బుధవారం 08 ఏప్రిల్ 2020
Editorial - Jan 28, 2020 , 23:34:07

ప్రజాకవి కాళోజీ

ప్రజాకవి కాళోజీ

కాళోజీ...

కవన కెరటమై.. జనజాగృతపరచిన

మరో బాపూజీ..

కాళోజీ ప్రజాకవి కాళోజీ

కాళోజీ మన తెలుగు దిక్సూచి!

అక్షరాన్ని ఆయుధంగా మలిచావు

లక్షలాది మెదళ్లను కదిలించావు

మాతృభాష మధురమని చెప్పావు

కలాన్ని కత్తిగా నూరి

కలాన్ని కత్తిగా నూరి

అక్షర జ్వాలగా నిలిచావు

స్వరాజ్య పోరాటంలో ముందుకు నడిచావు //కాళోజీ//

నైజాం నహీ జాన్తా అన్నావు

తెలంగాణ విముక్తికై పోరు సంధించావు

ఊచలను ఊతకర్రలను చేసి

ఊచలను ఊత కర్రలుగా చేసి

అక్షర బాణాలు ప్రయోగించావు

ఇదే నా గొడవ అని లోకానికి

ఎలుగెత్తి చాటావు

వేకువ పొద్దుగా చైతన్య పరిచావు //కాళోజీ//

- దుర్గమ్‌ భైతి, రామునిపట్ల, సిద్దిపేట జిల్లా


logo