శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Editorial - Jan 14, 2020 ,

సంక్రాంతికి స్వాగతం

సంక్రాంతికి స్వాగతం

ముంగిట్లో రంగు రంగుల ముగ్గులు..

బొడ్డెమ్మలతో యింటికి వచ్చెను కొత్త కాంతి

పచ్చని తోరణాలతో అలంకరించుకొని

చలిని పారదోలే భోగిమంటల కాంతులతో 

ఘుమఘుమలాడే పిండి వంటలతో

హరిదాసుల ఆట పాటలతో

రైతులకు ధాన్యరాసుల కుప్పలు  నింపిన ధైర్యంతో

ఆకాశం నిండా రంగురంగుల

పతంగులు గాలిలో తేలిపోతూ

యింటి నిండా బంధువులు, స్నేహితులతో

కళ కళాడుతూ

సందడితో  మనసునిండా ఆనందాన్ని నింపుతూ

బోసి నవ్వుల పిల్లలకు పోసిన  భోగిపళ్ళతో

చిన్న పిల్లల చిలిపి చేష్టలతో

కొత్త అల్లుళ్ళఅలకలతో

కొత్త కోడళ్ళ కోరికలతో

ఆడపడుచుల ఆటపాటలతో

గంగిరెద్దుల విన్యాసాలతో

మూడురోజుల పర్వదినాల 

సంక్రాంతి వచ్చింది

ఆనందలెన్నో తెచ్చింది

మన సంస్కృతి సంప్రదాయాలకు 

వన్నెతెచ్చింది.. పసిడిరాసులు ఇచ్చింది... 


-అనిత, 9394221927


logo