మంగళవారం 07 ఏప్రిల్ 2020
Editorial - Jan 14, 2020 ,

వర్సిటీల్లోనే ప్రజాస్వామ్య భవిష్యత్తు

వర్సిటీల్లోనే ప్రజాస్వామ్య భవిష్యత్తు

ప్రపంచంలోనే భారత్‌ను అతిపెద్ద ప్రజాస్వామ్యమని చెప్పుకుంటాం. చెప్పుకోవటమే కాదు, ఆచరణాత్మక స్వభావరీత్యా కూడా అంతటి ప్రాశస్థ్యాన్ని కూడా కలిగి ఉన్నాం. ఇది గత సమీప చరిత్రలో అనేక సందర్భాల్లో ప్రపంచంలోనూ, దేశంలోనూ భారత ప్రజాస్వామ్య విశిష్ఠతను చాటింది. కానీ గత కొద్దినెలలుగా దేశంలో జరుగుతున్న పరిణామాలు గత ప్రాశస్థ్యాన్ని మసకబరిచేరీతిలో ఉంటున్నాయి.

పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), జాతీయ పౌరపట్టిక (ఎన్‌ఆర్సీ)లకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా తీవ్రమైన విమర్శలు వస్తుండటమే కాదు, తీవ్రస్థాయిలో నిరసనోద్యమాలు కొనసాగుతున్నాయి. అతిపెద్ద అనేది సంఖ్యపైనే ఆధారపడినదిగా చూస్తే కోట్లాది ప్రజ ల భాగస్వామ్యంతో అతిపెద్ద ప్రజాస్వామ్యం అని చెప్పుకుంటే, అదిప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. పెద్దసంఖ్యలో ప్రజాసమూహాలు సీఏఏ, ఎన్‌ఆర్సీలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తూ అతిపెద్ద ప్రజాస్వామ్యం అనేదాన్ని సందేహాస్పదం చేస్తున్నాయి. 


సంఖ్య అనే దానికి, స్వాభావికమైన ప్రాధాన్యం ఉండక తప్పదు. అయి తే అదే అన్నివేళలా ప్రజాస్వామ్యానికి ప్రతిరూపంగా భావించలేం. ఇవ్వాళ.. అధికారపార్టీ గత ఎన్నికల్లో వచ్చిన తన సంఖ్యాబలంపై ఆధారపడి అధికారం చేపట్టి, తనదైన తరహా పాలనావిధానాలను అవలంబిస్తున్నది. అప్పటినుంచి తాను తలిచిందే ప్రజాస్వామ్యంగా తనకున్న సంఖ్యాబలంతో విధాన నిర్ణయాలను చేస్తూపోతున్నది. దాన్నే ప్రజాస్వామ్యంగా చెప్పుకొస్తున్నది. ఇలాంటి విధానాలకు విరుద్ధంగా మొదట్లోనే దేశంలో పెద్దఎత్తున చర్చజరిగింది. సంఖ్యాబలమే ప్రజాస్వామ్యానికి అంతిమం కాదనే వాదన ముందుకొచ్చింది. 


అదే సమయంలో భారత రాజ్యాంగం సార్వత్రిక వయోజన ఓటు హక్కు కల్పించింది. అయితే ఆ సందర్భంలోనే.. ‘భారతదేశంలో ప్రజాస్వామ్యం అంటే కొందరి కూలీన ఆధిపత్యవర్గాల చేతుల్లో మాత్రమే అధికారం కేంద్రీకృతమైతే అది అనివార్యంగా అప్రజాస్వామ్యంగా పరిణమిస్తుంది’ అని డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ నాడే హెచ్చరించారు. సరిగ్గా ఇలాంటి స్థితిలోనే రాజ్యాంగ విలువ లు భారత సామాజిక నిర్మితి కారణంగా అందరి దరిచేరలేదు. రాజ్యాం గం చెప్పినట్లుగా ఒకవేళ ప్రజలు ప్రజస్వామ్యంలో తమకు నచ్చిన వారి నే ఎన్నుకునే అవకాశం ఉంటే, ఆ ప్రజలనే అణిచివేతకు గురిచేసే వారు పాలకులుగా ఎన్నుకోబడే వారు కాదు. ప్రజాస్వామ్యంలో ప్రజలందరూ సమానులే అన్న విలువ ఉంటే, భారత సమాజంలో వేళ్లూనుకున్న అసమానతల మాటేమిటి? ప్రజాస్వామ్యం అంటే ఎన్నికలు మాత్రమే కాదు, దేశంలోని ఆధిపత్యవర్గాలు అధికారంలోకి రావటం కానే కాదు.


ప్రజాస్వామిక విలువలు, సంస్కృతి గురించి అంబేద్కర్‌ చెప్పి ఏడు దశాబ్దాలు దాటింది. కానీ దేశ పరిస్థితులు అలాగే ఉన్నాయి. ప్రజాస్వామ్యం అనేది ఆధునిక ప్రపంచంలో ఒక విప్లవాత్మక ఆచరణే అయితే, ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు ఎందుకు అప్రజాస్వామిక పాలనల్లో మగ్గుతున్నారు? ప్రజలు తమ అభీష్టానుసారం పాలకులను ఎన్నుకునే స్థితే ఉంటే వారికి ఇన్నివిధాల సమస్యలు, కష్టాలు వచ్చేవి కాదు. రాజ్యాంగం ప్రకారం భారత్‌ ప్రజాస్వామిక దేశం. ప్రజాస్వామిక రాజకీయాల్లో ప్రజలంతా భాగస్వాములై తమ ఆకాంక్షలకు అనుగుణమైన పాలకులను ఎన్నుకునే అవకాశం ఉంటుంది. కానీ ఆచరణలో చెప్పుకు న్న దానికీ, రాసుకున్న దానికీ భిన్నమైన ఫలితాలు,అనుభవాలు ఎదురవుతున్నాయి. ఫ్రెంచి విప్లవం ద్వారా ఆధునిక ప్రపంచానికి ప్రజాస్వామ్య ఆకాంక్షలు అంది వచ్చాయి. రాజకీయ ఆచరణకు అవకాశం ఏర్పడింది. 


స్వాతంత్య్రోద్యమ కాలంలో బ్రిటిష్‌ వలస పాలనకు వ్యతిరేక ఉద్యమం లో పెద్ద ఎత్తున ప్రజాభాగస్వామ్యంతో ఉద్యమాలు చేసిన కాంగ్రెస్‌, ఆ తర్వాత కాలంలో  ప్రజల భాగస్వామ్యంతో పాలనావిధానాలను, పాల నను కొనసాగించాలనే దానికి తిలోదకాలు ఇచ్చింది. ప్రజలను సంక్షేమ పథకాలు పొందేవారిగా, ఎదురుచూసే వారిగా మార్చేసింది. ఐదేండ్లకు ఒకసారి ప్రజలంతా బ్యాలెట్‌ బ్యాక్సుల్లో తమ బతుకులను, ప్రజాస్వామ్యాన్ని వెతుక్కునే పరిస్థితిని తెచ్చారు. ఈ నేపథ్యంలోనే పౌరుడు అంటే.. ఓటరుకార్డు, రేషన్‌ కార్డు కలిగి ఉండటంగా మారిపోయింది.


అన్నింటికన్నా భయంకరమైనదీ, విషాదకరమైనదీ ఏమంటే.. ఇవ్వాళ.. ప్రభుత్వమే ప్రజలను పౌరసత్వానికి అర్హతగా కొన్ని పత్రాలను చేతిలో పట్టుకొని నిలుచోవాలని చెబుతున్నది. తద్వారానే తాను పౌరున్నని నిరూపించుకోవాలని అంటున్నది. ఆ క్రమంలో ప్రభుత్వం తన ఇష్టానుసారం నువ్వు పౌరునివా, కాదా అన్నది నిర్ణయిస్తానంటున్నది. ఎవరైతే సరైన అవసరమైన పత్రాలు కలిగిఉండరో వారిని పౌరసత్వానికి అనర్హునిగా చేస్తున్నది. ప్రజల క్రియాశీల భాగస్వామ్యంతోనే ప్రజా స్వామ్యం మనగలుగుతుంది అంటే, ఆ ప్రజల భాగస్వామ్యమే ప్రశ్నార్థకం అవు తున్నది. కొన్ని రాజకీయసంస్థలు, కొందరు నేతలు ప్రజల పౌరసత్వాలను నిర్ణయించే, నిర్దేశించే స్థితి ఏర్పడిది. ఈ క్రమంలో ఆశ్చర్యకరమైన విషయమేమంటే.. ప్రజలు తమ పాలకులను ఎంచుకునే బదులుగా, పాలకులే తమ ప్రజలు ఎవరనేది ఎంచుకుంటున్నారు!


కొన్ని పాలనాపరమైన విధానాలు, వాదనల ప్రకారం.. మన ప్రభుత్వం చెబుతున్న దాంట్లో సహేతుకత ఉన్నదని అనిపిస్తున్నది. ప్రపంచంలోని అన్నిదేశాలు ప్రజల నుంచి, ఆ దేశంలోకి ప్రవేశించిన వారి నుంచి అవసరమైన పత్రాలు అడుగుతున్నాయి కదా, ఇందులో తప్పేమున్నది అనిపిస్తుంది. కానీ మన దేశం విషయానికి వస్తే పరిస్థితి ప్రత్యేకమైనది, భిన్నమైనది. మనమంతా మనకు సంబంధించిన పత్రాలు చూపెట్టకపోతే మనమంతా విదేశీయులం అయిపోతాం. ఈ క్రమంలో దేశమంతా ఓ సరిహద్దు కొసన నిలుచుంటుంది.  భద్రత మాటున మనమంతా శల్యపరీక్షలకు గురవుతాం. కొన్ని వార్తాకథనాల ప్రకారం.. ముంబాయి, బెంగళూరులో నిర్బంధ శిబిరాలు నిర్మితమవుతున్నాయి. ఈ నేపథ్యం లో దేశంలోని ప్రతి ఒక్కరూ సరిహద్దు మీద సరియైన పత్రాల పరిశీలనలో ఉన్నపరిస్థితి ఉన్నది. ఇది ప్రజలు నివసిస్తున్న ప్రాంతం, పరిస్థితులతో నిమిత్తం లేకుండా ఎదుర్కోబోయే విపత్కర పరిస్థితి. 


ప్రస్తుత పాలకులు చేపట్టిన ఎన్‌ఆర్సీ ప్రకారం.. ఒకరి పౌరసత్వం తొలిగిస్తే, సీఏఏ దాని సహేతుకతను నిర్ణయిస్తుంది. అలాగే ఒకరి పౌరసత్వం వారి ఇంటిపేరుపై ఆధారపడుతుంది. చరిత్రలో మొదటిసారి 19వ శతాబ్దంలో ఇంగ్లండ్‌లో జనాభా గణన చేసినప్పుడు పౌరుల వృత్తి ఆధారం గా గణించారు. అదే వలసపాలనా కాలంలో బ్రిటిష్‌ వారు  భారత్‌లో ప్రజలను మత ప్రాతిపదికన జనాభా గణన చేపట్టారు! ఫలితంగా దేశం లో జనాభా గణన అనేది మత, కులపరంగా జరిగింది. ప్రస్తుతం అధికారంలో ఉన్న వారూ సరిగ్గా అదేరీతిన ప్రజలను మత ప్రాతిపదికన గణన చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. సరియైన పత్రాలు, కుల, మత ప్రస్తావనలు, ఇంటిపేరు తదితరాలతో ప్రజలమధ్య అగాథాలు తవ్వుతున్నారు. డబ్భుఏండ్ల స్వాతంత్య్రానంతరం కూడా ప్రజల్లో నాటి భయాలు పోలేదు. ప్రజలంతా సమానులే అన్నది అనుభవంలోకి రాలేదు. కులం అనేది అన్నింటా మనిషి స్థానాన్ని నిర్దేశిస్తున్నది. ఈ క్రమంలోంచే ఆర్థికంగా ఎదిగిన కుటుంబాలన్నీ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల నుంచి దూరం చేశారు. అంతేకాదు వారు ప్రభుత్వరంగంలోని రావాణా నుంచే కాకుండా నివాసాలను కూడా వేరు పర్చి గేటెడ్‌ కమ్యూనిటీల పేర తమ స్వీయరక్షణ, నియంత్రణా విధానంలోకి వెళ్లిపోతున్నారు.


ఎన్‌ఆర్సీ, సీఏఏ ప్రజలను ప్రతి ఒక్కరినీ ఒంటరిని చేసి పౌరసత్వా న్ని నిరూపించుకోవాలని నిర్దేశిస్తున్నాయి. ఈ నేపథ్యంలోంచే రాజ్యాంగ ప్రవేశికలోని ‘భారతీయులమైన మేము..’ అనేది పోరాట నినాదమై పోయింది. చాలా సందర్భాల్లో ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామిక విలువలు ప్రశ్నార్థకమైనప్పుడు ప్రజలు, విద్యార్థులు రోడ్లమీదికి వచ్చి వాటిని సంరక్షించుకున్నారు. కొన్నిసార్లు దేశంలో అత్యున్నత న్యాయస్థానం జోక్యంతో రాజ్యాంగ విలువలు పరిరక్షించబడ్డాయి. ఇప్పుడు  కొన్నిరోజులుగా దేశంలోని యూనివర్సిటీ విద్యార్థులు రోడ్లపైకి వచ్చి ప్రజాస్వామిక విలువల కోసం ఉద్యమిస్తున్నారు


- సందిప్తో  దాస్‌గుప్తకార్మికరంగం విషయానికి వస్తే సంఘటితరంగం బలహీనపడి కార్మికసంఘాలు కనుమరుగవుతున్నాయి. మీడియా కూడా ప్రజాసమస్యలు, ఆకాంక్షలకు చోటివ్వకుండా పాలకుల మెప్పుకోసమే తాపత్రయపడుతున్నాయి. దేశంలో వామపక్షశక్తులు కునారిల్లిపోయాయి. ఈ నేపథ్యంలో నే ఎన్‌ఆర్సీ, సీఏఏ ప్రజలను ప్రతి ఒక్కరినీ ఒంటరిని చేసి పౌరసత్వా న్ని నిరూపించుకోవాలని నిర్దేశిస్తున్నాయి. ఈ నేపథ్యంలోంచే రాజ్యాంగ ప్రవేశికలోని ‘భారతీయులమైన మేము..’ అనేది పోరాట నినాదమై పోయింది. చాలా సందర్భాల్లో ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామిక విలువలు ప్రశ్నార్థకమైనప్పుడు ప్రజలు, విద్యార్థులు రోడ్లమీదికి వచ్చి వాటిని సంరక్షించుకున్నారు. కొన్నిసార్లు దేశంలో అత్యున్నత న్యాయస్థానం జోక్యంతో రాజ్యాంగ విలువలు పరిరక్షించబడ్డాయి. 


ఇప్పుడు  కొన్ని రోజులుగా దేశంలోని యూనివర్సిటీ విద్యార్థులు రోడ్లపైకి వచ్చి ప్రజాస్వామిక విలువల కోసం ఉద్యమిస్తున్నారు. సీఏఏ, ఎన్‌ఆర్సీలకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం జామియామిలియా ఇస్లామిక్‌ యూనివర్సిటినీ మూసేసింది. అయినా విద్యార్థులు పరిసర ప్రాంతాల ప్రజలను సమీకరించి వారికి యూనివర్సిటీ క్యాంపస్‌లో విద్యాబోధన  చేస్తున్నారు. అక్కడి నుంచి కూడా తమను ప్రభుత్వం తరిమేస్తే దేశంలోని రోడ్లపైనే తరగతులను నిర్వహిస్తామంటున్నారు. ఇవ్వా ళ.. యూనివర్సిటీలు వీధుల్లోకి వచ్చాయి. భారత ప్రజాస్వామ్య భవిష్యత్తు వీధుల్లో ఉన్న యూనివర్సిటీలపైనే ఆధారపడి ఉన్నది.

(వ్యాసకర్త: రాజకీయశాస్త్రంలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ) 

(‘ది వైర్‌' సౌజన్యంతో)         


logo