సోమవారం 06 ఏప్రిల్ 2020
Editorial - Jan 23, 2020 ,

పిచ్చికుక్కలను నిర్మూలించాలె

పిచ్చికుక్కలను నిర్మూలించాలె

ఇటీవల నగరంలోని అమీర్‌పేటలో వీధికుక్కలు యాభై మందికి పైగా బడిపిల్లలపై దాడిచేసి బీభత్సం సృష్టించాయి. ధరమ్‌కరం రోడ్డులో సుమారు రెండు గంటల పాటు సృష్టించిన బీభత్సానికి స్కూల్‌ పిల్లలతో పాటు స్థానిక ప్రజలు కూడా భయకంపితులయ్యారు. కుక్కకాట్లకు గురైన చిన్నారులు హుటాహుటిన ఫీవర్‌ ఆస్పత్రికి వెళ్లడం, ఆ దవాఖా నలో కుక్కకాటుకు సంబంధించిన ఇంజెక్షన్‌, ఇతరత్రా సదుపాయాలు అందుబాటులో ఉండటంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఏదేమైనా జీహె చ్‌ఎంసీ అధికారులు నగరంలోని పిచ్చికుక్కల బెడద నుంచి ప్రజలను రక్షించాలి.   

  - మొగుళ్ల సునిల్‌, బేగంపేట్‌, హైదరాబాద్‌


ఆల్‌ ది బెస్ట్‌ టీమిండియా

ఇటీవలే కంగారులను ఖంగుతినిపించి సిరీస్‌ను కైవసం చేసుకున్న కోహ్లీ సేన సుదీర్ఘకాల పర్యటన కోసం న్యూజిలాండ్‌లో కాలుమోపింది. కివీస్‌ తో శుక్రవారం నుంచి ఐదు టీ ట్వంటీలు, మూడు వన్డేలు, రెండు టెస్టు లు ఆడనున్నది. కోహ్లీ జట్టు ఈ మూడు సిరీస్‌లను కైవసం చేసుకొని సగర్వంగా భారత్‌కు తిరిగిరావాలి. ఆల్‌ ది బెస్ట్‌ టీమిండియా.     

  -  బేగరి ప్రవీణ్‌కుమార్‌, అంతారం, చేవెళ్ల, రంగారెడ్డి


అభినందనీయం

మున్సిపల్‌ ఎన్నికల ప్రకటన వచ్చినప్పటి నుంచి నగరాలు, పట్టణాల్లో ఎన్నికల కల కొట్టొచ్చినట్లు కనిపించింది. పలురకాల పార్టీల జెండాలతో తమ పార్టీలపై అభిమా నాన్ని చాటుతూ తమ నాయకునికే ఓటు వేయాలంటూ యువత ఓటర్లను అభ్యర్థిం చింది. యువతే కాకుండా, మహిళలు, పురుషులు జెండాలతో ప్రచార కార్యక్ర మాలు నిర్వహించారు. ఈ ఎన్నికల కోలా హలానికి నిన్నటితో ఫుల్‌స్టాప్‌ పడింది. అయితే ఇంతటి కోలాహలంలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా రాష్ట్ర పోలీసు యంత్రాంగం పటిష్ఠ భద్రతా చర్యలు చేపట్టడం ముదావ హం. అభ్యర్థులకు, ఓటర్లకు ఓటింగ్‌ సర ళిపై అవగాహన కల్పిస్తూ పోలింగ్‌ ప్రశాం తంగా ముగించడం అభినందనీయం.       

- నర్మాల మనీష్‌, లక్ష్మీనగర్‌, కరీంనగర్‌


logo