గురువారం 02 ఏప్రిల్ 2020
Editorial - Apr 25, 2020 ,

ఓటు

ఓటు

రెండక్షరాల ఓటు

స్వేచ్ఛా స్వాతంత్య్రనాదమై

ప్రజాస్వామ్య పరిరక్షణ కొరకు

జాతి, కులమతాల హద్దులు విడిచి

కాసుల ప్రలోభాలను తుడిచివేసి

వేలున సిరాచుక్కతో నడిచి

రహస్య తెరచాటున ముద్రించి

బ్యాలెట్ బాక్సులు భద్రపరుస్తూ

ఆత్మసాక్షిని ప్రతిబింబిస్తుంది ఓటు!

కాకలుతీరిన వీరులైనా

రాజకీయ చదరంగ భీష్ములైనా

కోట్లకు పడగలెత్తిన ధనవంతులైనా

ప్రతి ఓటరును ప్రాధేయపడాల్సిందే

ప్రజాస్వామ్యాన్ని గౌరవించాల్సిందే...

- ఉండ్రాల రాజేశం, 9966946084


గణతంత్రమా వందనం

గణతంత్రానికి స్వాగతం పలికి

వందనాలు చేస్తూ దేశాన్ని కాపాడుకుందాం

అమరుల త్యాగాలను గుర్తిద్దాం

జెండాలోని ప్రతి రంగు 

ప్రత్యేకతను తెలుసుకుందాం

అశోక చక్రం అందించే సందేశాన్ని స్వీకరిద్దాం! 

అవినీతి అంతానికి 

చేయీ చేయీ కలుపుదాం

కులమత భేదాలకు స్వస్తి వాచకం పలుకుదాం!

గాంధీ ఆశయాల సాధనకై ఐక్యంగా నిలబడుదాం

అంబేద్కర్ అందించిన

రాజ్యాంగ ఔన్నత్యాన్ని

కాపాడుకోవడానికి మనమంతా ప్రతిన పూనుదాం!

- అనిత దావత్, 93942 21927


logo
>>>>>>