బుధవారం 01 ఏప్రిల్ 2020
Editorial - Jan 28, 2020 , 00:13:52

సంక్షేమ పథకాల వల్లే భారీ విజయం

సంక్షేమ పథకాల వల్లే భారీ విజయం

సంక్షేమ పథకాల వల్లే భారీ విజయం

మున్సిపల్‌, కార్పొరేషన్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ ఏకపక్ష విజయాన్ని నమోదు చేసింది. రాష్ట్ర ప్రజలు కేసీఆర్‌ నాయకత్వంపై బలమైన నమ్మకం తో ఉన్నారు. కాబట్టే ఇంత విజయాన్ని కట్టబెట్టారు. కేసీఆర్‌ ప్రభు త్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలను ఆకర్షిస్తున్నా యన డానికి ఇది సంకేతం. ఈ సమయంలోనే ఇటీవల సీఎం కేసీఆర్‌ విలేకరులతో మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించినట్లు పెంచిన ఆసరా పింఛన్లను అందిస్తామనటం అభినం దనీయం. ప్రజా సంక్షేమమే పరమావధిగా వ్యవహరిస్తున్న టీఆర్‌ఎస్‌కు ఓటమి లేదు.  

- బోడపట్ల కిషన్‌, కురిక్యాల, కరీంనగర్‌


ఆల్‌ ది బెస్ట్‌ టీమిండియా

సుదీర్ఘ పర్యటనం కోసం న్యూజిలాండ్‌ చేరుకున్న టీమిండియా మొదటి రెండు టీ ట్వంటీల్లో విజయం సాధించి జోరు మీదున్నది. కోహ్లీసేన అటు బౌలింగ్‌లోనూ, ఇటు బ్యాటింగ్‌లోనూ సమిష్ఠిగా రాణిస్తున్నది. ఈ జోరు ఇలాగే కొనసాగించి మూడు సిరీస్‌లతో భారత జట్టు స్వదేశంలో కాలుపెట్టాలి. 

- తోట చంద్రశేఖర్‌, ముత్తారం, పెద్దపల్లి జిల్లా


హర్షణీయం

ఆదీవాసీ సమ్మక్క-సారక్క జాతర వచ్చే నెల ఫిబ్రవరి 5 నుంచి 8వ తేదీ వరకు ఘనంగా జరుగనున్నది. ఈ జాతరను ప్రభుత్వం ప్రతి ష్ఠాత్మకంగా తీసుకొని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని చర్యలు తీసు కుంటున్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో సమ్మక్క-సారక్క జాతరలో కనీస సౌకర్యాలు కూడా ఉండేవికావు. బస్సుల కొరత, రోడ్డు రవాణా మార్గం సరిగా ఉండేది కాదు. ఈ క్రమంలో రాష్ట్రం ఆవిర్భవించడంతో సమ్మ క్క-సారక్క జాతరను ప్రభుత్వం రాష్ట్ర పండు గగా ప్రకటించింది. రెండేండ్లకోసారి వచ్చే ఈ జాతరను తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా జరు పుకుంటాం. కాబట్టి ప్రభుత్వం ఈ పండుగ పట్ల ప్రత్యేక చొరవ తీసుకోవడం హర్షణీయం. అలాగే ప్లాస్టిక్‌ నిషేధం పట్ల ప్రభుత్వం చేస్తున్న చర్యలను ప్రజలు ఆచరించాలి.

- మొగుళ్ల సునీల్‌, బేగంపేట, 


logo
>>>>>>