సోమవారం 30 మార్చి 2020
Editorial - Feb 01, 2020 , 00:14:55

మేడారం జాతర

మేడారం జాతర

జాతరంట జాతర-మేడారం జాతర 

సమ్మక్కసారక్కలు-కొలువైన జాతర 

మొక్కిన మొక్కులు-తీరునంట అక్కడ

భక్తికొలది జనులంతా-బయలెల్లినారంట

కష్టాలను కడదేర్చి-పాపాలను తొలిగించి

భోగాలను ప్రసాదించి-భాగ్యాలను అందించి

జనకోటిని కాయంగా-వనమునందు వెలసెను

మొక్కులను తీర్చంగా-బంగారం సమర్పించి 

పసుపు కుంకుమల తోడ-గాజులను వేసెనంట

తెలంగాణ యావత్తు-కదిలెల్లి వచ్చెనంట

సల్లంగా చూడమంటు-కాపాడగ రమ్మంటు

పోటెత్తిరి జనులంతా-మేడారం జాతరకు

నాలుగురోజుల జాతర-నింగికెగిసిన అంబరాన

తిరిగిరా సమ్మక్క తిరిగిరా సారక్క

వరాలను ఒసగంగా-మళ్లీ రావంటూ

సాగనంపి వచ్చెరంట-తెలంగాణ జనమంతా...

- ఆదిమూలం చిరంజీవి, సిద్దిపేట


logo