సోమవారం 06 ఏప్రిల్ 2020
Editorial - Jan 21, 2020 , 00:31:13

శాస్త్రీయ భావనలతో వికసించాలె

శాస్త్రీయ భావనలతో వికసించాలె

ఇప్పుడు సమస్యంతా ఎక్కడో సుదూరాన ఉన్న కశ్మీర్‌లోయది, అర్బన్ నక్సలైట్లది మాత్రమే కాదు. అది అక్కడితోనే ఆగదు. ఒక ఉపాధ్యాయులుగా, బోధకులుగా మనల్ని మనం పునర్నిర్వచించుకోవాలి. మన ల్ని మనం ఉత్తేజకర భావవ్యక్తీకర శక్తులుగా గుర్తించాలి. ఒకవేళ ఉపాధ్యాయులే భావ వ్యక్తీకరణలో, భావజాల ప్రకటనలో వెనుకబడిపోతే, విశ్వవిద్యాలయాలు ఒక వస్తూత్పత్తి కంపెనీలా, సైనికులుండే నివాస బ్యారక్‌ల్లా కుచించుకుపోతాయి. అదే క్రమంలో ఇవ్వాళ మంచి విద్యార్థి అంటే అర్థం మారిపోయింది. ఇప్పుడు మంచి విద్యార్థి అంటే అతను ఏ ఆందోళనల్లో పాలు పంచుకోకూడదు.

ప్రత్యేకతల (స్పెషలైజేషన్) పేర విభజనలకు గురిచేసి ముక్కులుగా చేసిన బోధనాంశాలకు మనం ఆ ప్రత్యేకతలతోనే పదునుపెట్టాలి. మన పరిశోధన పత్రాలను, బోధనను మరింత అర్థవంతంగా మనం తీర్చిదిద్దాలి. తరగతి గదిలో బోధనను మరింత జ్ఞానవంతంగా, అర్థవంతంగా చేయాలి. అయితే ఇక్కడే మనం మరింత నైపుణ్యాలతో వ్యవహరించాలి. విద్యార్థి యువతను అర్థవంతమైన సామాజిక బోధనల ద్వారా జ్ఞానదీపాలుగా వెలిగించాలి. 

క్రూర హింసాత్మక కాలంలో తరగతి గదిలో ఉపాధ్యాయు డు ఎలా ఉండాలో నాకు తెలిసివస్తున్నది. ముఖ్యంగా జమా మిలియా, అలీఘర్ ముస్లిం యూనివర్సిటీల్లాగే జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ కూడా దాడులతో భయానక వాతావరణంలో కూరుకొనిపోయిన వేళ ప్రభుత్వం, యూనివర్సిటీ అధికారులు అంటున్నట్లు అంతా సజావుగానే ఉన్నదని చెప్పలేను. నేను ఎంతోకాలంగా యూనివర్సిటీలో వృత్తిపరమైన విధి నిర్వహణలో విద్యార్థులకు బోధిస్తున్నాను. విద్యార్థులకు ఎప్పటిలాగే తరగతిగదిలో పాఠాలు చెప్పి, అసైన్‌మెంట్స్ ఇచ్చి వారి వ్యక్తీకరణ ఆధారంగా మార్కులు వేశాను. ఈ పరిస్థితుల్లో తాజా పరిణామాలతో మేమంతా భయంలో కూరుకుపోయాం. పోలీసులు టీయర్ గ్యాస్ షెల్స్ జామియా మిలియా ఇస్లామియా గ్రంథాలయం బయట భీతిగొలిపేలా కనిపిస్తున్నాయి. జేఎన్‌యూలో కర్రలు, ఇనుపరాడ్లతో గూండాలు విద్యార్థులు, ప్రొఫెసర్లపై దాడులు చేసి తలలు పగులగొట్టిన దృశ్యాలు ఇంకా మా కండ్ల ముందు కదలాడుతున్నాయి. ఈ నేపథ్యంలో తరగతి గదిలో భావ వ్యక్తీకరణ, భావజాల ప్రసరణకు సంబంధించి కొత్త ప్రాతిపదికలు ఏర్పడుతున్నాయి.ఈ పరిస్థితుల్లో మన  తరగతి గదుల్లో విద్యాబోధనను ఆధిపత్య వాద బంధనాల నుంచి విముక్తి చేయటం ద్వారా మాత్రమే ఉపశమనం పొం దగలుగుతాం. హింసాత్మక చర్యలతో మనల్ని వేటాడుతూ మానసికంగా భయకంపితులను చేయజూస్తున్న నిరంకుశ ధోరణిని మన కండ్లను తెరిపించే విద్య ద్వారా ఎదుర్కోవాలి. ఈ క్రమంలోంచే ఆధిపత్యవర్గాల మెజారిటీవాదాన్నీ, నిరంకుశత్వాన్ని నిలువరించాలి. ఈ విధమైన క్రమానుగతమైన ఆచరణాత్మక బోధనల ద్వారా రాజకీయ, నైతిక ఆచరణతో నే ప్రస్తుత నిరంకుశత్వాన్ని ఎదిరించి మెరుగైన ప్రపంచాన్ని నిర్మించుకోగలం. అయితే.. ఇది సులువైనది కాదు. క్లిష్టమైన కష్టతరమైన లక్ష్యమే. నిరంకుశ గుత్తాధికార రాజకీయాలు దూసుకొచ్చిన తర్వాత అనేకవిధాలుగా సంకుచిత ఆలోచనలు, భావనలు తెరమీదికి రావటమే కాదు, ఆధిపత్యం చేస్తున్నాయి. అందరినీ ఏకీకృతమైన ఆలోచనలుండేలా సాధారణీకరిస్తున్నాయి. ఈ క్రమంలో భిన్న ఆలోచనలు, విముక్తివాద భావనలు అనుమానింపబడుతున్నాయి. అంతేకాదు, అలాంటి ఆలోచనలను హింసావాదంగా, జాతి వ్యతిరేకమైనవిగా, విద్రోహకరమైనవిగా ముద్రవేస్తున్నారు. అయినా మనం విద్యను వికాసానికి పునాదిగా చేసుకోవాలి. ఆ విద్యా వికాసం నుంచే ప్రతిఘటనను, విముక్తిని కాంక్షించాలి. ఈ క్రమంలోంచే మనల్ని మనం పునర్నిర్వచించుకోవాలి. ఇదే ఇప్పుడు విద్యార్థులను, ఉపాధ్యాయులను వేధిస్తున్న సమస్య. ఈ కష్టకాలంలోనే దీని కోసం మనం కట్టుబడి ఉండాలి.

ప్రత్యేకతల (స్పెషలైజేషన్) పేర విభజనలకు గురిచేసి ముక్కులుగా చేసిన బోధనాంశాలకు మనం ఆ ప్రత్యేకతలతోనే పదునుపెట్టాలి. మన పరిశోధన పత్రాలను, బోధనను మరింత అర్థవంతంగా మనం తీర్చిదిద్దాలి. తరగతి గదిలో బోధనను మరింత జ్ఞానవంతంగా, అర్థవంతంగా చేయాలి. అయితే ఇక్కడే మనం మరింత నైపుణ్యాలతో వ్యవహరించాలి. విద్యార్థి యువతను అర్థవంతమైన సామాజిక బోధనల ద్వారా జ్ఞానదీపాలుగా వెలిగించాలి. అంటే అర్థం.. మనం విద్యాబోధనను గురుతర బాధ్యతగా స్వీకరించి విద్యార్థుల్లో శాస్త్రీయ భావనలను, ఆత్మ ైస్థెర్యాలను పెంపొందించాలి. విద్యార్థుల అంతర్గత శక్తులను వెలికితీయాలి.అయితే ఇది.. ఓ రాజకీయ కార్యాచరణ కానక్కరలేదు. అది అకడమిక్ కార్యకలాపాలకు ప్రతిబంధకం కారాదు. పై పెచ్చు ఈ క్రమంలో మనం నిర్వహించే సామాజిక బాధ్యత విద్యార్జనకు ప్రతికూలం కాదు. కొంతమంది ఉపాధ్యాయులు అంటున్నట్లు అన్నింటికీ సమదూరంగా తటస్థత పేర, నిష్పక్షపాతం పేర యథాతథవాద సమర్థకులుగా మార రాదు. ఇప్పటికే ప్రత్యేకతల పేర సామాజిక స్పృహను విచ్ఛిన్నం చేశారు. మాలిక్యులార్ బయాలజీ, న్యూక్లీయర్ ఫిజిక్స్ ప్రొఫెసర్లు తమ గాలి చొరబడని ప్రయోగశాలల నుంచి బయటకువచ్చి యూనివర్సిటీ కారిడార్లలో గూండాలు ఇనుపరాడ్లతో స్వైరవిహాం చేస్తున్న దాన్ని, హింసాకాండ చేస్తున్నదాన్ని పట్టించుకోకుండా ఉంటున్నారు. అంతేకాకుండా, కొంత మంది సామాజికశాస్త్ర ప్రొఫెసర్లు కూడా తమను తాము ఒంటరిని చేసుకొని జరగుతున్న విషయాలను గుడ్లప్పగించి చూస్తుండటం విషాదం. మరో అడుగుముందుకేసి.., మీ తరగతి పుస్తకాలలో కారల్ మార్క్స్, గాంధీ, అంబేద్కర్ గురించి ఉంటే పుస్తకంలో ఉన్నది ఉన్నట్లే చెప్పాలనీ, ఒక్క పదం, మాట కూడా పుస్తకంలో లేనిది పలుక కూడదని, నిరంకుశత్వాన్ని ప్రశ్నించకూడదని అంటున్నారు. ఈ విధంగా నిష్పాక్షికత పేర మాట్లాడకుండా నిశ్శబ్దాన్ని వ్యవస్థీకృతం చేస్తున్నారు. ఇది ఒకరకంగా బాధ్యతల నుంచి పలాయనం చిత్తగించటమే.

అయితే నేను చెప్పేది.. ఉపాధ్యాయుడు తప్పకుండా ఓ కార్యకర్త కావాలని కాదు. కానీ ఉపాధ్యాయుడు వృత్తిపరమైన భావజాలానికి దూరంగా ఉంటూ నిష్క్రియాపరత్వం కారాదు. అంతర్గతంగా శాస్త్రీయ భావనలతో సమర్థతతో వ్యవహరించాలి. వృత్తిపరమైన నైపుణ్యాలతో అవసరమైన భావావిష్కరణలకు, ఆచరణలకు చేదోడుగా ఉండాలి. విద్యార్థి లోకాన్ని చీకటి నుంచి వెలుగులోకి మేల్కొల్పాలి.ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పటికే మనం మన స్పందనల నుంచి దూరమయ్యాం. ఆధిపత్యవాద రాజకీయాలు మనల్ని ఒక భయకంపిత వాతావరణంలోకి నెటేశాయి. మన గొంతుల్ని నొక్కేశాయి. క్రియాశీల స్పందనల నుంచి దూరం చేశాయి. గుత్తాధిపత్య వాదం మనల్ని ఏక ధృవ ప్రపంచం వైపు, వస్తుమయవాదం వైపు నడిపిస్తున్నాయి. సామూహిక కార్యాచరణ, పోరాటాల నుంచి మనం దూరం చేయబడినాము. ఇప్పుడు ఉపాధ్యాయ లోకమంతా ఓ సాధారణ వస్తు వినియోగదారుని మనస్తత్వంతో నీరుగారిపోయాం. మన ఆలోచనలు, ఆచరణలు పరాయీకరించబడ్డాయి. వృత్తిపర బాధ్యతల సంకెళ్లలో మనల్ని, మన మనస్సులను బంధించి వేశాయి. కండ్లముందు జరుగుతున్న ఘటనల్ని గురిం చి పట్టించుకోకుండా మన భద్రలోక జీవితాలను అనుభవిస్తూ, మనం సురక్షితమని నమ్ముతున్నాం.ఇప్పుడు సమస్యంతా ఎక్కడో సుదూరాన ఉన్న కశ్మీర్‌లోయది, అర్బ న్ నక్సలైట్లది మాత్రమే కాదు. అది అక్కడితోనే ఆగదు. ఒక ఉపాధ్యాయులుగా, బోధకులుగా మనల్ని మనం పునర్నిర్వచించుకోవాలి. మన ల్ని మనం ఉత్తేజకర భావవ్యక్తీకరశక్తులుగా గుర్తించాలి. ఒకవేళ ఉపాధ్యాయులే భావ వ్యక్తీకరణలో, భావజాల ప్రకటనలో వెనుకబడిపోతే, విశ్వవిద్యాలయాలు ఒక వస్తూత్పత్తి కంపెనీలా, సైనికులుండే నివాస బ్యారక్‌ల్లా కుచించుకుపోతాయి. అదే క్రమంలో ఇవ్వాళ మంచి విద్యార్థి అంటే అర్థం మారిపోయింది. ఇప్పుడు మంచి విద్యార్థి అంటే అతను ఏ ఆందోళనల్లో పాలు పంచుకోకూడదు. వారు కేవలం వారి చదువుల కు, వారి వ్యక్తిగత ఎదుగుదలకే పరిమితమవ్వాలి. ఇవ్వాళ్టి మార్కెట్ ఆధారిత ఆర్థికవ్యవస్థ టెక్నికల్ నైపుణ్యాలే కావాలని చెబుతున్నది. సామాజిక, ఆర్థిక విషయాలు, ఆచరణాత్మకతను పనికిరానిదిగా, విద్యా ర్థి వ్యతిరేకమైనదిగా అంటున్నది. రాజకీయ, నైతిక సామాజిక ప్రశ్నలను లేవనెత్తడాన్ని విద్యార్థి విడనాడాలని నిర్దేశిస్తున్నది. మధ్యతరగతి జీవన భావజాలానికి పెద్దపీట వేసి విద్యను ఓ సరుకుగా మార్చివేసి ఇదే అవసరమైన పోకడ అంటున్నది.

అందుకని మంచి విద్యార్థి అంటే.. రాజకీయాలను, ప్రజా ఉద్యమాలను పట్టించుకోకుండా ఉండటమేగా మారిపోయింది. ఈ క్రమంలోంచే విద్యార్థి తనదైన వ్యక్తిగత అభివృద్ధి, ఎదుగుదలకే పెద్దపీట వేసేందుకే ప్రాధాన్యం ఇచ్చేలా ప్రోత్సహిస్తున్నారు. ఆ క్రమంలో ప్రస్తుత అస్తిత్వ వ్యవస్థలను గౌరవించే వారిగా తీర్చిదిద్దుతున్నారు. ఈ నేపథ్యంలోంచే ప్రముఖ క్రికెటర్ సునీల్ గవాస్కర్ విద్యార్థులు వీధుల్లోకి వచ్చి ఉద్యమించొద్దని హితబోధ చేస్తున్నాడు. అందుకే ఆదర్శ విద్యార్థి, విద్యార్థిని తరగతిగదులకే పరిమితమవ్వాలని చెప్పుకొస్తున్నారు!సరిగ్గా ఈ నేపథ్యంలోంచే.. ఇవ్వాళ కొత్తతరం ఆదర్శ విద్యారి లోకం ముందుకువస్తున్నది. వీరంతా తమదైన భద్రలోకంలోంచి వారి ఉద్యోగాలు, ప్లేస్‌మెంట్స్, సాలరీ ప్యాకేజీల గురించి మాత్రమే ఆలోచించకుం డా విలువల గురించి పట్టించుకుంటున్నారు. ఇలాంటి తరం జామా మిలియా, జేఎన్‌యూ, జాదవ్‌పూర్, అలీఘర్ యూనివర్సిటీల నుంచి విలువల కోసం నినదిస్తున్నారు. ఇప్పటిదాకా రాజకీయాలకు దూరంగా ఉండే ఐఐటీలు, ఐఐఎంలు కూడా వీధుల్లోకి వచ్చి నిరసనోద్యమాల్లో పాలుపంచుకుంటున్నారు. పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారు. అధికార ప్రభుత్వం యూనివర్సిటీలపై చేస్తున్న ఆధిపత్యా న్ని ధిక్కరిస్తున్నారు. ఈ నేపథ్యంలోంచే విధ్యార్థిలోకం నుంచి ఓ ఆశావహ కాంతిరేఖను చూస్తున్నాను. విద్యార్థులు ఆధిపత్య ధోరణులకు వ్యతిరేకంగా రవీంద్రనాథ్ ఠాగూర్, గాంధీ, అంబేద్కర్ ఆలోచణాధార ను అనుసరిస్తున్నారు. రాజ్యాంగ విలువలు, భిన్నత్వంలో ఏకత్వం, సాంస్కృతిక వైవిధ్యాన్ని ఎత్తిపడుతున్నారు. ఆ క్రమంలోంచే సామాజిక శాంతిని, ప్రజల సహజీవనాన్ని పునర్నిర్మిస్తున్నారు.

ఈ క్రమంలోంచే నవతర విద్యార్థి లోకం గుత్తాధిపత్య నిరంకుశ ప్రభుత్వానికి గట్టి హెచ్చరిక చేస్తున్నారు. రాజ్యాంగ, శాస్త్రీయ విలువలకోసం ఉద్యమిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఉపాధ్యాయులుగా విద్యార్థులతో కలిసి నడువాల్సిన ఆవశ్యకత ఉన్నది. తరగతిగదిని మరింతగా సజీవ శాస్త్రీయ భావజాల ప్రసరణ కేంద్రంగా తీర్చిదిద్దాలి. దీనిద్వారానే నిజమైన విద్యా లక్ష్యాలను సాధిస్తుంది.

(వ్యాసకర్త:  జేఎన్‌యూలో సోషియాలొజి ప్రొఫెసర్) 

ది వైర్ సౌజన్యంతో...


logo