మంగళవారం 31 మార్చి 2020
Editorial - Jan 26, 2020 , 22:49:36

గుండెచప్పుడు

గుండెచప్పుడు

సమయం లేదు; ఎవరికీ ఎక్కడా. అంగడిలో

కాటు కలిశాం; అవసరంగానో, అప్రయత్నంగానో.

ఊబి నిజమే అయినా కూరుకుపోవడాన్ని

ప్రతిఘటించలేని పరిస్థితి.

సమర్థించుకోవడానికి సర్దిచెప్పుకోజూసినా అద్దమొకటి

అభిముఖంగా వేలాడ్తూనే వుంటుంది. తలపోత నుంచి

ఉక్కపోతను వేరు చేయలేం.

కక్ష్యలు కాపలా కాస్తున్నాయి; మనిషివై దారి

తప్పకుండా. సందర్భాలు శాసిస్తున్నాయి; ప్రేమాస్పదమైన

మాటలు పెదవి దాటకుండా.

కాళరాత్రుల్లోంచి కాపాడుకోవడమూ, మనల్ని మనం

సంరక్షించుకోవడమూ సంకటంగా మారిందిప్పుడు.

- మోహన్‌ రుషి, 96768 93149


logo
>>>>>>