బుధవారం 01 ఏప్రిల్ 2020
Editorial - Feb 03, 2020 , 23:07:02

తెలంగాణ కుంభమేళా

తెలంగాణ కుంభమేళా

జాతరండి జాతర 

మేడారం జాతర ॥జాతరండి॥ 

మాఘమాసంలో జరుగు జాతర 

నాలుగు రోజుల జాతర 

కన్నేపల్లిలో కనువిందుల జాతర 

మేడారం జన జాతర ॥జాతరండి॥ 

సమ్మక్క-సారక్కల వీర చరిత జాతర 

జంపన్న వాగులో స్నానాలజాతర 

చిలుకల గుట్టలో పూజారుల జాతర 

బెల్లం బంగార సమర్పణల జాతర ॥జాతరండి॥ 

గిరిజనుల పెద్దపండుగ జాతర 

సకల జనుల కలయికల జాతర 

చారిత్ర ఘనతను చాటి చెప్పే జాతర 

తెలంగాణ కుంభమేళా జాతర ॥జాతరండి॥

మొక్కులు తీర్చ పోదాము జాతర 

అందరం కదులుదాము మేడారం జాతర 

వనదేవతల చూడటానికి తరలుదాము జాతర 

పరవశాన దర్శనం సమ్మక్క సారక్క జాతర

॥జాతరండి॥

- ఉండ్రాళ్ళ రాజేశం, 9966946084


logo
>>>>>>