మంగళవారం 31 మార్చి 2020
Editorial - Jan 24, 2020 , 00:47:44

ప్రజాస్వామ్య స్థాయి

ప్రజాస్వామ్య స్థాయి

ఇరవయ్యో శతాబ్దితో పోలిస్తే ప్రజాస్వామ్యవ్యవస్థలు అంతకంతకూ దిగజారుతుండటం ఆందోళనకరం. ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్య సగటు స్కోరు 5.48 నుంచి 5.44కు తగ్గిపోయిందనిది ఎకనమిస్ట్ సర్వే వెల్లడించింది. 2006 నుంచి ఇది అత్యంత హీనస్థితి. 21 శతాబ్దంలోనూ ఇంకా 54 దేశాలు నిరంకుశ పాలనలో మగ్గిపోవడం కూడా ఆందోళనకరమే. అంతో ఇంతో ప్రజాస్వామ్య వ్యవస్థలున్న దేశాల్లోనూ పౌరహక్కుల పరిస్థితి దిగజారుతున్నది. ఇందుకు కారణాలు అనూహ్యమేమీ కాదు. పలుదేశాల్లో కార్పొరేట్ శక్తులకు అనుకూలమైన ఆర్థిక విధానాలు అవలంబించడం వల్ల అశాంతి చెలరేగుతున్నది.

భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యం కొంత పతనమైందనేది ది ఎకనమిస్ట్ ఇంటెలిజెన్స్ యునిట్ వార్షిక నివేదిక సూచించడంలో ఆశ్చర్యమేమీ లేదు. ముంజేతి కంకణానికి అద్దమెందుకు అన్నట్టు ప్రపంచవ్యాప్త పోకడలు కొంతకాలంగా ఆందోళనకరంగానే ఉన్నాయి. గతంతో పోలిస్తే భారత్ పది స్థానాలు కిందికి దిగజారింది. ఈ జాబితాలోనూ లోపాలు లేవని కాదు. అయినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా, మనదేశంలోనూ ప్రజాస్వామ్య పతనానికి అద్దం పట్టగలిగింది. పూర్తి ప్రజాస్వామ్య దేశాల పట్టికలో స్కాండినేవియన్ దేశాలతో పాటు పశ్చిమయూరప్ దేశాలు ఉండటంలో ఆశ్చర్యమేమీ లేదు. అయితే అమెరికాకు అనుకూలమైన, రైటిస్టు విధానాలు అవలంబిస్తు న్న చిలీని పూర్తి ప్రజాస్వామ్య దేశాల విభాగంలో చేర్చడం ఆమోదనీయం కాదు. ఇదేవిధంగా ఇరాన్‌ను నిరంకుశ రాజ్యాల జాబితాలో చేర్చడంతో పాటు పలు అమెరికా అనుకూల అరబ్బు రాచరిక వ్యవస్థల కన్నా కిందికి నెట్టడం పక్షపాత వైఖరిని సూచిస్తున్నది. ఇరాన్ మతరాజ్యంగా ప్రకటించుకున్నప్పటికీ, క్రమబద్ధంగా ఎన్నికలు జరుగడంతో పాటు ఆధునిక రాజ్యలక్షణాలను అనేకం ప్రవేశపెట్టుకోగలిగింది. ప్రజాస్వామ్యానికి యూరప్ దేశాల వ్యవస్థలే కొలమానాలు కాదు. వర్ధమాన దేశాల్లో స్థానిక పరిస్థితులకు అనుగుణమైన ప్రజాస్వామ్యం రూపుదిద్దుకుంటుంది. భారత్‌లోని లోపాలను ఎత్తి చూపవలసిందే. అయితే ఇక్కడి వ్యవస్థనూ పశ్చిమదేశాలతో పోల్చి తక్కువ చేయకూడదు. భారత్‌లో సామ్యవాద విధానాలు అనుసరించినప్పుడు నిరంకుశంగా, స్వేచ్ఛామార్కెట్ ప్రవేశించినప్పుడు ప్రజాస్వామ్యంగా నిర్వచించిన సందర్భాలూ ఉన్నాయి. పాశ్చాత్యుల కొలమానాలు పూర్తిగా అంగీకరించనప్పటికీ, మన దేశంపై తాజాగా వచ్చిన ఆరోపణలను కొట్టిపారేయడమూ తగదు.

ది ఎకనమిస్ట్ పత్రికకు చెందిన పరిశోధనా విశ్లేషణ విభాగం ఏటా ప్రజాస్వామ్యంపై అధ్యయనాన్ని సాగించి ఆయా దేశాల్లో పరిస్థితిని వెల్లడిస్తుంది. ఆరు అంశాలు ప్రాతిపదికగా పదింటిలో ఎన్ని పాయింట్లు వచ్చాయనేది గమనంలోకి తీసుకొని ప్రజాస్వామ్య స్థాయిని నిర్ధారిస్తారు. ఎన్నికల ప్రక్రియ, బహుళత్వం, ప్రభుత్వ పనితీరు, రాజకీ య భాగస్వామ్యం, ప్రజాస్వామ్య రాజకీయ సం స్కృతి, పౌరహక్కులు అనే ఆరు అంశాలను ప్రాతిపదికగా తీసుకొని ప్రజాస్వామ్య స్థాయిని లెక్కిస్తా రు. ఆయా దేశాలు సాధించిన స్కోరు ఆధారంగా దేశాలను పూర్తి ప్రజాస్వామ్యాలు, లోపభూయిష్ట ప్రజాస్వామ్యాలు, సంకర వ్యవస్థలు, నిరంకుశా లు అనే విభాగాలలో చేరుస్తారు. అమెరికా, భార త్ లోపభూయిష్ట ప్రజాస్వామ్యాల విభాగంలో ఉన్నాయి. ఈ దేశాల్లో ప్రజాస్వామ్య వ్యవస్థలు ఉన్నప్పటికీ కొన్ని లోపాలుంటే ఈ విభాగంలో చేరుస్తారు. ప్రజాస్వామ్య వ్యవస్థలుగా చెలామణి అవుతున్నప్పటికీ నిరంకుశ స్వభావం కలిగి ఉం టే సంకర వ్యవస్థలుగా గుర్తిస్తారు. అన్నివిభాగాలు కలిపి చూస్తే భారత్‌కు 6.9 స్కోరు లభించింది. జమ్ముకశ్మీర్‌లో అనుసరించిన విధానాలు, జాతీయ పౌర పట్టిక, పౌరసత్వ సవరణ చట్టంపై నిరసనలు మొదలైనవి ఈ సారి భారత్ పది స్థానాలు దిగజారడానికి కారణమయ్యాయి. పౌర హ క్కుల పరిస్థితి దేశ ప్రజాస్వామ్యాన్ని తక్కువ స్థాయికి తీసుకుపోయింది. ఎనిమిది స్కోరు లభిస్తే పూర్తి ప్రజాస్వామ్యంగా గుర్తిస్తారు. భారత్ పూర్తి ప్రజాస్వామ్య గుర్తింపు ఇప్పటివరకు పొందలే దు. 2014 నుంచి పరిస్థితి దిగజారుతూ పోతున్నది.

ఇరవయ్యో శతాబ్దితో పోలిస్తే ప్రజాస్వామ్యవ్యవస్థలు అంతకంతకూ దిగజారుతుండటం ఆం దోళనకరం. ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్య సగటు స్కోరు 5.48 నుంచి 5.44కు తగ్గిపోయిందనిది ఎకనమిస్ట్ సర్వే వెల్లడించింది. 2006 నుంచి ఇది అత్యంత హీనస్థితి. 21 శతాబ్దంలోనూ ఇంకా 54 దేశాలు నిరంకుశ పాలనలో మగ్గిపోవడం కూడా ఆందోళనకరమే. అంతో ఇంతో ప్రజాస్వామ్య వ్యవస్థలున్న దేశాల్లోనూ పౌరహక్కుల పరిస్థితి దిగజారుతున్నది. ఇందుకు కారణాలు అనూహ్యమేమీ కాదు. పలుదేశాల్లో కార్పొరేట్ శక్తులకు అనుకూలమైన ఆర్థిక విధానాలు అవలంబించడం వల్ల అశాంతి చెలరేగుతున్నది. జాతీయోన్మాదాన్ని రెచ్చగొట్టే ప్రభుత్వాలు అధికారానికి వస్తున్నాయి. అసమానతలు పెరుగుతున్నాయి. ఆర్థికపరిస్థితి దిగజారి, పౌరహక్కులు మృగ్యమై నిరసనలు చెలరేగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా నిరసనలు చెలరేగుతున్న తీరును కూడా ది ఎకనమిస్ట్ సర్వే గుర్తించింది. ఈ ప్రపంచవ్యాప్త పోకడకు భారత్ అతీతంగా లేదనేది గమనించవలసిన విషయం. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి మన దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థలు స్థిరపడుతున్నాయి. ప్రజలలో చైతన్యం, ప్రజాస్వామిక సంస్కృతి పెరుగుతూ వస్తున్నది. కానీ ఇటీవలి పరిణామాలు మాత్రం దేశ ప్రతిష్టను దిగజారుస్తున్నాయి. అసహనం, విద్వేషాలు ప్రజాస్వామ్యానికి మచ్చ తెస్తున్నాయి. ప్రభుత్వ విధానాలు కూడా ప్రజాస్వామ్యస్ఫూర్తికి అనుగుణంగా లేవు. అయినప్పటికీ మన దేశంలో ప్రజాస్వామ్యం పటిష్టంగానే ఉన్నందుకు మనం గర్వించవలసిందే. కాకపోతే ప్రజాస్వామ్య పతనానికి దారితీస్తున్న పరిస్థితులను గుర్తించి, చక్కదిద్దుకోవాలె.


logo
>>>>>>