సోమవారం 30 మార్చి 2020
Editorial - Jan 18, 2020 , 23:43:20

హరితమే భవిత!!

హరితమే భవిత!!

ఒక చెట్టుపై ఆధారపడి వందలాది కీటక, జంతు జాతులు జీవిస్తున్నాయి. ఒక ఎకరంలో ఉన్న చెట్లు, ఏడాదిలో 18 మందికి, నలుగురు మనుషులకు జీవితాంతం సరిపోయే ఆక్సిజన్‌ను అందిస్తాయి. గ్రీన్‌హౌస్‌ వాయువులను సమర్థవంతంగా నిరోధించి, గ్లోబల్‌ వార్మింగ్‌ను అడ్డుకుంటున్నాయి.

ఒక చిరు ప్రయత్నం, బృహత్‌యజ్ఞంగా మారాలంటే, దీక్షాదక్షతలే కాదు బాధ్యత కూడా అవసరం. ఒకరికి ముగ్గురు ఆ బాధ్యతను నెత్తికెత్తుకుం టే మరో ప్రపంచాన్ని, మరో తరానికి అం దివ్వడం కష్టసాధ్యమేమీ కాదు. పచ్చని చెట్ల తో కళకళలాడే ప్రకృతే ఆ ప్రపంచం.ప్రకృతి- మావవాళికే కాదు, సమస్త జీవజాతికి ప్రాణాధారం. మన మనుగడకై సృష్టించబడిన వ్యవస్థ. కారణమేదైనా కావ చ్చు. ఆ వ్యవస్థ ఉనికి ప్రమాదంలో పడితే, అన్నిజాతులూ అంతరించవలసిందే. అటువంటి ప్రకృతిలో ప్రధాన భాగస్వామి చెట్టు. జీవవైవిధ్యానికి తొలిమెట్టు. సకల జీవజాతికి తొలి ఆహారాన్ని అందించింది చెట్టే. ప్రాణవాయువును ఊదిందీ చెట్టే. అటువంటి చెట్లు ఇప్పుడు చెట్టుకొకటి, పుట్టకొకటిగా చెల్లాచెదురవుతున్నా యి. మహా మహారణ్యాలు మట్టిపాలవుతున్నాయి.

ఇప్పటికీ భూగోళంపై ఉన్న భూమిలో 30 శాతం అడవులే. ఆ అడవులు వాయువేగంతో మాయమవుతున్నాయి. ప్రపంచబ్యాంకు లెక్కల ప్రకారం, 1990 నుంచి 2016 వరకు 13 లక్షల చ.కి.మీ. అడవులు అంతర్థానమయ్యాయి. అంటే దక్షిణాఫ్రికా వైశాల్యం కంటే ఎక్కువ. మనుషులు చెట్లు కొట్టడం ప్రారంభించిన నాటి నుంచీ 46 శాతం చెట్లు నేలకూలాయి. గత 50 ఏండ్ల లో 17 శాతం అమెజాన్‌ వర్షాణ్యాలు నాశనమయ్యాయి. నిరటవీకరణ (Deforestation) ప్రపంచం నలుమూలలా నిరాటంకంగా కొనసాగుతున్నది. ప్రతి 1.2 సెకన్లకు ఫుట్‌బాల్‌ మైదానమంత అడవి మైదానంలా మారిపోతున్నది. ఇదే వేగంతో నిరటవీకరణ జరిగితే, సరిగ్గా వందేండ్లలో భూమ్మీద వర్షారణ్యమనేదే ఉండదు.

నిరటవీకరణకు కారణాలు ఎన్ని చెప్పుకున్నా, ప్రధానమైనవి వ్యవసాయం, గనులు, బోర్లు, పశుగ్రాస పెంపకం, దావానలాలు. ఇవే దాదాపు 50 శాతం నిరటవీకరణకు కారణాలు. పట్టణీకరణ కూడా కొంతమేర కారణమవుతున్నది. కలప వ్యాపా రం, కాగితపు పరిశ్రమలు కూడా లక్షలాది చెట్లను నరికేస్తున్నా యి. పామాయిల్‌ తోటల పెంపకం కోసం మలేషియాలో, సోయా పెంపకం కోసం బ్రెజిల్‌లో యథేచ్ఛగా అరణ్యాలను పొలాలుగా మారుస్తున్నారు. అయితే నిరటవీకరణ దోషం పూర్తి గా మనుషులకే ఆపాదించడానికి వీల్లేదు. కార్చిచ్చు, విపరీతమై న వేడి కూడా మొక్కలు పెరుగకుండా నిరోధిస్తున్నాయి. నిరటవీకరణ వల్ల మానవ, జంతు జాతులకు తీరని నష్టం కలుగుతున్నది. దాదాపు 160 కోట్ల మంది నేరుగా అడవులపై ఆధారపడి జీవిస్తున్నారు. భూమ్మీద ఉన్న 80 శాతం జంతు, వృక్ష జాతులు అడవుల్లోనే ఉన్నాయి.

అడవుల నరికివేత మానవాళి పట్ల పెనుశాపంగా మారనుం ది. చెట్ల వల్ల ఎన్ని ఉపయోగాలున్నాయో చాలామందికి తెలియకపోవచ్చు. ఒక చెట్టుపై ఆధారపడి వందలాది కీటక, జంతు జాతులు జీవిస్తున్నాయి. ఒక ఎకరంలో ఉన్న చెట్లు, ఏడాదిలో 18 మందికి, నలుగురు మనుషులకు జీవితాంతం సరిపోయే ఆక్సిజన్‌ను అందిస్తాయి. ఒక కారును 26వేల కిలోమీటర్లు నడవటానికి అవసరమయ్యే కార్బన్‌ డై ఆక్సైడ్‌ను పీల్చుకుంటాయి. అడవులు తీవ్ర వాతావరణ మార్పులను అరికడుతాయి. గ్రీన్‌హౌజ్‌ వాయువులను సమర్థవంతంగా నిరోధించి, గ్లోబల్‌ వార్మింగ్‌ను అడ్డుకుంటున్నాయి. అత్యంత ప్రమాదకర వాయువులను పీల్చుకొని, మనకు స్వచ్ఛమైన గాలిని అందిస్తున్నాయి. చెట్లు మనకు చల్లదనాన్ని అందిస్తున్నాయి. నగరాలకు, పట్టణాలకు నీరు, నీడ ఇస్తూ దాదాపు 10 డిగ్రీల ఫారిన్‌హీట్‌ మేర చల్లబరుస్తున్నాయి. నలుగురు ఉండే ఇల్లుకి మూడు చెట్లు చాలు, సరిపడా స్వచ్ఛమైన గాలికి. అంతెందుకు? పచ్చని చెట్లను చూస్తే చాలు, వ్యాధుల నుంచి కూడా త్వరగా కోలుకుంటారని పరిశోధనలు తేల్చాయి.

భూగోళవ్యాప్తంగా అరణ్యాలు శరవేగంతో కనుమరుగవుతున్నాయి. ఇదే వేగం కొనసాగితే, వందేండ్ల తర్వా త చెట్టును పిల్లలకు సినిమాల్లోనూ, టీవీల్లోనూ చూపించాల్సివస్తుంది. ఈ వేగం తగ్గి, రాబోయే కొన్నితరా లైనా మనుగడ సాగించాలంటే వీలైనన్ని చెట్లు నాటడమే పరిష్కారం.ఇప్పుడిప్పుడే ఈ ప్రళయాన్ని ఆపేందుకు ప్రపంచదేశాలు కృషి మొదలుపెట్టాయి. జీవవైవిధ్యాన్ని, జీవపర్యావరణ వ్యవస్థను కాపాడటానికి నడుం బిగించాయి. ప్రపంచానికి పెనువిపత్తుగా మారిన గ్లోబల్‌ వార్మింగ్‌ను అరికట్టడానికి చెట్లు పెంచడం మినహా మరో మార్గం లేదు. భారత్‌లో కూడా అటవీ పెం పకం మెల్లమెల్లగా ఊపందుకుంటున్నది. భారత్‌, తన మొత్తం భూ విస్తీర్ణంలో 21.54 శాతంగా, 7,08,273 చ.కి.మీల అటవీప్రాంతాన్ని కలిగి ఉన్నది. దీన్ని 33శాతానికి పెంచాలని కేంద్రం నిర్ణయించింది. ప్రస్తుతానికి 6,778 చ.కి.మీలను జమ చేయగలిగింది.

రాష్ట్రాలలో తెలంగాణ, అటవీకరణను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. 2014లో ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ పదవి చేపట్టగానే చెట్ల పెంపకాన్ని మరో ఉద్యమంలా చేపట్టారు. ‘తెలంగాణకు హరితహారం’గా నామకరణం చేసి, 230 కోట్ల మొక్కల పెంపకాన్ని లక్ష్యంగా ఎంచుకొని, ప్రభుత్వ యంత్రాంగాన్ని మొత్తం సంసిద్ధం చేశారు. 130 కోట్లు పట్టణ-నగర ప్రాంతాల్లో, 100 కోట్లు అటవీ ప్రాంతాల్లో పెంచాలని భారీగా కార్యాచరణ రూపొందించారు. ఇప్పటికే 80 కోట్లకు పైగా మొక్కలు నాటుకొ ని చిగుళ్లు వేస్తున్నాయి. అందులో కూడా ముఖ్యమంత్రి ఆలోచ న విభిన్నంగా ఉన్నది. వన్యప్రాణులకు ఆహారంగా అవసరమయ్యే ఫలమొక్కలను కూడా అటవీ ప్రాంతాల్లో నాటాలని అధికారులను ఆయన ఆదేశించారు. భవిష్యత్తు తరాలకు ప్రాణవాయువునందివ్వాలన్న కేసీఆర్‌ సంకల్పం, ఆచరణ బహుదా శ్లాఘనీయం.

అలాగే, రాజ్యసభసభ్యులు, జోగినిపల్లి సంతోష్‌కుమార్‌, సామాజిక మాధ్యమాల ఆసరాగా, ‘గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌' అనే కార్యక్రమానికి 2017 జూలైలో శ్రీకారం చుట్టారు. ఒక వ్యక్తి మూడు మొక్కలు నాటి, మరో ముగ్గురు తన స్నేహితులను అలాగే నాటమని అందుబాటులో ఉన్న సోషల్‌ మీడియాలో చాలెంజ్‌ చేయడం ఈ కార్యక్రమ ఉద్దేశం. ఈ గొలుసుకట్టు చాలెంజ్‌ అనతికాలంలోనే ఎంతో ప్రఖ్యాతిగాంచి, కోట్ల సంఖ్య లో మొక్కలు నాటేలా చేసింది. దేశవ్యాప్తంగా ప్రముఖులకు చేరి న ఈ చాలెంజ్‌, సర్వత్రా ప్రశంసలు అందుకుంటున్నది. రైస్‌ బకె ట్‌, ఐస్‌ బకెట్‌ చాలెంజ్‌ల్లా కాకుండా, ఒక ఉన్నతాశయంతో, వ్యక్తిగతంగా దీన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో అద్భుతమైన ఫలితాలను సాధిస్తున్నది.

ఈ కార్యక్రమంలో ఉన్న ప్లస్‌పాయింటేమంటే, ప్రతి ఒక్కరు మూడే మొక్కలు నాటడం వల్ల వ్యక్తిగతంగా శ్రద్ధ పెరిగి,అవి కచ్చితంగా బతికి, పెద్దవయ్యే అవకాశముంటుంది. అంటే, 95 శాతానికి పైగా మొక్కలు ఈ సమాజం లో భాగమవుతాయి. కొంతమంది ఊళ్లు దత్తత తీసుకున్నారు. మరికొంతమంది బడులు దత్తత తీసుకున్నారు. కానీ, సంతోష్‌ ఒక ‘అడవి’ని దత్తత తీసుకొని పెంచిపోషిస్తున్నారు. ప్రకృతి పట్ల ఎంతో ప్రేమ, అవగాహన, ముందుచూపు ఉంటేనే ఇటువంటి కార్యక్రమాలు సాధ్యం. ఇలాంటి ఉదాత్తమైన ఆలోచనలకు పురుడుపోసి, ఎంతో       

శ్రద్ధతో అమలుచేస్తున్న సంతోష్‌కుమార్‌, భావితరాలకు తనవంతు ఊపిరి పోస్తున్నట్లే.

సమాజంలో మనందరం కూడా భాగస్వాములమే. మన పిల్ల ల పట్ల ఎంతో బాధ్యతతో మెలుగుతామో, వారి పిల్లల పట్ల కూడా అంతే బాధ్యతతో మెలగాల్సి ఉన్నది. అందరూ తమ ఇం ట్లో, కార్యాలయాల్లో, ఎక్కడ వీలుగా ఉంటే అక్కడ మొక్కటు విరివిగా నాటి ఎవరి ప్రాణవాయువును వారే తయారుచేసుకొ ని, వారి వారసులకు కూడా అందివ్వాలి. వీలైనన్ని మొక్కలు నాటడమే కాదు, అవి కుదురుకునేంతవరకు సంరక్షించడమే మానవాళికి మనం చేయగలిగిన మహోపకారం. వృక్షాలే మన భావితరాలకు శ్రీరామరక్షగా నిలుస్తాయి. వాటిని మనం రక్షిస్తే, మనల్ని అవి రక్షిస్తాయి.

వృక్షో రక్షతి రక్షితః


logo