మహాకూటమి విచిత్ర విన్యాసం

Wed,September 12, 2018 11:33 PM

అప్పుడు టీడీపీతో పొత్తుపెట్టుకోవడం ఉద్యమ ఎత్తుగడలో భాగమే తప్పా అధికారం కోసమో, పదవుల కోసమో కాదు. 2009 వరకూ టీడీపీ కరుడుగట్టిన సమైక్యవాది. ఇలాంటి పరిస్థితిలో కరుడుగట్టిన టీడీపీని సమైక్యవాదం నుంచి బయటకు లాగి తెలంగాణకు సానుకూలంగా ఉందని చెప్పించాలన్న ఎతుగ్తడలో భాగమే అప్పటి పొత్తు.

రాష్ర్టాన్ని సాధించుకోవడంతోనే అయిపోలేదు. కొట్లాడి తెచ్చుకు న్న రాష్ర్టాన్ని ఓ వైపు బంగారు తెలంగాణగా మార్చుకునే యజ్ఞం చేస్తూనే మరోవైపు రాష్ర్టాన్ని సమైక్యవాదుల కుయు క్తుల నుంచి కాపాడుకోవాల్సిన గురుతర బాధ్యత కూడా మనపై ఉన్నది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విఫలయత్నమని విషప్రచారం చేయడానికి మన వ్యతిరేకులు ఎప్పటికీ మన చుట్టే ఉంటారు. ఇక ముందు కూడా మనం ఎన్నో కుట్రలను ఎదుర్కోవడానికి సన్నద్ధంగా ఉండాలి.. తెలంగాణ వచ్చిన తొలిరోజుల్లో కేసీఆర్ అన్న మాటలివి. ఆయన అన్నవిధంగానే రాష్ట్రం వచ్చిన నాలుగున్నరేండ్ల తర్వాత సరిగ్గా మరో తెలంగాణ వ్యతిరేక కుట్రకు తెరలేచింది. ఎన్నికల వేళ ఇప్పుడు తెలంగాణ వ్యతిరేక శక్తులంతా కలిసి అధికారం, పదవుల కోసం సిద్ధాంతాలను గాలికొదిలేసి అవకాశవాద పొత్తులకు తెగబడుతున్న విచిత్ర రాజకీయ విన్యాసం ఈ కుట్రలో భాగమే. నైతికత, పొంతన లేని పొత్తుతో మహాకూటమిగా ఏర్పడి తెలంగాణ సమాజ శ్రేయస్సే ఏకైక లక్ష్యంగా పాలన సాగిస్తున్న కేసీఆర్ ప్రభుత్వాన్ని కూలదోసే విఫల ప్రయత్నం చేస్తున్నరు. అధికారంలోకి రావడం, పదవులు పంచుకోవ డం కోసం కరుడుగట్టిన తెలంగాణ వ్యతిరేకి చంద్రబాబు పంచన చేరి ఆయన చెప్పిన విధంగా ఏపీకి మేలుచేస్తూ తెలంగాణకు వంచన చేయడానికి పరస్పర విరుద్ధ సిద్ధాంతాలు కలిగిన కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, కోదండరామ్ పార్టీలు కలిసి ఒకే జెండాగా మారిన పరిణామం రాజకీయ దిగజారుడుతనానికి పరాకాష్ట తప్ప మరొకటి కాదు. అసలు ఈ అక్రమ పొత్తులకు ప్రాతిపదిక ఏమిటి?. ఎందుకు కలి సిపోతున్నారు?. ఈ అపవిత్ర కలయికపై ప్రజలకు ఏం చెప్పదల్చుకున్నారు?.

టీడీపీ కాంగ్రెస్ వ్యతిరేక పునాదులపై పురుడుపోసుకున్న పార్టీ. కాంగ్రె స్‌ను రాష్ట్రం నుంచే కాదు, దేశం నుంచే తరిమికొడితే తప్ప ప్రజలు బాగుపడరని ఎన్టీఆర్ చెప్పని రోజే లేదు. అంతటితో ఆగకుండా జాతీయ స్థాయిలో కాంగ్రెస్ వ్యతిరేకశక్తులను ఏకం చేయడానికి ఆయన ఎంతో కృషిచేశారు. అలాంటి ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ నేడు కాంగ్రెస్‌తో అక్ర మపొత్తుకు సిద్ధమవుతుంటే ఆయన ఆత్మ ఎంత ఘోషిస్తుందో మాటల్లో చెప్పలేను. విద్యుత్ చార్జీలు తగ్గించమన్న పాపానికి బషీర్‌బాగ్ చౌరస్తాలో ముగ్గురు రైతులను కాల్చిచంపిన చరిత్ర చంద్రబాబుది. ఇది టీడీపీ సర్కా ర్ రాక్షసత్వానికి పరాకాష్ట అని విమర్శిస్తూ కాంగ్రెస్, సీపీఐ నాయకులు ఏటా బషీర్‌బాగ్‌లో అప్పటి అమరులకు నివాళులర్పిస్తున్నారు?. ఇలాంటి స్థితిలో ఈ రెండు పార్టీలు టీడీపీతో పొత్తుపెట్టుకోవడం చనిపోయిన రైతు ల ఆత్మలను ఘోష పెట్టడం కాదా?. పొత్తు పెట్టుకోవడం ద్వారా నాటి టీడీపీ ముష్కర చర్యను కాంగ్రెస్ ఇప్పుడు సమర్థిస్తున్నదని ఎందుకు అను కోకూడదు. కాంగ్రెస్ హయాంలో జరిగిన ముదిగొండ కాల్పుల్లో పేద వర్గాలకు చెందిన 9 మంది అసువులు బాసారు. ఈ ఘటన కాంగ్రెస్ కిరా తక పాలనకు పరాకాష్ట అని అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ దుమ్మెత్తి పోసింది. అలాంటి కిరాతక కాంగ్రెస్ పార్టీతో ఇప్పుడు టీడీపీ దేనికోసం జట్టుకడుతున్నది. జలయజ్ఞం పేరుతో లక్ష కోట్లు దోపిడీ చేసి దాన్ని ధన యజ్ఞంగా మార్చారని అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్‌ను తిట్టిన తిట్టు తిట్టకుం డా ఆరోపణలు చేయడమే కాకుండా రాజా ఆఫ్ కరప్షన్ పేరుతో పుస్తకా లు ముద్రించి గల్లీ నుంచి ఢిల్లీ వరకు పంచిన టీడీపీకి ఇప్పుడు కాంగ్రెస్ అవినీతి పార్టీగా కనబడటం లేదా?. ఇప్పటివరకూ పాము, ముంగిసల మాదిరిగా కొట్టుకుంటూ పరస్పర వ్యతిరేక రాజకీయాలు చేస్తూ వచ్చిన కాంగ్రెస్, టీడీపీలు ఈ రోజు సిద్ధాంతాలకు ఉప్పు పాతరేసి ఒకే వేదికను పంచుకోవడాన్ని పరమ అపవిత్రమనక ఏమనాలి?.

చంద్రబాబుకు తెలంగాణ పట్ల ఏమాత్రం ప్రేమ ఉండదు. హైదరాబా ద్ నుంచి సాగనంపారనే కసి ఆయనలో ఇంకా ఉన్నది. ఏ చిన్న అవకాశం దొరికినా తెలంగాణను దెబ్బతీయడానికే కుట్ర పన్నుతారు. అలాంటి వ్యక్తి నాయకత్వంలోని టీడీపీతో పొత్తుపెట్టుకుంటున్న కాంగ్రెస్ అధిష్ఠానం ఢిల్లీలో ఉంది. ఈ అక్రమ పొత్తు తర్వాత కాంగ్రెస్ అధిష్ఠానం ఢిల్లీతో పాటు అమరావతిలో కూడా ఉంటుంది. భూప్రపంచం బద్దలయ్యేలా ఏదైనా అద్భుతం జరిగి ఒకవేళ కాంగ్రెస్ అధికారం చేపడితే ప్రభుత్వాన్ని నడిపించేది బాబే కదా?. తెలంగాణ హక్కులను హరిస్తూ కృష్ణా, గోదావరి జలాలను ఏపీకి మళ్లించమని హుకుం జారీ చేస్తడు. ఆయనకు కావాల్సిన పనులన్నీ ఇక్కడి ప్రభుత్వంతో చేయించుకుంటూ తెలంగాణ ప్రజల నోట్లో మట్టి కొడుతడు. తెలంగాణ మీద వీసమంత ప్రేమ కూడా లేని కాంగ్రెస్ బాబు తానా అంటే తందాన అనే రకమే. ఎందుకంటే ఇక్కడి కాంగ్రెస్ నాయకులకు తెలంగాణ సోయి లేదు. ఎందుకంటే మహారాష్ట్ర ప్రభుత్వం గోదావరిపై బాబ్లీ వంటి అక్రమ ప్రాజెక్టులు నిర్మిస్తుంటే ఉమ్మడి ఆంధ్రపదేశ్, మహారాష్ట్రలతో పాటు ఢిల్లీలో అధికారంలో ఉండి కూడా అడ్డు చెప్పకుండా జీ హుజూర్ అన్న బానిస మనస్తత్వమే ఇందుకు నిదర్శ నం. కానీ టీఆర్‌ఎస్ ఆలోచనంత తెలంగాణ ప్రయోజనాలే. కేవలం రాష్ట్ర అభివృద్ధినే గిరిగీసుకున్న పార్టీ ఇది. కాంగెస్ బాస్‌లు ఢిల్లీలో, టీడీపీ బాస్ లు అమరావతిలో ఉంటే టీఆర్‌ఎస్ బాస్‌లు తెలంగాణలోనే ఉంటరు. జాతీయవాదాన్ని బలపరుస్తూనే తెలంగాణ అభివృద్ధిని, ప్రజల సంక్షేమా న్ని నెతిక్తెత్తుకున్న ఏకైక పార్టీ టీఆర్‌ఎస్. అయితే పొత్తులపై చర్చ జరిగే సందర్భాల్లో 2009 ఎన్నికల్లో టీడీపీతో టీఆర్‌ఎస్ పొత్తుపెట్టుకోలేదా? అనే ఒక వితండవాదం కొందరు వినిపిస్తున్నారు. ఇది వారి అవగాహనా రాహిత్యానికి నిదర్శనం. అప్పుడు టీడీపీతో పొత్తుపెట్టుకోవడం ఉద్యమ ఎత్తుగడలో భాగమే తప్పా అధికారం కోసమో, పదవుల కోసమో కాదు. 2009 వరకూ టీడీపీ కరుడుగట్టిన సమైక్యవాది. ఇలాంటి పరిస్థితిలో కరుడుగట్టిన టీడీపీని సమైక్యవాదం నుంచి బయటకు లాగి తెలంగాణకు సానుకూలంగా ఉందని చెప్పించాలన్న ఎతుగ్తడలో భాగమే అప్పటి పొత్తు. కానీ ఇప్పటి కాంగ్రెస్, టీడీపీల పొత్తు మాత్రం రాజకీయ అవకాశ వాదమే. ఈ పొత్తుల పట్ల తెలంగాణ ప్రజలు అప్రమత్తం కావాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. తెలంగాణ వ్యతిరేకులంతా కొత్త వేషంతో వస్తున్నది ప్రజ లపై కక్షతోనే తప్ప ప్రేమతో కాదు. కేవలం అధికారం, పద వుల కోసం సిద్ధాంతాలను గాలికొదిలి, జెండాలను పక్క నపెట్టి స్వార్థ రాజకీయ అజెండాతో వస్తున్న వారికి తెలంగాణ సమాజం సరైన రీతిలో గుణపాఠం చెప్పబోతున్నది.
prabhakar
ఎన్ని కుయుక్తులకు పాల్పడిన కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, కోదండరామ్ పార్టీలు అక్రమ పొత్తు చిత్తుకాక తప్పదు. ఇక్కడ మరో విషయం. ఎన్ని కలు వస్తున్న తరుణంలో ఈ పథకం బాగా లేదనో, అభివృద్ధి జరుగలేద నో విపక్షాలు విమర్శించడం సహజం. కానీ ఇక్కడి కాంగ్రెస్ నాయకులు టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏ రంగంలో విఫలమైందో చెప్పలేని పరిస్థితి. పథ కాల గురించి మాట్లాడటానికి, ప్రభుత్వ పనితీరు గురించి మాట్లాడటానికి ఏమీ లేకపోవడంతో పదేపదే కేసీఆర్‌ది నియంతృత్వ పాలన అంటూ ఆడి పోసుకోవడం వారి దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం. ఈ సందర్భం గా కాంగ్రెస్ నాయకులను నేను ఒక్కటే డిమాండ్ చేస్తున్నాను. మీ దృష్టి లో అసలు నియంతృత్వ పాలన అంటే ఏమిటి? కోటి ఎకరాలకు సాగు నీరిచ్చేలా ప్రాజెక్టులు కట్టడమా?. 52 లక్షల మంది రైతులకు ఎకరానికి ఏడాదిలో రూ.8 వేల చొప్పున పెట్టుబడి సమకూర్చడం, రైతులందరికీ బీమా సౌకర్యం కలిపించడమా?. ఇంటింటికీ మంచి నీళ్లిచ్చే మిషన్ భగీర థ, మీ హయాంలో ధ్వంసమైన చెరువులను పునరుద్ధరిస్తున్న మిషన్‌కాక తీయ, పింఛన్ల పెంపు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, హాస్టళ్లకు సన్నబి య్యం, మూడు కోట్ల 80 లక్షల మందికి కంటి పరీక్షలు చేయించడం మీ దృష్టిలో నియంతృత్వ పాలననా?. అహంకారంతో కండ్లు మూసుకుపో యిన కాంగ్రెస్ నాయకులు కంటి పరీక్షలు చేయించుకొని కుటిలబుద్ధిని మార్చుకోవాలి. ఈ సందర్భంగా నేను తెలంగాణ ప్రజలకు చేసే విన్నపం ఏమంటే కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, కోదండరామ్ పార్టీల నయా కుట్రలను తిప్పికొట్టడానికి సమాయత్తం కావాలి. అవకాశవాద, అక్రమ, అపవిత్ర పొత్తులతో వస్తున్న కాంగ్రెస్, టీడీపీ తదితర పార్టీలకు తెలంగాణ ప్రజలు చుక్కలు చూపించడానికి సిద్ధంగా ఉన్నరు. కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, కోదండరామ్ పార్టీల మహాకూటమి వారికి ఓ మహా ఓటమిగా చేదు అనుభవాన్ని మిగిలిసు్ంతది.
(వ్యాసకర్త: శాసనమండలి సభ్యుడు)

602
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles