మట్టి గణపతి జిందాబాద్

Wed,September 12, 2018 01:09 AM

గణపతి బప్పా మోరియా..!
మట్టి గణపతి మేలయ్యా..!
ఆకులలములతో పూజించేటి
దేవునికెందుకు రంగులయా!
బుద్ధికి రూపం సిద్ధి గణపతి
చెరువుకు ఊతం రేగడి మట్టి
రసాయనాలు రంగులు లేని
మట్టి గణపతిని సిద్ధం చేద్దాం
చెరువులు, వాగులు, చెల్కల్ని
స్వచ్ఛ జలాలతో నింపేద్దాం
మట్టి గణపతి జిందాబాద్!
స్వచ్ఛ గణపతి జిందాబాద్!
Matti-Ganapathi

అవగాహన కల్పించాలె

ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కు గొప్ప ఆయుధం లాంటిది. అంత
విలువున్న ఓటు హక్కు గురించి ప్రజల్లో చైతన్యం కల్పించాల్సిన అవసరం
ఎన్నికల కమిషన్‌పై ఉన్నది. కొందరు నిరక్షరాస్య ఓటర్లకు ఈవీఏంలపై సరిగ్గా అవగాహన లేకపోవడంతో ఒకరికి వేయాల్సిన ఓటు ఇంకొకరికి వేస్తున్నారు. ఈవీఏంలు వచ్చి ఏండ్లు
గడుస్తున్నా ప్రజలకు ఈవీఏంలపై సరైన అవగాహన కల్పించకపోవడం అధికారుల వైఫల్యమే. కాబట్టి ఇప్పటికైనా
అధికారులు చర్యలు తీసుకొని ఈవీఏంలపై ప్రజలకు చైతన్యం కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.
- షేక్ అస్లాం షరీఫ్, శాంతినగర్

161
Tags

More News

VIRAL NEWS