బుధవారం 23 సెప్టెంబర్ 2020
Editorial - Feb 12, 2020 , 23:50:36

రాష్ట్ర బీజేపీ వింత వైఖరి

రాష్ట్ర బీజేపీ వింత వైఖరి

తెలంగాణ అభివృద్ధి అవసరాల పట్ల ఇక్కడి బీజేపీ వైఖరి ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది. పాలించేది ఎవరైనా అభివృద్ధి అనేది రాష్ర్టానికి ఒక మౌలిక అవసరం. ఈ వాస్తవాన్ని గుర్తించి వ్యవహరించే పార్టీలనే ప్రజలు విశ్వసిస్తారు. ఇది మరిచిన బీజేపీ రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రస్థాయిలో తమ పలుకుబడిని ఉపయోగించే బదులు, కేంద్రం నుంచి రాష్ట్రం ఏదైనా కోరటమే తప్పన్నట్లు ప్రతిదానికి రాజకీయ దాడి చేస్తున్నది. ఇది ప్రజలు హర్షించగల ధోరణి కాదు. ఒక పార్టీగా ఏ రాజకీయాలు చేసుకున్నా దానిని అభివృద్ధితో కలగలపటం మాత్రం మెచ్చదగిన పని కాదు.

మతాన్ని రాజకీయాలతో కలగలిపితే, ప్రజలు మతతత్వాన్ని గాక అభివృద్ధి-సంక్షేమం మోడల్‌నే ఎంచుకుంటారని, అప్పుడు నిన్నటి తెలంగాణ, నేటి ఢిల్లీ అసెంబ్లీల వంటి ఫలితాలే ఉంటాయని గ్రహించాలి. 2014లో తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి రాష్ట్ర బీజేపీ తీసుకుంటున్న వైఖరి ని ఒకసారి గమనించండి. అప్పుడు ఇక్కడ కేసీఆర్‌ ప్రభుత్వం, కేంద్రం లో మోదీ ప్రభుత్వం ఏర్పడ్డాయి. కొత్త రాష్ట్రం అయినందున, అనేక దశాబ్దాలుగా అంతర్గత వలస దోపిడీకి గురై వెనుకబడిపోయింది గనుక అభివృద్ధి అవసరాలు అనేకం ఉంటాయి. అందుకోసం కావలసిన సహాయానికి కేంద్రం వైపు చూడటం సహజం. సహాయాన్ని అందించవలసి న బాధ్యత కేంద్రంపై మామూలుగానే రాజ్యాంగానుసారం ఉంటుంది. వెనుకబడిన రాష్ర్టాలకు మరింత సహకరించవలసిన అదనపు బాధ్యత కూడా ఉంటుంది. నిబంధనల ప్రకారమే గాక, విచక్షణ ఆధారంగా మరి న్ని నిధులు ఇచ్చే వెసులుబాటు కేంద్ర ఆర్థిక సంఘం కల్పిస్తున్నది. ఆ ప్రకారం గతంలో కాంగ్రెస్‌, యూపీఏ ప్రభుత్వాలుగాని, బీజేపీ, ఎన్డీయే ప్రభుత్వాలు గాని చేస్తూ వస్తున్నదే తప్ప అందులో కొత్త లేదు. వాస్తవానికి ఈ విచక్షణ వెసులుబాటును గతంలో కాంగ్రెస్‌, ఇప్పుడు బీజేపీ ఒక ఆయుధంగా ఉపయోగించుకుంటూ వచ్చాయి. తమకు నచ్చని రాష్ట్ర ప్రభుత్వాలను బ్లాక్‌ మెయిల్‌ చేయటం, నచ్చినవాటికి చేతికి ఎముకలేని పద్ధతిలో నిధులివ్వటం ఒక ఆనవాయితీగా మారింది. మన ఫెడరల్‌ వ్యవస్థలోని కేంద్ర-రాష్ట్ర ఆర్థిక సంబంధాల్లో ఇదొక నిరంతర వివాదంగా మారింది.


ఇటువంటి పరిస్థితుల మధ్య కేంద్రం నుంచి అవసరమైన నిధులు, ప్రాజెక్టులు సంపాదించుకోవటం వేర్వేరు రాష్ర్టాలకు వలెనే తెలంగాణకు కూడా ఒక నిరంతర యుద్ధంగా మారింది. 2014 నుంచి మొదలుకొని గత ఆరేండ్లుగా ఇదేవిధంగా సాగుతుండగా, ఈ విషయమై తెలంగాణ బీజేపీ వైఖరి ఏమిటి? ఈ నాయకత్వం ఈ గడ్డకు చెందినదే. ఇక్కడి కష్టసుఖాలు తెలిసినదే. స్వరాష్ట్ర సాధన విషయంలో కాంగ్రెస్‌, కమ్యూనిస్టుల వలె దోబూచులాడటం గాక నిజాయితీగా నిలబడినటువంటిదే.  దానిని బట్టి చూసినప్పుడు రాష్ర్టావతరణ తర్వాత రాష్ట్ర అభివృద్ధి అవసరాల పట్ల కూడా అదేవిధమైన తెలంగాణ భక్తిని చూపాలి. వారు ఆ పని చేసినట్లయితే రాష్ర్టాభివృద్ధికి ఉపయోగపడటమేగాక, ప్రధానమంత్రి మోదీ 2014లోనే రాష్ర్టాలకు హామీ ఇచ్చిన  సహకార ఫెడరలిజం ప్రకటనకు అనుగుణంగా ఉండేది. ఇటు తెలంగాణ అవసరాలను, అటు రాజ్యాంగ నిబంధనలను, మరొకవైపు బీజేపీ చేసుకుంటూ రాష్ట్ర బీజేపీ నాయకులు కేంద్రం నుంచి వీలైనంత ఎక్కువగా రాబట్టేందుకు ప్రయత్నించవలసింది. పైన అనుకున్నట్లు నిధులు, ప్రాజెక్టుల కేటాయింపుల లో కేంద్రానికి గల విచక్షణాధికారాలు తక్కువకావు గనుక, దానిని అనువుగా చేసుకుంటూ ఎంతో సాధించవలసింది. ఆ పని చేస్తూ అందుకు ప్రచారం కూడా చేసుకున్నట్లయితే, ఈ ఆరేండ్లలో తమకు ప్రజాదరణ ఎంతో లభించి ఉండేది. అంతమాత్రాన అధికారానికి  వచ్చినా రాకపోయినా, ప్రజల దృష్టిలో విశ్వసనీయత మాత్రం ఇపుడు కనిపిస్తున్న దాని కన్న ఎక్కువ ఉండేది. కానీ అంతా విరుద్ధంగా జరిగింది.


తెలంగాణ ఏర్పాటును గట్టిగా బలపరిచిన బీజేపీ ఆ మేరకు ప్రజలలో కొంత అభిమానాన్ని సంపాదించి కూడా సీట్లు గెలువలేకపోవటం తెలిసిందే. అందుకు కారణాల చర్చ ఇక్కడ అక్కరలేదు గాని, ఆ తర్వాత నుంచి వారు సరైన పాఠాలు గ్రహించి రాష్ట్ర అభివృద్ధికి చేయూతనిస్తూ, ప్రజల ఆదరణను సంపాదించటానికి బదులు మొదటినుంచే రాజకీయ క్రీడలు ఆరంభించారు. తమది రాజకీయ పార్టీ అయినందున ఒకవైపు అటువంటి క్రీడలు సాగించినప్పటికీ మరొకవైపు రాష్ట్ర అభివృద్ధికి సహకరించవలసింది. రాజకీయాలు ఒకస్థాయిలో ఏమి ఉన్నా, ప్రధానంగా ప్రజల విశ్వాసం సంపాదించటం సరైన వ్యూహమవుతుంది. రాష్ట్ర అభి వృద్ధికి సహకరించటం వల్ల అది సాధ్యమయ్యేది. కానీ ఈ రాజకీయ సూక్ష్మం అర్థం కాని తెలంగాణ బీజేపీ నాయకులు పూర్తిగా రాజకీయ క్రీడలో పడి కొట్టుకుపోయారు. ఇప్పటికీ అదే చేస్తున్నారు. ఇది జరుగు తూ వచ్చిన క్రమమెట్టిది?


తెలంగాణ ఏర్పడిన కొత్తలో వారు ముఖ్యమంత్రి కేసీఆర్‌ పూర్తిగా మోదీకి విధేయునిగా ఉండగలరని ఆశించారు. రాష్ట్ర అవసరాల కోసం కేంద్రంలోని బీజేపీకి రాజకీయంగా అండగా నిలవగలరని, రాజ్యసభలో తమకు ఆధిక్యత లేనందున అక్కడ సహకరించగలరని భావించారు. అదే క్రమంలో పుణ్యంతో పాటు పురుషార్థం అన్నట్లుగా టీఆర్‌ఎస్‌ ప్రభు త్వం ద్వారా తమ వ్యక్తిగత ప్రయోజనాలను నెరవేర్చుకోవాలనుకున్నా రు. ఇది పూర్తిగా లోగడ ఇక్కడ చంద్రబాబు, ఢిల్లీలో వాజపేయి ఉండినప్పటి తరహా నమూనా. కానీ టీఆర్‌ఎస్‌ విషయానికి వచ్చేసరికి తమ అంచనాల ప్రకారం జరుగలేదు. కేసీఆర్‌ కేంద్రంతో మంచికి మంచి చెడు కు చెడు అన్నట్లు స్వతంత్ర వైఖరి తీసుకున్నారు. మరొకవైపు మోదీ ప్రభుత్వం తెలంగాణ కోసం ప్రత్యేకంగా ఏమీ చేయకపోగా, తన అవసరాల కోసం ఒక దశ అంతా రాజకీయంగా అస్పష్ట వైఖరిని అవలంబించింది. దీనంతటి మధ్య తెలంగాణ బీజేపీ నేతలు అయోమయానికి గురయ్యారు. 


ఇక్కడ తమ పార్టీ పెరుగుదల కోసం కేసీఆర్‌ ప్రభుత్వాన్ని విమర్శించాలో లేక మోదీ ప్రభుత్వానికి రాజకీయ అవసరాలుంటాయి గనుక మెతకదనం చూపాలో వారికి అర్థం కాలేదు. 2014-18 చివరి దశకు వచ్చేసరికి పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా సూచన మేరకు కేసీఆర్‌ పై దాడి అయితే మొదలుపెట్టారు గాని, ఇన్నాళ్ళు నీడకు నిద్రపోయిన ఎద్దు ఇప్పుడు దున్నమంటే దున్నుతుందా అన్నట్లు తయారైంది పరిస్థితి. అయితే ఈ మొదటి విడుత కాలమంతా రాష్ట్ర బీజేపీ చేసిన అతిపెద్ద తప్పు రాష్ట్ర అవసరాల సాధన కోసం కేంద్ర స్థాయిలో ఎటువంటి కృషి చేయకపోవటం. తక్కిన విషయాలు ఎట్లున్నా వారికి ప్రజల్లో విశ్వసనీయతకు సంబంధించి మొదటి విడుతలో నష్టం చేసింది, ఇప్పుడు 2019 నుంచి రెండవ విడుతలోనూ నష్టం చేస్తున్నదిదే.


కేసీఆర్‌ ప్రభుత్వంపై దాడిచేసి, పథకాలకు, నిధులకు మోకాలడ్డి ఆ క్రమంలో లభించే పబ్లిసిటీని చూసి బీజేపీ నేతలు ఆనందించటం కనిపిస్తున్నదే. కానీ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని నిబంధనల ప్రకారం ఏమి అడిగినా, అవసరాల దృష్ట్యా కొన్ని అదనంగా కోరటం అన్ని రాష్ర్టాలు చేసేదే అయినందున ఆ ప్రకారం చేసినా, అదేదో మహా నేరం, దేశద్రోహం అయినట్లు వెంటనే విరుచుకుపడటం తెలంగాణ బీజేపీ నేతలకు ఒక ఆనవాయితీగా మారింది. ఉదాహరణకు, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయహోదా కావాలని కోరితే ఆ మాట విభజన చట్టంలో లేదంటూ వాదించేవారి తీరు జుగుప్సాకరంగా లేదా?


సరిగ్గా ఇక్కడనే గమనించదగ్గ మరొక విషయం ఉంది. మొదటి విడు త చివరిదశలో అమిత్‌ షా సూచనల మేరకు వీరు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పై దాడి ప్రారంభించినట్లు పైన చెప్పుకున్నాం. కేసీఆర్‌ తమకు పూర్తి విధేయునిగా ఉండగలరనే భ్రమలు ఆ సరికి తొలగటం, ఇక్కడ స్వతంత్రం గా ఎదుగాలనుకోవటం అందుకు కారణం. అంతవరకు మంచిదే. కానీ కేసీఆర్‌పై దాడిలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలపై సైతం దాడి చేయటం మొదలుపెట్టారు. రెండింటిని విడిగా చూస్తూ కేసీఆర్‌పై దాడి, రాష్ట్ర ప్రయోజనాల కోసం కృషి అనే వ్యూహాన్ని అనుసరిస్తే ప్రజలు దాని ని ఆ విధంగా అర్థం చేసుకుంటారు. కానీ కేసీఆర్‌ పాలనలో అభివృద్ధి జరిగితే ఆ పేరు ఆయనకు పోతుందని, అటువంటప్పుడు రాష్ట్ర అవసరాల కోసం తాము ఢిల్లీలో ఎందుకు ప్రయత్నించాలని హ్రస్వదృష్టితో ఆలోచించారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరే వాటిపై ఫిర్యాదులు చేసి మోకాలు అడ్డుపెడితే ఆ నష్టాలు, అపఖ్యాతి కేసీఆర్‌ ఖాతాలోకి పోయి ప్రజలు బీజేపీ వైపు మళ్లుతారని అంచనాలు వేశారు. 


ఇది ఎంతమాత్రం వివేకం లేని రాజకీయమని చెప్పేందుకు పాండిత్యం అక్కరలేదు. రాష్ర్టానికి ఎన్నో అవసరాలుంటాయి గనుక కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం అడుగుతూనే ఉంటుంది. ఆ కోరికలు ఒకోసారి మితిమీరినవి కూడా కావ చ్చు. అయినా అడుగటం తప్ప రాష్ర్టాలకు మార్గాంతరం లేదు. ముఖ్యం గా కేంద్రం రాష్ర్టాల ఆర్థిక ప్రయోజనాలకు, హక్కులకు, ఫెడరల్‌ వ్యవస్థ కు విరుద్ధంగా వ్యవహరిస్తున్నప్పుడు ప్రతిఘటించటం, డిమాండ్లు చేయటంలో తప్పేమిటి? మన దేశంలో సోకాల్డ్‌ సహకార ఫెడరలిజం చరిత్ర అంతా రాష్ర్టాల హక్కులను హరించి కేంద్రీకరణలను పెంచటం, ఆ స్థితి ని రాష్ర్టాలు ప్రతిఘటించటం చరిత్రగానే మారలేదా? ఇదిగాక రాష్ట్ర విభజన చట్టంలో గల అనేక అంశాలను మోదీ ప్రభుత్వం సాగదీస్తుండటం వల్ల తెలంగాణకు కలుగుతున్న నష్టాలు ఇక్కడి బీజేపీ నాయకులకు తెలియనివా? రాష్ట్ర అభివృద్ధి విషయంలో రాజకీయాలను పక్కనపెట్టి అన్ని పార్టీలు ఒకటి కావాలనే సూత్రం వారు విననిదా?


కేసీఆర్‌ ప్రభుత్వంపై దాడిచేసి, పథకాలకు, నిధులకు మోకాలడ్డి ఆ క్రమంలో లభించే పబ్లిసిటీని చూసి బీజేపీ నేతలు ఆనందించటం కనిపిస్తున్నదే. కానీ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని నిబంధనల ప్రకారం ఏమి అడిగినా, అవసరాల దృష్ట్యా కొన్ని అదనంగా కోరటం అన్ని రాష్ర్టాలు చేసేదే అయినందున ఆ ప్రకారం చేసినా, అదేదో మహా నేరం, దేశద్రోహం అయినట్లు వెంటనే విరుచుకుపడటం తెలంగాణ బీజేపీ నేతలకు ఒక ఆనవాయితీగా మారింది. ఉదాహరణకు, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయహోదా కావాలని కోరితే ఆ మాట విభజన చట్టంలో లేదంటూ వాదిం చేవారి తీరు జుగుప్సాకరంగా లేదా? పార్టీని ఒక పద్ధతి ప్రకారం పాజిటి వ్‌గా ఉమ్మడి రాష్ట్రంలో నిర్మించుకోలేని అసమర్థులు, విభజన తర్వాత కూడా అదే అసమర్థత చూపుతున్నవారు తమను తాము ఇటువంటి కుహనా వ్యూహాలకు బందీలుగా మార్చుకున్నారు. ఆ విధంగా వారు తమకు తాము హాని చేసుకుంటే ప్రజలకు అభ్యంతరం ఏమీ ఉండనక్కరలేదు. కానీ తెలంగాణ ప్రయోజనాలకు సైంధవులుగా మారితే మాత్రం తప్పకుండా అభ్యంతరకరమే.


logo