గురువారం 02 ఏప్రిల్ 2020
Editorial - Jan 26, 2020 ,

ప్రజలు మెచ్చిన నాయకుడు

ప్రజలు మెచ్చిన నాయకుడు

నాయకులంటే సమస్యలను సృష్టించేవారు కాదు, సమస్యలను పరిష్కరించేవారు. దేశ సమస్యలకు ఆచరణాత్మక దృక్పథంతో పరిష్కారాలు సాధించలేనివారు ఉద్వేగాలను పురిగొల్పి గట్టెక్కాలని చూస్తారు. రాజకీయాలలో ఇది చాలా ప్రమాదకరమైన పోకడ. మోదీ విధానాల వల్ల దేశ ఆర్థికపరిస్థితి ప్రమాదకర స్థాయికి దిగజారింది. కేసీఆర్‌ మాటలను బట్టి పరిస్థితి ఎంత దారుణంగా ఉన్నదో స్పష్టమవుతున్నది. అయినాసరే ప్రజల్లో ఉద్వేగాలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలనే ధోరణి కేంద్రంలో అధికారంలో ఉన్న నాయకులలో కనబడుతున్నది. ఇటీవల నగరపాలక సంస్థల ఎన్నికల ముందు సోషల్‌ మీడియాలో ఎంత రెచ్చగొట్టే పోస్టులు పెట్టారో గమనించాం. భైంసా ఘటన ద్వారా ప్రజలను రెచ్చగొట్టాలనే ప్రయత్నం సాగింది. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను ఎగతాళి చేసేవిధంగా పిట్ట కథలను తయారుచేసి వాట్సాప్‌ గ్రూప్‌లలో పెట్టడం పెద్ద ఎత్తున సాగుతున్నది.

ఊహించినట్టుగానే నగర పాలక సంస్థల ఎన్నికల లో టీఆర్‌ఎస్‌ విజయ దుందుభి మోగించింది. కార్పొరేషన్లు, మున్సిపాలిటీలలో ఏకపక్ష విజయం సాధించింది. భైంసాలో ఉద్రిక్తతలు సృష్టించి, సోషల్‌ మీడియా ద్వారా రాష్ట్రమంతటా ప్రచారం చేయడం ద్వారా ఎన్నికల్లో లబ్ధి పొందాలనే కుయుక్తులనూ ప్రజలు తిరస్కరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ వ్యక్తిత్వం అత్యున్నతమైనది. ఆయన పాలనాదక్షత ముందు ఉద్వేగాలు సృష్టించి ఓట్లు రాల్చుకుందామనే ప్రయత్నాలు చెల్లుబాటు కావు కదా! ఒక్కమాట లో చెప్పాలంటే కేసీఆర్‌ను ఎదిరించే నైతిక సంపత్తి ప్రతిపక్షాలకు లేదు. 


టీఆర్‌ఎస్‌ అసెంబ్లీ ఎన్నికలలో వందకు పైగా స్థానాలు గెలుచుకుంటుందనే అనుకున్నాం. కానీ కొన్ని సీట్లు తగ్గాయి. ఆ తర్వాత విజయపరంపర కొనసాగుతూనే ఉన్నది. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో గెలువడం వేరు. కానీ స్థానిక సంస్థల్లో అభ్యర్థులను గెలిపించుకోవడం అంత సులభం కాదు. అక్కడ స్థానిక సమస్యలే కాదు, స్థానిక ప్రజా సంబంధాలు కూడా ప్రాధాన్యం వహిస్తాయి. దేశ ప్రధాని కూడా ఒక సర్పంచ్‌ను ఎదిరించలేకపోవచ్చు! కానీ స్థానిక ఎన్నికలలోనూ ప్రజలు కేసీఆర్‌ను చూసి ఓటు వేశారనేది వాస్తవం. కేసీఆర్‌కు ఓటు వేస్తున్నామని అనుకోవడం వల్లనే టీఆర్‌ఎస్‌కు ఇంతటి ఘన విజయం సాధ్యమైంది. పట్టణ ఓటర్లు కూడా టీఆర్‌ఎస్‌కు పట్టం కట్టారంటే, కేసీఆర్‌ ఆమోదనీయత అన్ని సామాజిక వర్గాలలో ఎట్లా విస్తరించుకపోయిందో అర్థం చేసుకోవచ్చు. ప్రతిపక్షాలకు తాము ఓడిపోయే యుద్ధం చేస్తున్నామనేది ముందే తెలుసు. కానీ పోరాడక తప్పలేదు. 


ఈ ఎన్నికల తర్వాత టీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కేటీఆర్‌ స్థానం మరింత స్థిరపడ్డది. రాజకీయ కుటుంబం నుంచి వచ్చినవారికి రాజకీయాల్లో ప్రవే శం వరకు సులభంగానే జరుగుతుంది. కానీ తనను తాను నిరూపించుకోవడం, స్థిరపడటం వారు స్వయంగా సాధించవలసిందే. లాల్‌ బహద్దూర్‌ శాస్త్రి తర్వాత, పాత కాంగ్రెస్‌ నాయకులు బలంగా ఉన్న సమయంలో, ఇందిరాగాంధీ ప్రధాని పదవి పొందడానికి అత్యంత చాకచక్యంతో వ్యవహరించారు. ఆ తర్వాత చరిత్ర తెలిసిందే. ఇందిరా గాంధీ తర్వాతి తరాల్లో ఆ రాజనీతి, జనాకర్షణ లోపించాయి. ఆ ఫలితం కనిపిస్తూనే ఉన్నది. కేటీఆర్‌ మంచి భవిష్యత్తు గల యువనాయకుడని ఈ ఎన్నికల నిర్వహణను బట్టి మరింత ధ్రువపడ్డది. దావోస్‌లో పారిశ్రామికవేత్తలను ఆకట్టుకుంటూనే అక్కడినుంచి ఎన్నికల పోరాటాన్ని నడిపిన తీరు అభినందనీయం.


ఎన్నికల ఫలితాల తర్వాత నిర్వహించిన పత్రికా సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ అనేక అంశాలపై మాట్లాడారు. తన సహజ ధోరణిలో తెలంగాణ పరిస్థితి, ప్రభుత్వ కార్యాచరణ గురించి గోరు ముద్దలు పెట్టినట్టు ప్రజలకు అర్థమయ్యే రీతి లో వివరించారు. రాష్ర్టానికే పరిమితం కాకుండా దేశ రాజకీయాల గురించి మాట్లాడారు. పరిపాలన ఎట్లా ఉండాలె, ప్రజాస్వామ్యవ్యవస్థలో పాలకులు వ్యవహరించవలసిన తీరు, ప్రజాభిప్రాయాన్ని గమనించి అవసరమైతే మధ్యలో విధానాలను సమీక్షించుకోవడం మొదలైన ప్రజాస్వామ్య సూత్రాలను అలవోకగా వివరించారు. ఉద్యమకాలంలో కూడా కేసీఆర్‌ సైద్ధాంతిక అంశాలను బరువైన పదజాలంతో కాకుండా అత్యంత సులభమైనరీతిలో వివరించేవారు. 


కేసీఆర్‌ సుదీర్ఘ పత్రికా సమావేశాన్ని చూస్తున్నప్పుడు చరిత్రలో ప్రాధాన్యం గల రెండు ప్రధాన ఘట్టాలు గుర్తుకువచ్చినయి. ఒకటి-అమెరికాలో 1930 దశకంలో అప్పటి దేశాధ్యక్షుడు రూజ్‌వెల్ట్‌ చేపట్టిన ‘న్యూడీల్‌'. రెండవది- 1945 నాటి బ్రిటన్‌ ఎన్నికలు.అమెరికా మహా మాంద్యంలో కూరుకుపోయినప్పుడు దాని నుంచి గట్టెక్కించడానికి చేపట్టిన కార్యక్రమాలే ‘ది నూ ్యడీల్‌' పేర ప్రాచుర్యం పొందాయి. 1933 నుంచి 39 వరకు రూజ్‌వెల్ట్‌ ప్రభుత్వం వివిధ వర్గాల ప్రజలకు ఊరట ఇవ్వడానికి అనేక చర్యలను చేపట్టింది. రైతులకు, నిరుద్యోగులకు, వృద్ధులకు-ఇట్లా అన్ని వర్గాలకు చేయూత లభించింది. సంక్షోభంలో ఉన్న అమెరికా ఆర్థిక నావను ఒడ్డుకు చేర్చడానికి రూజ్‌వెల్ట్‌ అసాధారణ ప్రజ్ఞను ప్రదర్శించారు. 


ఈ కార్యక్రమాన్ని మూడు ‘ఆర్‌'లతో చెబుతారు. పేదలకు ‘రిలీఫ్‌', ఆర్థిక పునరుజ్జీవానికి ‘రికవరీ’, ఆర్థికవ్యవస్థ సంస్కరణ ‘రిఫామ్‌'. ఈ విధానంతో ఇరువయవ శతాబ్దపు అమెరికా రాజకీయాలను, ఆర్థికవిధానాలను మలుపు తిప్పారాయన. న్యూడీల్‌ విధానాన్ని కన్సర్వేటివ్స్‌ తీవ్రంగా వ్యతిరేకిస్తుంటే, ఉదారవాదులు, కార్మికులు, శ్వేతేతరులు, స్థానిక జాతుల వారు డెమొక్రాటిక్‌ పార్టీ ఛత్రం కింద కేంద్రీకృతమయ్యారు. దేశ రాజకీయాల్లో భావజాలపరమైన కేంద్రీకరణ సాగింది. అందుకే రూజ్‌వెల్ట్‌ మరణించే వరకు నాలుగుసార్లు అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. జార్జి వాషింగ్ట న్‌, అబ్రహాం లింకన్‌ తర్వాత మళ్ళా అంతటి నాయకుడిగా చరిత్రలో నిలిచిపోయారు.


తెలంగాణ రాష్ట్రం ఏర్పడేనాటికి మన సమాజం పరాయి పాలనలో ఛిన్నాభిన్న మై ఉన్నది. ప్రజలకు దినం గడిస్తే దీర్ఘాయుషు అన్నట్టు ఉండేది. ఊళ్ళల్లో యువకులు ఉండలేని భయానక పరిస్థితి. తెలంగాణ ఏర్పడిన వెంటనే ముఖ్యమంత్రి కేసీఆర్‌ భిన్నవర్గాలు తెప్పరిల్లడానికి తక్షణ సహాయం అందించే పథకాలు చేపట్టారు. లక్షలాది రూపాయలను ప్రతినెలా ఊళ్లలోకి ప్రవహింపజేశారు. ఆసరా పింఛను కావచ్చు, మిషన్‌ కాకతీయ ద్వారా వచ్చిన కూలీ కావచ్చు, ఆ సొమ్మును దాచి పెట్టుకోరు. వాటిని వివిధ రూపాల్లో ఖర్చుచేస్తారు. అవి చేతులూ మారే కొద్దీ ఆర్థిక వ్యవ స్థ పుంజుకుంటూ ఉంటుంది. అతి తొందరలోనే సమాజం తేరుకున్నది. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలతో తెలంగాణ తేరుకున్నది. కులవృత్తుల నైపుణ్యాలను ఉత్పత్తిదాయకంగా మార్చడం, నీటి ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయడం మొదలైనవన్నీ తెలంగాణ సమాజ గతిని మార్చాయి. ఇవాళ పల్లెటూళ్ళ లో ప్రజలు నిమ్మళంగా ఉన్నారు. హైదరాబాద్‌లో, అమెరికాలో- ఎక్కడున్నా సరే, పాత మిత్రులంతా కలుసుకుంటున్నారు. 


దేశ రాజకీయాల్లో కూడా ప్రగతికాముక, లౌకిక, సమాఖ్య శక్తుల ఏకీకరణ కోసం కేసీఆర్‌ కృషిచేస్తున్నారు. 2019 ఎన్నికలకు ముందు కేసీఆర్‌ చెప్పినట్టు ప్రాంతీయ నాయకులు ఏకతాటిపైకి వచ్చి ఒక సమగ్ర పరివర్తనా కార్యక్రమంతో దేశ ప్రజల ముందుకుపోతే, ఇవాళ దేశ రాజకీయ చిత్రపటం మరోవిధంగా ఉండేది. దేశానికి ఈ కష్టాలు తప్పేవి. తెలంగాణ రాష్ట్ర సాధనకు కేసీఆర్‌ ప్రదర్శించిన పట్టుదల తెలిసిందే. ఇప్పుడు జాతీయస్థాయిలో రాజకీయ పునరేకీకరణ సాధించగలననే దృఢవిశ్వాసంతో ఉన్నారని తాజా పత్రికా సమావేశంలో మాట్లాడిన తీరును బట్టి తెలుస్తున్నది.


నాయకులంటే సమస్యలను సృష్టించేవారు కాదు, సమస్యలను పరిష్కరించేవా రు. దేశ సమస్యలకు ఆచరణాత్మక  దృక్పథంతో పరిష్కారాలు సాధించలేనివారు ఉద్వేగాలను పురిగొల్పి గట్టెక్కాలని చూస్తారు. రాజకీయాలలో ఇది చాలా ప్రమాదకరమైన పోకడ. మోదీ విధానాల వల్ల దేశ ఆర్థికపరిస్థితి ప్రమాదకర స్థాయికి దిగజారింది. కేసీఆర్‌ మాటలను బట్టి పరిస్థితి ఎంత దారుణంగా ఉన్నదో స్పష్టమవుతున్నది. అయినాసరే ప్రజల్లో ఉద్వేగాలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలనే ధోర ణి కేంద్రంలో అధికారంలో ఉన్న నాయకులలో కనబడుతున్నది. ఇటీవల నగర పాలక సంస్థల ఎన్నికల ముందు సోషల్‌ మీడియాలో ఎంత రెచ్చగొట్టే పోస్టులు పెట్టారో గమనించాం. భైంసా ఘటన ద్వారా ప్రజలను రెచ్చగొట్టాలనే ప్రయత్నం సాగింది. 


తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను ఎగతాళి చేసే విధంగా పిట్ట కథలను తయారుచేసి వాట్సాప్‌ గ్రూప్‌లలో పెట్టడం పెద్ద ఎత్తున సాగుతున్నది. చంద్రబాబు పెంపుడు ఉద్యమకారులు, సంఘాలు ఈ కార్యక్రమా న్ని పెద్ద ఎత్తున చేపట్టడాన్ని గమనించవచ్చు. వీరి దృష్టిలో ప్రజలు అజ్ఞానులు. ఏది గట్టిగా ప్రచారం చేస్తే అది నమ్ముతారని అనుకుంటారు. కానీ ప్రజలను తక్కువగా అంచనా వేయవద్దు. ప్రజలు తమ జీవితానుభవాలను బట్టి నిర్ణయాలు తీసుకుంటారు. నిజమైన నాయకులకు ప్రజల విచక్షణపై నమ్మకం ఉంటుంది. 1945 నాటి బ్రిటన్‌ ఎన్నికలు ఇందుకు ఉదాహరణ. రెండవ ప్రపంచ యుద్ధంలో చర్చిల్‌ నాయకత్వంలో విజయం సాధించిన తర్వాత ఈ ఎన్నికలు జరిగాయి. చర్చిల్‌ ప్రచా రం ఉద్వేగాలతో కూడుకున్నది. కానీ అట్లీ నాయకత్వంలోని లేబర్‌ పార్టీ మాత్రం యుద్ధం తర్వాత దేశాన్ని పునర్నిర్మించడంపై ప్రచారం సాగించింది. 1930 దశకం ఆర్థిక సంక్షోభాన్ని చవిచూసిన బ్రిటన్‌ సమాజం అట్లీ విధానాలకు హారతి పట్టింది. 


తెలంగాణ సమాజానికి దిశానిర్దేశం చేసిన కేసీఆర్‌ ఇప్పుడు జాతీయ రాజకీయాలను పునర్నిర్వచించాలని భావిస్తున్నారు. దేశ ప్రజలు మోదీ మొదటి పర్యాయం పాలనను కూడా పెద్దగా ఆమోదించలేదు. కానీ తగిన ప్రత్నామ్నాయం లేకపోవడం వల్ల మోదీ మళ్ళా గెలిచారు. ఇప్పటికీ జాతీయ రాజకీయాలలో శూన్యం ఆవరించి ఉన్నది. దేశానికి ఒక కొత్త అజెండా అవసరం. ఒక కొత్త రాజకీయ కూటమీ అవసరమే. లౌకిక ప్రజాస్వామ్య, సమాఖ్యశక్తులను ఒకే వేదిక మీదికి సమీకృతం చేయ డం తక్షణ అవసరం.

[email protected]


logo