శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Editorial - Jan 13, 2020 , 00:33:34

పుస్తకాలు

పుస్తకాలు

పుంజీతం (కథలు)

మనిషిలోని వివిధ సంఘర్షణలను సజీవంగా చిత్రించగల శక్తి మిగతా ప్రక్రియల కంటే కథకే ఎక్కువ. వర్తమాన గ్రామీణ జీవన సంఘర్షణల ను పదునైన కథలుగా మలిచి అందిస్తున్న రచయి త డాక్టర్ వెల్దండి శ్రీధర్. ఈ కథలు మనల్ని చేయి పట్టుకొని గ్రామాలకు తీసుకెళ్తాయి. విధ్వం సమవుతున్న గ్రామీణ దృశ్యాలను చూపుతాయి. ఆర్ద్రత పరుస్తాయి.

రచన: డాక్టర్ వెల్దండి శ్రీధర్, వెల: రూ.100, ప్రతులకు: వెల్దండి సురేఖ, ప్లాట్ నెం:302, సాయి శ్రీనివాసం అపార్ట్‌మెంట్, రీట్రీట్ కాలనీ,

ఫాదర్ బాలయ్యనగర్, ఓల్డ్ అల్వాల్, హైదరాబాద్.


నోముల యాదిలో...

బహుభాషా కోవిదుడు, సాహితీవేత్త నోముల సత్యనారాయణ తెలంగాణవ్యాప్తంగా సాహితీ పరులందరికీ ఆప్తుడు, ఆదర్శప్రాయుడు. ఆయన మొదటి వర్ధంతి సందర్భంగా ఆయన మిత్రులు, అభిమానులు ఆయన జ్ఞాపకాలతో వెలువరించిన సంచిక నోముల యాదిలో..విలువైనది. .

దేవులపల్లి కృష్ణమూర్తి, ఆచార్య జి.చెన్నకేశవరెడ్డి,

అమ్మంగి వేణుగోపాల్, వెల: రూ. 100, ప్రతులకు: దేవులపల్లి కృష్ణమూర్తి, 17/98, శ్రీశ్రీ మార్గం, నకిరేకల్-508211, నల్లగొండ జిల్లా


 జాతి విపంచీగానం 

జాతీయ భావానికి విస్తృతమైన భారతీయమై న నిర్వచనాన్ని చెబుతూ ఇటీవలికాలంలో పాశ్చా త్యుల నుంచి మనకు సంక్రమించిన జాతీయ భావనలోని పరిమితులను ఖండించారు. విశ్వశ్రే యఃకారకమైన జీవన తాత్పర్యాన్ని చెప్పిన గ్రం థం ఇది.

రచన: ముదిగొండ వీరభద్రయ్య, వెల:రూ.70, ప్రతులకు: డాక్టర్ 

అప్పం పాండయ్య, తెలుగు విజ్ఞాన పరిషత్తు, ఫోన్:9703079900


logo