సోమవారం 06 ఏప్రిల్ 2020
Editorial - Feb 11, 2020 , 22:56:54

లైంగికదాడులకు అంతం లేదా?

లైంగికదాడులకు అంతం లేదా?

ఒకవైపు లైంగికదాడుల దోషులను కఠినంగా శిక్షిస్తూ కోర్టులు ఉరిశిక్షలు విధిస్తున్నా, మహిళలపై దాడులు ఆగటం లేదు. రోజుకొకటిగా అమానవీయ ఘటనలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. వరంగల్‌లో, కరీంనగర్‌లో జరిగిన దాడులు మహిళలపై జరుగుతున్న దాడుల విషయంలో సమాజం ఆలోచనాతీరులో మార్పు రావాల్సిన అవసరాన్ని చాటిచెబుతున్నాయి. లైంగికదాడుల నిర్మూలన ఎలా సాధ్యమో, ఎప్పుడు మహిళలు స్వేచ్ఛగా, నిర్భయంగా జీవించే పరిస్థితులు నెలకొంటాయో. 

- మల్లిక, చండూరు, నల్లగొండ జిల్లా


ప్రమాదాలను నివారించాలె

రోజురోజుకు రోడ్డు ప్రమాదాలు పెరుగుతూనే ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు అధికారులు ప్రమాదాల నివారణ కోసం ప్రత్యేక శ్రద్ధలు తీసుకుంటున్నప్పటికీ ప్రమాదాలకు అడ్డుకట్ట పడకపోతుండటం బాధాకరం. ఈ ప్రమాదాలకు అతివేగం, మద్యం తాగి వాహనాలు నడిపించడం లాంటివే ప్రత్యేక కారణా లుగా చెప్పుకోవచ్చు. కాబట్టి వాహనదారులకు అవగాహన సదస్సులు నిర్వహించి రోడ్డు ప్రమాదాలను నివారించాలి. 

- బోడపట్ల కిషన్‌, కురిక్యాల, కరీంనగర్‌


రిజర్వేషన్లకు తిలోదకాలేనా?

ఉద్యోగాల్లో, పదోన్నతుల్లో రిజర్వేషన్లు తప్పనిసరి కాదని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వటం దేశంలోని బడుగు, బలహీనవర్గాలకు ఆశనిపాతం. తరతరాలుగా వివక్ష, అణిచివేతలతో కునారిల్లుతున్న వర్గా లు సుప్రీం తీర్పు కారణంగా మరింతగా వెనుకబాటుకు గురయ్యేపరిస్థితులు తలెత్తుతాయనటంలో సందేహం లేదు. ఈ విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇంకా ఏవిధంగానూ స్పం దించకపోవటం విడ్డూరం. మొదటినుంచీ ఆధిప త్య అగ్రవర్ణాల పార్టీగా ముద్రపడిన బీజేపీ, ఇప్పు డు తాజా తీర్పుతో తాను తలచిందే జరిగిందన్న ట్లు వ్యవహరిస్తుందా చూడాలి. సామాజిక వెనుకబడిన వర్గాల పట్ల బీజేపీ తన నిబద్ధతను చాటు కోవాలి. మరోవైపు దేశంలోని వెనుకబడిన వర్గాల ప్రజలు రిజర్వేషన్ల పరిరక్షణకు నడుం కట్టాల్సిన సమయం ఆసన్నమైనది. రిజర్వేషన్ల విషయంలో రాజ్యాంగ స్ఫూర్తిని పరిరక్షించుకునేందుకు

కదలాలి. 

- ఎర్ర సైదులు, వలిగొండ, యాదాద్రి భువనగిరి జిల్లా


logo