శనివారం 29 ఫిబ్రవరి 2020
ట్రంప్‌ పర్యటన

ట్రంప్‌ పర్యటన

Feb 13, 2020 , 23:15:00
PRINT
ట్రంప్‌ పర్యటన

ట్రంప్‌ భారత పర్యటన ఇరువురు నాయకులకు హర్షాతిరేకాన్ని కలిగిస్తున్నప్పటికీ, ఉభయ దేశాల స్నేహసంబంధాలను దృఢపరుస్తుందా? వాణిజ్య, రాజకీయ సంబంధాల్లో విభేదాలకు పరిష్కారాలను సూచిస్తుందా? అనే ప్రశ్న ఉత్పన్నమవుతున్నది. అంతర్జాతీయ సంబంధాలలో అమెరికానే అత్యంత దుందుడుకుగా వ్యవహరిస్తున్నది. అందులో ట్రంప్‌ మిత్రదేశాల మనోభావాలను ఏ మాత్రం లక్ష్య పెట్టరు. ఈ విషయంలో యురోపియన్‌ దేశాలే ఇబ్బంది పడుతున్నాయి. వాణిజ్య రక్షణ రంగాలతో పాటు అంతర్జాతీయ సంబంధాల విషయంలో కొంత నిక్కచ్చిగా వ్యవహరించడమే మంచిది.

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఈ నెల 24వ తేదీ నుంచి రెండురోజుల పాటు మన దేశంలో పర్యటించడం ద్వైపాక్షిక సంబంధాలలో ప్రాధాన్య ఘట్టమనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ట్రంప్‌ తొలిరోజు గుజరాత్‌లో పర్యటించి మరుసటి రోజు ఢిల్లీలో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకించి యూరప్‌లో మతవాద, జాత్యహంకార వాదనలు ప్రబలుతున్న సందర్భమిది. అధ్యక్షుడు ట్రంప్‌, ప్రధాని మోదీ ఇదే కోవకు చెందిన నాయకులు కనుక వీరిద్దరి మధ్య గాఢానుబంధం పెనవేసుకున్నది. మన దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగడానికి ముందు 2019 సెప్టెంబర్‌లో అమెరికాలో ‘హౌడీ మోదీ’ సభ ఏర్పాటైంది. ఇప్పుడు అమెరికాలో అధ్యక్ష ఎన్నిక లు ప్రచారం సాగుతున్న సందర్భమిది. తనకు లక్షలాది మందితో ఘనస్వాగతం లభించబోతున్నదని ట్రంప్‌ గొప్పగా చెప్పుకుంటున్నారు. ‘హౌడీ’ (కుశల ప్రశ్న) మాదిరిగానే గుజరాత్‌లో ట్రం ప్‌ కోసం ‘కెమ్‌ చో ట్రంప్‌' పేర సభ నిర్వహణ కోసం మోదీ ఏర్పాట్లు చేస్తున్నారు.


 విమానాశ్ర యం నుంచి సభాస్థలి వరకు భారీ ఎత్తున స్వాగత ఏర్పాట్లు చేస్తున్నారు. 1959లో నెహ్రూ హయాంలో అమెరికా అధ్యక్షుడు ఐసెన్‌హోవర్‌కు ప్రజా స్వాగతం పలికిన తర్వాత మళ్ళా ఇటువంటి ఏర్పాట్లు చేయడం ఇదే మొదటిసారి. ఇది రెండు దేశాల మధ్య పెరుగుతున్న స్నేహబంధం కన్నా ఇరువురు నాయకుల భావ సారూప్యాన్ని ఎక్కువగా సూచిస్తున్నది. మొదటిరోజు గుజరాత్‌ పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ అధ్యక్షుడు ట్రంప్‌ను గాంధీజీ సబర్మతి ఆశ్రమ సందర్శనకు తీసుకుపోతారు. ప్రజల ఉద్వేగాలను రెచ్చగొట్టి అధికారానికి వచ్చిన ట్రంప్‌ను మోదీ అహింసా ప్రవక్త అయిన గాంధీ ఆశ్రమ సందర్శనకు తీసుకుపోవడం విశేషమే.


ట్రంప్‌ పర్యటన నేపథ్యంలో భారత్‌ అమెరికా నుంచి హెలికాప్టర్ల కోసం ఇరువై ఐదు వేల కోట్ల రూపాయల మేర భారీ కొనుగోలు ఒప్పందాన్ని ఖరారు చేసినట్టు తెలుస్తున్నది. ఒకప్పుడు రక్షణ రం గంలో రష్యా ప్రధాన సరఫరాదారుగా ఉండేది. కానీ ఇటీవలికాలంలో అమెరికా నుంచి కొనుగోళ్ళు భారీ గా పెరిగిపోతున్నాయి. ట్రంప్‌ పర్యటన ఖరారు కాగా నే అమెరికాలోని రెండు పార్టీలకు చెందిన నలుగురు సెనేటర్లు కశ్మీర్‌, మానవహక్కుల అంశాలను లేవనెత్తడం గమనార్హం. వీరు అమెరికా విదేశాంగ మంత్రి కి రాసిన లేఖలో కశ్మీర్‌లో నెలకొన్న పరిస్థితుల పట్ల ఆందోళన వెలిబుచ్చారు. 


పౌరసత్వ సవరణ చట్టాన్ని కూడా ప్రస్తావించారు. ఈ లేఖ రాసినవారిలో ట్రంప్‌ కు సన్నిహిత సెనేటర్‌ లిండ్సే గ్రాహం కూడా ఉన్నా రు. అమెరికాలోని సెనేటర్లకు నిజంగా పౌరహక్కుల పట్ల అంత నిబద్ధత ఉంటే తమ దేశంలోనే అల్పసంఖ్యాకవర్గాల పరిస్థితిని చక్కదిద్దవచ్చు. అమెరికా సైన్యాలను మోహరించిన పశ్చిమాసియా దేశాలలో,  ఆఫ్ఘనిస్థాన్‌లో పరిస్థితిని పట్టించుకుంటే, భారత్‌ వైపు చూసేంత తీరుబడికూడా దొరుకదు. కానీ తమ వాణిజ్య ప్రయోజనాలను నెరవేర్చుకోవడానికి పౌర హక్కుల సమస్యను లేవనెత్తి బెదిరించడం వీరికి అలవాటుగా మారింది. అయితే సెనేటర్ల ఆరోపణల్లో నిజాయితీ లేనప్పటికీ, మన దేశంలో పరిస్థితులను మనం చక్కదిద్దుకోకూడదని కాదు. భారత్‌కు ప్రజాస్వామ్య దేశంగా ఉన్న ప్రతిష్ఠకు ఇటీవల మోదీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు మచ్చ తెస్తున్న మాట వాస్తవం. ప్రజాస్వామిక సూత్రాలను పాటించకపోతే ఆంతరంగికంగా ప్రతికూల పరిస్థితులు ఏర్పడటమే కాదు, అంతర్జాతీయంగా కూడా ఇబ్బందులు ఎదురవుతాయని మోదీ ప్రభుత్వం గ్రహించాలె.


ట్రంప్‌ భారత పర్యటన ఇరువురు నాయకులకు హర్షాతిరేకాన్ని కలిగిస్తున్నప్పటికీ, ఉభయ దేశాల స్నేహసంబంధాలను దృఢపరుస్తుందా? వాణిజ్య, రాజకీయ సంబంధాల్లో విభేదాలకు పరిష్కారాలను సూచిస్తుందా? అనే ప్రశ్న ఉత్పన్నమవుతున్నది. అంతర్జాతీయ సంబంధాలలో అమెరికానే అత్యంత దుందుడుకుగా వ్యవహరిస్తున్నది. అందులో ట్రంప్‌ మిత్రదేశాల మనోభావాలను ఏ మాత్రం లక్ష్య పెట్టరు. ఈ విషయంలో యురోపియన్‌ దేశాలే ఇబ్బంది పడుతున్నాయి. వాణిజ్య రక్షణ రంగాలతో పాటు అంతర్జాతీయ సంబంధాల విషయంలో కొంత నిక్కచ్చిగా వ్యవహరించడమే మంచిది. చైనా విషయంలో వ్యవహరించినట్టుగానే భారత్‌ పట్ల వాణిజ్య ఆంక్షలు విధిస్తామనే పరోక్ష సూచనలు అందుతున్నాయి. భారత్‌కున్న వాణిజ్య ప్రాధాన్యాలను అమెరికా రద్దుచేసింది. 


పలురంగాల్లో సుంకాలు విధించింది. ప్రపంచ వాణిజ్య ఒప్పందం ప్రకారం వర్ధమాన దేశాలకు కొంత వెసులుబాటు ఉంటుంది. కానీ ట్రంప్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత భారత్‌ను వర్ధమాన దేశాల జాబితా నుంచి తొలిగించారు. ఇరాన్‌, వెనిజులా దేశాల నుంచి చము రు దిగుమతి చేసుకోకుండా ఒత్తిడి చేయడం వల్ల భారత్‌కు ఆర్థికభారం పెరిగింది. రష్యా నుంచి రక్షణ కొనుగోళ్ల ఒప్పందాన్ని రద్దుచేసుకోమని అమెరికా నుంచి ఒత్తిడి వస్తున్నది. అమెరికాతో స్నేహబంధాన్ని కొనసాగిస్తూనే భారత్‌ స్వీయ ప్రయోజనాలను కాపాడుకోవాలె. ట్రంప్‌తో స్నేహా న్ని మోదీ దేశ ప్రయోజనాల పరిరక్షణకు ఏ మేర ఉపయోగించుకుంటారనేది ప్రధానం.


logo