మంగళవారం 31 మార్చి 2020
Editorial - Jan 30, 2020 , 23:16:28

పాలనను ప్రతిబింబించిన ఫలితాలు

పాలనను ప్రతిబింబించిన ఫలితాలు

జాతీయ పార్టీగా చెప్పుకోబడే ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్, తెలంగాణలో పాగా వేయడానికి ప్రయత్నిస్తున్న బీజేపీ కంటె తెలంగాణ ప్రయోజనాల కోసమే ఏర్పడిన టీఆర్‌ఎస్‌తోనే తమ సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్న నమ్మకం ప్రజల్లో ప్రబలంగా ఉండటమే టీఆర్‌ఎస్ గెలుపునకు ప్రధానకారణం. కమ్యూనిస్టులు, టీడీపీ లాంటి పార్టీలు వారి చారిత్రక తప్పిదాల వల్ల తెలంగాణలో కనుమరుగై పోయాయి.

మునిసిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో 130 స్థానాలకు గాను 120 స్థానాలు టీఆర్‌ఎస్ గెలుచుకుంది. ఇది కనీవిని వినీ ఎరుగని అఖండ విజయమే. జాతీయ పార్టీలుగా చెప్పుకోబడే కాంగ్రెస్, బీజేపీ, కమ్యునిస్టు పార్టీలకు ఘోర పరాభవమే మిగిలింది. వీరికి గత అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో లభించినన్ని స్థానాలు కూడా లభించలే దు. ఈ విజయం నిస్సందేహంగా కేసీఆర్, కేటీఆర్‌ల విజయమనే చెప్పొ చ్చు. తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు ఎదురన్నదే లేదన్న విషయాన్ని ఈ ఫలితాలు రుజువు చేస్తున్నాయి. కేసీఆర్ రాజకీయ వ్యూహాలు, ఎత్తుగడలు, ప్రచార తీరుతెన్నులు, గత ఆరేండ్లుగా తమ ప్రభుత్వం వివిధ వర్గాల ప్రజ లకు చేసిన పనులను ప్రజల హృదయాల్లోకి చేరేట్టు చేయడం వల్ల ఈ విజయం సాధ్యమైంది. ఎన్నికల వ్యూహాలను అత్యద్భుతంగా పన్నగలిగే సామర్థ్యమున్న అపరచాణక్యుడు కేసీఆర్‌తోపాటు మునిసిపల్ ఎన్నికలను అంతా తానే అయి నడిపించి అఖండ విజయం సాధించి పెట్టారు కేటీఆర్. ఈ పురపాలక ఎన్నికల ఫలితాలేం చెబుతున్నాయన్న విషయాన్ని గమనిస్తే, తెలంగాణ ప్రజలు ఆరేండ్లు టీఆర్‌ఎస్ పాలన పట్ల సంతోషంగానే ఉన్నారని, కేసీఆర్ పట్ల పాజిటివ్ దృక్పథంలోనే ఉన్నారని అర్ధమవుతున్నది. జాతీయ పార్టీగా చెప్పుకోబడే ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్, తెలంగాణలో పాగా వేయడానికి ప్రయత్నిస్తున్న బీజేపీ కంటె తెలంగాణ ప్రయోజనాల కోసమే ఏర్పడిన టీఆర్‌ఎస్‌తోనే తమ సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్న నమ్మకం ప్రజల్లో ప్రబలంగా ఉండటమే టీఆర్‌ఎస్ గెలుపునకు ప్రధానకారణం. కమ్యూనిస్టులు, టీడీపీ లాంటి పార్టీలు వారి చారిత్రక తప్పిదాల వల్ల తెలంగాణలో కనుమరుగై పోయాయి. కేంద్రంలో ఉన్న బలాన్ని ఆస రా చేసుకొని బీజేపీ తెలంగాణలో బలోపేతం కావాలని చూస్తున్నా వాళ్ళు చూపుతున్న మైనార్టీ వ్యతిరేకత, ప్రజాసమస్యలతో సంబంధం లేకుండా మతతత్వాన్ని పెంచి పోషించడం తెలంగాణ ప్రజలకు నచ్చని విషయం. తాను హిందువునేనని, అయినంత మాత్రాన సెక్యులర్, ప్రజాస్వామిక భావాలను మంట గలుపవలసిన అవసరం లేదని కేసీఆర్ చెప్పిన మాటల ముందు బీజేపీ మతతత్వం వెలవెలబోయింది. హిందువులైనంత మాత్రా న బీజేపీకి ఓటేయ్యాల్సిన అవసరం లేదని కేసీఆర్ బలంగా చెప్పగలిగారు. అందువల్ల తాత్కాలికావేశంలో పార్లమెంటు ఎన్నికల్లో కొన్ని చోట్ల బీజేపీకి ఓటేసిన వాళ్ళు కూడా ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ఓటేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి సమర్థవంతమైన నాయకత్వం లేకపోవడం, పాత చింతకాయ పచ్చడి విధానాలతో ప్రజలనేమాత్రం నమ్మించలేని వాగ్దానాలతో ప్రచారం చేయడం వల్ల ప్రజల ఆదరణ పొందలేక పోయింది. రోజురోజు కూ కాంగ్రెస్ రాష్ర్టంలో చిక్కిపోతు నామావశిష్టంగా మిగిలిపోతున్నది. సమీప భవిష్యత్తులో కేసీఆర్ వ్యూహాలను ఎదిరించి నిలువగల నాయకుడు కాంగ్రెస్ నుంచి వచ్చే అవకాశం కనబడటం లేదు. కాంగ్రెస్ కాని, బీజేపీ కాని టీఆర్‌ఎస్‌కు దీటుగా ప్రజల నమ్మకాన్ని చూరకొనగలిగే స్థితిలో లేవు. అందుక్కారణం ఆ పార్టీలు ఇంతవరకు తెలంగాణ కోసం చేసిన పనులు చెప్పుకోదగినవేమీ లేక పోవడమే. దీంతోపాటు ఆ పార్టీలు టీఆర్‌ఎస్‌పై చేస్తున్న ఆరోపణల్లో పసలేకపోవడం. కాం గ్రెస్, బీజేపీ. కమ్యూనిస్టు పార్టీల కంటె మెరుగైన సంఖ్యలో కేసీఆర్ బలహీన వర్గాలకు పదవులు, పథకాలిచ్చి ఆదుకున్నారు. అన్ని ఎన్నికల్లోనూ అంతకంటె ఎన్నో రెట్లెక్కువ ఆమోదం లభించడానికి మెజారిటీగా ఉన్న బలహీన వర్గాలు, కులాల ప్రజలు ఇతర పార్టీల కంటె మెరుగ్గా తమనాదుకునే వారు కేసీఆర్ గారే అని నమ్మడం వల్ల ఆయన తీసుకున్న అనేక సంక్షేమ కార్యక్రమాల వల్ల.  


2014 నుంచి  జరిగిన అన్నీ ఎన్నికలోను టీఆర్‌ఎస్ అఖండ విజయం సాధించడానికి కారణం కేసీఆర్ తీసుకున్న చర్యలు, సంక్షేమ పథకాలే కారణమని అర్ధమవుతున్నది. ముందు తెలంగాణ తెచ్చిన యోధునిగా బ్రహ్మరథం పట్టినా క్రమక్రమంగా తెలంగాణ ప్రయోజనాలు కాపాడే నాయకుడిగా, అన్ని కులాలు, వర్ణాలు, వర్గాల ప్రయోజనాలు కాపాడే నేతగా ప్రజ ల మన్నలు పొందారు. సామాన్య ప్రజలకు ఓటర్లకు కులం మతం, పార్టీ, సిద్ధాంతాలు, వర్గం లాంటివేవీ పెద్దగా ఆలోచించి ఓటువేయడానికి ఉపకరించే విషయాలు కావు. వారికి బతుకుదెరువు చూపేవారు కావాలి. తమ సంక్షేమం గురించి ఆలోచించేవారు కావాలి. తమ ఆత్మగౌరవం నిలబెట్టే వారుకావాలి. ఇవన్నీ ఇతర పార్టీలకంటె మెరుగ్గా తెలంగాణ ప్రజలకు అందించిన నేత కేసీఆర్. వలస పాలనలో మగ్గుతున్న తెలంగాణను విముక్తం చేసి తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నమైన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వారియర్ కేసీఆర్. అందుకే కేసీఆర్ అంటే ప్రజలకు అంత అభిమానం. ఉత్తరాది వారికి దక్షిణాది వారంతా మద్రాసీలైనట్టే, తెలుగువారంటే ఆంధ్రులే.. తెలుగు భాషంటే ఆంధ్రభాషే. రాష్ర్టం ఏర్పడక ముం దు తెలంగాణకు ప్రత్యేక గుర్తింపేలేదు. తెలంగాణ భాషను, యాసను అసెంబ్లీలోనూ, ఇతరత్రాను మాట్లాడటమూ తక్కువ తనమే. చంద్రబాబు కాలంలోనయితే తెలంగాణ పదాన్ని ఉచ్ఛరించడమూ నేరమే. భాషపై, సంస్కృతిపై, తెలంగాణ ఆత్మగౌరవంపై జరిగిన దాడికి, చూపిన వివక్షకు చరమగీతం పాడే ట్టు చేశారు కేసీఆర్. తెలంగాణ భాషను అసెంబ్లీల్లోనూ ఇతరత్రా ను యధేచ్చగా వాడేందుకు మార్గం సుగమం చేశారు. తెలంగాణ భాషకు పార్లమెంటరీ గౌరవం కలుగడమే కాకుండా తెలంగాణ రాష్ర్టం ప్రపంచపటంలో సగర్వంగా కనబడేట్టు చేశారు. తెలంగాణ భాష, జాతి ఆత్మగౌరవం పెరుగడమే కాకుండా తెలంగాణవాళ్లు స్వపరిపాలనకు అర్హులుకారు అనే స్థితి నుంచి తెలంగాణ వాళ్లే సమర్థులైన పాలకులని రుజువు చేశారు కేసీఆర్. అనేక ప్రాజెక్టులను పూర్తి చేసిన ఘనత కేసీఆర్‌దే. అనేక పరిశ్రమలు మూతపడటానికి విద్యుత్ సరఫరా సరిగ్గా లేక పోవడం ప్రధానకారణం. రైతులు కరెంటు సరఫరా సరిగ్గా లేక పంట నష్టంతో ఉరి తాళ్లనాశ్రయించారు. కేసీఆర్ విద్యుత్ సమస్య పరిష్కరించడమే కాకుండా ఉరి సాలగా మారిన సిరిసిల్లాను సిరిసాల మార్చారు. మనకు రావాల్సిన నీటివాటా, కేంద్ర ప్రభుత్వ నిధుల విషయంలో కేంద్రాన్ని ఢీకొనడానికి వెనుకాడటం లేదు. నాణ్యమైన విద్యకోసం అనేక రెసిడెన్షియల్ పాఠశాలలను నెలకొల్పి ఇంగ్లీషు మీడియంతో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో విద్యను బహుజనులకు అందిస్తున్నారు. వృద్ధాప్య పింఛన్లు, కళ్యాణ లక్ష్మి, రైతు బంధులాంటి అనేక పథకాల ద్వారా తెలంగాణలోని ప్రతి ఇల్లు ఏదో విధంగా లబ్ధి పొందేట్టు చేస్తున్నారు. వృత్తి కులాల వారికి ఆయా వృత్తి ఆదాయం పెంచడానికి, బతుకుదెరువు చూపించడానికి చేస్తున్న కృషి తక్కువదేం కాదు. అందుకే ఇప్పటి మునిసిపాలిటీ ఎన్నికల్లోనూ, నిన్నటి  పంచాయతీ ఎన్నికల్లోనూ, మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్‌కు బ్రహ్మరథం పట్టారు ప్రజలు. ప్రజల విశ్వాసాన్ని ఛేదించడం కాంగ్రెస్‌కు కానీ, బీజేపీకి కానీ, మరే పార్టీకి కానీ అసాధ్యం. 


logo
>>>>>>