శనివారం 04 ఏప్రిల్ 2020
Editorial - Jan 25, 2020 ,

డబ్ల్యూటీవో వివక్ష

డబ్ల్యూటీవో వివక్ష

ప్రస్తుత పరిస్థితుల్లో భారత రైతాంగం జీవన మనుగడ కోసమే నానా తంటాలు పడుతున్నది. తమ ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు లేక తల్లడిల్లుతున్నారు. ఇదొక్క చెరుకు రైతుల పరిస్థితి మాత్రమే కాదు, వరి, గోధుమ, ఇతర తృణధాన్యాలు పండించే రైతులు కూడా తీవ్ర ఆర్థికసంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు.

గణతంత్ర దినోత్సవానికి ముఖ్యఅతిథిగా బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బొల్సొనారోను భారత ప్రభుత్వం ఆహ్వానించింది. ఇత నికి గౌరవ ఆతిథ్యం పట్ల దేశంలోని రైతు సంఘాలు, ప్రజ లు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అతనికి ఇం టా, బయటా చెడ్డపేరు ఉన్నది. దురభిమానిగా, నిరంకుశునిగా, చంచల స్వభావిగా, సైనిక స్వభావిగా, హంతకునిగా, మహిళా వ్యతిరేకిగా ముద్రపడిన అతన్ని రిపబ్లిక్ దినోత్సవానికి అతిథిగా ఆహ్వానించటం పట్ల ప్రభుత్వంపై అన్నివర్గాల నుంచి విమర్శలొస్తున్నాయి. ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో)లో భారత రైతుల ప్రయోజనాలకు, ముఖ్యంగా చెరుకు రైతుల ప్రయోజనాలకు వ్యతిరేకంగా నిలిచిన బొల్సొనారో 2020 గణతంత్ర దినోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరుకానుండటం పట్ల సర్వత్రా నిరసన వ్యక్తమవుతున్నది.బొల్సొనారో భారతదేశంలోని ఐదు కోట్ల మంది చెరుకు రైతుల ప్రయో జనాలకు వ్యతిరేకంగా నిలిచారు. ఆయన తన దేశం బ్రెజిల్ ప్రయోజనాల కోసం చేసింది కూడా కాదు. బొల్సొనారో భారత రైతుల సంక్షేమం పట్ల కత్తిగట్టి వ్యవహరించారు. ఈ క్రమంలో బొల్సొనారో ప్రపంచ వాణిజ్య సంస్థలో భారతదేశానికి వ్యతిరేకంగా వివాదం లేవనెత్తారు. భారత్‌పై బ్రెజిల్ ఫిర్యాదు చేసిన తర్వాతనే ఇతర దేశాలు బ్రెజిల్‌తో జతకట్టాయి. దీంతో దేశంలోని చెరు కు రైతుల బతుకులు మరింత కష్టనష్టాల పాలయ్యాయి.బొల్సొనారోను గణతంత్ర దినోత్సవానికి ముఖ్యఅతిథిగా ఆహ్వానించ టంతో ప్రజల జీవనభద్రత, సమస్యల పట్ల ప్రభుత్వానికి కనీస పట్టింపు లేదని నిరసిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రపంచ వాణిజ్య సంస్థ విధానాలకు వ్యతిరేకంగా రైతు ఉద్యమాల భారత సమన్వయ కమిటీ (ఐసీసీఎఫ్‌ఎం) నిరసనోద్యమాలకు పిలుపునిచ్చి బొల్సొనారో రాకను నిరసించాలని కోరింది.

చెరుకు ఉత్పత్తిలో ప్రపంచంలో భారతదేశం రెండో స్థానం ఆక్రమించింది. అలాగే ప్రపంచంలోనే అతిపెద్ద చక్కెర వినియోగదారుగా కూడా భారత్ ఉన్నది. దేశంలో చిన్న, మధ్యతరహా రైతులు ఐదుకోట్ల మంది దాకా చెరుకు ఉత్పత్తిని జీవనోపాధిగా చేసుకొని జీవిస్తున్నారు. కానీ దేశీయంగా ఉన్న పరిస్థితుల దృష్ట్యా చెరుకు రైతులు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయి ఉన్నారు. చక్కెర మిల్లులు రైతులకు బిల్లులు చెల్లించకపోవటం మూలంగా ఈ పరిస్థితి కొంతకాలంగా తీవ్ర సమస్యగా మారింది. ఒకానొక అంచనా ప్రకారం చక్కెర మిల్లులు రైతులకు 20 వేల కోట్ల దాకా బకాయిపడ్డాయి. ఇప్పటికీ రైతులకు 4,5 00 కోట్లు చెల్లించాల్సి ఉన్నది. మరోవైపు బ్రెజిల్ కూడా చెరుకు ఉత్పత్తిలో, చక్కెర ఉత్పత్తి, ఎగుమతిలో కూడా ప్రపంచంలోనే అగ్రభాగాన్ని ఆక్రమించింది. ప్రపంచ చక్కెర ఎగుమతిలో బ్రెజిల్‌దే 45 శాతం. బ్రెజిల్, ఆస్ట్రేలియా, గౌతెమాలా దేశాలు తమ చెరుకు ఉత్పత్తిలో 70 నుంచి 75 శాతం ప్రపంచ మార్కెట్‌కు ఎగుమతి చేస్తున్నాయి. భారత్ ఎగుమతి చేస్తున్నది 1నుంచి 4 శాతంగా ఉండ టం గమనార్హం.భారతదేశంలో చెరుకు ఉత్పత్తిదారులకు దేశీయంగా లభిస్తున్న మద్ద తు, చక్కెర ఎగుమతిలో ప్రభుత్వం నుంచి పొందుతున్న సబ్సిడీలపై బ్రెజి ల్ డబ్ల్యూటీవోలో 2019 ఫిబ్రవరిలో ఫిర్యాదు చేసింది. ప్రపంచ వాణిజ్యసంస్థ నియమ నిబంధనలకు విరుద్ధంగా భారత్ రైతులకు ప్రయోజనాలు, సబ్సిడీలు ఇస్తున్నదని ఆరోపించింది. మొదట సాధారణ ఫిర్యాదు గా నమోదు చేసిన బ్రెజిల్ తర్వాత డబ్ల్యూటీవోలోని వివాద పరిష్కార కమిటీకి విన్నవించింది. దీంతో భారత్‌కు వ్యతిరేకంగా గౌతెమాలా, కోస్టారికా, ఆస్ట్రేలియా, థాయిలాండ్, యురోపియన్ యూనియన్‌లోని తదిత ర దేశాలు బ్రెజిల్‌తో జతకట్టాయి. బ్రెజిల్ ప్రధాన ఆరోపణ ఏమంటే.. భారత్ చెరుకు రైతులకు ఫేర్ అండ్ రెమ్యునరేటివ్ ప్రైస్ (ఎఫ్‌ఆర్‌పీ)ని ఎక్కువగా చెల్లిస్తున్నదని. 2010-11లో చెరుకు టన్నుకు రూ.1,391లు చెల్లించిన భారత్ 2018-19నాటికి దాన్ని 2,750కి పెంచిందని ఆరోపిస్తున్న ది. అలాగే ప్రభుత్వ మద్దతు ధర కూడా ఎక్కువగా ఉంటున్నదని బ్రెజిల్ విమర్శిస్తున్నది. ఈ విధంగా రైతులకు భారత ప్రభుత్వం అనేక రూపాల్లో మద్దతుగా నిలువటం, సబ్సిడీలు ప్రకటించటంతో భారత్ ఉత్పత్తులతో అంతర్జాతీయ మార్కెట్‌లో తీవ్ర ఒత్తిడి ఏర్పడుతున్నదని బ్రెజిల్ ఆరోపిస్తున్నది. ఇంకా భారతదేశం వ్యవసాయానికి దేశీయ మద్దతు 10 శాతం కన్నా మించకూడదని ఉన్నా, భారత్ అనేకరూపాల్లో రైతులకు లాభం కలిగిస్తున్నదని నిరసిస్తున్నది. అంతర్జాతీయ నిబంధనలకు అనుగుణంగా వ్యవసాయరంగానికి సబ్సిడీలు ఇవ్వటం నిషిద్ధమైనా, భారత్ అనేకరూ పాల్లో కొనసాగిస్తున్నదని బ్రెజిల్ ఆక్షేపిస్తున్నది.

భారత్ ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ రైతులకు ఎఫ్‌ఆర్‌పీ చెల్లించటం లేదు. దేశంలో మొత్తం 732 చక్కెర మిల్లు లుంటే అందులో కేవలం 43 మాత్రమే ప్రభుత్వ రంగంలోని వి. దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు, రైతులకు ప్రయోజనాలు కలిగే విధంగా చక్కెర మిల్లులు వ్యవహరిస్తున్నాయనటానికి అర్థమే లేదు. నిజానికి రైతులకు అన్నివిధాలా ప్రభుత్వ ఆదుకొని, మద్దతు ధరలు చెల్లిస్తూ ఉంటే వ్యవసాయరంగం లో ఈ సంక్షోభం ఉండేదే కాదు. రైతుల ఆత్మహత్యలు కూడా ఉండేవి కావు. ఒకవేళ ప్రపంచ వాణిజ్య సంస్థలో బ్రెజిల్ గెలిస్తే.. అది భారత చెరుకు రైతుల పాటి శాపంగా మారుతుంది. ఇప్పటికే సంక్షోభంలో కూరుకుపోయిన రైతాం గం వ్యవసాయం నుంచి తప్పుకునే దుస్థితి ఏర్పడుతుంది. అంతిమంగా దేశం చక్కెరను దిగుమతి చేసుకునే పరిస్థితులు దాపురిస్తాయి. వాస్తవానికి డబ్ల్యూటీవో నియమ నిబంధనలు అన్నిదేశాలకూ సమాన స్థాయిలో వర్తించేలా లేవు. అభివృద్ధి చెందిన దేశాలకు ఒక తీరుగా, వెనుకబడిన, అభివృద్ధి చెందుతున్న దేశాల పట్ల మరోతీరుగా డబ్ల్యూటీవో వ్యవహరిస్తున్నది. అమెరికా లాంటి దేశం వ్యవసాయరంగ ఉత్పత్తులకు 64.4 శాతం సబ్సిడీలు ఇస్తున్నది. అయినా భారత రైతులపై కక్షగట్టి మనదేశంపై నిందారోపణలు చేయ టం అభివృద్ధి చెందిన దేశాలకు పరిపాటి అయ్యింది.ప్రస్తుత పరిస్థితుల్లో భారత రైతాంగం జీవన మనుగడ కోసమే నానా తంటాలు పడుతున్నది. తమ ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు లేక తల్లడిల్లుతున్నారు. ఇదొక్క చెరుకు రైతుల పరిస్థితి మాత్రమే కాదు, వరి, గోధు మ, ఇతర తృణధాన్యాలు పండించే రైతులు కూడా తీవ్ర ఆర్థికసంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. రైతుల భద్రత అంటే  కేవలం రైతులకు సంబంధించిన విషయం కాదు, అది ఆహారభద్రత, జీవనభద్రత, అంతిమంగా దేశ సార్వభౌమాధికారానికి సంబంధించిన విషయం. భారత రైతాంగ ప్రయోజనాలకు వ్యతిరేకంగా నిలిచిన బొల్సొనారోను గణతంత్ర దినోత్సవానికి అతిథిగా గౌరవించటం అంటే రైతులను కించపర్చటమే.

(వ్యాసకర్త: ఆశ-కిసాన్ స్వరాజ్ నెట్ వర్క్ కార్యకర్త) ది వైర్ సౌజన్యంతో..


logo