గురువారం 02 ఏప్రిల్ 2020
Editorial - Feb 07, 2020 , 22:53:58

అపూర్వ జాతర

అపూర్వ జాతర

భక్త జన సందోహంతో

అడవి పల్లె విరిసింది!

వన దేవతల కొలుపుతో

మేడారం  మురిసింది!

పసుపు కుంకుమతో...

పుడమి పూత పూసింది

మునకలు, తలనీలాలతో

జంపన్న వాగు ఎగసింది!

జమిడిక డప్పు మోతతో

చిలకల గుట్ట చిందేసింది!

నిలువెత్తు బంగరు రాశితో

తల్లిగద్దె తడిసి ముద్దయ్యింది!

సిగమూగు, డోలి రాగాలతో

కొమ్మా రెమ్మా ఊయలూగింది!

ఎదురు కోళ్లు..

మొక్కులు అప్పగింతతో..

వెదురు వనం పరవశించింది!

ఓరుగల్లు జాతర- ధిక్కార స్వరపేటిక

పౌరుషాల రణ వేదిక- త్యాగల సుమ మాలిక

గిరిజనుల సంస్కృతి చిత్రిక

వీర వనితల ప్రతాప ప్రతీక

మేడారం మహా మేళా

ఆదివాసీ సంబురాల..

మన్నెం జీవన వికాస హేళ!

సమ్మక్క సారలమ్మల మహా‘తీర్థం’

సకల జీవ కోటికి ముక్తి ప్రసాదితం!!

-  కోడిగూటి తిరుపతి


logo