శనివారం 04 ఏప్రిల్ 2020
Editorial - Jan 26, 2020 , 22:47:19

బహుజన సాహిత్య జాతర

బహుజన సాహిత్య జాతర


ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా 2020 ఫిబ్రవరి 2న రాజ్యాంగ పరిరక్షణకోసం ‘బహుజన సాహిత్య జాతర’ నిర్వహిస్తున్నాం. వక్తలుగా జీ.లక్ష్మీనర్సయ్య, అల్లం నారాయణ, కె.శ్రీనివాస్‌, కాలువ మల్లయ్య, బండి నారాయణ స్వామి, గోరటి వెంకన్న, జయరాజు, సంగిశెట్టి శ్రీనివాస్‌, స్కైబాబ, కదిరె కృష్ణ, కోయి కోటేశ్వర్‌ రావు, జిలుకర శ్రీనివాస్‌, ఏపూరి సోమన్న, నిస్సార్‌, అన్నవరం దేవేందర్‌, జూపాక సుభద్ర, ఎం.ఎం.వినోదిని, కనీజ్‌, జి.వెంకట కృష్ణ, నలిగంటి శరత్‌, దాసోజు లలిత, కాకాని సుధాకర్‌, మెర్సీ మార్గరేట్‌, వేంపల్లి షరీఫ్‌, డప్పోల్ల రమేష్‌, చింతం ప్రవీణ్‌, నస్రీన్‌ ఖాన్‌..,  రెండు తెలుగు రాష్ర్టాల నుంచి సాహిత్యకారులు మేధావులు  హాజరవుతారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు సదస్సులో వర్తమాన రాజకీయ, సామాజిక పరిస్థితుల మీద చర్చ, సాయంత్రం కవిగాయక సభ ఉంటుంది.

- డాక్టర్‌ గోగు శ్యామల, డాక్టర్‌ కాలువ మల్లయ్య, డాక్టర్‌ పసునూరి రవీందర్‌


రచనలకు ఆహ్వానం

ప్రముఖ రచయిత్రి డాక్టర్‌ ముదిగంటి సుజాతారెడ్డి సాహితీ ప్రస్థానం 50 ఏండ్లు పూర్తయిన సందర్భంగా తెలంగాణ భాషా సాంస్కృతిక మండ లి ‘బహుముఖీన’ అనే అభినందన సంచికను తేవాలని నిర్ణయించింది. సాహితీమిత్రులు,పరిశోధక విద్యార్థులు సుజాతారెడ్డితో తమకున్న సాహిత్యానుబంధాన్ని గురించిన వ్యాసాలను 2020 ఫిబ్రవరి 15లోపు పంపాల్సిందిగా కోరుతున్నాం. చిరునామా: డాక్టర్‌ గంటా జలంధర్‌రెడ్డి, ఇంటి నెం: 2-2-1105/21, ఫ్లాట్‌ నెం. 201, రోహణం, తిలక్‌నగర్‌, హైదరాబాద్‌-44.

- డాక్టర్‌ గంటా జలంధర్‌రెడ్డి, 9848292715


బడిపిల్లల కథలు ఆవిష్కరణ సభ

తెలంగాణలోని ఉమ్మడి జిల్లాల వారిగా కథాసంకలనాలను ‘తెలంగాణ బడి పిల్లల కథలు’ సంకలనాల ఆవిష్కరణ సభ 2020 జనవరి 29న ఉద యం 11 గంటలకు, హైదరాబాద్‌ చిక్కడపల్లిలోని నగర కేంద్రగ్రంథాలయంలో జరుగుతుంది. డాక్టర్‌ నందిని సిధారెడ్డి అధ్యక్షతన జరుగు సభ లో గౌరవఅతిథులుగా మణికొండ వేదకుమార్‌, బి.జనార్దన్‌రెడ్డి, డాక్టర్‌ ముదిగంటి సుజాతారెడ్డి, డాక్టర్‌ అమ్మంగి వేణుగోపాల్‌, చొక్కాపు వెంకటరమణ, మాచిరాజు కామేశ్వరరావు, డాక్టర్‌ పత్తిపాక మోహన్‌ హాజరవుతారు. గరిపల్లి అశోక్‌ వందన సమర్పణ చేస్తారు.

- బాల చెలిమి, చిల్డ్రన్స్‌ ఎడ్యుకేషనల్‌ అకాడమి


logo