సాహితీ సవ్యసాచి ద్వా.నా.శాస్త్రి

Mon,August 28, 2017 01:37 AM

1972 నుంచి నేటి వరకు విభిన్న పత్రికల్లో వేలాది పుస్తక సమీక్షలు చేస్తున్న ఏకైక వ్యక్తి ద్వానాశాస్త్రి. వందేళ్లనాటి ఛాయా చిత్రాలు, అరుదైన పుస్తకాలు, అలనాటి విశేష కవితలు, వెలుగులోకి ఆయన తీసుకువచ్చారు. ద్వానా రాసిన తెలుగు సాహిత్య చరిత్ర పది ముద్రణలు పొందింది.
madhukar
తెలుగులో విమర్శనాత్మక సాహిత్యం కొరవడిన సమయంలో ఆయన తన కళాన్ని ఝళిపించినవాడు. నాలుగున్నర దశాబ్దాలుగా ఎత్తిన కలం దించకుండా విమర్శనారంగంలో నిరంతర కృషి చేస్తున్నవా డు. ఆయన వ్యాసాలు రచయిత హృదయావిష్కరణకు అద్దంపడుతాయి. ప్రాచ్యలక్షణ పరిజ్ఞానాన్ని, పాశ్చాత్య వివేచనాన్ని సమన్వయిస్తూ ఆధునిక పాఠకులకు అవలీలగా అర్థమయ్యే రీతిలో వివరించడంలో ఆయనది అనుభవమున్న కలం. వస్తు వైవిధ్యం, సామాజిక స్పృహ, స్పష్టత నిండిన కవిత్వాన్ని అం దించడంలో ఆయనకు ఆయనే సాటి. శతాధిక రచనలు, అంతకుమించిన పురస్కారాలు అందుకున్న సాహితీ సవ్యసాచి ద్వాదశి నాగేశ్వర శాస్త్రి.

ద్వానాశాస్త్రి కోస్తాంధ్ర ప్రాంతానికి చెంది నవాడు కానీ హైదరాబాద్‌లో స్థిరపడటమే కాకుండా తెలంగాణ ప్రాంత కవులు,సాహిత్యాన్ని ప్రేమించినవాడు. తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను సమర్థించడమే కాకుండా సభ లు, సమావేశాల్లో పాల్గొన్నవాడు. తెలంగాణకు జై కొట్టి తెలంగాణ సాహితీకారులను, ఇక్కడి సాహితీ సంపదను పరిచయం చేస్తూ రచనలూ చేయడం విశేషం.1970లో రచనా వ్యాసంగంలోకి అడుగుపెట్టిన ద్వానాశాస్త్రి విమర్శనా సాహిత్యానికి పెద్దపీట వేస్తూ అనేక వ్యాసాలు, పుస్తకాలు రాశారు. వివిధ పత్రికలు, పుస్తకా ల్లో వేలాది వ్యాసాలూ రాశారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే వ్యక్తిత్వం ద్వానా సొంతం. కవి, పరిశోధకుడు, రచయిత, విమర్శకుడిగా ఎన్నో రచనలు చేసినప్పటికీ ఎక్కడకూడా దర్పాన్ని ప్రదర్శించని నిగర్వి. గడిచిన 46 ఏండ్లుగా వేలాది వ్యాసాలు, పుస్తకాలు ఆయన ప్రచురించారు.

సమాధిలో స్వగతాలు-వచ న కవిత, వాఙ్మయ లహరి- వ్యాససంపుటి, సాహిత్య సాహి త్యం - వ్యాస సంపుటి, మారేపల్లి రామచంద్ర కవితా సమీక్ష-ఎం.ఫిల్. సిద్ధాంత వ్యాసం, ద్రావిడ సాహిత్య సేతువువ్యాస ద్వాదశి, వ్యాస సంపుటి అక్షర చిత్రాలు, అరుదైన ఛాయాచిత్రాలు సాహిత్య సంస్థలు - పీహెచ్‌డీ సిద్ధాంత వ్యాసం, ఆం ధ్ర సాహిత్యం, మన తెలుగు తెలుసుకుందాం, ద్వానా కవిత లు, శతజయంతి సాహితీమూర్తులు సంపాదకత్వం,తెలుగు సాహిత్య చరిత్ర, నానీలలో సినారె, సినారె కవిత్వంలో ఉక్తులు, సూక్తులు ఇలా వందకు పైగా పుస్తకాలు ఆయన కలం నుంచి పురుడుపోసుకున్నాయి. ఆయన 800 పేజీల తెలుగు సాహిత్య చరిత్రతో సహా యాభైకి పైగా గ్రంథాలు, వెలకొద్దీ వ్యాసాలూ, రెండువేల సమీక్షలు రచించారు.

ద్వానా శాస్త్రి తన రచనల్లో తెలంగాణ సాహిత్యానికి పెద్దపీ ట వేశారు. అసలైన తెలుగు పదాలు తెలంగాణ మాండలికంలోనే కనిపిస్తాయని, మిగిలిన తెలుగు ప్రాంతంలో సంస్కృత పదాలు కనిపిస్తాయని ద్వానా అంటారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలో తెలంగాణ సాహితీ మిత్రులను ఈ లోకానికి పరిచయం చేస్తూ తెలంగాణ సాహిత్య రత్నాల వీణ పేరుతో ద్వానాశాస్త్రి ప్రత్యేక సంచిక తీసుకువచ్చా రు. పాల్కుర్కి సోమన నుంచి నందిని సిధారెడ్డి వరకు సుమారు 110 మంది కవులు, రచయితలు, వారి రచనలను పరిచయం చేస్తూ ఈ పుస్తకాన్ని తీసుకురావడం విశేషం. దీన్ని ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్యకు అంకితమిచ్చారు. నవ కవితాజలధి దాశరథి పేరుతో దాశరథి వ్యక్తిత్వం, రచనలు, ఉద్యమ నేపథ్యం తదితర అంశాలతో 2011లోనే ఆయన పుస్తకాన్ని తీసుకువచ్చా రు.

దీన్ని ఆయన సతీమణి లక్ష్మికి అంకితమిచ్చారు. తెలంగాణ పోటీ పరీక్షలకు వెళ్లే విద్యార్థులకు, ఉద్యోగార్థులకు ఉపయోగపడే తెలంగాణ సాహితీ సంపద పేరుతో మరో సంచికను తీసుకురావడంతో పాటు దాన్ని మలి తెలంగాణ ఉద్యమంలో తొలి అమరవీరుడు శ్రీకాంతాచారికి అంకితమిచ్చాడు. ద్వానాశాస్త్రి హైదరాబాద్ వచ్చి స్థిరపడిన తర్వాత ఇదే తన పుట్టినూరు అని నమ్మారు. కవి శ్రీనాథుడు తన కాశీఖండంలో ఉన్న ఊ రు కన్నతల్లి ఒక్కరూపు అన్న మాటలను స్ఫూర్తిగా తీసుకున్న ద్వానా తెలంగాణ కవులతో మమేకం కావడంతో పాటు ఇక్కడి సాహితీ సంస్థలతోనూ కలిసి పనిచేశారు. ఉద్యమ నేపథ్యాన్ని గమనించిన ఆయన తెలంగాణ ఉద్యమం సమంజసమైనదేన ని విశ్వసించడమేకాకుండా ప్రజలు కోరుకుంటున్నపుడు అంగీకరించవలసిందే అని ఉద్యమకారుల పక్షాన నిలిచారు.

1972 నుంచి నేటి వరకు విభిన్న పత్రికల్లో వేలాది పుస్తక సమీక్షలు చేస్తున్న ఏకైక వ్యక్తి ద్వానాశాస్త్రి. వందేళ్లనాటి ఛాయా చిత్రాలు, అరుదైన పుస్తకాలు, అలనాటి విశేష కవితలు, వెలుగులోకి ఆయన తీసుకువచ్చారు. ద్వానా రాసిన తెలుగు సాహి త్య చరిత్ర పది ముద్రణలు పొందింది. కీర్తిశేషులైన 62 మంది సాహితీ ప్రముఖుల జీవిత విశేషాలను వారి కూతుళ్లు, కుమారులచే సేకరించి మా నాన్నగారు పేరిట పుస్తకంగా వెలువరించారు. పోటీ పరీక్షలలో తెలుగు భాషా సాహిత్యాలపై ఎనిమిది పుస్తకాలు రాశారు, ప్రాచీన కవిత్వంలో వ్యక్తిత్వ వికాసం ఉందని మొదట పుస్తకం రాసింది ద్వానానే. ప్రాచీన కాలం నుంచి నేటి వరకు సాహిత్యంలో గల హాస్యనిధిని తెలుగు సాహిత్యంలో హాస్యామృతం పేరుతో పుస్తకంగా తీసుకొచ్చారు.

డాక్టర్ ద్వాదశి నాగేశ్వర శాస్త్రి (ద్వా.నా.శాస్త్రి) సాహిత్యంలో పలు ప్రయోగాలు చేసి అంతర్జాతీయ రికార్డులు సొంతం చేసుకున్నారు. ఏకధాటిగా 12 గంటల పాటు తెలుగు భాషా సాహిత్యాలపై ప్రసంగించి ప్రపంచ రికార్డు నెలకొల్పారు.ద్వానా శాస్త్రి 2014లో శతక సాహిత్యంలో వ్యక్తిత్వ వికా సం అనే అంశం మీద 188 నిమిషాల పాటు ప్రసంగం ద్వారా జీనియస్ బుక్ రికార్డ్, 2015లో పలకరిస్తే ప్రసంగం పేరుతో 6 గంటల నిర్విరామ ప్రసంగంతో వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నారు.
-మధుకర్ వైద్యుల, 9182777409

1390
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles