గురువారం 02 ఏప్రిల్ 2020
Editorial - Jan 24, 2020 ,

ఉపాధ్యాయునిలో ఓర్పు అవసరం

ఉపాధ్యాయునిలో ఓర్పు అవసరం

పిల్లవానికి చదువు చెప్పడం పరిపూర్ణమైన విధానంలో సాగాలి తప్ప, కేవలం సమాచారాన్ని వారి మెదళ్లలో నిం పడం కాకూడదు. పరిపూర్ణంగా వికసించిన వ్యక్తిత్వం, ప్రపంచం కోసం ఆలోచించగలిగే విశాల దృక్పథం వ్యక్తిలో కలిగించలేనప్పుడు ఆ చదువు తన ప్రయోజనాన్ని నెరవేర్చలేదు. పాఠశాలకు వెళ్లి కొన్ని పాఠాలు నేర్చుకోవటం వల్ల విద్యార్థికి అవసరమైన చదువు లభించినట్లు కాదు. అందరూ ఒకటే అనే భావన, తమకున్న దానిని తోటివారితో పంచుకోవడం, ప్రేమాభిమానాలు మొదలైన భావాలను పెంపొందించినప్పుడే సమగ్ర వికాసం జరుగుతుంది.

గురువుకు ఉండాల్సినది ఓరిమి. కొందరు విద్యార్థులు నేర్చుకోవడానికి ఎక్కువ సమయం తీసుకోవచ్చు, అలాంటప్పుడు గురువు కనబరిచే ఓపిక వారికి ఉత్సాహాన్నిస్తుం ది. గురువే విద్యార్థులకు సరైన ఉదాహరణగా నిలువాలి. జీవితపు విలువలు సగం మాత్రమే వారు తల్లిదండ్రుల నుంచి నేర్చుకుంటారు. మిగిలిన సగం ఉపాధ్యాయుల నుంచి నేర్చుకుంటారు. ఉపాధ్యాయుడు చెప్పే ప్రతి మాట, చేసే ప్రతి పనిని పిల్లలు గమనిస్తారు.

పిల్లలు ఏ స్థాయి నుంచి వచ్చారో, వారికి అడుగడుగు నా ఏ విధంగా తోడ్పడాలో ఉపాధ్యాయులు అర్థం చేసుకోవాలి. విద్యార్థులు పెరుగుతున్న దశలో చాలా గందరగోళంలో ఉంటారు. ఎందుకంటే అప్పటిదాకా వారి మనసు లో ఉన్న అనేక అభిప్రాయాలు పనికిరాకుండా పోతాయి. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడనుకుంటారు. ఆ తర్వాత పై తరగతిలో గ్రహాలు, వాటి కదలికల గురించి చెబుతా రు. దాంతో ఇంతకుముందు ఏర్పడిన అభిప్రాయం పటాపంచలైపోతుంది. సరైన ఉపాధ్యాయుడు ఈ విషయాన్ని అర్థం చేసుకొని, ఈ గందరగోళ వ్యవస్థ నుంచి విద్యార్థిని జాగ్రత్తగా ముందుకు నడిపించాలి.

పిల్లలతో ప్రేమగా ఉండాలి. ప్రేమగా ఉంటూనే స్థిరంగా ఉండాలి. కొందరు పిల్లలు మొండిగా ఉంటారు. వారిని దగ్గరకు తీసుకొని లాలించి ప్రోత్సహించాలి. వారి భుజం తట్టి, వారిని ప్రేమిస్తున్నానని, వారికోసం శ్రద్ధ తీసుకుంటున్నామని వారికి తెలిసేలా చేయాలి. మొండిగా ఉండే పిల్లల ఓపి కతో సున్నితంగా వ్యవహరించాలి. అలా చేసినప్పుడే ఆ పిల్ల ల వ్యవహారశైలి సాధారణమవుతుంది. కాబట్టి ఉపాధ్యా యులు కఠినంగా, అదే సమయంలో సున్నితంగానూ ఉం డాలి. అలా ఉండలేని పక్షంలో కోరుకున్న స్థాయికి మీ విద్యార్థులను తీసుకువెళ్లలేరు.

- శ్రీశ్రీ రవిశంకర్


logo
>>>>>>