బుధవారం 01 ఏప్రిల్ 2020
Editorial - Feb 13, 2020 , 23:06:22

ప్రేమికుల రోజు..

ప్రేమికుల రోజు..


మంచి కవిత కోసం..

కవిత్వాన్ని ప్రేమించాలి

మంచి శ్వాస కోసం..

ప్రకృతిని ప్రేమించాలి 

మంచి వ్యక్తిత్వం కోసం..

విలువలను ప్రేమించాలి

మంచి జీవనం కోసం..

పర్యావరణాన్ని ప్రేమించాలి

నీలో వెలుగు నిండటం కోసం..

నీలోని చీకటిని ప్రేమించాలి

విజయాన్ని చేజిక్కించుకునేందుకు

ఓటమిని ప్రేమించాలి

శతృత్వాన్ని అణిచివేసేందుకు

స్నేహాన్ని ప్రేమించాలి

వ్యామోహాన్ని వీడటంకోసం

ధ్యానాన్ని ప్రేమించాలి

ఆనందంగా బతికేందుకు

కన్నవారిని ప్రేమించాలి

దేశ ఔన్నత్యాన్ని చాటేందుకు

జన్మనిచ్చిన భూమిని ప్రేమించాలి

సూర్యచంద్రుల విశ్వప్రేమల్లే

దేశమే దేహమనుకొని ప్రేమించాలి

భారతీయతకదే సార్థకత కాదా

ప్రతీరోజూ ప్రేమికుల రోజే కాదా..!

- పాల్వంచ హరికిషన్‌

95024 52780


logo
>>>>>>