మంగళవారం 31 మార్చి 2020
Editorial - Jan 12, 2020 , 00:45:41

అంతిమ న్యాయం

అంతిమ న్యాయం

యావజ్జీవితం జైలులో మగ్గడం కూడా మరణశిక్ష లాంటిదే అని కొందరి అభిప్రాయం. మానవహక్కులపై నానాటికి పెరుగుతున్న అవగాహన వల్ల ఉరితీసే ప్రక్రియ దారుణంగా అమానవీయంగా ఉంటుందనే అభిప్రాయం ప్రబలుతున్నది. ఈ విధానంలో ఉరిశిక్ష అనుభవించే వ్యక్తి సుదీర్ఘమైన శారీరక, మానసిక బాధను హింసను అనుభవిస్తారని కొందరు మానవతావాదుల అభిప్రాయం. అయితే ప్రాణాంతక వాయువు లేక విద్యుతాఘాతంతో మరణశిక్ష అమలుజరిపే అవకాశమున్న అమెరికా, ఎత్తు నుంచి కిందకి తోసివేసి చంపే చట్టాలు గల ఇరాక్‌, బహిరంగ ప్రదేశంలో కాల్చిచంపే చైనా వంటి దేశాల భయానక శిక్షల కన్నా ఉరిశిక్షే మెరుగైందని కొందరి వాదన.


జనవరి 22న నిర్భయ దోషులకు ఉరిశిక్ష ఖరారైంది. ఈ నేపథ్యంలో ఉరిశిక్షల అమలుపై తీరుతెన్నులు, ప్రభుత్వ వైఖరి, అనుకూల, ప్రతికూల ప్రభావాలపై చర్చ తెరపైకి వచ్చింది.  ట్రయల్‌ కోర్టులో మరణశిక్ష ఖరారైన తర్వాత ధృవీకరణకు హైకోర్టుకు పంపాలి. ఆ తర్వాత బాధితుడు సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం ఉంటుంది. చట్టపరిధిలో విచార ణ పూర్తయినా క్షమాభిక్ష కోసం రాష్ట్రపతిని అభ్యర్థించవచ్చు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 72 (1) ద్వారా సంక్రమించిన అధికారాన్ని ఉపయోగిస్తూ రాష్ట్రపతి మరణశిక్షను నిలిపివేసే అవకాశం ఉన్నది. అన్నిదశల్లో విజ్ఞప్తులు, అప్పీళ్ళు చేసుకుంటూ పై రెండు ప్రక్రియలు పూర్తికానంతవరకు శిక్ష అమలుపరుచడానికి వీల్లేదు. దీర్ఘకాలం ఈ ప్రక్రియ కొనసాగడానికి ఇదే ముఖ్య కారణం. మరణశిక్ష విధించబడిన కొందరు ఖైదీలు శిక్ష  అమల్లో జరుగుతున్న జాప్యం వలన శిక్ష కోసం ఎదురుచూస్తూ 20 నుంచి 25 సంవత్సరాలు జైళ్లలో మగ్గుతున్న సందర్భాలున్నాయి.

మన రాజ్యాంగంలో పూర్తిగా అవసరమైన సందర్భాలలో తప్ప నిందితుడికి మరణశిక్ష విధించేంత తీవ్రస్థాయికి వెళ్ళకుం డా తగిన జాగ్రత్తలున్నాయి. అందుకే రాజ్యాంగంలోని ఆర్టిక ల్‌ 21 న్యాయసూత్రాల ప్రాతిపదికపై తప్ప ఏ వ్యక్తి  ప్రాణాన్ని, వ్యక్తిగత స్వేచ్ఛను హరించరాదు అని స్పష్టంగా చెబుతున్నది. అత్యంత అరుదైన సందర్భాల్లో మాత్రమే మరణశిక్ష విధించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

అయితే జీవించేహక్కును ఉల్లంఘించే వారిని అదే రూపం లో శిక్షించడాన్ని మరణశిక్ష ధ్రువపరుస్తుంది. డెత్‌ వారెంట్‌ అం టే ఒక వ్యక్తిని అతను చేసిన ఘోరమైన నేరానికి శిక్షగా న్యాయ ప్రక్రియ ద్వారా శిక్ష విధించడం. భారత్‌లో మరణశిక్ష విధించబడిన కేసులలో అధిక శాతం హత్య కేసులే.  మరణశిక్ష విధించిన కేసుల్లో కొన్నిటికి మాత్రమే ఆధారాలు లభ్యమవుతున్నాయి. హతులు, అనుమానితుల నుంచి సరైన ఆధారాలు సేకరించి, నిర్ధారణతో రాబట్టిన ఫలితాలను కోర్టుకు సమర్పించగలిగితే కేసులు బలపడుతాయి. పోలీసులు, ప్రాసిక్యూషన్‌, న్యాయవ్యవస్థల్లో అసలు దోషులను కనిపెట్టగలిగే పటిష్టమైన యంత్రాంగం ఉండాలి. నిర్భయపై లైంగికదాడి చేసిన నిందితులపై అన్నిస్థాయిలోనూ నేర నిర్ధారణ జరిగింది. ఈ నెల 22 న ఉరిశిక్ష అమలుచేయాలని పాటియాలా కోర్టు తీర్పు వెల్లడిం చింది.

ఏబీపీ న్యూస్‌, సీ-ఓటర్‌ నిర్వహించిన అధ్యయనంలో మహిళలపై లైంగికదాడులకు పాల్పడేవారికి మరణశిక్ష విధించాలని అధ్యయనంలో పాల్గొన్న 68 శాతం మంది మహిళలు అభిప్రాయపడ్డారు. మహిళలపై లైంగికదాడులు హత్యలకు పాల్పడిన దోషులపై సభ్యసమాజంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. లైంగికదాడి, పోక్సో చట్టం కింద నమోదైన కేసులలో దర్యాప్తు రెండు నెలల్లో పూర్తయ్యేలా, విచారణ ఆరు నెల ల్లో పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్టు కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్‌ప్రసాద్‌ ప్రకటించారు. ఇటువంటి కేసుల్లో నిందితులకు సత్వరమే శిక్షపడేలా ఆంధ్రప్రదేశ్‌ శాసనసభలో కూడా ఈ మధ్యనే విప్లవాత్మక బిల్లు ఆమోదించింది.

స్వతంత్ర భారతదేశంలో మరణశిక్షకు గురైనమొదటి దోషి మహాత్మాగాంధీ హత్య కారకుడు నాథూరామ్‌ గాడ్సే (1949, నవంబర్‌ 15). జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం వారి ప్రాజె క్ట్‌ 39 గణాంకాల ప్రకారం స్వాతంత్య్రం వచ్చిన తర్వాత సుమారు 720 ఖైదీలకు మరణశిక్ష అమలుచేయబడింది. అత్యధికంగా ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రం 354 మందిని ఉరి తీయగా, హర్యానాలో 90 మందిని, మధ్యప్రదేశ్‌లో 73 మందిని ఉరితీశారు. అయితే 1999- 2020 నేటివరకు అమలైనవి ఐదు మాత్రమే. మన దేశంలోనే కాదు, ప్రపంచవ్యా ప్తంగా చూస్తే అమలవుతున్న మరణశిక్షల సంఖ్య తగ్గుతూ వస్తున్నాయి.

ఉరిశిక్షలు అమలుపరిచేందుకు వృత్తిపరంగా శిక్షణ పొందిన వ్యక్తులు దొరుకడం నేటి సామాజిక వ్యవస్థలో గగనతలంగా మారింది. మనదేశంలో తలారీ వృత్తి వంశపారంపర్యంగా ఉన్నా ప్రస్తుత పరిస్థితులలో వారి లభ్యత కరువైంది. ఉత్తరప్రదేశ్‌లో మీరట్‌ జైల్లో పవన్‌ అనే తలారీ అధికారికంగా ఈ వృత్తిలో ఉన్నారు. ప్రస్తుతం 56 ఏళ్ల వయసున్న పవన్‌ నెలకు రూ.3 వేల జీతంతో పనిచేస్తున్నారు. సిమ్లాకు చెందిన రవికుమార్‌ అనే కూరగాయల వ్యాపా రి,  తిరువనంతపురం నుంచి రేమండ్‌ రాబిన్‌ డాన్‌స్టన్‌ అనే సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ నిర్భయ హంతకుల్ని  ఉరితీస్తానంటూ స్వచ్ఛందంగా ముందుకువచ్చారు. ఈ మేరకు వారు రాష్ట్రపతికి లేఖ రాశారు. సమాజాన్ని కలుషితం చేస్తున్న కలుపుమొక్కలను ఏరివేయడానికి స్వచ్ఛందంగా ముందుకు వస్తున్న అభినవ తలారుల కొత్త పోకడ ఇది.

అదేవిధంగా ఉరిశిక్ష అమలు చేయడానికి ఉపయోగించే తాడు కూడా కేవలం బీహార్‌లోని బక్సర్‌ సెంట్రల్‌ జైల్లో మాత్ర మే దొరుకుతుంది. నాథురామ్‌ గాడ్సే నుంచి నేటివరకు మరణ శిక్ష అనుభవించిన నేరస్థుల మెడకు చుట్టబడినవి బక్సర్‌ ఉరితాళ్లే. దీనికి కారణం మరెవరికీ ఉరితాళ్లు తయారుచేసే నైపు ణ్యం లేక కాదు. ఇతర ప్రాంతాల్లో వీటి తయారీపై నిషేధం బ్రిటిష్‌ కాలం నుంచి ఇప్పటివరకు కొనసాగుతున్నది. వీటి తయారీలో మెళకువలు తెలిసిన నలుగురు బస్తర్‌ జైలు సిబ్బం ది అక్కడి ఖైదీలకు శిక్షణనిస్తారు. జైలులో జీవితఖైదు అనుభవించే ఖైదీలు, ఉరిశిక్ష పడ్డ ఖైదీలను తాడు తయారీ పనిలో వినియోగిస్తారు. సత్ప్రవర్తన కలిగినవారికి శిక్ష కాలం తగ్గినట్లే, ఉరితాడు తయారుచేసే ఖైదీలకు కూడా వారి పని గంటల ఆధారంగా కొంతమేరకు శిక్ష కాలం తగ్గుతుంది.

ఉరిశిక్షకు ప్రత్యామ్నాయ మార్గాలపై చాలాకాలం నుంచి చర్చ జరుగుతున్నది. మరణశిక్ష విధించబడిన నేరస్థులకు సుప్రీంకోర్టు జీవితఖైదుగా మార్చిన సందర్భాలు చాలా ఉన్నా యి. యావజ్జీవితం జైలులో మగ్గడం కూడా మరణశిక్ష లాం టిదే అని కొందరి అభిప్రాయం. మానవహక్కులపై నానాటికి పెరుగుతున్న అవగాహన వల్ల ఉరితీసే ప్రక్రియ దారుణంగా అమానవీయంగా ఉంటుందనే అభిప్రాయం ప్రబలుతున్నది. ఈ విధానంలో ఉరిశిక్ష అనుభవించే వ్యక్తి సుదీర్ఘమైన శారీరక, మానసిక బాధను హింసను అనుభవిస్తారని కొందరుమానవతావాదుల అభిప్రాయం. అయితే ప్రాణాంతక వాయువు లేక విద్యుతాఘాతంతో మరణశిక్ష అమలుజరిపే అవకాశమున్న అమెరికా, ఎత్తు నుంచి కిందకి తోసివేసి చంపే చట్టాలుగల ఇరా క్‌, బహిరంగ ప్రదేశంలో కాల్చిచంపే చైనా వంటి దేశాల భయానక శిక్షల కన్నా ఉరిశిక్షే మెరుగైనదని మరికొందరి వాదన.

సంపూర్ణ అక్షరాస్యత సాధిస్తూ నైతిక విలువలతో పౌరులను గుణవంతులు, శీలవంతులుగా మార్చగలిగే విద్యావిధానాన్ని రూపకల్పన చేయదలచిన తెలంగాణ ప్రభుత్వ ఆదర్శాన్ని దేశమంతా గుర్తించి అమలుపరిచేలా చేయగలిగితే దేశం సుఖశాంతులతో వర్ధిల్లుతుంది. ఆ విధంగా యువతలో సత్ప్రవర్తన, నడవడిక పెరిగి, నేరాలు-ఘోరాలు తగ్గుతాయి. అప్పుడు కఠినమై న శిక్షలు, శిక్షా విధానాలు వాటంతటవే మరుగునపడుతాయ నటంలో సందేహం లేదు.


logo
>>>>>>