మూల మలుపు పరిచయ సభ

Mon,September 10, 2018 12:54 AM

డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి కవితా సంకలనం మూల మలుపు 2018 సెప్టెంబర్ 16న సాయంత్రం 6 గంటలకు కరీంనగర్‌లోని ఫిలిమ్ భవన్‌లో జరుగుతుంది. అన్నవరం దేవేందర్ అధ్యక్షతన జరుగు సభలో గౌరవ అతిథులుగా గుడిపాటి, నగునూరి శేఖర్, కందుకూరి అంజయ్య హాజరవుతారు. బూర్ల వెంకటేశ్వర్లు పుస్తక పరిచయం చేస్తారు. కూకట్ల తిరుపతి, సి.వి. కుమార్ సమన్వయకర్తలుగా వ్యవహరిస్తారు.
- సాహితీ సోపతి, కరీంనగర్

నీళ్లలోని చేప ఆవిష్కరణ సభ

బాల సుధాకర్ మౌళి కవితా సంపుటి నీళ్లలోని చేప ఆవిష్కరణ సభ 2018 సెప్టెంబర్ 16న సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్, సుందరయ్య విజ్ఞానకేంద్రంలో జరుగుతుంది. కవి యాకూబ్ అధ్యక్షతన జరుగు సభలో ఎన్.వేణుగోపాల్, శ్రీరామోజు హరగోపాల్ వక్తలు గా హాజరవుతారు. కె.శివారెడ్డి పుస్తకాన్ని ఆవిష్కరిస్తారు.
- కవి సంగమం

నిశ్శబ్ద యుద్ధం ఆవిష్కరణ సభ

గొట్టిపర్తి యాదగిరిరావు కవిత్వ సంపుటి నిశ్శబ్ద యుద్ధం ఆవిష్కరణ సభ 2018 సెప్టెంబర్ 10న సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్, రవీంద్రభారతి కాన్ఫరెన్స్ హాల్‌లో జరుగుతుంది. డాక్టర్ పాలకుర్తి మధుసూధన్‌రావు అధ్యక్షతన జరుగు సభలో వక్తులుగా చింతపట్ల సుదర్శన్, ఎం. నారాయణ శర్మ హాజరవుతారు. గౌరవ అతిథులుగా డాక్టర్ నందిని సిధారెడ్డి, మామిడి హరికృష్ణ పాల్గొంటారు. వి. ప్రకాశరావు పుస్తకాన్ని ఆవిష్కరిస్తారు.
- పాలపిట్ట బుక్స్, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ

రచనలకు ఆహ్వానం

మధురవాణి. కామ్ త్రైమాసిక అంతర్జాల సాహిత్య పత్రిక కోసం కథలు, కవితలు, వ్యాసాలు ఆహ్వానిస్తున్నాం. రచనలు గతంలో ఎక్కడా ప్రచురణ కానివే పంపించాలి. రచనలు 2018సెప్టెంబర్ 20లోగా పంపించాలి. సమయాభావం వల్ల రచనలు యూనికోడ్‌లో టైప్ చేసిన(గూగుల్, లేఖిని) వాటినే స్వీకరిస్తాం. చిరునామా: sahityam@madhuravani.com, కథామధురాలు-katha@ madhuravani.com, కవితావాణి-kavitha@madhuravani. com కు పంపించాలి.
- రాజు వంగూరి

649
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles