గురువారం 09 ఏప్రిల్ 2020
Editorial - Feb 05, 2020 , 22:59:08

ఆత్మగౌరవ ప్రతీక

ఆత్మగౌరవ ప్రతీక

మాఘ పున్నమున మేఘం మెరిసెను

ఆదివాసుల భక్తి పొంగెను

జన సముద్రం అడవికొచ్చెను

జే గంటల నాదం మోగెను

సమ్మక్కా.. సమ్మక్కా..!

పచ్చటి అడవులు వన్యప్రాణులు

ఆభరణాలు తల్లీ నీకు

తల్లి చేతితో నాటువైద్యం

గూడెం ప్రజల ఆయువు పెంచెను

శత్రువులను క్రూర మృగాలను

ధైర్యముతోటి ఎదురించే

యుద్ధవిద్యలు ప్రజలకు నేర్పేను

సమ్మక్కా.. సమ్మక్కా..!

కరువుతో ప్రజలు తల్లడిల్లితే

కప్పం కట్టబోమని తెగించి చెప్పె

వీర వణితలు రౌద్రం చూపె

కదం తొక్కి మరి యుద్ధం చేసె

పోరులో వీర మరణం పొందె

సమ్మక్కా.. సమ్మక్కా..!

చిలుకల గుట్టపై కుంకుమభరిణై

మళ్లీ పుట్టెను సమ్మక్క

తల్లి బాటలో నడిచిన పిల్లలు

ఎక్కుపెట్టిన బాణాలైరి

గూడెం కోసం కొడుకు త్యాగం

జంపన్నవాగుకు జీవమాయె

త్యాగాల బాటలో స్వేచ్ఛను వెతికినవమ్మా 

సమ్మక్కా.. సమ్మక్కా..!

ఆదివాసుల పవిత్ర పూజలు

నైవేద్యంగా బెల్లం బుట్టలు

ఎల్ల లోకాలలో ఏడ చూడము

కుంభమేళాగా నీ జాతర జరుగు

నీ జాతరకొచ్చి మొక్కులు తీర్చితే

మాకు జన్మజన్మల పుణ్యం కలుగు 

సమ్మక్కా.. సమ్మక్కా..!!

- వేల్పుల రాజు, 97019 33704


logo