ఆదివారం 29 మార్చి 2020
Editorial - Feb 10, 2020 , 22:37:07

ప్రాథమిక అంశాలపై పట్టేది?

ప్రాథమిక అంశాలపై పట్టేది?

ఇటీవల వెలువడిన వార్షిక పాఠశాల విద్యా నివేదిక (అసర్‌) ప్రకారం ఒకటో తరగతి విద్యార్థుల్లో సుమా రు 60 శాతం చిన్నారులు రెండంకెల సంఖ్యలను గుర్తించలేకపోతున్నారు.  ప్రభుత్వ పాఠశాలల్లో బాలికల నమోదు ఎక్కువగా ఉంటే, ప్రైవేట్‌ పాఠశాలల్లో బాలుర నిష్పత్తి ఎక్కువగా ఉన్నది. దేశంలో చాలామంది పిల్లలు గణితం అంటే భయపడుతున్నట్లు నివేదికలు తెలియజేస్తున్నాయి. నేషనల్‌ అచీవ్‌మెం ట్‌ సర్వే-2017 ప్రకారం మూడవ తరగతి విద్యార్థుల్లో మూడోవంతు మంది పాఠాన్ని చదవలేకపోతున్నారు. 8వ తరగతి చదువుతున్న వారిలో 56 శాతం మంది మూడంకెల సంఖ్యను ఒక అంకెతో భాగించలేకపోతున్నట్లు, మూడోవంతు  పాఠ్యాంశాలను చదవలేకపోతున్నట్లు తెలుస్తున్నది. మూడవ తరగతిలో 70శాతం మంది విద్యార్థులు చిన్న చిన్న తీసివేతలు కూడా చేయలేకపోతున్నట్లు నివేదిక తెలు పుతున్నది. 


దేశవ్యాప్తంగా ఒకటవ తరగతిలో ప్రవేశాలు నూరుశాతం జరుగుతున్నప్పటికీ ఉన్నత విద్యకొచ్చేసరికి బడిమానేయటం పెరుగుతున్నది.  పదవ తరగతిలో ఉత్తీర్ణత పెంచాలనే ఉద్దేశంతో ప్రైవేట్‌ పాఠశాలల్లో విద్యార్థులకు 9 తరగతిలోనే 10వ తరగతి పాఠ్యాంశాలు బోధిస్తున్నారు. ఈ చర్యల వల్ల ప్రైవేట్‌ పాఠశాలల్లో పది ఉత్తీర్ణతాశాతం బాగానే ఉన్నప్పటికీ 9వ తరగతిలోని కీలకాంశాలను విద్యార్థులు కోల్పోతున్నారు. ఫలితంగా పది తర్వాత ఆ విద్యార్థులు ఇంటర్‌లో మంచి ఫలితాలు సాధించలేకపోతున్నారు. కేంద్ర ప్రభుత్వం 2019-20 నాటి బడ్జెట్‌లో విద్యారంగానికి 3.4 శాతం నిధులు కేటాయించింది.  ఈ ఏడాది అవి 3.2 శాతానికి తగ్గాయి.  విద్యకు కనీసం 6 శాతం నిధులు కేటాయించాలి. అలాగే నైపుణ్యాలకూ వారు ప్రాధాన్యం ఇవ్వాలి. రాబోయే నూతన విద్యా విధానంలోనైనా ఈ లోటు తీరుతుందని ఆశిద్దాం.

- యం. రాంప్రదీప్‌


logo