శనివారం 04 ఏప్రిల్ 2020
Editorial - Jan 28, 2020 , 23:37:54

మందగమనానికి బడ్జెట్‌ చికిత్స

మందగమనానికి బడ్జెట్‌ చికిత్స

దేశ ఆర్థికవ్యవస్థ పతనానికి సంబంధించిన అతి ప్రధానమైన సూచిక రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా వెల్లడిస్తున్న గణాంకాలే. 2018-19తో పోలిస్తే 2019-20లోని మొదటి ఆరు నెలల కాలంలో వాణిజ్యరంగానికి ఇచ్చిన మొత్తం రుణం 88 శాతం పడిపోయాయి. బ్యాంకులతో పాటు నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ కంపెనీలు (ఎన్‌బీఎఫ్‌సీ) ఇచ్చే రుణాలను కూడా ఇందులో చేరిస్తేనే ఈ తగ్గుదల కనిపిస్తున్నది.

ఆర్థిక పతనం, దశాబ్దాల కాలంలోనే అత్యంత భారీ నిరుద్యోగం, గ్రామీణ కూలీ పెరుగుదలలో స్తబ్ధత, కొనుగోలుశక్తి తగ్గుదల-మొదలైన కారణాలన్నీ మన దేశంలోని ఆర్థికసంక్షోభాన్ని ప్రత్యేమైనదిగా సూచిస్తున్నా యి. మనదేశంలో కనిపిస్తున్న ఆర్థికపతనానికి ప్రపంచవ్యాప్త మందగమనంతో సంబంధం లేదు. మనదేశంలో ఆర్థిక పతనానికి కారణాలు స్థానికమైనవే. మోదీ ప్రభుత్వం ఈ వాస్తవాలను గుర్తించి, వచ్చే బడ్జెట్‌ లో తగుచర్యలను తీసుకోవాలె. మనదేశంలోని ఆర్థిక దుస్థితికి, ఇతర దేశాల్లోని పరిస్థితికి పొంతన ఏ మాత్రం లేదు. మన దేశ ఆర్థిక వ్యవస్థ లో వచ్చిన పరిణామాలను గమనిస్తే ఈ తేడా తెలుస్తుంది. గత నాలుగు త్రైమాసికాల్లో జీడీపీ తగ్గుదలలోని మోతాదును, స్వభావాన్ని అర్థం చేసుకోవాలె. కొన్నినెలలుగా వృద్ధిలో తిరోగమనం కనిపిస్తున్నది. ఇంధన ఉత్పత్తి ప్రధానంగా మూలరంగాల్లో ఈ తిరోగమనాన్ని గమనించవచ్చు. దిగుమతులు తగ్గుతూ ఉన్నాయి. స్థానిక ఉత్పత్తుల్లోనూ తగ్గుదల ఉన్న ది. ఈ లక్షణాలన్నీ భారత్‌లో నెలకొన్ని ఆర్థిక పతనం ఇతర దేశాల ఆర్థిక అనిశ్చితితో పోలిస్తే భిన్నమైనదని సూచిస్తున్నాయి.


దేశ ఆర్థికవ్యవస్థ పతనానికి సంబంధించిన అతి ప్రధానమైన సూచిక రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా వెల్లడిస్తున్న గణాంకాలే. 2018-19తో పోలిస్తే 2019-20లోని మొదటి ఆరు నెలల కాలంలో వాణిజ్యరంగానికి ఇచ్చిన మొత్తం రుణం 88 శాతం పడిపోయాయి. బ్యాంకులతో పాటు నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ కంపెనీలు (ఎన్‌బీఎఫ్‌సీ) ఇచ్చే రుణాలను కూడా ఇందులో చేరిస్తేనే ఈ తగ్గుదల కనిపిస్తున్నది. నిజాని కి ఈ రుణాలే వినియోగ రుణాలకు, గృహరుణాలకు చోదకశక్తులు. వాణిజ్యరంగానికి అంతకుముందు ఆర్థికసంవత్సరంలో మొత్తం రుణా లు ఏడు లక్షల కోట్లు ఉండగా, ఇప్పుడు తొంభై వేల కోట్లకు పడిపోయా యి. వాణిజ్యరంగానికి రుణాలు తొంభైశాతానికి పడిపోయిన ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో మరెక్కడైనా ఉన్నది. పరుగు పందెంలో పాల్గొనేవారికి ఆహారం తగ్గించి అంతేవేగంగా పరుగెత్తమంటే సాధ్యమవుతుం దా! ఆర్థికవ్యవస్థలో తరచు ఒక చక్రభ్రమణంలా సంక్షోభాలు వస్తుంటాయి. కానీ ఈ సంక్షోభం చక్రభ్రమణానికి సంబంధించినది కాదు. ఆర్థికవ్యవస్థలోని భారీ లోపాన్ని వెల్లడిస్తున్నది.


మోదీ ప్రభుత్వ మొదటి పర్యాయం ఐదేండ్ల పాలనలో రాష్ర్టాల రుణదాతలు రుణాలు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడ్డది. రూ.పది లక్షల కోట్ల మేర రుణాల వసూళ్ళు ఒత్తిడికి గురయ్యాయి. అయినా ఎన్‌బీఎఫ్‌సీలు రుణా లు ఇచ్చేంత శక్తిమంతంగా ఉన్నాయి. మూడు ఆరు నెలల డిబెంచర్ల విడుదల తదితరమైన వాటిద్వారా రుణాల సేకరణ జరుపగలిగాయి. సందేహాలు లేకుండా మ్యూచువల్‌ ఫండ్స్‌ వటిని కొనుగోలు చేశాయి. వాణిజ్యరంగానికి లభించే 75 శాతం రుణాలు ఎన్‌బీఎఫ్‌సీల నుంచే వస్తాయి. కానీ గతేడాది కాలంగా బ్యాంకులతో సమానంగా వెలిగిపోతు న్న ఎన్‌బీఎఫ్‌సీలు కుప్పకూలిపోవడమో, రుణాలు ఇవ్వడం నిలిపివేయడమో జరిగింది. దివాన్‌ హౌజింగ్‌ సంస్థ ఇందుకు ఉదాహరణ. ఇవి బ్యాంకులకు రూ.రెండున్నర లక్షల కోట్ల మేర బాకీ పడ్డాయి. ఇవన్నీ మొండిబకాయిలుగా మారిపోయాయి. మోదీ ప్రభుత్వానికి గతంలో ప్రధాన ఆర్థిక సలహాదారుగా పనిచేసిన అరవింద్‌ సుబ్రమణ్యన్‌ దీనిని రెండవ ట్విన్‌ బ్యాలన్స్‌ షీట్‌ సమస్య అని అన్నారు. మొదటి సమస్య యూపీఏ హయాంలో జరిగింది. 


పబ్లిక్‌రంగ సంస్థలు భారీఎత్తున యథేచ్ఛగా రుణాలు ఇవ్వడం వల్ల మొండిబకాయిలు పెరిగిపోయాయి.పబ్లిక్‌రంగ బ్యాంకులకు మొండిబకాయిలు పెరిగిపోవడానికి కారణం గత యూపీఏ ప్రభుత్వమే అని మోదీ ప్రభుత్వం అంటున్నది. ఇదేవి ధంగా గత మూడేండ్లలో ఎన్‌బీఎఫ్‌సీలకు పట్టిన దుర్గతికి కూడా మోదీ ప్రభుత్వం బాధ్యత వహించాలె. పెద్ద నోట్ల రద్దు తర్వాతి కాలంలో బ్యాంకులకు నిధుల కొరత తీరింది. దీంతో వాణిజ్యరంగానికి రుణాలు అందించడానికి వీలుగా ఎన్‌బీఎఫ్‌సీలకు నిధులను అందించాయి. బ్యాంకుల ద్వారా అందిన నిధుల్లో కొంతభాగాన్ని ఈ ఎన్‌బీఎఫ్‌సీలు మొండిబకాయిల స్థానంలో వాడుకున్నాయి. గతంలో స్థిరాస్తి రంగానికి, ఆశ్రిత పక్షపాతంతోనూ ఇచ్చిన మొండిబకాయిలు అలాగే ఉండిపోయా యి. 


డిమాండ్‌ పడిపోవడం మూలంగా భారత ఆర్థికవ్యవస్థ మందగించడమనేది గత 70 ఏండ్లలో ఏనాడూ జరుగలేదని ఆర్బీఐ మాజీ గవర్నర్‌ ఒకరు తెలిపారు. చమురు సరఫరాలో అంతరాయం ఏర్పడటం వల్ల లేదా గ్రామీణ ప్రాంతం క్షామాన్ని ఎదుర్కొనడం వల్ల మాత్రమే ఆర్థికవ్యవస్థ మందగమనం చోటుచేసుకునేది. నాలుగైదేండ్లుగా డిమాం డ్‌ సమస్య దేశ ఆర్థికరంగాన్ని పీడిస్తున్నదనే విషయాన్ని ప్రభుత్వం అధికారికంగా గుర్తించడం ఇంతవరకు జరుగలేదు. ప్రభుత్వ పత్రాలలో ఈ ప్రస్తావనే లేదు. 


యూపీఏ హయాంలో పబ్లిక్‌రంగ బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను చెల్లించలేక తంటాలు పడుతున్న ఆశ్రిత వాణిజ్యవేత్తలను ఆదుకోవడానికి ఎన్‌బీఎఫ్‌సి రుణాలు ఉపయోగపడ్డాయి. మోదీ హయాంలో ఈ ఆశ్రిత వాణిజ్యవేత్తలు ఎణ్‌బీఎఫ్‌సీ రుణాలను వాడుకోవడం ద్వారా పాత పాచికలనే ప్రయోగించారు. ఈ విధంగా బ్యాంకులకు ఉన్న మొండిబకాయిల సమస్య ఎన్‌బీఎఫ్‌సీలకు బదిలీ అయింది. దీంతో మొండి బకాయిల సమస్య మళ్ళా మొదటికి వచ్చింది. ఎన్‌బీఎఫ్‌సీలు తమ మొండి బకాయిలు, ప్రత్యేకించి గృహ రుణాలకు సంబంధించిన బకాయిలు ఎంత భారీ ఎత్తున ఉన్నాయనేది దాచి పెడుతున్నా యి. డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ దివాలా తీసింది. కానీ ఈ సంస్థకు పబ్లిక్‌రంగ సం స్థలు ఎంత రుణాలు ఇచ్చాయనేది వెల్లడికాలేదు. ఇప్పటికీ ఎంత మొత్తం రుణాలు ఇచ్చాయనేది అంతుచిక్కని వ్యవహారమే. రిజర్వు బ్యాంకు ఈ మొండి బకాయిల వ్యవహారాన్ని పర్యవేక్షిస్తున్నది. కానీ ఇప్పటికీ పారదర్శకతను పాటించడం లేదు.


ఈ పరిణామాలను గమనిస్తే భారత్‌ ఎదుర్కొంటున్న ఆర్థిక అనిశ్చితి కి ఇతర దేశాలు ఎదుర్కొంటున్న ఆర్థిక దుస్థితికి పోలికలు లేవని స్పష్టమవుతున్నది. భారత్‌ తనదైన ఆర్థిక తప్పిదాల వల్ల సమస్యల్లో పడిపోయింది. అయితే మోదీ ప్రభుత్వం ఇప్పటివరకు మన దేశం ఆర్థిక పతనంలో కూరుకుపోయిందనే వాస్తవాన్ని అంగీకరించడమే లేదు. మన దేశ ఆర్థికవ్యవస్థలోని సెకండ్‌ ట్విన్‌ బ్యాలన్స్‌షీట్‌ సమస్యను ప్రభుత్వం మొదట గుర్తించాలె. నగరప్రాంతాల్లో కొనుగోళ్ళు పెరుగవచ్చునని కొం దరు ఆర్థికవేత్తలు అంటున్నారు. ఇది అనుకున్నట్టు జరిగినా ఆర్థికవ్యవస్థలోని లోపాన్ని చక్కదిద్దకపోతే ఫలితం ఉండదు. వాణిజ్యరంగానికి తొంభై శాతం రుణాలు తగ్గిపోవడమనేది ఆర్థికవ్యవస్థను పీడిస్తున్న పెద్ద రుగ్మతను సూచిస్తున్నది. 


ఈ రుగ్మతకు శస్త్రచికిత్స చేయకపోతే ఆర్థిక రంగం చక్కబడదు. ఆర్థికరంగం ఎదుర్కొంటున్న తీవ్ర సమస్యలకు మోదీ ప్రభుత్వం సమాధానం ఇవ్వవలసి ఉన్నది. మొదట ఆర్థికరంగం చక్కగా లేదనే విషయాన్ని మోదీ ప్రభుత్వం అంగీకరించాల్సి ఉంటుంది. ప్రధాని స్వయంగా ఆర్థికవ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారని అంటున్నా రు. ఈ కారణంగానైనా మోదీ తమ ప్రభుత్వ విధాన నిర్ణయాల వల్లనే ఈ దుస్థితి ఏర్పడిందని అంగీకరించాలె. పెద్ద నోట్ల రద్దు వల్ల ఆర్థిక వ్యవ స్థ డిమాండ్‌ సంక్షోభంలో కూరుకుపోయిందని ఆయన గుర్తించాలె.


డిమాండ్‌ పడిపోవడం మూలంగా భారత ఆర్థికవ్యవస్థ మందగించడమనేది గత 70 ఏండ్లలో ఏనాడూ జరుగలేదని ఆర్బీఐ మాజీ గవర్నర్‌ ఒకరు తెలిపారు. చమురు సరఫరాలో అంతరాయం ఏర్పడటం వల్ల లేదా గ్రామీణ ప్రాంతం క్షామాన్ని ఎదుర్కొనడం వల్ల మాత్రమే ఆర్థికవ్యవస్థ మందగమనం చోటుచేసుకునేది. నాలుగైదేండ్లుగా డిమాం డ్‌ సమస్య దేశ ఆర్థికరంగాన్ని పీడిస్తున్నదనే విషయాన్ని ప్రభుత్వం అధికారికంగా గుర్తించడం ఇంతవరకు జరుగలేదు. ప్రభుత్వ పత్రాలలో ఈ ప్రస్తావనే లేదు. కానీ 1980, 90 దశకాల్లో ఆర్థిక మంత్రిత్వ శాఖలో పనిచేసిన కనీసం ఇద్దరు ప్రధాన ఆర్థిక సలహాదారులు ఈ విషయాన్ని అంగీకరించారు. ఇంత డిమాండ్‌ సమస్య గతంలో ఏనాడూ లేదని ఆర్థిక సర్వేలను ఉటంకిస్తూ వారు తెలిపారు. మూడేండ్లుగా పీడిస్తున్న ఈ సమస్యను కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా అధిగమించదలుచుకున్నది? మోదీ ఈ ప్రశ్న వేసుకుంటే సమాధానాలు అవే వస్తాయి. త్వరలో ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌లో ఇందుకు చికిత్సా చర్యలు చేపట్టవచ్చు.


‘ది వైర్‌' సౌజన్యంతో..


logo