బుధవారం 08 ఏప్రిల్ 2020
Editorial - Jan 24, 2020 , 00:47:44

ముంచుకొస్తున్న మిడతల ముప్పు

ముంచుకొస్తున్న మిడతల ముప్పు

మిడతల దండు దాడి కారణంగా లక్షలాది ఎకరాల్లో జరిగిన పంట నష్టానికి రాజస్థాన్ ప్రభుత్వం నష్టపరిహారాన్నిప్రకటించింది. వివిధ జిల్లాల్లో జరిగిన పంట నష్టం గురించి అంచనాతో 31 కోట్ల రూపాయలను విడుదల చేసింది. ముఖ్యంగా జైసాల్మేర్, బార్మెర్, జాలోర్, జోధ్‌పూర్ జిల్లాల్లో ఈ నష్టపరిహారాన్ని ఇచ్చేందుకు నిర్ణయించింది.రైతులు చెబుతున్న దానిప్రకారం పంట నష్టానికిగాను హెక్టారుకు 13,500 రూపాయలు ప్రకటించింది.అయితే ప్రభుత్వాధికారుల నష్ట పరిహారానికి ఓ నియంత్రణ పెట్టారు. రెండెకరాల కన్నా ఎక్కువ పంటకు నష్టపరిహారం ఇవ్వబోమని ప్రకటించారు. రైతులు ఎన్ని ఎకరాల్లో పంట వేసినా, ఎంత నష్టపోయినా, రెండెకరాలకు మాత్రమే నష్టపరిహారం చెల్లిస్తామని జాలోర్ జిల్లా కలెక్టర్ ప్రకటించటం శోచనీయం.

యెమెన్, సౌదీ అరేబియా, ఇరాన్ దేశాల్లో విపరీతంగా కురిసిన వర్షాల కారణంగా ఆ తేమ వాతావరణంలో పెద్ద ఎత్తున మిడతలు వృద్ధి చెందాయి. వీటి పుట్టుక, అభివృద్ధిని నియంత్రించటంలో ఇరాన్, యెమెన్ దేశాలు పూర్తిగా విఫలమయ్యాయి. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ప్రకారం.. 2019 జనవరిలో మోతాదుకు మించి కురిసిన వర్షాల కారణంగా యెమెన్, సౌదీ అరేబియా, ఇరాన్‌లోని పశ్చిమ ప్రాంతంలో విపరీతంగా వృద్ధిచెందిన మిడతల దండు అక్కడినుంచి బయల్దేరి వివిధ ప్రాంతాలకు విస్తరించటం ప్రారంభించింది.రాజస్థాన్, గుజరాత్ రాష్ర్టాల్లో మున్నెన్నడూ లేనివిధంగా పంట పొలాలపై మిడతల దండు దాడి చేసింది. ఒక అం చనా ప్రకారం 3.5 లక్షల హెక్టార్లలో పంటను నాశనం చేసింది. 2019-20లో మిడతల కారణంగా పంట నాశనంతో లక్షలాది మంది రైతులు పెద్ద ఎత్తున నష్టపోయారు. రాజస్థాన్‌లోని జైస్లామెర్, బార్మెర్, జోధ్‌పూర్, జాలోర్, హనుమాన్‌ఘర్, గంగానగర్, బికనెర్, సిరోహి జిల్లాల్లో పంట తీవ్రంగా నష్టపోయింది. ముఖ్యంగా ఆవా లు, జీలకర్ర పంటలు పెద్ద ఎత్తున నాశనమయ్యాయి.ఈ మిడతలు వేగవంతమైన కదలికలతో అతికొద్ది కాలంలోనే వంద లు, వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించే శక్తి కలిగి ఉండి, అవి విస్తరించిన మేర పంటపొలాలను తీవ్రంగా నష్టపరిచాయి. ఇవి దేశ సరిహద్దులను కూడా దాటి విస్తరిస్తూ అవి విస్తరించిన మేర అంతా పంటలను తినేస్తూ తీవ్రంగా నష్టపరిచాయి. ఐక్యరాజ్యసమితి సంస్థ.. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్‌ఏఓ) ప్రకారం మిడతల దండు విస్తరణను ఆయా దేశాలు కట్టడి చేయాల్సిన అవసరం ఉన్నదని దేశాలను హెచ్చరించింది. సాధారణంగా మిడతల దండు సుమారుగా 40 మిలియన్ల వరకుంటాయి. ఇలాంటి మిడతల దండు ఒక రోజులో 35 వేల మంది తినేంత ఆహారాన్ని తినేస్తాయి. అలాగే ఇవి ఒకరోజులో 20 ఒంటెలు, ఆరు ఏనుగులు తినేంత ఆహారాన్ని తింటాయి. ఈ లెక్కన చూస్తే ఏదైనా ప్రాంతంపై మిడతల దండు దాడి చేసిందంటే కొన్ని గంటల్లోనే వందల ఎకరాల పంటలు కనుమరుగవుతాయి.

కాబట్టి మిడతల దండు ప్రమాదాన్ని గురించి ఎఫ్‌ఏఓ కూడా వివిధ దేశాలను హెచ్చరించింది. మిడతల దండు సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవాలని ఆయా దేశాలకు సూచించింది. మిడతల దండు గమనాన్ని శాటిలైట్ సాయంతో గుర్తించి వాటి రాకను నియంత్రించేందుకు, పం టల రక్షణకు తీసుకోవాల్సిన చర్యల గురించి కూడా హెచ్చరించటం గమనార్హం. ఈ క్రమంలోనే మిడతల దండు గమన దిశ ఆధారంగా ఆరు వారాల ముందే ఆయా దేశాలను హెచ్చరిస్తున్నది. ఈ నేపథ్యంలోంచే భారత దేశం మిడతల దండును ఎదుర్కోవటం కోసం చర్యలు చేపట్టిం ది. వాటిని నాశనం చేసేందుకు ఆర్గనోఫాస్ఫేట్ అనే రసాయనాన్ని చిన్నమోతాదుల్లో వినియోగిస్తున్నది.యెమెన్, సౌదీ అరేబియా, ఇరాన్ దేశాల్లో విపరీతంగా కురిసిన వర్షా ల కారణంగా ఆ తేమ వాతావరణంలో పెద్ద ఎత్తున మిడతలు వృద్ధి చెందాయి. వీటి పుట్టుక, వృద్ధిని నియంత్రించటంలో ఇరాన్, యెమెన్ దేశాలు పూర్తిగా విఫలమయ్యాయి. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ప్రకారం.. 2019 జనవరిలో మోతాదుకు మించి కురిసిన వర్షాల కారణంగా యెమెన్, సౌదీ అరేబియా, ఇరాన్‌లోని పశ్చిమ ప్రాంతంలో విపరీతంగా వృద్ధి చెందిన మిడతల దండు అక్కడినుంచి బయల్దేరి వివిధ ప్రాం తాలకు విస్తరించటం ప్రారంభించింది. ఈ క్రమంలోనే భారత్, పాకిస్థా న్ సరిహద్దు ప్రాంతాలపై గత జూన్ నుంచి డిసెంబర్ దాకా పంటపొలా లపై దాడిచేశాయి. ఇదే సమయంలో భారత్‌లో కూడా వానకాలపు వర్షా లు ఆలస్యంగా మొదలై ఎక్కువకాలం కొనసాగడం కూడా మిడతల అభివృద్ధికి అనుకూలంగా మారింది. దీంతో ఈ తేమ వాతావరణం అనుకూలతతో మిడతలు విపరీతంగా పెరిగాయి. తడి భూముల్లో మాత్రమే మిడతలు గుడ్లు పెడుతాయి. ఒక మిడత 150 దాకా గుడ్లు పెడుతుంది. మిడతలు భారతదేశ పంటపొలాల్లోకి ప్రవేశించిన కాలానికి ఇక్కడ వర్షా లు కురుస్తున్న స్థితి ఉన్నది. అందువల్ల మిడతలు ఈ అనుకూల వాతావరణంలో విపరీతంగా వృద్ధిచెందాయని రాజస్థాన్‌లోని బికనూర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం డైరెక్టర్ ఎస్.ఎల్.గోదారా తెలిపారు. అలా గే ఈ మిడతల దండు నియంత్రణకు వాటి గుడ్ల దశలోనే నియంత్రించేందుకు అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. అయితే మిడతలను నియంత్రించేందుకు వాటి గుడ్లపై చల్లే రసాయనాన్ని, పంట పొలాలపై పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వివరించారు.

అయినా మిడతల దండు పంటపొలాలపై దాడిచేసి తీవ్రంగా నష్టపరుస్తున్నదంటే, వాటి నియంత్రణకు చేపట్టిన చర్యలు చాలినంతగా లేవని అర్థమవుతున్నదని గోదారా అంటున్నారు. గతంలో కూడా ఇలా 1993 లో మిడతల దండు దాడి చేసిందని తెలిపారు. అయితే  అప్పుడు దాన్ని సమర్థంగా నియంత్రించామని తెలిపారు. ఇప్పుడు ఈ మిడతల గుంపు ప్రమాదం తీవ్రస్థాయిలో ఉన్నదంటే నియంత్రణ సరైన స్థాయిలో జరుగలేదని తెలిపారు. ఇప్పటికైనా పాకిస్థాన్, భారత అధికారులు మిడతల నియంత్రణకు సమిష్ఠిగా తగు చర్యలు చేపట్టాల్సి ఉన్నది. కానీ పాకిస్థాన్ సరైనవిధంగా స్పందించకపోవటం కారణంగానే మిడతల దండు ప్రమా దం వచ్చిపడిందని కె.ఎల్.గుర్జార్ అనే శాస్త్రవేత్త అంటున్నారు. గుడ్డు స్థాయిలోనే మిడతలను నియంత్రించాల్సిన అవసరం ఉన్నదని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలోనే పాకిస్థాన్ అధికారులతో సమావేశమై మిడతల నియంత్రణకు తగు చర్యల కోసం ఆలోచించామని తెలుపటం గమనార్హం.2020 జనవరిలో ఎఫ్‌ఏఓ తెలిపినదాని ప్రకారం.. మిడతల దండు దాడిని ఇంకా పూర్తిగా నియంత్రించలేకపోయారు. ఇంకా భారత్-పాకిస్థాన్ సరిహద్దు జిల్లాల్లో మిడతల గుంపులు వృద్ధి చెందుతూనే ఉన్నా యి. వీటిని నియంత్రించేందుకు చేపట్టిన చర్యలు కొనసాగుతున్నాయి. ఈ జనవరి దాకా దక్షిణ తీరప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలతో మిడత లు గుడ్లు పెట్టడానికి అనుకూలమైన వాతావరణంగా మారిందని ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ తెలిపింది. వ్యవసాయ శాస్త్రవేత్త గోదారా ప్రకారం.. సాధారణంగా వానకాలం వరకే దేశంలో మిడతలుంటాయి. కానీ ఈ సారి అకాల వర్షాల కారణంగా వేసవి కాలపు పంటలపై కూడా మిడతలు దాడి చేస్తున్నాయి.

మిడతల దండు దాడి కారణంగా లక్షలాది ఎకరాల్లో జరిగిన పంట నష్టానికి రాజస్థాన్ ప్రభుత్వం నష్ట పరిహారాన్ని ప్రకటించింది. వివిధ జిల్లాల్లో జరిగిన పంట నష్టం గురించి అంచనాతో 31 కోట్ల రూపాయలను విడుదల చేసింది. ముఖ్యంగా జైసాల్మేర్, బార్మెర్, జాలోర్, జోధ్‌పూర్ జిల్లాల్లో ఈ నష్టపరిహారాన్ని ఇచ్చేందుకు నిర్ణయించింది. రైతులు చెబుతున్న దాని ప్రకారం పంట నష్టానికి గాను హెక్టారుకు 13,500 రూపాయలు ప్రకటించింది. అయితే ప్రభుత్వాధికారుల నష్ట పరిహారా నికి ఓ నియంత్రణ పెట్టారు. రెండెకరాల కన్నా ఎక్కువ పంటకు నష్టపరిహారం ఇవ్వబోమని ప్రకటించారు. రైతులు ఎన్ని ఎకరాల్లో పంట వేసి నా, ఎంత నష్టపోయినా, రెండెకరాలకు మాత్రమే నష్టపరిహారం చెల్లిస్తామని జాలోర్ జిల్లా కలెక్టర్ ప్రకటించటం శోచనీయం.పంటకు నష్టపరిహారం విషయంలో రైతులు తీవ్రంగా నిరాశచెందుతున్న స్థితి ఉన్నది. జీలకర్ర సాగుకోసం రెండెకరాలకు ఎనభై వేల దాకా ఖర్చుచేసి పంట వేస్తే జరిగిన నష్టానికి 27 నుంచి 30 వేలు చెల్లిస్తామని ప్రభుత్వం చెబుతున్నదని మేము విన్నాం. అలా అయితే వడ్డీలతో షావుకార్ల దగ్గర తెచ్చిన అప్పులకు మేం ఏం చెల్లించాలని బార్మెర్‌కు చెందిన రైతు సద్దాం వాపోతున్నాడు. ప్రకృతి వైపరీత్యాలు, ఇలాంటి చీడపురుగులు మిడతల దండు కారణంగా నష్టపోయిన రైతులకు నష్టపరిహారం సంపూర్ణంగా చెల్లించినప్పుడే రైతుకు తగిన న్యాయం జరుగుతుంది.


-ది వైర్ సౌజన్యంతో..


logo