మంగళవారం 31 మార్చి 2020
Editorial - Feb 05, 2020 , 23:02:43

మేధావులు కళ్ళు తెరుస్తారా?

మేధావులు కళ్ళు తెరుస్తారా?

ఐక్యరాజ్యసమితికి చెందిన యూఎన్‌డీపీ, తెలంగాణ రాష్ర్టానికి సుస్థిరాభివృద్ధి సాధనలో మొత్తం దేశంలోనే మొదటి ర్యాంకును ప్రకటించిందంటే మనకు అంతకన్న గర్వించదగింది, సంతోషించవలసింది ఉండదు. రాష్ట్ర ప్రభుత్వానికి అది అన్నింటికి మించిన కిరీటమవుతుంది. ఇది టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం గొప్పలు చెప్పుకునేందుకు తనకుతాను ప్రకటించుకున్నది కాదు. ఈ ర్యాంకు ప్రకటన తర్వాతైనా ప్రతిపక్షాలు, అంతకన్నా ముఖ్యంగా కొందరు సినికల్‌ దివాంధ మేధావులు కళ్ళు తెరుస్తారా?

యూఎన్‌డీపీ (యునైటెడ్‌ నేషన్స్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రాం) చేసిన సుస్థిరాభివృద్ధి లక్ష్యాల (సస్టేనబుల్‌ డెవలప్‌మెంట్‌ గోల్స్‌) సర్వే నివేదిక గత నెల 29న వెలువడింది. ఆ సర్వేకు సం బంధించి ముందుగా గుర్తించవలసిన విష యం ఒకటున్నది. ఇది రొటీన్‌గా జరిగే కేవలం ఆర్థికాభివృద్ధి సర్వే కాదు. అటువంటి సర్వేలలోనూ తెలంగాణ అగ్రగామిగా ఉంటున్నదనేది సరే. కానీ అందుకు భిన్నంగా సుస్థిరాభివృద్ధి లక్ష్యాలలో ఆర్థికాభివృద్ధితో పాటు మానవాభివృద్ధి అంశాలు కూడా కొన్ని కలిసి ఉన్నాయి. ఇది గమనార్హమైన విషయం. ఒక దేశం లేదా రాష్ట్రం అభివృద్ధిని జీడీపీ శాతాల లో, తలసరి ఆదాయం అంకెలలో కొలిచి చూడటం ప్రభుత్వాలకు, సర్వే సంస్థలకు మొదటినుంచి ఆనవాయితీ అయిన పద్ధతి. 


కానీ ఆర్థికాభివృద్ధి ఎంత గొప్పగా ఉన్నా పేదరికం, పేదల సంఖ్య తగ్గకపోవడం, కొన్ని సం దర్భాల్లో మరింత పెరుగుతుండటంతో జీడీపీ లెక్కలు అర్థరహితమనే విమర్శలు వచ్చాయి. దాంతో సుమారు మూడు దశాబ్దాల కిందటే ఐక్యరాజ్యసమితి మానవాభివృద్ధి సూచికల పద్ధతిని ముందుకు తెచ్చింది. అం దుకు పొడిగింపు అన్నట్లు ఈ 21వ శతాబ్దం ఆరంభంలో ‘మిల్లెన్నియల్‌ డెవలప్‌మెంట్‌', ‘సస్టేనబుల్‌ డెవలప్‌మెంట్‌' వంటి కొత్త ఆలోచనలు చేసింది. ఇటువంటివన్నీ ప్రధానంగా పేద దేశాలు, అక్కడి పేదల అభివృ ద్ధికి, సమతులనాభివృద్ధికి, సమ్మిళిత అభివృద్ధికి దోహదం చేసేవి, అద్దం పట్టేవి. ఈ సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను ఐక్యరాజ్యసమితి అన్ని దేశాలకు సిఫార్సు చేసింది. ఆ మేరకు లక్ష్యాల సాధన ఏ విధంగా సాగుతున్నదో సంవత్సరాల వారీగా సర్వేలు చేస్తుంటారు.


ఇందులో తెలంగాణ వంటి ఒక కొత్త రాష్ట్రం, ఆరేండ్లయినా ఇంకా పూర్తిగా నిండని రాష్ట్రం, ఈ తరహా అభివృద్ధులకు ఇప్పటికే పేరు పడిన తమిళనాడు, కేరళ, కర్ణాటకలను సైతం మించిపోయి ఈసారి మొదటిస్థానాన్ని సాధించగలగటం నమ్మశక్యం కాని విషయమే. అయినప్పటికీ అది జరిగిందంటే, ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వాన ప్రభుత్వం మొదటి నుంచి రాష్ట్ర ఆర్థికాభివృద్ధి, సామాజికాభివృద్ధి గురించి స్పష్టమై న దార్శనికతతో, పట్టుదలతో పనిచేస్తూ వస్తున్నదాని ఫలితమేనని అంగీకరించకతప్పదు. ఆర్థికాభివృద్ధితోపాటు సుస్థిరాభివృద్ధి, మానవాభివృద్ధి ముఖ్యంగా తెలంగాణ వంటి రాష్ర్టానికి ఒక తప్పనిసరి అవసరం. దేశ స్వాతంత్య్రానికి పూర్వకాలపు బ్రిటిష్‌ వలస దోపిడీ దేశమంతా అనుభవించిన స్థితి కాగా, తెలంగాణ ఆ తర్వాత కాలంలోనూ సీమాంధ్ర ధనికులకు ఒక అంతర్గత వలసగా మారి దోపిడీకి గురైంది.


ఆర్థికాభివృద్ధితో పాటు సామాజిక అభివృద్ధి కూడా జరిగినట్లయితేనే అది నిజమైన అర్థంలో అభివృద్ధి అవుతుంది. ఈ దృక్పథం సీఎం కేసీఆర్‌కు మొదటినుంచి స్పష్టంగా ఉంది. అందువల్లనే ‘సంక్షేమం-అభివృద్ది’ తమ విధానమంటూ పరిపాలనా రథానికి వాటిని రెండు చక్రాలుగా మార్చుకున్నారు. అది యూఎన్‌డీపీ వారి ‘సుస్థిరాభివృద్ధి లక్ష్యాల’ సర్వే నివేదికలోనూ ప్రతిఫలించింది. ఉదాహరణకు, ‘భూమి ఆధారంగా జీవితం’అనే అంశంతో ముడిపడింది వ్యవసాయం, నీటిపారుదల, రైతులు, కూలీలు, గ్రామీణ ఆర్థికవ్యవస్థ కాగా ఇందులో రాష్ట్రం గెలుచుకున్న పాయింట్లు 88.


ఇటువంటి స్థితి నుంచి రాష్ర్టాన్ని, ప్రజలను బయటకు తీసుకురావాలంటే కేవలం ఆర్థికాభివృద్ధి చాలదు. అందుకు పరిమితమైతే భారతదేశం ప్రపంచంలోని పది అతిపెద్ద ఆర్థికవ్యవస్థలలో ఒకటి అయి మానవాభివృద్ధిలో మాత్రం 129వ స్థానంలో ఉన్నట్లు, తెలంగాణలోనూ ఇదే వ్యత్యాసాల పరిస్థితి తయారయ్యేది. అట్లా జరుగటం లేదని ఇప్పుడు యూఎన్‌డీపీ నివేదిక చెబుతున్నది. వాస్తవానికి సుస్థిరాభివృద్ధి సూచికలలో తెలంగాణ ప్రగతి ఇంతకుముందు సంవత్సరాలలోనూ సంతృప్తికరంగానే ఉంది. ఈ సారి అది అన్ని రాష్ర్టాలను మించిపోయింది. ఈ ర్యాంకు రాగల సంవత్సరాలలో ఇదేస్థాయిలో ఉంటుందా లేక కొద్దిగా అటు ఇటు అవుతుందా అని విచారించనక్కరలేదు. ప్రధానమైన విషయం ప్రభుత్వానికి ఆ దృష్టి ఉం డటం, ఆ దిశలో నిరంతర ప్రయాణం తెలంగాణ నేలకు, ప్రజలకు కావలసింది ఇది.


యూఎన్‌డీపీ పేర్కొన్న అంశాలను చూస్తే.. ఆ నివేదిక ప్రకారం ఆర్థికవృద్ధిలో 82 పాయింట్లతో తెలంగాణ మొదటి స్థానాన్ని ఆక్రమించింది. ఆర్థికమాంద్యం, జీఎస్టీ వసూళ్ల తగ్గుదల వల్ల ఆదాయం కొంత తగ్గటం వంటివి జరిగినా సొంత రాబడులు, సంపదలో వృద్ధిరేటు సుస్థిరంగా ఉన్నదని ఆ నివేదిక ప్రశంసించింది. ఇందులో తెలంగాణ పాయింట్లు నిరుడు 75 కాగా ఈసారి ప్రతికూల పరిస్థితులలోనూ 82కు పెరుగటం మామూలు కాదు. అదేవిధంగా రిజర్వ్‌ బ్యాంక్‌ నిబంధనలైన ఎఫ్‌ఆర్‌ బీఎం (ఫిస్కల్‌ రెస్పాన్సిబిలిటీ అండ్‌ బడ్జెట్‌ మేనేజ్‌మెంట్‌) కింద జీఎస్‌ డీపీ (గ్రాస్‌ స్టేట్‌ డొమెస్టిక్‌ ప్రొడ్యూస్‌ లేదా రాష్ట్ర స్థూల ఉత్పత్తి)లో 25 శాతం వరకు రుణాలు తీసుకునేందుకు అనుమతి ఉండగా, తెలంగాణ అంతకన్న ఎనిమిది శాతం తక్కువగా 17 శాతమే తీసుకున్నది. 


ఈ విషయంలో మహారాష్ట్ర (16.9) తర్వాత అతిస్వల్పమైన తేడాతో రెండవ స్థానంలో ఉన్నది. రాష్ట్రంలో ఆర్థికాభివృద్ధి లేదని, ఆర్థికవ్యవస్థ కుప్పగూలుతున్నదని, కేసీఆర్‌ ప్రభుత్వం రాష్ర్టాన్ని అప్పుల ఊబిలోకి నెట్టివేసిందని నిరంతరం ఆరోపణలు చేసే ప్రతిపక్షాలు, మేధావులు ఈ వాస్తవాలను తెలుసుకోవటం మంచిది. వాస్తవానికి రాష్ర్టానికి ఆర్థిక విషయాల లో ఇటువంటి ర్యాంకులు తరచూ వస్తున్నాయి. కానీ ఈ సినిక్స్‌ వాటి ని చదువరో లేక రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజలను తప్పుదారి పట్టించేందుకు ఈ గోబెల్స్‌ ప్రచారాలు సాగిస్తుంటారో వారికే తెలియాలి.


ఆర్థికరంగానికి కీలకమైన మరొక అంశాన్ని చూస్తే.. నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేయటంలో తెలంగాణ మార్కులు నిరుడు 63 కాగా, ఈసా రి 93కు పెరిగాయి. 2014లో రాష్ట్రం ఏర్పడినపుడు విద్యుచ్ఛక్తి పరిస్థితి ఏమిటో ఇప్పుడు ఏ విధంగా ఉందో అందరికీ అనుభవంలోని విషయమే. రాష్ర్టావతరణ తర్వాత ప్రభుత్వం వెంటనే దృష్టి కేంద్రీకరించిన రంగాలు మూడు కాగా వాటిలో విద్యుత్తు ఒకటి. తక్కిన రెండు నీటి పారుదల, సామాజిక సంక్షేమం. వీటిలో విద్యుత్తు గృహావసరాలకే గాక సమస్త అభివృ ద్ధి రంగాలకు తప్పనిసరి అయింది. చూస్తుండగానే చక్కబడిన మొదటిరంగం కూడా ఇదే. ఈ విషయమై రాష్ట్రంలోని అన్ని వర్గా ల నుంచి, జాతీయంగా కూడా ప్రశంసలు వస్తున్న సమయంలో కూడా మన ప్రతిపక్షాలు, కొందరు మేధావులు ఈ వాస్తవాన్ని గుర్తించనిరాకరించటం ఆశ్చర్యం.


పైన అనుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం సాధిస్తూ వస్తున్న ఇటువంటి అభి వృద్ధికి రాష్ట్రంలో అంతర్గతంగానే గాక జాతీయస్థాయిలో, తరచు అంతర్జాతీయంగానూ వస్తుండిన ప్రశంసల నుంచి కళ్లు, చెవులు మూసుకున్న మన ప్రతిపక్షాలు, ఈ తరహా మేధావులు, అటువంటి సర్టిఫికెట్లు డబ్బి చ్చి కొనుక్కున్నవంటూ తమ వికృత ఆలోచనను బయటపెట్టుకున్నారు. వామపక్షాల వారు ‘అంతా శూన్యం’ అంటూ శూన్య గీతాలాపనలు చేశారు. ప్రస్తుతం సుస్థిరాభివృద్ధిలో లభించిన మొదటి ర్యాంకు ఐరాసకు చెందిన యూఎన్‌డీపీ నుంచి అయినందున, కనీసం ఈ సారైనా అదే వికృతత్వం ప్రదర్శించరని ఆశించాలి. వారు ఇప్పటికైనా అభివృద్ధిని గుర్తించి తమ ధోరణిని మార్చుకోవటం వాంఛనీయం. అటువంటి మార్పు ప్రజల దృష్టిలో తమ విశ్వసనీయతను కూడా పెంచగలదు. లోపాలను ఎత్తిచూపటంతో పాటు జరిగే మంచిని గుర్తించినప్పుడే అది నిర్మాణాత్మకత అయి తమకు విశ్వసనీయత ఏర్పడగలదని వారు  ఇప్పుడైనా అర్థం చేసుకోవాలి.


ఆర్థికాభివృద్ధితో పాటు సామాజిక అభివృద్ధి కూడా జరిగినట్లయితేనే అది నిజమైన అర్థంలో అభివృద్ధి అవుతుంది. ఈ దృక్పథం సీఎం కేసీఆర్‌కు మొదటి నుంచి స్పష్టంగా ఉంది. అందువల్లనే ‘సంక్షేమం-అభి వృద్ది’ తమ విధానమంటూ పరిపాలనా రథానికి వాటిని రెండు చక్రాలుగా మార్చుకున్నారు. అది యూఎన్‌డీపీ వారి ‘సుస్థిరాభివృద్ధి లక్ష్యాల’ సర్వే నివేదికలోనూ ప్రతిఫలించింది. ఉదాహరణకు, ‘భూమి ఆధారంగా జీవితం’అనే అంశంతో ముడిపడింది వ్యవసాయం, నీటిపారుదల, రైతు లు, కూలీలు, గ్రామీణ ఆర్థికవ్యవస్థ కాగా ఇందులో రాష్ట్రం గెలుచుకున్న పాయింట్లు 88. ప్రజాజీవనానికి, సామాజిక అభివృద్ధికి ఇదేవిధంగా కీలకమైన స్వచ్ఛమైన నీరు, పారిశుద్ధ్యంలో వచ్చినవి 84 పాయింట్లు. శాంతిభద్రతలు, న్యాయంలో 77 పాయింట్లు. ఈ విధంగా వివిధ రం గాల అభివృద్ధి సుస్థిరంగానే గాక, ప్రజల మధ్య అంతరాలను తగ్గిస్తూ సమ్మిళితమైన రీతిలో సాగుతున్నదని  యూఎన్‌డీపీ అభిప్రాయపడటం  రాష్ట్రం గర్వించదగిన విషయం.


దీనంతటిని బట్టి ఈ రోజున దేశంలో వాంఛనీయమైన అభివృద్ధి నమూనాకు రూపకల్పన చేస్తున్న రాష్ట్రం తెలంగాణ అని చెప్పవచ్చు. దాని అర్థం జరుగవలసినవన్నీ జరిగిపోయాయని కాదు, ఉదాహరణ కు- విద్య, ఆరోగ్యరంగాల్లో జరుగవలసింది ఇంకా ఉన్నది. ఈ విషయ మై ప్రభుత్వం దృష్టిసారించటం మొదలైంది. అయితే, ఇందులోని పలు అంశాల్లో పౌర స్పృహ, భాగస్వామ్యం అవసరమనే గుర్తింపు, కార్యాచరణ ప్రజల వైపు నుంచి చాలా అవసరం. అప్పుడే సమగ్రాభివృద్ధి సత్వ రం, సంపూర్ణం అవుతుంది.


logo
>>>>>>