ముగింపుకు ముందు

Mon,August 27, 2018 04:46 AM

ఆరేండ్ల క్రితం చంద్రశేఖరరావు రాసిన ఒక కథ పేరు ముగింపుకు ముందు. అయితే అదే పేరుతో కథా రచయిత మరణానంతరం ముగింపుకు ముందు పేరుతో వచ్చిన కథాసంకలనం ఇది. చంద్రశేఖరరావు కథలు ఆయనలోని నిశ్శబ్దాలు, సంచలనాలు, నిలువనీయని ఉద్వేగాలు, నడిచివచ్చిన కాలాన్ని, మనుషుల కలల్ని, గాథల్ని, గాయాల్ని రికార్డు చేశాయి.
రచన:డాక్టర్ వి. చంద్రశేఖరరావు, వెల: రూ.100,
ప్రతులకు: విశాలాంధ్ర పుస్తక కేంద్రాలు


మాయ జలతారు

సమకాలీన సమాజానికి దర్పణంగా సలీం కథలు ఉంటాయి. ఆధునిక సమాజంలో మనుషులు తమదైన మూలాల్లోంచి కృషించి పోతున్న వైనాన్ని సలీం కథలు చాటి చెబుతాయి. సామాజిక సంఘర్షణలు, మనుషుల అంతస్సంఘర్షణల సుడిగుండం లాంటి జీవితాల ప్రతిఫలనాలే ఈ కథలు.
రరచన: సలీం, వెల: రూ.150, ప్రతులకు:సలీం, ఫ్లాట్ నెం:బి2/206,
లక్ష్మినారాయణ అపార్ట్‌మెంట్స్, 3-6-164, హిమాయత్‌నగర్,
హైదరాబాద్-29. ఫోన్:7588630243


ప్రతిధ్వని (సాహిత్య వ్యాసాలు)

కవి, విమర్శకుడు డాక్టర్ దిలావర్ రాసిన సాహిత్య వ్యాసాల సంపుటి ఇది. ఇందులో రచయిత తనదైన దృష్టికోణంతో ఆయా సాహిత్య ఖండాలను ఎలా ఆస్వాదించారో, అనుభూతి చెందారో, ఎంతగా తల్లడమల్లడమయ్యారో తన వ్యాసాల్లో చెప్పారు. ఆ తన్లాట వినాల్సింది, చూడాల్సింది.
రచన: డాక్టర్ దిలావర్, వెల: రూ. 100, ప్రతులకు: ఎండీ అక్బర్,
ఎస్‌ఐఐఎల్ క్యాంపస్, గాంధీనగర్, పాల్వంచ,
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా-507154


కవి విశ్వంభరుడు

మనసు దోచుకున్న వన్నెల దొరసానితో వెండితెరనేలిన పాటల నెలరేడు, కొనగోటిమీది జీవితాన్ని నాగార్జునసాగరమంతా ఎత్తుకు చేర్చిన జ్ఞానపీఠం సినారె. పల్లెటూరిలో పుట్టి పరిపాలనాధికారిగా, ఆచార్యునిగా, ఉపకులపతిగా, అధికార భాష సంఘం , భాషా సాంస్కృతిక మండలి వంటి సంస్థలకు అధ్యక్షులుగా సేవలు అందించడంతో పాటు, ప్రతిష్టాత్మక తెలంగాణ సారస్వత పరిషత్‌కు అధ్యక్షులుగా ఉన్న మహాకవి, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత డా.సి.నారాయణరెడ్డి. ఆయన 87వ జన్మదినాన్ని పురస్కరించుకుని మేడ్చల్, మల్కాజిగిరి జిల్లా రచయితల సంఘం 87మంది కవులచే తీసుకువచ్చిన కవితా సంకలనం కవి విశ్వంభరుడు.
సంకలనకర్త: గోగులపాటి కృష్ణమోహన్, వెల: రూ.100, ప్రతులకు: అధ్యక్షులు,
మేడ్చల్ మల్కాజిగిరి రచయితల సంఘం, 3-160,క్వా.నెం-918, సూరారం కాలనీ,
కుత్బుల్లాపూర్ సర్కిల్, మేడ్చల్‌జిల్లా-55, 9700007653

686
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles