ఆదివారం 29 మార్చి 2020
Editorial - Jan 10, 2020 , 12:17:50

ప్రజాస్వామ్యానికి ప్రమాద సూచిక

ప్రజాస్వామ్యానికి ప్రమాద సూచిక

జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ)పై జరిగిన దాడి దేశంలో హింసా దౌర్జన్యాలను చాటుతున్నది. అధికార పార్టీ హింసాత్మకతకు వాస్తవరూపంగా, ప్రతీకాత్మకంగా కనిపిస్తున్నది. ఈ నేపథ్యంలో వస్తున్న ఆరోపణలు, ప్రభుత్వం చేస్తున్న వాదనలు చూస్తే.., ప్రభు త్వం మనల్ని బుద్ధిహీనులుగా తలుస్తున్నట్లు కనిపిస్తున్నది. కేంద్ర మానవాభివృద్ధి శాఖామంత్రి జేఎన్‌యూ విద్యార్థులు శాంతిని కాపాడాలని పిలుపునివ్వటం ఆశ్చర్యం కలిగిస్తున్నది. జేఎన్‌యూలో ముసుగులు ధరించిన దుండగులు కర్రలు, ఇనుపరాడ్లతో మూడుగంటల పాటు స్వైరవి హా రం చేస్తున్నా అధికారం చెలాయిస్తున్న ప్రభుత్వ పెద్దలకు పట్టింపులేకపోవటం దేన్ని సూచిస్తున్నది. అయ్యా మంత్రి గారూ.. ఇది విద్యార్థులు చేసిన హింస కాదు, వారు కాదు శాంతిని పాటించాల్సింది. అది మీ బాధ్యత. మీ పార్టీ అనుబంధ సంఘాల వారు చేసిన హింస అది. వారే గత కొన్నేండ్లుగా జేఎన్‌యూలో హింసావాదం తిష్టవేసినట్లు ప్రచారం చేశారు. ఇప్పు డు వారదే చేశారు. వారి ఇష్టానుసారం హింసకు పాల్పడిన వారే హింసాదౌర్జన్యాల గురించి ఇన్నాళ్లు మాట్లాడారు.


కేంద్ర హోంమంత్రి జేఎన్‌యూలోని హింసాదౌర్జన్యాల గురించి పోలీసుల నుంచి నివేదికను కోరారు. కానీ వారు జేఎన్‌యూ క్యాంపస్‌లో దాడులు జరుగుతుంటే, హింసాదౌర్జన్యాలు సాగుతుంటే ప్రేక్షక పాత్ర వహించారు. ఈ పోలీసులే కొద్దిరోజుల కిందట జామియా మిలియా ఇస్లామియా క్యాంపస్‌లో విద్యార్థులపై దాడికి దిగారు. ఆ పోలీసుల ముందే యోగేంద్ర యాదవ్‌పై జరుగుతుంటే వారు కండ్లప్పగించి చూశారు కాదా? ఇంకా ఏం కావాలి. దేనిగురించి ఆలోచించాలి.

నియమ, నిబంధనలు ఏమయ్యాయి? జేఎన్‌యూ టీచర్స్‌ అసోసియేషన్‌ సమావేశాన్ని విచ్ఛిన్నం చేసి టీచర్లు, విద్యార్థులపై దుండగులు దాడి చేశారు. ఇంకా ఏం దాస్తారు. ఇంకా ఆందోళనకరమైన విషయమేమంటే.. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న దృశ్యాలను బట్టి చూస్తే అధికారవర్గాల దన్నుతోనే ముసుగు దుండగులు దాడికి పాల్పడ్డారని అవగతమవుతున్న ది. ఈ దాడి సారాంశం, సందేశమేమంటే.. ఇప్పుడు ఏ ఒక్కరూ సురక్షి తం కాదని చెప్పదలుచుకున్నారు. ఏ ఒక్కరిని వదిలిపెట్టబోమని చాటదల్చుకున్నారు. అదే ప్రభుత్వ పాలనావిధానంగా ప్రదర్శించారు. చట్టాలకు అతీతంగా రక్షణ చట్టాలన్నింటినీ తుంగలో తొక్కిన అరాచకాన్ని ప్రజలకు చూపించారు. ఈ హింసా దౌర్జన్యకాండనంతా జేఎన్‌యూ అధికారులు కేంద్రమంత్రి వర్గానికి నివేదించాలి. కానీ ఏ తీరున స్పందించారో తెలుస్తూనే ఉన్నది. ఇదే వర్సిటీ అధికార వర్గం టీచర్లు, విద్యార్థుల విషయంలో పరిమితికి మించి స్పందించిన దాఖలాలున్నాయి. కానీ తాజా దాడిపై మాత్రం దాడి జరిగిన తర్వాత మూడు గంటలకు మేలుకున్నారు. కంటి తుడుపు మాటలతో బాధ్యతల నుంచి తప్పించుకోజూస్తున్నారు.


జరుగుతున్న పరిణామాలను బట్టి ఇదంతా అధికార పెద్దల కనుసన్నల్లోనే జరిగినట్లు భావించాల్సి వస్తున్నది. నిజానికి.. జేఎన్‌యూపై దాడిచేసిన ముసుగు రౌడీలు ఎవరు? అధికార పార్టీ అనుబంధ సంఘం విద్యార్థులేనని మనం చెప్పలేం. కానీ ప్రత్యక్ష సాక్షులు చెబుతున్న విషయాలు, బాధిత విద్యార్థులు చెబుతున్న విషయాలను బట్టి అసలు అగంతకులు ఎవరో ఊహించవచ్చు. యూనివర్సిటీలో జరుగుతున్న దాడిగురించి తెలుసుకొని యూనివర్సిటీ గేట్‌ వద్దకు పరుగెత్తుకొని వచ్చిన ఒక యువ మహిళ చెప్పినదాని ప్రకారం.. దాడికి పాల్పడిన వారిలో ఒక ఏబీవీపీ వారో, భజరంగ్‌దళ్‌కు చెందినవారో మాత్రమే ఉన్నారని చెప్పలేం. కానీ వారు ఆమెను ‘మీరు ఏబీవీపీ మద్దతుదారులేనా’ అని అడిగారు. దానికి ఆమె నుంచి ఏ సమాధానం లేకపోవటంతో.. దాడిచేసిన దుండగులు, వారి మద్దతుదారులు వర్సిటీ గేటు వద్ద ఏ జంకూబొంకు లేకండా గుమికూడారు.


ఆ యువతి చెప్పిన విషయం ఆమె మాటల్లోనే.. ‘మేం జేఎన్‌యూకు సమీపంలోనే నివసిస్తున్నాం. మాకు మెస్సేజ్‌ల ద్వారా వర్సిటీ ప్రొఫెసర్లు, విద్యార్థులపై ఏబీవీపీ గుండాలు దాడిచేస్తున్నారని సమాచారం అందింది. అప్పుడు మేం వర్సిటీకి వెళ్లాలని నిర్ణయించుకున్నాం. కానీ వర్సిటీకి వెళ్లే రోడ్డు మార్గమంతా పోలీసులతో నిర్బంధింపబడి ఉన్నది. రోడ్డును మూసేసిన పోలీసులు చెప్పిందేమంటే.. క్యాంపస్‌లో విద్యార్థులు నిరసన తెలుపుతున్నారని. కాబట్టి మమ్ములను క్యాంపస్‌లోకి అనుమతించలేమని చెప్పారు. అదేవిధంగా ఆ రోడ్డుగుండా ట్రాఫిక్‌ను అనుమతించలేదు. దాంతో మేం మా కారును రోడ్డుకు దూరంగా ఓ దగ్గర నిలిపేశాం. అక్కడి నుంచి నడుచుకుంటూ వర్సిటీ గేటు దగ్గర రెండు పోలీస్‌ వ్యాన్లున్న చోటు కు పోయాం. అక్కడ 50-70 మంది దాకా పోలీసులు, మరికొంత మం ది సాదా దుస్తుల్లో ఉన్నారు. వారంతా వర్సిటీ లోపల జరుగుతున్న దౌర్జన్యాన్ని నిరోధించటానికి, పరిస్థితిని చక్కదిద్దటానికి బదులు గేటు దగ్గర తాపీగా సేద తీరుతున్నారు. ఎందుకు మమ్ములను వెళ్లనివ్వటం లేదని అంటే.. అక్కడికి పోవటం సురక్షితం కాదు, అక్కడ విద్యార్థుల మధ్య కొట్లాట జరుగుతున్నదని చెప్పారు.

 అప్పుడు మేం.. మీరు వెళ్లి ఆ కొట్లాటను ఆపాలి కదా.. అంటే, వారు చాలా సాదాసీదాగా భుజాలెగరేసి ఏమీ చేయలేమన్నట్లు ప్రవర్తించారు!

ఇలా నేను పోలీసులను అనేక ప్రశ్నలను అడుగుతుంటే.. అక్కడ నిలుచున్న వారిలో ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చి.. నీవు ఏబీవీపీ మద్దతుదారువే నా అని అడిగాడు. అప్పుడు నేను చెప్పాను.. నేను ఎవరి మద్దతుదారు కానని. అప్పుడా వ్యక్తి సగర్వంగా ఇలా అన్నాడు.. లోపల వారిని లాఠీలతో కొడుతున్నారు. మంచిపనే అవుతున్నదని గొప్ప పని జరుగుతున్నదన్నట్లుగా, టీచర్లకు, విద్యార్థులకు జరుగవలసిందే అన్నట్లుగా చెప్పా డు. ఇలా చెబుతున్నప్పుడు అక్కడున్న వారిలో చాలామంది నన్ను, నా భర్తను చుట్టుముట్టారు. అందులో ఒకరు.. ఆమె అవ తలివైపు వ్యక్తి, వీడియోలు తీస్తున్నదని ఏవేవో అంటున్నారు. ఆ మాటలు వింటే తాము అక్కడ ఇంకొంచెం సేపు ఉంటే సురక్షితం కాదని, వారేమై నా చేయగలరని అనిపించింది. ఇంత జరుగుతున్నా పోలీసులేమీ పట్టించుకోవటం లేదు. దాంతో వెంటనే మేం మా కారువైపు నడుస్తున్నాం. మా కారువైపు వెళ్తున్నప్పుడు చూస్తే.. వర్సిటీ గేటువద్దకు వర్సిటీ లోపలి నుంచి వంద, నూటా యాభైమంది కర్రలు, రాడ్లతో వచ్చారు. వారంతా కర్రలు, రాడ్లతో నిదానంగా పోలీసుల దగ్గరికి వచ్చి పోలీసులలో కలిసిపోయారు. పోలీసులు ఎవరిని ఏమీ అనటం లేదు. అరెస్టు చేయలేదు. ఇదంతా చూస్తుంటే.. దాడి వెనుక ప్రభుత్వ ప్రోత్సాహం ఉన్నదని ఇట్టే అర్థమవుతున్నది. ఇంతకన్నా భయంకరం ఏముటుంది?. దాడి జరిగిన సమయం, వర్సిటీ గేటు వద్ద ఉన్న పరిస్థితి, పోలీసుల ప్రవర్తన, వారన్న మాటలు ఏం తెలియజేస్తున్నాయ్‌. దాడి మూకలకు పోలీసులు, యూనివర్సిటీ అధికారులు ముందస్తుగానే సంరక్షణ అభ యం ఇచ్చి ఉన్నారా? వారంతా ఎలా సురక్షితంగా మాయమయ్యారు?


కానీ ఆ తర్వాత పోలీసులు మీడియా ద్వారా చేసిన ప్రచారం.. వర్సిటీలో హింసకు జామియా మిలియా విద్యార్థులే కారణమని. ఈ గొడవంతా విద్యార్థుల్లోని రెండువర్గాల మధ్య కొట్లాటేనా? గత ఆదివారం జేఎన్‌యూలో జరిగిన దాడి ప్రజాస్వామ్యానికి పెద్ద ప్రమాద సూచిక. ఇప్పుడు జేఎన్‌యూ సమస్యగా కనిపించవచ్చు. కానీ మనమంతా ఉదాసీనంగా ఉండదగింది కాదు. తప్పక పట్టించుకోదగినది. వారు తమ దాడి ద్వారా మనమంతా గూండా రాజ్యంలో ఉన్నామని చెప్పటమే కాదు, వారి దయాదాక్షిణ్యాలపై ఆధారపడ్డామని చెప్పారు. ఈ క్రమంలోనే కేంద్ర హోంమంత్రి ‘భారత్‌ మాతా’ నినాదాలను గట్టిగా ఇవ్వాలని పిలుపునిస్తున్నారు. ఆ నినాదాలతో ప్రత్యర్థుల కర్ణబేరి పగిలిపోవాలంటున్నారు. జేఎన్‌యూ విద్యార్థి సంఘం నేత ఐషీ ఘోష్‌, ప్రొఫెసర్‌ సుచరితా సేన్‌లు కార్చిన రక్తం.. అధికార పార్టీ హింసా రాజకీయాలకు సంకేతంగా అర్థం చేసుకోవాలి. వారి హింసా రాజకీయాలు వాస్తవ రూపం దాల్చుతున్న దానికి ప్రతీకగా భావించాలి.


(వ్యాసకర్త: ఢిల్లీ యూనివర్సిటీ అధ్యాపకులు) ‘ది వైర్‌' సౌజన్యం...


logo