గురువారం 02 ఏప్రిల్ 2020
Editorial - Feb 06, 2020 , 23:16:15

జయహో సమ్మక్క, సారక్క

జయహో సమ్మక్క, సారక్క

జయహో సమ్మక్కతల్లి, సారక్క తల్లి

కర్కశ కరువు కోరలలో చిక్కిన

తన ప్రజలకోసం కన్నీరు కార్చినా.. ॥జయ॥

రుధిర నిర్ఘరి పారగా

సార్వభౌమాధికారం కోసం 

పోరాటం జరిపినా..॥జయ॥

కాలు దువ్విన కాకతీయుల చేతనే

వనదేవతగా కాళ్ళు మొక్కించుకన్నా.. ॥జయ॥

కుల,మత,ప్రాంత భేదము లేకుండా

భారతావని నంతటినీ

తన మహిమలతో పాలించినా..॥జయ॥

చిరునామానే లేని కొండ కోనల మధ్య

కుంభమేళాను తలపింప జేసినా..॥జయ॥

ఆ మేడ రాజ్యపు మహారాణి

కరుణారస హృదయిని

బాధ లెరిగి కరుణించే వరదాయిని

సమ్మక్క తల్లికి గాక

ఈ జగతిలో ఇంకెవరికి చెల్లుతుంది

జయహో సమ్మక్క తల్లి జయహో సారక్క తల్లి.

-రాజేందర్‌గౌడ్‌. దొనికల 


logo