గురువారం 02 ఏప్రిల్ 2020
Editorial - Jan 27, 2020 , 23:58:07

కేసీఆర్‌, కేటీఆర్‌ల కృషి ఫలితం

కేసీఆర్‌, కేటీఆర్‌ల కృషి ఫలితం

మున్సిపాలిటీ, కార్పొరేషన్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ ఏకపక్ష విజయం సాధించింది. 120 మున్సిపాలిటీలలో 110 మున్సిపాలిటీ పీఠాలను, 10 కార్పొరేషన్లను గెలువడమనే ది దేశ చరిత్రలో ఎక్కడా జరుగలేదు. అది కేవలం సీఎం కేసీఆర్‌ మార్గదర్శకత్వంలో మంత్రి కేటీఆర్‌ కృషి వల్ల మాత్రమే సాధ్య మైంది. సిద్ధాంతాలను తమ మధ్య గల వైరుధ్యాలను వదిలేసి జాతీయ పార్టీలైన కాంగ్రెస్‌, బీజేపీ అధికారమే లక్ష్యంగా ఈ ఎన్నికల్లో కలిసి పనిచేసినప్పటికీ విజయం సాధించలేకపోయాయి. కాంగ్రెస్‌, బీజేపీలు నిందారోపణలు, వ్యక్తిగత విమర్శల విష ప్రచారాన్ని ప్రజలు తిరస్కరించారు. టీఆర్‌ ఎస్‌ పార్టీ దరిదాపుల్లో రాకుండా కాంగ్రెస్‌, బీజేపీలు సింగిల్‌ డిజిట్‌కు పరిమితమయ్యాయి. గత ఆరేండ్లుగా కేసీఆర్‌, కేటీఆర్‌ జోడి గ్రామీణ, పట్టణ ప్రాంతాల సమ్మిళిత అభివృద్ధి సాధించింది. ఇదే ఈ పురపాలిక ఎన్నికల్లో ఘన విజయానికి కారణం.

కేసీఆర్‌ గ్రామ పునాదుల నుంచి తెలంగాణను పునఃనిర్మిస్తుంటే కేటీఆర్‌ పట్టణాభివృద్ధికి కృషి చేస్తున్నారు. మున్సిపల్‌ చట్టం ద్వారా పట్టణాల్లో అవినితిరహిత బాధ్యాతాయుత పాలనను కేటీఆర్‌ ప్రారంభించారు. మున్సిపాలిటీ పట్టణాభివృద్ధి, వ్యాపార, వాణిజ్య సాంకేతిక మం త్రిగా గతంలో ఈ శాఖల్లో ఎన్నడూ జరుగని అభివృద్ధికి రుణాత్మక మార్పునకు కేటీఆర్‌ కారణమయ్యారు.


విభిన్న సమూహాలు, సమస్యలు గల పట్టణాల్లో అర్బన్‌ పార్టీలుగా పిలువబడే బీజేపీ, టీడీపీలకు గతంలో బలమైన పునాదులుండేవి. వాటి ని ఎదుర్కొని టీఆర్‌ఎస్‌ పార్టీని పట్టణ ప్రాంతాల్లో ఒక బలీయమైన శక్తి గా మలచడంలో కేటీఆర్‌ దీర్ఘకాలిక కృషి ఉన్నది. తెలంగాణ ఉద్యమం ఎన్నికల పోరాటాల్లో పనిచేసిన అనుభవం ఉండటం మూలానా మొన్న జీహెచ్‌ఎంసీ ఎన్నికలు మొదలుకొని నేటి పురపాలక ఎన్నికల వరకు ఒంటిచేత్తో గెలిపించగల ఒక బలమైన నాయకుడిగా కేటీఆర్‌ పరిణితి చెందారు.

కేటీఆర్‌ కృషి వల్ల ఈ రోజు సామాజిక, ఆర్థిక, వాణిజ్య, రియల్‌ ఎస్టేట్‌ రంగాల్లో అత్యంత క్రియాశీలక నగరంగా హైదరాబాద్‌ అవతరించింది. జేఎల్‌ గ్లోబల్‌ సంస్థ, జేఎల్‌ సిటీ మూమెంట్‌ ఇండెక్స్‌ 2020లో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 30 నగరాల్లో హైదరాబాద్‌ అత్యంత క్రియాశీలక నగరాన్ని మొదటి స్థానాన్ని దక్కించుకున్నది. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో ప్రపంచ ఆర్థిక వేదిక 50వ వార్షికోత్సవానికి కేటీఆర్‌ను ఆహ్వానించడం విశేషం. గత ఆరేండ్లుగా ఆయన హైదరాబాద్‌లో పారిశ్రామిక, వాణిజ్య రంగంలో, ఐటీ అభివృద్ధి కోసం చేసిన కృషిని గౌరవంగా దీన్ని మనం భావించాలి. 2020-30 దశాబ్దాన్ని తెలంగాణ దశాబ్దంగా పేర్కొని భారత్‌లో పెట్టుబడులకు తెలంగాణ స్వర్గధామం అనే నినాదంతో ముందుకువెళ్తున్నారు.

2016లో జీహెచ్‌ఎంసీకి జరిగిన ఎన్నికల్లో 150 సీట్లకు గాను 99 సీట్లు గెలువడానికి కేటీఆరే కర్త, కర్మ, క్రియ అనే విషయం తెలిసిం దే. దాని తర్వాత జీహెచ్‌ఎంసీ పరిధిలోని హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లా ల పరిపాలన, పార్టీ బాధ్యతలను కేటీఆర్‌ తీసుకొని ప్రత్యేకమైన ప్రణాళిక ద్వారా పార్టీని బలోపేతం చేశారు. కేటీఆర్‌ కృషివల్లనే 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలోని కాంగ్రెస్‌, టీడీపీ కూటమిని టీఆర్‌ఎస్‌ చిత్తు చేయగలిగింది. తర్వాత జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లో, పంచాయతీ, జిల్లా పరిషత్‌ స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ విజయాల్లో కేటీఆర్‌ భాగస్వామ్యం ఉన్నది. మున్సిపల్‌ 2020 ఎన్నికల బాధ్యతను తాను తీసుకోవడమే కాక తన పురపాలక శాఖకు సంబంధించిన పుర ఎన్నికల గెలుపోటములకు పూర్తి బాధ్యత వహిస్తానని ఎన్నికలను ఒక సవాల్‌గా స్వీకరించారు. పార్టీని, నాయకులను సమన్వయం చేస్తూ తన వ్యూహాలతో మున్సిపల్‌ ఎన్నికల్లో అఖండ విజయానికి కారణమయ్యారు. పెట్టుబడిదారుల్లో, వ్యాపారవర్గాల్లో సీమాంధ్రులు, ఉత్తర భారతదేశ చిరు వ్యాపారస్తుల్లో ఉన్న భయాందోళనను తొలిగించి వారి విశ్వాసాన్ని కేటీఆర్‌ పొందడం వల్లనే బీజేపీ, టీడీపీలను టీఆర్‌ఎస్‌ ఓడించగలిగింది.


వ్యాపార, పట్టణాభివృద్ధి, ఐటీ  శాఖల మంత్రి అయిన కేటీఆర్‌ 2014 నుంచి బ్రాండ్‌ హైదరాబాద్‌ పేరిట వ్యాపారవర్గాలను ఆకర్షించే పని మొదలుపెట్టారు. మినీ ఇండియాగా పిలువబడే హైదరాబాద్‌ వ్యాపార అనుకూలతలను, వాతావరణ అనుకూలతలను ప్రభుత్వం వ్యాపారులకు కల్పించే ప్రోత్సాహకాలను సమర్థవంతంగా ప్రచారం చేయడమే కాకుండా వ్యాపారవర్గాలను ఒప్పించారు. ఇంగ్లీష్‌ భాషపై పట్టు ప్రావీణ్యంతో పాటు కేటీఆర్‌ కొన్ని సందర్భాల్లో సీఈఓ అవతారమెత్తి అందరిని ఆకర్షించారు. మాదాపూర్‌, గచ్చిబౌలి లాంటి హైదరాబాద్‌ పశ్చిమ ప్రాంతానికి పరిమితమైన ఐటీ పరిశ్రమలను లుక్‌ ఈస్ట్‌ పాలసీ పేరుతో మిగతా ప్రాంతాలకు ముఖ్యంగా హైదరాబాద్‌ తూర్పు ప్రాంతాలకు విస్తరించడానికి తీవ్ర కృషిచేస్తున్నారు. ఐటీ పరిశ్రమ కేవలం హైదరాబాద్‌కే పరిమితం కాకుండా వరంగల్‌, ఖమ్మం, కరీంనగర్‌, నిజామాబాద్‌ లాం టి నగరాల విస్తరణకు ప్రణాళిక రచించారు.


కేటీఆర్‌ కృషితో అమెజాన్‌, ఆపిల్‌, మైక్రోసాఫ్ట్‌ లాంటి సంస్థలు హైదరాబాద్‌లో పెద్ద ఎత్తున తమ వ్యాపార కార్యకలాపాలు ప్రారంభించాయి.  వారి పట్టుదల, కృషితో 2015లో గూగుల్‌ సంస్థ తమ అతిపెద్ద అవుట్‌లెట్‌ను వెయ్యి కోట్లతో హైదరాబాద్‌లో ప్రారంభించారు. కేటీఆర్‌ కృషివ ల్లనే అమెజాన్‌ తన అతిపెద్ద సెంటర్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించిం ది. ఇండియాలోనే అతిపెద్ద ఇంక్యుబేటర్‌ కలిగిన టీహబ్‌ను స్టార్టప్‌ కోసం 2017, నవంబర్‌ 5న హైదరాబాద్‌లో కేటీఆర్‌ చొరవతో ఏర్పరిచారు. టీఎస్‌ఐపాస్‌ విధానం ద్వారా పెద్ద వ్యాపారస్థులకు సింగిల్‌ విం డో పద్ధతిలో వ్యాపార అనుమతులను సులువుగా పొందే పద్ధతిని ప్రవేశపెట్టారు. టీఎస్‌ఐపాస్‌ ద్వారా ఈజీ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో తెలంగాణ ఇండియాలోనే మొద టి స్థానంలో ఉన్నది. ప్రభుత్వ ప్రోత్సాహం ద్వారా పరిశ్రమల్లో తెలంగాణ యువకులకు ఉద్యోగాలు లభించేవిధంగా శిక్షణ ఇవ్వటం కోసం టాస్క్‌ (తెలంగాణ అకాడమిక్‌ ఫర్‌ స్కిల్‌ నాలెడ్జ్‌ కేటీఆర్‌ ద్వారా ఏర్పాటు చేశారు. టాస్క్‌ ద్వారా వేలాదిమంది చదువుకునే సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడం కోసం ప్రత్యేక శిక్షణను ఇప్పి స్తున్నది. దీనివల్ల తెలంగాణ విద్యాధికులకు, యువకులకు ఉపాధి అవకాశాలు మెరుగయ్యాయి.    


కేటీఆర్‌ కృషి వల్ల ఈరోజు సామాజిక, ఆర్థిక, వాణిజ్య, రియల్‌ ఎస్టేట్‌ రంగాల్లో అత్యంత క్రియాశీలక నగరంగా హైదరాబాద్‌ అవతరించింది. జేఎల్‌ గ్లోబల్‌ సంస్థ, జేఎల్‌ సిటీ మూమెంట్‌ ఇండెక్స్‌ 2020లో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 30 నగరాల్లో హైదరాబాద్‌ అత్యంత క్రియాశీలక నగరాన్ని మొదటి స్థానాన్ని దక్కించుకున్నది. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో ప్రపంచ ఆర్థిక వేదిక 50వ వార్షికోత్సవానికి కేటీఆర్‌ను ఆహ్వానించడం విశేషం. గత ఆరేండ్లుగా ఆయన హైదరాబాద్‌లో పారిశ్రామిక, వాణిజ్య రంగంలో, ఐటీ అభివృద్ధి కోసం చేసిన కృషిని గౌరవంగా దీన్ని మనం భావించాలి.  2020-30 దశాబ్దాన్ని తెలంగాణ దశాబ్దంగా పేర్కొని భారత్‌లో పెట్టుబడులకు తెలంగాణ స్వర్గధామం అనే నినాదంతో ముందుకు వెళ్తున్నారు.

అదేవిధంగా పకడ్బందీ ప్రణాళికతో వ్యవసాయ, పారిశ్రామిక రంగాల అభివృద్ధికి కేసీఆర్‌ కేటీఆర్‌ ద్వయం కృషిచేసింది. లౌకికభావాలు గల కేసీఆర్‌ అనేక సంక్షేమ కార్యక్రమాలకు దేశంలోనే ఆధ్యుడిగా ముందుకు వెళ్తుంటే ఆయనకు కుడి, ఎడమ భుజాలుగా ఆధునిక భావాలు, గ్లోబల్‌ ఆలోచనలతో కేటీఆర్‌ పరిశ్రమలు, ఐటీ అభివృద్ధికి కృషి చేస్తున్నారు. ప్రగతిశీల తెలంగాణ కోసం డైనమిక్‌ హైదరాబాద్‌ కోసం కేటీఆర్‌ చేస్తున్న కృషిని గుర్తించాలి, ప్రశంసించాలి, అండగా నిలబడాలి. సముచిత మతతత్వం రాజ్యాంగ వ్యతిరేకశక్తులకు తెలంగాణలో చోటులేదని ప్రతిన పూనాలి. 

 


డి.రాజారాం యాదవ్‌


logo