బుధవారం 08 ఏప్రిల్ 2020
Editorial - Feb 04, 2020 , 22:50:41

పంట మార్పిడి మేలు

పంట మార్పిడి మేలు

కొత్త పంటలను రాష్ట్రంలో అమలుచేశారు. దీనిద్వారా రైతులకు అదనపు ఆదాయం చేకూరింది.అందుకే ప్రజలు నిత్యం వాడే ఆపిల్‌ ను రాష్ట్రంలో సాగు చేసేందుకు పరిశోధనలు జరిగాయి. ఆసిఫాబాద్‌లోఆపిల్‌ తోటల సాగు సాధ్యమని తేలింది. మన ప్రాంతంలో అతి తక్కువ ఉష్ణోగ్రత ఉండదు. కాబట్టి HRM-99 రకాన్ని సీసీఎంబీ సహాయంతో పరిచయం చేయడం జరిగింది. ప్రస్తుతం తోట మూడవ సంవత్సరంలో ఉన్నది. పూత వచ్చింది. రాష్ట్రంలో ఇతర రాష్ర్టాలు విడుదల చేసిన రకాలను రైతులు సాగుచేస్తున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల ద్వారా సాగునీటి లభ్యత బాగా పెరిగింది. ఏండ్లతరబడి ఎదురుచూస్తున్న సాగునీటి కలను ప్రభుత్వం నిజం చేస్తున్నది. ఈ ప్రాజెక్టుల ద్వారా అందుబాటులోకి వచ్చిన ప్రతి నీటి చుక్కను రైతులు సద్వినియోగం చేసుకోవాలి. అయితే కేవలం వరి పంటనే పండిస్తే భవిష్యత్తులో గిట్టుబాటు ధరలు అందకపోవచ్చు. అందుకే బంగారు భవిష్యత్తు ఉన్న ఆయిల్‌పాం సాగువైపు మొగ్గుచూపాలి.


వంటనూనెల పరంగా వినియోగంలో ప్రపంచంలో భారత్‌ది 5వ స్థానం. ప్రపంచనూనెల ఉత్పత్తిలో నాలుగుశాతం, వినియోగంలో 12 శాతం, వాణిజ్యంలో 21 శాతం మన దేశానిదే. ఉత్పత్తిపరంగా ఈ శాతం పెద్దదే. అయితే వినియోగ అవసరాల కోసం 70 శాతం దిగుబడి చేసుకోవాల్సి వస్తున్నది. ప్రస్తుతం సాలీనా కోటి 40 లక్షల టన్నుల వంట నూనె లు దిగుమతి చేసుకుంటున్నాం. సంవత్సరానికి 2.5 నుంచి 2.6 కోట్ల టన్నుల నూనె గింజలు ఉత్పత్తి అయితే, కోటి ఏడు వేల ఐదువందల కిలోల నూనెలు లభ్యమవుతున్నాయి. మలేషియా, ఇండోనేషియా, అర్జెంటీనా, బ్రెజిల్‌ దేశాల నుంచి ప్రధానంగా దిగుమతి చేసుకుంటున్నాం. ఏటా జనాభా పెరిగిపోతున్నది. అట్లనే పెరుగుతున్న ఆదాయాలు, కొనుగోలుశక్తి నేపథ్యంలో వంటనూనెలకు డిమాండ్‌ భారీగా ఉన్నది. సంప్రదాయ నూనెగింజలు సాగుచేయడం ద్వారా ఈ సమస్యను అధిగమించలేకపోతున్నాం. ఫలితంగా దిగుమతుల భారం రోజురోజుకూ పెరుగుతున్నది. దీనికితోడు పట్టణీకరణ, పారిశ్రామికీకరణ వల్ల నూనెగింజల పం టల సాగువిస్తీర్ణం పెంచడం వీలు కావడం లేదు.


ఈ నేపథ్యంలో వంటనూనెల సమస్యను తగ్గించే తరుణోపాయం ఆయిల్‌పాం సాగు విస్తీర్ణం పెంచడం. తద్వారా ప్రతి నీటిబొట్టుకు అధిక దిగుబడి, రైతుల ఆదాయాలు రెట్టింపయ్యే మార్గమవుతుంది. తక్కువ విస్తీర్ణంలో అంటే ఏడాదికి హెక్టారుకు 4 నుంచి 6 టన్నుల పామాయిల్‌ సాధ్యమవుతుంది. ఆయిల్‌పాం అభివృద్ధి పథకం కింద దేశంలోని 18 రాష్ర్టాలలో 20 లక్షల హెక్టార్లు ఆయిల్‌పాం సాగు పరిధిలోకి తీసుకొని రావాలని సూచించిం ది. ఇప్పటివరకు 3.45 లక్షల హెక్టార్లు మాత్రమే సాగులోకి వచ్చింది. ఈశా న్య రాష్ర్టాల్లో ఆయిల్‌పాం సాగుకు మంచి భవిష్యత్తు ఉన్నది. ఏడాదికి హెక్టారుకు 20 నుంచి 30 టన్నులు సాధిస్తున్నారు. కర్ణాటక రైతులు 50 టన్నులు కూడా సాధించగలిగారు. కాబట్టి రాష్ట్రంలో కూడా గోదావరి, కృష్ణ నదీపరీవాహక ప్రాంతాల్లో సంవత్సరమంతా నీటి సౌకర్యం ఉన్న ప్రాంతంలో ఆయిల్‌పాంను సాగు చేసుకోవచ్చు. కేంద్రం ఇప్పటికే రాష్ట్రంలోని 18 జిల్లాల్లోని 206 మండలాలు ఆయిల్‌పాం సాగుకు అనుకూలంగా ఉన్నాయని తేల్చింది. రాష్ట్రంలో 3 లక్షల హెక్టార్ల సాగు చేసుకునే వీలున్నది. ఇందులోభాగంగా 18 వేల హెక్టార్లలో విస్తీర్ణం పెంచగలిగాం.


రాష్ర్టాభివృద్ధిలో ఉద్యానరంగానిది ప్రధాన పాత్ర. రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తిలో 40.5 శాతం ఉద్యానరంగానిదే. రాష్ట్రంలో 12.40 లక్షల ఎకరాల్లో ఉద్యానపంటలు సాగుచేయబడుతున్నాయి. 71.52 లక్షల టన్నుల దిగుబడిని ఇస్తున్నాయి. 4.42 లక్షల ఎకరాల్లో పండ్లు, 3.52 లక్షల ఎకరాల్లో కూరగాయలు, 3.90 లక్షల ఎకరాల్లో సుగంధ ద్రవ్య పంటలు సాగుచేయబడుతున్నాయి. పలు ప్రాముఖ్యం కలిగిన ఉద్యాన పథకాలను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. కూరగాయల కొరత తీర్చేందుకు ఉత్పాదకత పెంచాలి. సంవత్సరమంతా కూరగాయలు పండాలంటే వాతావరణ నియంత్రణ కావాలి. అందుకు ఉపయోగపడే హరితగృహాలను భారీగా రాష్ట్రంలో ప్రోత్సహించా రు. 90 శాతం సబ్సిడీతో 1210 ఎకరాల్లో హరితగృహాల్లో కూరగాయల సాగు జరుగుతున్నది. సాగునీటి కొరతను తీర్చడంతో పాటు నీళ్లు, ఎరువుల వినియోగ సామర్థ్యం పెంచేందుకుగాను బిందు, తుంపరసేద్యాలను భారీగా ప్రోత్సహించింది. 


రాష్ట్రంలో నికరసాగు విస్తీర్ణం 51.20 లక్షల ఎకరాలుంటే, 18.59 లక్షల ఎకరాలకు సూక్ష్మ నీటి సేద్యం అమల్లో ఉన్నది. రాష్ర్టావిర్భావానికి ముందు 11.99 లక్షల ఎకరాలకు మాత్రమే ఉంటే, తెలంగాణ ఏర్పడిన తర్వాత 1816 కోట్ల రూపాయలతో 6.60 లక్షల ఎకరాలలో బిందు, తుంపరసేద్యాన్ని ఏర్పాటుచేశారు. నాబార్డ్‌ సహాయంతో అమలుచేసిన సూక్ష్మసేద్యం పథకంతో ఒక రైతుకు సరాసరిన రెండు లక్షల అదనపు ఆదా యం సమకూరింది. ఆధునిక పరిశోధనల ఫలితంగా అధిక దిగుబడిని ఇచ్చే హైబ్రిడ్స్‌ అందుబాటులోకి వచ్చాయి. ఉత్పత్తి, ప్రాసెసింగ్‌, విలువల జోడిం పు, ఉప ఉత్పత్తుల అభివృద్ధిలో టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిం ది. ఇటీవల వెలుగులోకి వచ్చిన జీనోమ్‌ సీక్వెన్సింగ్‌, స్మార్ట్‌ ఫార్మింగ్‌, డిజిటల్‌ టెక్నాలజీ, కోత యంత్రాల నేపథ్యంలో దేశంలో ఆయిల్‌పాం సాగు పెంచాలి. దిగుబడిని తద్వారా రైతులకు ఆదాయాన్ని పెంచుకోవచ్చు. ఈ నేపథ్యంలో రాష్ట్రం త్వరలో హైదరాబాద్‌లో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న ఆయిల్‌పాం జాతీయ సదస్సుతో మన రాష్ట్ర రైతులు జాతీయ, అంతర్జాతీయ పరిశోధనలు, టెక్నాలజీలను తెలుసుకునే అవకాశం ఉన్నది.


కొత్త పంటలను రాష్ట్రంలో అమలుచేశారు. దీనిద్వారా రైతులకు అదనపు ఆదాయం చేకూరింది. అందుకే ప్రజలు నిత్యం వాడే ఆపిల్‌ను రాష్ట్రంలో సాగు చేసేందుకు పరిశోధనలు జరిగాయి. ఆసిఫాబాద్‌లో ఆపి ల్‌ తోటల సాగు సాధ్యమని తేలింది. మన ప్రాంతంలో అతి తక్కువ ఉష్ణోగ్రత ఉండదు. కాబట్టి HRM-99 రకాన్ని సీసీఎంబీ సహాయంతో పరిచయం చేయడం జరిగింది. ప్రస్తుతం తోట మూడవ సంవత్సరంలో ఉన్నది. పూత వచ్చింది. రాష్ట్రంలో ఇతర రాష్ర్టాలు విడుదల చేసిన రకాలను రైతులు సాగుచేస్తున్నారు. మన ప్రాం తంలో వీటిని సాగుచేయడానికి అనుకూలత అంతగా లేదు. అందుకే ఉత్తమమైన పరిశోధనలతో విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు ఆరు పంటలలో ఏడు కొత్తరకాలను విడుదల చేశారు. క్షేత్రస్థాయిలో రైతుల పొలాల్లో వీటి దిగుబడి బాగున్నది. స్వల్పకాలంలో వచ్చే రకాలు, సంవత్సరమంతా సాగుచేసుకునే రకాలతోపాటు, అధిక జిగురునిచ్చి, కూరగాయగా వాడే గోరుచిక్కుడు, కొత్తిమీర, ధనియాలను ఇచ్చేరకం కూడా విశ్వవిద్యాల యం అభివృద్ధి చేసింది. భవిష్యత్తులో అన్ని పంటలలో నాణ్యమైన అధిక దిగుబడిని ఇస్తూ స్వల్పకాలిక రకాలను రైతులకు తెచ్చే ప్రయత్నం చేస్తాం.


మిగతా పంటలతో పోలిస్తే ఏడాదంతా ఆదాయాన్ని పనిదినాలను కల్పించే అవకాశం ఆయిల్‌పాంకు ఉన్నది. 30 ఏండ్ల తోట కాలం ఉండే ఈ సాగులో మొదటి మూడేండ్లు అంతరపంటగా ఎటువంటి కూరగాయలైనా, మెట్ట పంటలను కూడా పండించుకోవచ్చు. దీనిద్వారా అదనపు ఆదాయం వస్తుంది. ఆ తర్వాత ఆకుకూరలు కూడా సాగు చేసుకోవచ్చు. దీనికితోడు దీర్ఘకాలిక తోట పంట కాబట్టి తోట చుట్టూ ఎర్రచందనం లేదా వెదురును సాగుచేసుకొని మరింత ఆదాయం పొందే వీలున్నది. కోట్లాది రూపాయల మేర విదేశాల నుంచి నూనెగింజలు దిగుమతి చేసుకునే బదు లు దేశీయంగా ఆయిల్‌పాం పంటల సాగువైపు రైతులను మళ్లించాలి. అం దుకు అనుగుణంగా వారిని ప్రోత్సహించాలి.

(వ్యాసకర్త: రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖ ముఖ్య కార్యదర్శి)


logo