సోమవారం 06 ఏప్రిల్ 2020
Editorial - Feb 12, 2020 , 23:49:02

అభివృద్ధికి ప్రతీక మేడారం

అభివృద్ధికి ప్రతీక మేడారం

నాటి సమ్మక్క-సారలమ్మ పోరాట స్ఫూర్తికి కొనసాగింపుగా ఆవిష్కృతమైన కేసీఆర్‌ స్వయం పాలన, నాడు కోల్పోయినసుందర మనోహర చిత్ర ప్రతీకలను సరికొత్తగా ముందుకుతెస్తున్నది. నాటి స్వయం పాలనకోసం పోరాడిన సమ్మక్క-సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు, జంపన్న వనవీరుల రక్తంతో తడిసింది. నేడు తెలంగాణ కోసం అదే స్ఫూర్తిని కొనసాగించి సాగునీటి జలాలతో ఆ రక్తపు మరకల జ్జాపకాల స్థానంలో అభివృద్ధి ఆనవాళ్లను ప్రవేశపెట్టింది. నేడు సాగునీటి సెలయేటి సవ్వళ్ళు వినిపిస్తున్నవి. జంగల్‌లోని ఆదివాసీల జమీన్లో నిత్య జల ప్రవాహంతో జల్‌జంగల్‌ జమీన్‌ అనే ఉద్యమ నినాదాన్ని నాటి మన్యం వీరుల స్ఫూర్తిని వాస్తవీకరిస్తున్నది.

సోషియాలజీలో మానిఫెస్ట్‌ ఫంక్షన్స్‌, (ఉద్దేశింపబడిన కార్యా లు) లేటెంట్‌ ఫంక్షన్స్‌ (ఒక కార్యం ద్వారా లభించే అనుద్దేశపు ఫలం) అనే అంశమొకటి ఉన్నది. ఒక పనిని చేపట్టినప్పుడు మనం సదరు పనిని ఏమి ఉద్దేశించి చేస్తున్నామో.. అది నెరవేరుతూనే.. దాంతో  పాటు ఉద్దేశింపబడని అదనపు కార్యం కూడా మనకు తెలియకుండానే నెరవేరడమనే సామాజిక సిద్ధాంతాన్ని మాలినోవిస్కీ అనే ఫ్రెంచి సోషియాలజిస్ట్‌ ముందుకుతెచ్చాడు. దీన్నే రాబర్ట్‌ మర్టన్‌ అనే సామాజిక శాస్త్రవేత్త మరింతగా అభివృద్ధి చేసిండు.ఒక మతం అనేది ఆయా సమాజాల్లోని మనుషులను కట్టుబాట్లలో పెట్టి కొన్ని నిర్దిష్ట ప్రామాణిక విలువలతో సహజీవనం చేసే ఏర్పాట్లను చేస్తుంది. 


ఇది ఆ మతం మానిఫెస్ట్‌ ఫంక్షన్‌. అదే సందర్భంలో ఆ మతం నెరవేర్చే లేటెంట్‌ ఫంక్షన్‌ ఏమంటే ఆ మతాన్ని ఆచరించే మనుషుల నడుమ ఐక్యత సాధించడం. ఈ నేపథ్యంలోంచి మనం సమ్మక్కసారలమ్మ జాతరను అర్థం చేసుకోవచ్చు. సమ్మక్క సారక్క మేడారం జాతర జరుపడంలోని ఉద్దేశం (మానిఫెస్ట్‌ ఫంక్షన్‌) ఏందంటే దేవతల జాతర. హిందు మతంలోని అన్ని భక్తిమార్గాల మాదిరే ఇక్కడికీ జనం వెల్లి తమ మొక్కు లు తీర్చుకుంటారు. కానీ ఈ జాతర ద్వారా మనం అర్థం చేసుకోవాల్సిన లేటెంట్‌ ఫంక్షన్‌ ఉంది. అది తెలుసుకుందాం. మేడారం జాతర ద్వారా మనం మూడు ముఖ్యమైన అదనపు నిర్వచనాలను అర్థం చేసుకోవాల్సి ఉంటది. 


హిందూ తత్వం అంటే మత రాజకీయవాదులు చెప్పే మనువా ద హిందుత్వమే కాదు, మూలవాసి హిందుత్వం కూడా ఉన్నదని సమ్మ క్క-సారక్క జాతర నిరూపించిన మొదటి అంశం. ఇక రెండోది- తెలం గాణలోని గోదావరి లోయ ప్రాంతమంటే కల్లోలిత ప్రాంతమని తూపాకులు తూటాల మోతలనే వలసపాలనలోని ప్రతీకలకు విరుగుడుగా కాళేశ్వర ప్రాజెక్టుల ద్వారా వాగులై వంకలై సాగునీరై పారుతున్న ప్రాణహిత గోదావరి జీవజలంగా మారిపోయింది. తద్వారా అడివి జీవితాల్లో మైదా న ప్రాంతాల్లో మారుతున్న అభివృద్ధి ఆనవాళ్లను కన్నేపల్లి అడవిలో సరికొత్త ప్రతీకలకు అద్దం పట్టింది. ఇక మూడోది- నాగరికులంటే నగరాల్లో జీవించేవాళ్లు కాదు. ప్రకృతితో మమేకమై జీవించేవాళ్లు అనే అసలు సిస లు జీవన నిర్వచనాన్ని జాతర ఇచ్చింది. ఇట్లా మూడు రకాలుగా మన మెదళ్ల మీద ఇన్నాళ్లు రుద్దబడిన ప్రతీకాత్మక రూపక  ప్రతీకలను రద్దుచేసి వాటి స్థానంలో వినూత్న ప్రతీకలను ముందుకుతెచ్చే మానిఫెస్ట్‌ ఫంక్షన్‌ను మేడారం సమ్మక్క సారలమ్మ జాతర మనకు అందించింది.


సమ్మక్క సారలమ్మ జాతర-మూలవాసీ హిందుతత్వం: హిందూమత రూపంలో ఆధిపత్య విలువలు నడిపిస్తున్న మెయిన్‌ స్ట్రీమ్‌ సంస్కృతికి భిన్నంగా పంచభూతాలే కేంద్రంగా, గుడి లేని, తలుపులు తాళం లేని తనంతో ప్రకృతి దేవతలను కొలిచి మొక్కే ఓ సబ్బండ భారత మూలవాసీ సామాజిక సంస్కృతి ఇది. గుడి కడితేనే గుణం కుదురుకుంటుంది, భక్తి పరవశిస్తుందనే సంప్రదాయ మత విశ్వాసానికి భిన్నమైనది ఇది. గుడి లేని, తలుపులు లేని, సమ్మక్క-సారక్క గద్దెల మీదినుంచి భక్తుల హృదయాల్లో ఆధ్యాత్మిక జ్ఞానబోధ చేసింది. అసలు సిసలు భారత ఆధ్యాత్మిక తాత్వికతకున్న మూలాల మాయిముంతను దోలాడి పట్టి మతం ముసుగున కొనసాగుతున్న విచ్ఛిన్న నిర్వచనాల బూజును తొలిగించిన మహాక్రతువే సమ్మక్క-సారక్క జాతర.

తెలంగాణకే తలమానికమై సబ్బండ జాతులను తలెత్తుకునేలా చేస్తున్న మేడారం సమ్మక్క సారలమ్మ జాతర నిజంగా ఒక అప్రకటిత ‘ములవాసి హిందూ’ జాతీయ పండుగ. 


ఈ జాతర దేశీయ సాంస్కృతిక వారసత్వ సంపద. ఇందులో తరగని ఆధ్యాత్మికత వేదాల పురాణాల భావనలకన్నా లక్షల రెట్లు విస్తరించి ఉన్నది. అన్ని మతాల మానవులు కోట్లాదిగా తరలివచ్చి మొక్కిన మేడారం.. మొత్తంగా లౌకికవాద అలౌకికత్వాన్ని ప్రోదిచేసుకున్నది. గంగా జమునా తెహజీబ్‌ అనే దేశీయ సంస్కృతికి సరికొత్త నిర్వచనాన్ని అందిస్తూ సాగిన మేడారం జాతర వర్తమాన మత రాజకీయాలకు విరుగుడుగా నిలిచింది. సర్వమత ప్రేమికుడు ధార్మిక దార్శనికు డు సీఎం కేసీఆర్‌ ఆకాంక్షలకు అనుగుణంగా సాగిన సమ్మక్క సారక్కల జన మేళా విజయవంతమవ్వడం వెనుక ప్రజల అలౌకిక భావనే కాదు, తెలంగాణ పాలకుల లౌకికవాద ఆధ్యాత్మికత దాగి ఉన్నదని నిరూపించింది.


గోదావరి లోయకు మారుతున్న రూపక ప్రతీక: గోదావరి లోయ తెలంగాణ రాకముందు, సాగునీటి అభివృద్ధి జరుగకముందు గోచరమయ్యే ప్రతీకలు కల్లోలిత ప్రాంతం, సాయుధ పోరాటం. ఇది వలస పాలనలోని ‘గోదావరి లోయ’ అనే పదానికి మెటాఫర్‌. కానీ నేడు అదే గోదావరి లోయ తన రూపాన్ని తానే తీర్చిదిద్దుకునే కాళేశ్వర జీవజల ప్రాంతమైం ది. అభివృద్ధికి ఆనవాలుగా మారుతున్నది. స్వయం పాలనలో  తెలంగాణ వినూత్న ప్రతీకలకు నెలువవుతున్నది. నిన్నటిదాకా నిత్యం భయకంపితులను చేసే అభద్రత. ఇందుకు కారణం అడవిలోని క్రూరమృగాలు కాదు.. జీవనదులను ఎండబెట్టి, వాన నీటిని మళ్లించి మైదానంలోని బతుకులను ఎడారి చేసి, తెలంగాణ భావితరాన్ని అడవిపాల్జేసిన నాటి క్రూర వలస పాలన. తత్పలితంగా అమరుల రక్త తర్పణలతో తల్లడిల్లిన అడవితల్లి ఆక్రందన. దశాబ్దాలుగా అట్లా కొనసాగిన పోరాట ప్రతీకలు ఇప్పుడు రూపం మార్చుకొని సరికొత్తగా జీవం పోసుకున్నాయి. ఇందుకు సమ్మక్క సారక్క జాతర ఒక చారిత్రక నిదర్శనం.


నాటి సమ్మక్క-సారలమ్మ పోరాట స్ఫూర్తికి కొనసాగింపుగా ఆవిష్కృతమైన కేసీఆర్‌ స్వయం పాలన, నాడు కోల్పోయిన సుందర మనోహర చిత్ర ప్రతీకలను సరికొత్తగా ముందుకుతెస్తున్నది. నాటి స్వయం పాలనకోసం పోరాడిన సమ్మక్క-సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు, జంపన్న వనవీరుల రక్తంతో తడిసింది. నేడు తెలంగాణ కోసం అదే స్ఫూర్తిని కొనసాగించి సాగునీటి జలాలతో ఆ రక్తపు మరకల జ్జాపకాల స్థానంలో అభివృద్ధి ఆనవాళ్లను ప్రవేశపెట్టింది. నేడు సాగునీటి సెలయేటి సవ్వళ్ళు వినిపిస్తున్నవి. జంగల్‌లోని ఆదివాసీల జమీన్లో నిత్య జల ప్రవాహంతో జల్‌జంగల్‌ జమీన్‌ అనే ఉద్యమ నినాదాన్ని నాటి మన్యం వీరుల స్ఫూర్తిని వాస్తవీకరిస్తున్నది.

తెలంగాణ ధార్మిక దార్శనికత దేశానికి అవసరం: సీఎం కేసీఆర్‌ దార్శనికతతో అన్ని శాఖలు అద్భుతమైన సమన్వయంతో సమ్మక్క-సారలమ్మ దిగ్విజయం చేయడం చారిత్రాత్మకం.


logo