూ పత్రికల్లో చదుతున్నాం, టీవీల్లో చూస్తున్నాం. విద్యార్థులూ ఇక్కడ ఒక్క టి గమనించాలి. మార్కులు, ర్యాంకులే ప్రధానం కాదు. ఓటమిని గుణపాఠంగా స్వీకరిస్తేనే విజయానికి మార్గం సుగమమవుతుంది. చదువులో వెనుకబడినంత మాత్రాన ప్రపంచంలోని దారులన్నీ మూసుకుపోవు. ప్రపంచంలో ఎన్నో లక్ష్యాలు, మార్గాలున్నాయి. అందులో మనమూ ఒక లక్ష్యాన్ని అందుకుందాం. గెలుపునకు తుదిమెట్టు అం టూ ఏది ఉండదు. ఓటమి ఎప్పుడూ అపాయకారి కాదు. మనకు ఈ రెండింటినీ సాధించాల్సిన దానికి కావాల్సింది మనోధైర్యం, ఆత్మవిశ్వాసం, పట్టుదల మాత్రమే.


విద్యార్థులు ఎప్పుడూ, ఏ దశలోనూ నిరాశా నిస్పృహ లకు లోనుకావద్దు. మానసిక దృఢత్వంతో సాధించాలనే కసిని పెంచుకోవాలి. సమస్యలను సమర్థంగా ఎదుర్కొన్న ప్పుడే జీవితం సార్థకమవుతుంది. ఉన్నత శిఖరాలను అధి రోహిస్తారు. అంతేకానీ మానసిక ైస్థెర్యాన్ని కోల్పోయి తల్లి దండ్రులేమంటారో, తోటి స్నేహితులు ఏ విధంగా వ్యవ హరిస్తారోనని ముందుగానే తమకు తాము మానసికంగా కృంగిపోయి నిండుజీవితాన్ని మధ్యలోనే ముగించకూడ దు. జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలో విద్యార్థులకు తెలియజేసే బాధ్యత ముందు తల్లిదండ్రులు, ఆ తర్వాత, గురువులు, స్నేహితులు తీసుకోవాలి. జీవన పోరాటంలో విజయాలు, వైఫల్యాలు సహ జం. నేడున్న ఈ పోటీ ప్రపంచంలో తామనుకున్నది సాధించాలనే కాంక్ష విద్యార్థుల ఆలోచనల్లో పుట్టడం సహ జం.ఈ క్రమంలో ఒత్తిళ్లకు, ఆందోళనలకు లోనయ్యేవారు విద్యార్థులు ఎందరో ఉన్నారు. ఇలాంటి విద్యార్థుల్లో అపసవ్యత నెలకొంటుంది. ఈ క్రమంలో ఆ విద్యార్థులు శారీ రక అనారోగ్యాలకు గురవుతారు.


ఒకటి నేర్చుకోవాలనుకుంటున్నప్పుడు అది ఎంత కఠినమైనదైనా వెనుకడుగు వేయకూడదు. తోటి మిత్రులు, మేధావులతో చర్చించడం కానీ, విజేతల సాయం తీసుకోవడం కానీ చేయాలి. ఇలా ఎంతోమంది విద్యార్థులు చేసి లక్ష్యానికి చేరువయ్యారు. ఉన్నత శిఖరాలకు ఎదిగారు. ఇలా మనం విజేతలను ఆదర్శంగా తీసుకొని భావితరా లకు స్ఫూర్తిగా నిలుద్దాం. 

- అట్ల శ్రీనివాస్‌రెడ్డి, కరీంనగర్‌


logo