మంగళవారం 31 మార్చి 2020
Editorial - Jan 12, 2020 , 00:58:15

రాజ్యాంగ విలువల్ని రక్షించుకోవాలె

రాజ్యాంగ విలువల్ని రక్షించుకోవాలె

భారత పౌరసమాజం ఈ దాడులను ఏ విధంగా నిరోధించాలి? ఇదొక క్లిష్ట ప్రశ్న. ఎందుకంటే.. పౌరసమాజం తమదైన పద్ధతిలో నిరసిస్తూనే ఉన్న ది. ప్రభుత్వాన్ని నిలువరిస్తూనే ఉన్నది. కానీ ఇది మాత్రమే సరిపోయేది కాదు. వీధుల్లోకి వచ్చి చేస్తున్న నిరసనోద్యమాలు సమస్య తీవ్రతను తెలియజేస్తుంది. కానీ వాటిని మౌలికంగా నిరోధించలేకపోతున్నాయనేది, మార్పు దిశగా అడుగులు వేస్తున్నాయా అనేది పెద్ద ప్రశ్న. ఇప్పటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఒకడుగు వెనుకకు వేసినట్లుగా కనిపిస్తున్నది. కానీ పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా గుణాత్మక మార్పును తీసుకోస్తాయా అనేది ప్రశ్నార్థకమే. నిరసనోద్యమాలు కొంత తగ్గుముఖం పట్టినప్పుడు, ఉధృతి తగ్గినప్పుడు ప్రభుత్వం తిరగి మరింత దూకుడుగా ముందుకు దూసుకురావచ్చు.

కాలచక్రం తిరుగుతున్న ది. కొత్త సంవత్సరం వచ్చింది. గతేడాది దుః ఖభరితంగా, నిరాశాజనకంగా గడిచినా.. చివరికి ఓ ఆశాకిరణాన్ని అందించి వెళ్లిం ది. ప్రభుత్వం ఎన్నికల ద్వారా దక్కిన విజయంతో తనదైన అజెండా అమలు చేస్తున్నది. ఆ క్రమంలో ఎన్నికల్లో వచ్చి న తిరుగులేని మెజారిటీ కారణంగా ఏది తలిస్తే అదే నిజమన్నట్లుగా, చట్టమన్నట్లు గా వ్యవహరిస్తున్నది. ఈ క్రమంలో వారు ముస్లింలను లక్ష్యంగా చేసుకొని సాధ్యమైనన్ని రూపాల్లో వెంటాడుతున్నారు. ఇదంతా సంఘ్‌ పరివార్‌ తాత్త్విక ఎజెండాననుసరించి జరుగుతున్నది. పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌరపట్టి క, జాతీయ జనాభా పట్టిక లాంటివన్నీ ఆ క్రమంలో వచ్చినవే. ఇదే ఇవ్వాళ దేశ భవిష్యత్తుకు సంబంధించి అతిపెద్ద, ముఖ్య సమస్యగా ముందుకొచ్చింది.

కానీ ఈ పరిస్థితుల్లోనే దేశంలో ఓ ఆశారేఖ వికసించింది. దేశవ్యాప్తంగా ఎన్నార్సీ, సీఏఏలకు వ్యతిరేకంగా పెద్దఎత్తున ప్రజలు నిరసనోద్యమాలతో ఉద్యమిస్తున్నారు. ప్రభుత్వం చేపట్టిన ఎన్నార్సీ, సీఏఏలకు నిరసనగా తీవ్ర ఆగ్రహజ్వాలలు వెళ్లగక్కు తున్నారు. గత ఐదేండ్లుగా దేశంలో కొనసాగిన విభజన రాజకీయాల ప్రతిఫలనంగా ముందుకొచ్చిన పౌరగణన, పౌరసత్వ సవరణ చట్టం లాంటి వాటిని తీవ్రంగా ప్రతిఘటిస్తున్నారు. భారత సమాజాన్ని ప్రమాదపుటంచునకు తీసుకుపోతున్న విధానాలను నిరసిస్తున్నారు. ఈ క్రమంలో కొనసాగుతున్న ప్రజాందోళనల్లో రాజ్యాంగ ప్రవేశికను నిరసనకారులు చదువటం ఏదో యాదృచ్ఛికంగా జరిగింది కాదు. అది రాజ్యాంగాన్నీ, లౌకిక ప్రజాస్వామిక విలువలు గత డబ్భు ఏండ్లుగా కొనసాగుతున్న వాటి పరిరక్షణకు ప్రతీకగా రాజ్యాంగంలోని ప్రవేశికను చదువుతు న్నారు. కానీ బీజేపీ దాని అనుబంధ సేనలు మాత్రం ఈ రాజ్యాంగ విలువల విధ్వంసమే పరమావధిగా వ్యవహరిస్తున్నారు. సంఘ్‌పరివార్‌ శక్తుల ఈ రాజ్యాంగ వ్యతిరేకచర్యలనుంచి రాజ్యాంగాన్ని, విలువలను పరిరక్షించుకునే దిశగా ప్రజలు ఉద్యమిస్తున్నారు.

రాజ్యాంగ విలువలను పరిరక్షించుకునే ఈ ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వా ములు కావాలి. నిరసనోద్యమాలతో సంఘ్‌పరివార్‌ శక్తులకు ముకుతాడు వేయా లి. అయితే సంఘ్‌పరివార్‌ కూడా ఈ ప్రజా ఉద్యమాలతో వెనుకడుగు వేస్తుందనుకోలేం. అది తన హిందూ రాష్ట్ర ఏర్పాటు కలను, కార్యక్రమాన్ని వదులుకోదు. నిరంతరాయంగా, బహుముఖీన తన ప్రయత్నాలను కొనసాగిస్తుంది. తొంభై ఏండ్లుగా ఆర్‌ఎస్సెస్‌ చేస్తున్న భావజాల ప్రచారయుద్ధం ఫలితంగా నేడు అది ఓ ప్రబలశక్తిగా మారి ఎలాంటి పరిణామాలకు మూలంగా ఉంటున్నాయో చూస్తు న్నాం. ఆ క్రమంలో వారు కోరుకుంటున్న హిందూ రాష్ట్ర నిర్మాణం కోసం తమ దారిలో ప్రతిబంధకంగా భావించిన అన్ని శక్తులను, విలువలను వారు నాశనం చేస్తున్నారు. ఆ క్రమంలో వారికి కావాల్సింది కేవలం విజయం మాత్రమే కాదు, తమ భావజాలానికి వ్యతిరేకంగా, విరుద్ధంగా ఉన్న ప్రతిదాన్నీ నిర్మూలిస్తున్నారు. ఆ క్రమంలో వారికి లౌకికత్వం, ఉదార ప్రజాస్వామ్యం లాంటివి కూడా గిట్టటం లేదు. ఈ నేపథ్యంలోనే గత కొన్నేండ్లుగా సంఘ్‌పరివార్‌ శక్తులు రాజ్యం అండతో చేస్తున్న అకృత్యాలు ప్రజలకు బాగానే అనుభవంలోకి వచ్చాయి. ప్రభుత్వ అండ తో ఆర్‌ఎస్సెస్‌ శక్తులు మరింత దూకుడుగా, నిరంకుశంగా తమ హిందుత్వ ఎజెం డాను అమలుచేశాయి. ఈ క్రమంలో  వారు ఈ అదను పోతే రాదనే ఆత్రుత, కుతూహలంతో దూసుకుపోయారు.

మొదట్లో నరేంద్ర మోదీ ప్రభుత్వం పునాదులు కుదుటపర్చుకునే చర్యలను చేప ట్టింది. ఎప్పుడైతే పునాది గట్టిపడింది పట్టుచిక్కిందని భావించిందో ఇక దూకుడు పెంచింది. 2019లో అధికారంలోకి వచ్చిన కొన్ని నెలల పాటు 70 ఏండ్లుగా  కశ్మీర్‌కు ఉన్న స్వయం ప్రతిపత్తి విషయాన్ని ప్రస్తావిస్తూ దాన్ని తీసివేయాలనే ప్రచారానికి పూనుకున్నారు. ఆ తర్వాత కశ్మీర్‌కు ఉన్న ఆర్టికల్‌ 370ని రద్దుచేశారు. ఆ తర్వాత కాలంలో డిసెంబర్‌లో పౌరసత్వ సవరణ బిల్లును పార్లమెంటులో ఆమోదింపజేసుకున్నారు. ఈ రెండింటి మధ్యలో సుప్రీంకోర్టుతో అయోధ్యలో రామాల యం నిర్మాణానికి అనుమతి ఇప్పించుకున్నారు. ఈ క్రమంలో ఎన్నికల ప్రచారం లో చెప్పినట్టి ప్రతీ వాగ్దానాన్ని వారు అమలుచేసిన వారైపోయారు. ఇక వారికి మిగిలిందేమంటే.. ఉమ్మడి పౌర స్మృతి. దీన్ని కూడా రాబోయే కాలంలో వెనుకో ముందో తీసుకొస్తారు. ఇలా ఒకదాని తర్వాత ఒకటిగా బీజేపీ, ఆర్‌ఎస్సెస్‌ శక్తులు తమ లక్ష్యం దిశగా కదులుతూనే ఉన్నాయి. ఈ క్రలో అడ్డువచ్చిన అన్నింటినీ ధ్వంసం చేస్తూనే ఉన్నాయి.లో భారత పౌరసమాజం ఈ దాడులను ఏ విధంగా నిరోధించాలి? ఇదొక క్లిష్ట ప్రశ్న. ఎందుకంటే.. పౌరసమాజం తమదైన పద్ధతిలో నిరసిస్తూనే ఉన్న ది. ప్రభుత్వాన్ని నిలువరిస్తూనే ఉన్నది. కానీ ఇది మాత్రమే సరిపోయేది కాదు. వీధుల్లోకి వచ్చి చేస్తున్న నిరసనోద్యమాలు సమస్య తీవ్రతను తెలియజేస్తుంది. కానీ వాటిని మౌలికంగా నిరోధించలేకపోతున్నాయనేది, మార్పు దిశగా అడుగులు వేస్తున్నాయా అనేది పెద్ద ప్రశ్న. ఇప్పటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఒకడుగు వెనుకకు వేసినట్లుగా కనిపిస్తున్నది. కానీ పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా గుణాత్మక మార్పును తీసుకోస్తాయా అనేది ప్రశ్నార్థకమే. నిరసనోద్యమాలు కొంత తగ్గుముఖం పట్టినప్పుడు, ఉధృతి తగ్గినప్పుడు ప్రభుత్వం తిరగి మరింత దూకుడుగా ముందుకు దూసుకురావచ్చు.


కాబట్టి ఈ నిరసనోద్యమాలు మరింత విస్తృతస్థాయిలో సంఘటిత ఉద్యమాలు గా రూపుదిద్దుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. దీనికోసం ప్రజా సమూహాల సమ్మతిని ప్రోది చేయాల్సిన ఆవశ్యకత ఉన్నది. ప్రభుత్వం చేస్తున్న అన్నిరకాల ప్రచారాలను ఎదుర్కోవాల్సి ఉన్నది. ఆ క్రమంలో న్యాయ సంబంధమైన కోణం లో కూడా హిందుత్వశక్తులను నిలువరించాలి. ఈ విధంగా ప్రజావ్యతిరేక, రాజ్యం గ వ్యతిరేక మూకలను సర్వశక్తులతో ఏకోన్ముఖంగా ఎదుర్కోవాలి. అయితే ఈ నిరసనోద్యమాలన్నీ తక్షణ స్పందనల్లోంచి ఉద్భవించిన ప్రజాస్పందనలుగా గుర్తించా లి. ఒక ఏకీకృత నాయకత్వం అంటూ లేకుండా ప్రజలంతా కలిసి నడుస్తున్న ఉమ్మ డి ఆగ్రహానికి ప్రతీకలు ఈ నిరసనోద్యమాలు. అయితే ఈ ఉద్యమాల వెనుక పౌరసంఘాలు, హక్కుల కార్యకర్తల ఉమ్మడి కృషిఎనలేనిది. ఈ నేపథ్యంలోంచే ఈ ఉద్యమాల్లో కార్యకర్తల బలం సమకూరుతున్నది. అయితే ఇప్పుడు కావల్సింది ఒక నాయకత్వం ఎదిగిరావటం, ఒక నిర్మాణం రూపొందటం. ఇది సాధ్యమైనప్పు డే దేశప్రజల ఉమ్మడి ఆకాంక్షల ప్రతిరూపంగా పటిష్టఉద్యమం రూపుదాల్చుతుంది. 

ఇప్పుడిప్పుడే నిరసనోద్యమాలు చేస్తున్న పౌరసంఘాల మధ్య సమన్వయ అవసరాన్ని వారు గుర్తిస్తున్నారు. కానీ రాజకీయపార్టీలు లేకుండా ఇది సాధ్యమేనా అన్నది ఉన్నది. రాజకీయనేతలే ప్రస్తుత సమస్యలన్నింటికీ కారణమన్న భావన ఒకటున్నది. ఈ నేపథ్యంలో రాజకీయపార్టీల పాత్రను అందరూ అంగీకరిస్తారా అన్నది కూడా సమస్యగా మారింది. అయితే కేరళలో పునరయి విజయన్‌, పశ్చిమబెంగాల్‌ మమతా బెనర్జీ సీఏఏ, ఎన్నార్సీలను తీవ్రంగా ప్రతిఘటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇలాంటి రాజకీయశక్తి, వాటి మధ్య సమన్వయంతోనే హిందుత్వ శక్తు ల దూకుడును నిలువరించవచ్చు అన్నది గుర్తెరగాలి. లేనట్లయితే ప్రభుత్వ యం త్రాంగం ముందు నిరసనోద్యమాల శక్తి బలహీనమై నీరుగారిపోకమానదు.

ఈ క్రమంలో ప్రభుత్వ యంత్రాంగంతో విప్లవాత్మక మార్పుల కోసం చేసే పోరాటాలు కూడా సంఘటితశక్తితో ఉద్యమించాల్సిన అవసరం ఉన్నది. ఈ క్రమంలో మావో సేటుంగ్‌ చెప్పినది గుర్తుంచుకోవాలి. విప్లవం అంటే విందు భోజనం కాదు. సున్నితమైనది కాదు. పూల అల్లికలా సున్నితమైనది కాదు. కఠినాత్మకమైనది. త్యాగాలతో కూడినది.. అని మావో విప్లవాల గురించి చెప్పారు. అయితే ఇప్పుడు దేశంలో చేస్తున్నది విప్లవ పోరాటం కాదు. మౌలిక మార్పుకోసం సాగుతున్న పోరా టం కాదు. కొన్ని విలువల కోసం, కొన్నివర్గాల పట్ల జరుగుతున్న వివక్షను రూపుమాపటం కోసం సాగుతున్న ప్రజాస్వామిక పోరాటం ఇది. దీనికోసం ప్రజలంతా ఏకతాటిపైకి రావాలి. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా వీధుల్లోకి విప్లవించాలి. ముస్లిం వర్గాలను బాధితులుగా చేస్తున్న విధానాలను నిలువరించాలి. అయితే ఇది ముస్లింవర్గాల సమస్య మాత్రమే కాదు, మొత్తం దేశ ప్రజల సమస్య. దీనితోనే మన రాజ్యాంగ విలువలను పరిరక్షించుకోగలుగుతాం. కొత్త సంవత్సరం ఈ స్ఫూర్తితో ముందుకుసాగుదాం. 

(‘ది వైర్‌' సౌజన్యంతో..) 


logo
>>>>>>