మంగళవారం 31 మార్చి 2020
Editorial - Jan 25, 2020 , 23:31:33

పునర్నిర్మాణ సూత్రధారి

పునర్నిర్మాణ సూత్రధారి

ప్రతి పట్టణం దాని అవసరాలు తీర్చటమే గాక విస్తృతంగా పెరుగుతున్న పట్టణాల దశ దిశలను నిర్ణయించే స్థితికి వచ్చి భవిష్యత్తులోకి ప్రవేశించగల ఆలోచనలు చేయగల శక్తి కేటీఆర్‌కు ఉన్నది. ప్రతి పట్టణాన్ని ఒక ఉత్పాదన కేంద్రాలుగా చేసేంతవరకు కేటీఆర్‌ కృషి ఆగేది కాదు. ఎన్నికల్లో విజయాలే కాదు పట్టణాల రూపురేఖలను తీర్చిదిద్ది పట్టణ తెలంగాణను అభివృద్ధిపథంలో నడిపించే ఈ తరం నాయకుడు కేటీఆర్‌.

ఏ ఎన్నికలు జరిగి ఫలితాలు వచ్చి నా ఓడినవారు గెలుపోటములు సహజం అని  ఓటమిని ఒప్పుకోవడం రివాజుగా జరిగే పని. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి టీఆర్‌ఎస్‌ అసాధారణంగా ప్రతి ఎన్నికల్లోనూ గెలుస్తూ వస్తు న్నది. ఏ ఎన్నికలు జరిగినా విజయం మాదే అని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ప్రకటిస్తూ వస్తున్నారు. నిజంగా ప్రతి ఎన్నికల ఫలితాల్లోనూ అదే ఒరవడి కనిపించి టీఆర్‌ఎస్‌కు విజయోస్తు అంటూ ప్రజలు ఆశీర్వదిస్తున్నారు. మేం ప్రజలకోసం పనిచేయటం, ప్రభుత్వాన్ని ప్రజల పక్షంగా మార్చిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆలోచనల ధార ల్లో అభివృద్ధిని గ్రామ వాకిళ్ల దాకా తీసుకుపోవటమే మా విజయ రహస్యమని కేటీఆర్‌ పదేపదే చెబుతున్నారు. ప్రజల కోసం తామేం చేశా మో చెప్పిమరీ టీఆర్‌ఎస్‌ ఓటు తీసుకుంటుంది.


ప్రజలు ఏం కోరుకుంటున్నారు? తమ సమస్యల పరిష్కారానికి ఏం చేయమంటున్నారు? మా ఊర్లు, మా పట్టణాలు ఏం చేస్తే కళకళలాడుతూ ఉంటాయోనన్న విషయంపై ప్రజలు మనోభావాలు ఏ విధంగా వ్యక్తం చేస్తున్నారు? ప్రజావసరాలు, పట్టణావసరాలు, గ్రామావసరాలు, సామాజికావసరాలపై కేసీఆర్‌ పెట్టినంత దృష్టి ఏ ముఖ్యమంత్రి ఆలోచించలేదు. లోతైన ఆలోచన, పదునైన పనితనం తో కేసీఆర్‌ పాలన రథచక్రాలను నడిపించుకుంటూ సాగుతున్నారు. ఏ మాట చెప్పినా దాన్ని ఆచరించే ఆచరణాత్మక ప్రభుత్వంగా టీఆర్‌ఎస్‌ నిలిచింది. తమ అవసరాలను తీర్చి, తెలంగాణ సమాజాన్ని శక్తివంతంగా తీర్చిదిద్దటాన్నే ప్రజలు కోరుకుంటారు. ప్రజలు కోరుకునేవిధంగా ప్రభుత్వాన్ని కేసీఆర్‌ తీర్చిదిద్దుతున్నారు.


మున్సిపల్‌ ఎన్నికలను చూడబోయే ముందు సహజంగా వాగ్దానా లు ముందుకొస్తాయి. కానీ ఈ ఎన్నికలు జరుగబోయే తీరు చూస్తే వాగ్దానాలు, వాక్బాణాలు, రొడ్డకొట్టుడు విమర్శల జోలికి టీఆర్‌ఎస్‌ వెళ్లే స్థితి కన్పించడం జరుగదనుకుంటా! టీఆర్‌ఎస్‌పైన ధ్వజమెత్తటం, టీఆర్‌ఎస్‌పై అడ్డగోలు విమర్శలు చేసే ఒక సెక్షన్‌ ఎప్పుడూ ఉంటుంది. ఆ విమర్శలకు దిగేవారు కొందరు వ్యక్తులుగా ఉండవచ్చు.  ప్రత్యేకించి కొన్నిపార్టీల వాళ్లూ ఉండవచ్చును. దానివల్ల మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు పెద్దగా జరిగే నష్టం అస్సలుండదు. 


రాష్ర్టావతరణ తర్వాత ఎన్నెన్ని ఎన్నికలు జరిగాయో, ఆ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అప్రతిహతంగా ఎలా విజయ దుందుభి మోగిస్తూ ముందుకు సాగుతూ పోతున్నదో గడిచిన కాలం చూసింది ఇప్పటికీ ప్రధాన ప్రతిపక్షాలుగా ఉన్న పార్టీల పెద్దలు నోటికొచ్చినట్లు తిట్లదండకం అందుకుంటున్నారు. వీళ్లు ఇట్లా టీఆర్‌ఎస్‌పై టీఆర్‌ఎస్‌ నేతలపై వ్యక్తిగతంగా చేసే విమర్శల దాడు ల వల్ల వాళ్లే తేలికైపోయి నిలిచారు. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా కొందరు నేతలు అడ్డగోలుగా వ్యక్తిగత విమర్శలు చేశారు. ఎన్నికల ఫలితాల్లో చూస్తే వాళ్లు సోయిలో లేకుండా పోయారన్నది నిజం.


కేటీఆర్‌ రాజకీయంగా శక్తివంతమైన వ్యూహకర్త. గత గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో 100 కార్పొరేటర్‌ స్థానాలు గెలుచుకుంటామని కేటీఆర్‌ చెప్పి మరీ సాధించారు. రాజకీయంగా సమీకరణాలు చేసేవాళ్లకు అంతుబట్టని విధంగా కేటీఆర్‌ ఫలితాలు సాధించారు. ఇది కేటీఆర్‌ ఆలోచనల్లో సాగిన ఎన్నికల్లో తొలిమెట్టు. సీపీఐ నారాయణ వంద కార్పొరేట్‌ స్థానాలు టీఆర్‌ఎస్‌కు వస్తే చెవి కోసుకుంటానని ప్రకటించారు. కానీ నారాయణ నా స్నేహితుడని, చెవిలేని నారాయణను నేను చూడలేనని ముఖ్యమంత్రి కేసీఆర్‌ సున్నితంగా సమాధానం చెప్పారు. 


కఠోరదీక్షతో 14 ఏండ్లు నిలిచి తెలంగాణ సాధకునిగా గెలిచిన కేసీఆర్‌ కు కేటీఆర్‌ లాంటి తనయుడుండటం కూడా కలిసివచ్చిన అదృష్టం. 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కేటీఆర్‌ పర్యవేక్షణలో జరిగిన కొంగరకలాన్‌ సభ విజయవంతమైంది. 51 నెలల్లో టీఆర్‌ఎస్‌ సాధించిన విజయాలు, ప్రభుత్వం ప్రజల కోసం చేసిన పనులను కొంగర్‌కలాన్‌ వేదికగా ప్రజల ముందు పెట్టారు. ఇది ఒకరకంగా ప్రభుత్వం తనకుతానుగా తన అభివృద్ధి విజయయాత్రను ప్రజలముందు పెట్ట డం జరిగింది. కేసీఆర్‌ ఆలోచనల ధారల్లో కేటీఆర్‌ ఈ కొత్త సంస్కృతికి శ్రీకారం చుట్టి ఎన్నికల శంఖారావం పూరించటం జరిగింది.


వరు స విజయాలు, ఒంటరిగా విజయాలు కేటీఆర్‌ చెప్పినట్లే టీఆర్‌ఎస్‌ను ప్రజలు గెలిపించి చూపించిన తీరు. ఇపుడు తెలంగాణ నేలంతా టీఆర్‌ఎస్‌కు ఏకపక్షంగా నిలిచింది. కేటీఆర్‌ అన్నట్లు అవి ఏ ఎన్నికలైనా గెలుపు టీఆర్‌ఎస్‌కే దక్కుతుందని చెప్పింది. పక్క గా జరిగి తీరింది. మొత్తం మున్సిపాలిటీ ఎన్నికల చరిత్రలో ఇలా వార్‌ వన్‌సైడ్‌గా విజయమంతా ఒక పార్టీ పక్షానికే వచ్చింది ఎక్కడా లేదు. టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా కేటీఆర్‌ పగ్గాలు చేపట్టి న దగ్గరి నుంచి పార్టీకి మరింత ఊపునిచ్చింది. కొత్త జవసత్వాలతో కదులుతుందని సత్యం.


టీఆర్‌ఎస్‌ గెలుపు వెనుక పార్టీ నిరంతర శ్రమ ఉన్నది. పార్టీ పట్టును మరింత పెంచేందుకు అధినేత కేసీఆర్‌ చూపిన దారిలో కఠిన శ్రమతో కేటీఆర్‌ ముందుకుసాగుతూ పార్టీ రథచక్రాలను పరుగులు పెట్టిస్తున్నారు. ఏదైనా ఒక పని చేపడితే పరిపూర్ణం గా అర్థం చేసుకొని ఆ పనిని సాధించేవరకు వదలకుండా లక్ష్యాన్ని చేరుకునే సాధన చేయగలిగిన వాళ్లే ఈ ప్రజాక్షేత్రంలో నిలబడగలుగుతారు. అలా ప్రజా హృదయాల్లో చెరగని సంతకంగా కేసీఆర్‌ నిలిచా రు. ఆ బాటలో కేటీఆర్‌ పరిణతి చెందిన నేతగా ఎదిగివస్తున్నారు.


కేటీఆర్‌ మున్సిపల్‌ ఎన్నికల రక్షణ క్షేత్రంలో దూకటానికి ముందే పకడ్బందీగా పక్కాగా ఎన్నికల వ్యూహరచన చేసుకున్నారు. ప్రజలముందుకువెళ్లటానికి ముందుగానే ఈ ఎన్నికల ఎజెండా ఏమిటన్న విషయాన్ని ప్రకటించి మరీ బరిలో దిగటం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలకు సంబంధించి క్షుణ్ణంగా తెలుసు. ఏ మున్సిపాలిటీ ఏ సమస్యలు ఎదుర్కొంటున్నదో కేటీఆర్‌కు బాగా తెలుసు. ఏ మున్సిపాలిటీ పేరుచెప్పినా ఆ మున్సిపాలిటీ స్థితిగతులు ఏమిటో తడుముకోకుండా కేటీఆర్‌ చెప్పగలరు. ఆయన దగ్గర సమగ్ర సమాచారం ఉన్నది. 


సమాచారాన్ని ఎట్లా  చేయాలో కూడా బాగా ఎరుక తెలిసిన వ్యక్తి కేటీఆర్‌. మున్సిపల్‌ వ్యవహారాల శాఖామాత్యులుగా ఉండటం వల్ల కూడా ఆయనకు మున్సిపాలిటీల పనితీరు లోతుగా తెలుసు. ఇతర ప్రతిపక్షపార్టీలు రాజకీయంగా అడ్డగోలు విమర్శలు చేసుకుంటూపోతున్నారు కానీ మూలల్లోకి పోయి సమస్యకు విరుగుడు గురించి ఆలోచించిన దాఖలాల్లేవు. ఎన్నికల్లో విజయాలను సాధించటమే కాదు సాధించిన విజయాలతో సంతృప్తిని చెందకుండా భవిష్యత్‌ను తీర్చిదిద్దుకునేందుకు టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా కేటీఆర్‌ అడుగులు వేస్తున్నారు. రాష్ట్రం పునర్నిర్మించబడుతున్న ఈ దశలో ప్రతి పట్టణాన్ని పునర్నిర్మించుకునే పని అత్యంత ముఖ్యమైన ది. ఏ పట్టణానికి ఏది అవసరమో? ఆ పట్టణ పరిసరాల ఆధారంగా స్థానికంగా ఆ ప్రాంతాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలన్న శాస్త్రీయమైన ఆలోచన కేటీఆర్‌కు ఉన్నది.


కేటీఆర్‌ చెప్పినట్లుగానే ఫలితాలు రావటమే కాదు, కేటీఆర్‌ ఆలోచనల్లో ప్రతి పట్టణాన్ని తీర్చిదిద్దుకునే పట్టణ ప్రగతి కూడా శరవేగంగా జరిగే యాక్షన్‌ ప్లాన్‌లను రచించి ముందుకు అడుగులువేసే శక్తివంతు డు కేటీఆర్‌.ప్రతి పట్టణం దాని అవసరాలు తీర్చటమే గాక విస్తృతంగా పెరుగుతున్న పట్టణాల దశ దిశలను నిర్ణయించే స్థితికి వచ్చి భవిష్యత్తులోకి ప్రవేశించగల ఆలోచనలు చేయగల శక్తి కేటీఆర్‌కు ఉన్నది. ప్రతి పట్టణాన్ని ఒక ఉత్పాదన కేంద్రాలుగా చేసేంతవరకు కేటీఆర్‌ కృషి ఆగేది కాదు. ఎన్నికల్లో విజయాలే కాదు పట్టణాల రూపురేఖలను తీర్చిదిద్ది పట్టణ తెలంగాణను అభివృద్ధిపథంలో నడిపించే ఈ తరం నాయకుడు కేటీఆర్‌. తన ఆలోచనలకు, తను వేసే అడుగులకు, తన భవిష్యత్‌ లక్ష్యాలకు ఆమోదముద్ర వేసిన అండగా నిలిచిన ప్రజల కోసం వెనుదిరిగి చూడకుండా ముందుకు సాగిపో కేటీఆర్‌ లక్ష్యాల సాధన కోసం తెగించి ముందుకుసాగండి. బెస్ట్‌ ఆఫ్‌ లక్‌.


logo
>>>>>>