గురువారం 02 ఏప్రిల్ 2020
Editorial - Jan 25, 2020 , 23:36:32

అందరం నేరస్థులమే!

అందరం నేరస్థులమే!

టాయిలెట్‌ లేకపోయినా టీవీ ఉంటోందనేది పాత విషయం. ఒంటిమీద ప్యాంట్‌ లేకపోయినా సరే, చేతిలో మొబైల్‌ తప్పనిసరైంది. దీనికితోడు డెటా ఫెసిలిటీ రావడంతో రసిక సామ్రాజ్యం అరచేతిలో దృశ్యంగా అలరారుతున్నది. పైకి శ్రీరామచంద్రుల్లా కనబడుతూ అశ్లీలాన్ని అమాయకంగా ఆస్వాదిస్తూ... అంతర్గత మృగాలుగా మారుతున్నారు. కళ్లెం లేని విశృంఖలత మరిన్ని దారుణాలకు దారితీస్తుంది. మద్యాన్ని మించిన మహా మాయావి ఈ నెట్‌ అశ్లీలత. దీని వెల్లువకు కారణం ఎవరు?

రెండు నెలల కిందట సుమారు పది, పదిహేను రోజుల పాటు దేశం ఉడికిపోయింది. దిశ, నిర్భయ అంటూ నిలువునా ఊగిపో యింది. ఎవరికి వారు తీర్పులు చెప్పడ మూ; ఉదారంగా శిక్షలు వేస్తూ అశ్లీలమైన నిందలు వేయడమూ విశృంఖలంగా సాగి పోయింది. ఆ సమయంలో మరే విషయం లేనట్టు కుతకుతలాడిపోయాం. అటువంటి వార్తలే అన్నిదిక్కులా పిక్కటిల్లేలా మీడి యా మోగిపోయింది. లైంగికదాడి చేసిన వారిని అప్పటికప్పుడే ఎవరికి వారు చంపే యాలనే రీతిలో వాద నలు పెరిగిపోయాయి. అంతలో దిశపై లైంగికదాడిచేసి హత్య చేసినవారు ఎన్‌కౌంటరయ్యారు. 


దాం తో ఇక వాదన మరోరకంగా మారింది. మరోవైపు నిర్భయ నేర స్థులు ఇంకా శిక్షింపబడలేదనే వాదన చర్చింపబడింది. నిజాని కి జనవరి 22న వారు నలుగురు ఒకేసారి ఉరితీయబడి ఉండా ల్సింది. అది చివరి నిమిషంలో ఫిబ్రవరి 1కి వాయిదా పడింది. వచ్చే శనివారం ఆ నలుగురూ ఒకేసారి తీహార్‌ జైలులో ఉరిశిక్ష కు గురవుతారు. ఉరితీసే ఉద్యోగి పోస్ట్‌ అక్కడ ఖాళీ ఉన్నది కనుక వేరొకచోట నుంచి ఆ ఉద్యోగి వచ్చి ఉరితీస్తాడు. నిజానికి నలుగురిని ఒకేసారి ఉరితీసే ఆ సదుపాయం అక్కడ లేదు. అటువంటి సందర్భం ఇంతవరకు వచ్చినట్టు లేదు కనుక ఏర్పా ట్లు లేవు. తీర్పు ప్రకారం ఒకేసారి నలుగురు ఉరితీయబడాలి.


ఈ విషయం సంబంధించి ఒక చౌకబారు చమత్కారం,  వికృతమైన హాస్యం పొందే దృష్టాంతం ఉన్నది. పర్యావరణ కాలుష్యం కారణంగా అందరూ చనిపోతాం కనుక, తమను ఉరి తీయనక్కరలేదని ఆ నలుగురి నేరస్థుల్లో ఒకరు నివేదన చేయడం గమనార్హం. ఆ స్థాయిలో పర్యావరణం నాశనమైంద ని ఆందోళన చెందాలో, లేక ఆ స్థాయి కాలుష్య వార్తల ఆధా రంగా శిక్ష నుంచి గట్టెక్కాలనే ఆ వ్యక్తి చావు తెలివికి విషాదం చెందాలో బోధపడటం లేదు. నేరస్థులు శిక్ష ముందు కూడా ఇలాంటి దొంగదారులు వెతుకుతున్నారని మనకు అర్థం కావ డం లేదు; ఉరిశిక్షలు కూడా వారికి తెలివిని ప్రసాదించడం లేద ని మనం గుర్తించాలి. ఇంతకుమించి మరే శిక్ష లేదు-అది నాగ రకమైనా, అనాగరికమైనా! నేరస్థుల నేరాలను ఎంతమాత్రం వెనుకేయడం, సమర్థించడం అవసరం లేదు. అయితే మనం ఇంతకుమించి చేయాల్సిందేమీ లేదా?


అసలు ఉరి ఎక్కడ అమలు జరుగాలి? ఏ విషయాలు ఉరి తీయబడాలి? మనకు బాగా తెలిసిన దిశ విషయం చూద్దాం. ఈ నేరం హైదరాబాద్‌ నగర శివార్లలో, టోల్‌గేట్‌కు దగ్గరలో జరిగింది. ఆ జరిగిన సమయం అర్ధరాత్రి కాదు, తెల్లవారు జాము ముందు కాదు. నేరానికి పాల్పడినవారు ఇరువయ్యేండ్ల కు అటూఇటూ ఉన్నవారిలా కనబడుతున్నారు. మద్యం పుచ్చు కున్నారు. మిస్‌లీడ్‌ చెయ్యడానికి మొబైల్‌ వంటివి వాడారు. తమకు ఉపాధి అయిన లారీని నేరం చేయడానికి వినియోగిం చుకున్నారు. చదువులేకుండా కేవలం తమ శారీరక సామర్థ్యం తో లభించే పనులు చేస్తున్న, బాధ్యత లేని ఆకతాయి కుర్రాళ్లు. వీరు ఎన్‌కౌంటర్‌ అయ్యాక ఒక నిందితుడి భార్య పరిస్థితి ఎం త విచారకరంగా ఉన్నదో మనకు తెలుసు. అలాగే నేరస్థుడి తల్లి మాట్లాడిన తీరు, ఉద్రేకంతో ఊగిపోయిన విధానం మనం టీవీ ఛానళ్లలో చూశాం. ఈ విషయాలు గమనిస్తే వారి పేదరికం, దాని ఫలితంగా వచ్చే తెంపరితనం మనకు బోధపడుతాయి. చదువు, ఉపాధి, నమ్మకం, ఆశలేని జీవితాలు ఎలా ఉంటా యో; అటువంటివారు ఎలా మాట్లాడుతారో కూడా మనం గుర్తించాలి.


మొత్తం విషయం పరిశీలిస్తే మనందరం సామూహికంగా, మన విధానాలపరంగా కూడా బాధ్యులమే అనిపిస్తున్నది. రిపబ్లిక్‌ దేశంగా ఏర్పడి ఏడు దశాబ్దాలైన సందర్భం లో సైతం ఈ విషయాలు ముచ్చటించుకో వడం ప్రధానమే. అంత కిందటయితే బ్రిటి ష్‌ పాలననూ, దానికిముందు మరొక పాల కుడిని విమర్శించుకోవచ్చు. మనం స్వాతం త్య్రం సంపాదించుకొని, మనల్ని మనం పాలించుకుంటున్నాం. కనుక ఈ ఏడు దశా బ్దాల లొసుగులను వేరెవరి మీదనో వేసి చేతులు దులుపుకోలేం కదా!


పేదరికం, బాధ్యత లేని కుటుంబ నేపథ్యం; కనీస అవసరా లు తీర్చే ఆర్థికస్థితీ; పరిమితమైన విలక్షణను అయినా కలిగించే సంస్కారం ఉండి ఉంటే ఏ కుటుంబం తమ పిల్లలకు చదువులే కుండా చేయదు. ఇవేవీ లేకపోవడం మొత్తం కుటుంబానికి ఎటువంటి ఆత్మవిశ్వాసమైనా, ఎలాంటి ఆశ అయినా ఉన్నా ఇలా పిల్లలను వదిలివేయదు. ఇంతమంది ఇలా పేదరికంలో మగ్గిపోవడానికీ, మరింత దిగజారడానికి ఎవరు బాధ్యులు?

అవిద్య: స్వాతంత్య్రం వచ్చిన ఆరు దశాబ్దాలకు విద్యాహక్కు చట్టం తెచ్చుకున్నాం. కొన్ని ఎలా అమలవుతాయో మనకు తెలుసు. అయినా బడి బయట ఇంతమంది  బాలబాలి కలు ఎలా ఉంటున్నారు. దీనికి శాశ్వత పరిష్కారం లేకుండా ఏం చేసినా ప్రయోజనం ఉండదు. దీనికి కూడా సమాజం బాధ్యత వహించాల్సిందే.


మద్యం అందుబాటు, అలవాటు: మద్యం మంచిది కాదు, మద్యంతో వచ్చే ఆదాయం మాత్రం అవసరమే! మన పిల్లాడు తాగకపోతే చాలు, ఇతరులందరూ తాగితే మంచిదే మన వ్యాపారానికి అని భావిస్తారు ఆ వాణిజ్యంలో ఉన్నవారు. 19 37లోనే మద్యం నుంచి ఆదాయం అనే భావన తగదని గాంధీ చాలా స్పష్టంగా నయీతాలీం వివరణలో పేర్కొంటారు. నేటికీ మనం మద్యాన్ని మనం వదలుకోలేకపోవడమే కాక; మరింత ఆధునికంగా మద్యం, మద్యం సంబంధిత సంస్కృతి బాగా విచ్చుకుంటున్నది. సామాజిక ఆమోదం పొందిన మద్యం కార ణంగా మన సామాజిక పరిస్థితి మరింత రంగులమయం కావ చ్చు కానీ తప్పక పతనమవుతుంది.


టెక్నాలజీ, టెక్నాలజీ మరగడం: టాయిలెట్‌ లేకపోయినా టీవీ ఉంటోందనేది పాత విషయం. ఒంటిమీద ప్యాంట్‌ లేక పోయినా సరే, చేతిలో మొబైల్‌ తప్పనిసరైంది. దీనికితోడు డెటా ఫెసిలిటీ రావడంతో రసిక సామ్రాజ్యం అరచేతిలో దృశ్యం గా అలరారుతున్నది. పైకి శ్రీరామచంద్రుల్లా కనబడుతూ అశ్లీ లాన్ని అమాయకంగా ఆస్వాదిస్తూ... అంతర్గత మృగాలుగా మారుతున్నారు. కళ్లెం లేని విశృంఖలత మరిన్ని దారుణాలకు దారితీస్తుంది. మద్యాన్ని మించిన మహా మాయావి ఈ నెట్‌ అశ్లీలత. దీని వెల్లువకు కారణం ఎవరు? వీటిని విమర్శిస్తూ టీవీ ఛానళ్లు మరింత బూతు నట్టింట పంచుతున్నాయి. ఈ ధోరణికి అడ్డుకట్ట వేయకపోతే భవిష్యత్‌ తరాలు కోల్పోతాం. 


పట్టించుకోనితనం: టోల్‌గేట్‌ దగ్గర జరిగినా, ఎవరూ పట్టిం చుకోకపోవడం ఏమిటి? బాధ్యత తీసుకోకుండా నోటికొచ్చిన ట్టు మాట్లాడటం ఏమిటి?

ఇక్కడ చెప్పుకున్న కారణాలను ఉరితీస్తే-నిర్భయ, దిశ లభి స్తుంది. ఆ స్థాయిలో గమ్యం కన్న గమనం మెరుగుపడాలి. అం తవరకు మనం అందరం నేరస్థులమే!


logo
>>>>>>