మంగళవారం 02 జూన్ 2020
Editorial - Apr 04, 2020 , 23:11:55

కర్మయోగి

కర్మయోగి

తెలంగాణ అతని ఇల్లు

ప్రజలకోసం 

పరిత్యాగమే అతని సంపద

పాడి.. పంట..

నీలి బంగారు కొలనులే 

అతని ఆత్మ బంధువులు

ఆకుపచ్చని ద్వీపకల్ప సౌధ

నిర్మాణమే అతని స్వప్నం..

ఆయుధం పట్టని న్యాయ ధీరుడు

ద్వేష రహిత దివ్యత్వ ఆరాధకుడు

జ్ఞాన విజ్ఞ జల పాఠాల బోధకుడు..

విపత్తుల కాలంలో 

 జన హృదయ సాంత్వనాపరుడు

మధుర భాషణ స్థితప్రజ్ఞుడు..

కల్లోల కరోనా నియంత్రణలో 

ధన్వంతరి చింతనాపరుడు

కల్లోలాలను కాళ్ల ముందు 

మోకరింప చేసుకునే మాన్వితుడు

నోవెల్‌ ఆచరణతో దేశమంతా 

వీస్తున్న ప్రచండ సమీరుడు

అసమాన ఆరాటాల పోరాటాలతో 

పునీత మాగాణ  ఉద్భవ కర్మయోగి

పశ్చిమ తూర్పు కనుమల

వింధ్య సాత్పురా పర్వతాల మధ్య

వెలుగుతున్న దక్కన్‌ పీఠభూమి శిఖరం

పావన నవజీవన నాగరికతకు 

జీవం పోసిన గోదావరి కృష్ణమ్మల 

ప్రక్షాళన ప్రాంతంలో 

సుశిక్షిత  ఫలాలను అందిస్తున్న 

చందన కల్పవృక్షమతడు


అస్నాల శ్రీనివాస్‌ 

9652275560


logo