బాధ్యతల సంస్కృతి ఎప్పటికి వచ్చేను?

Thu,January 12, 2017 01:01 AM

తెలంగాణ వంటి ఉద్యమాలలో పాల్గొనే వారిలో మూడు విధాలైన వారుంటారు. ఒకటి-కేవలం స్వప్రయోజనాలవారు. రెండు-స్వప్రయోజనాలతో పాటు తెలంగాణ ప్రయోజనాలను కలగలిపి చూసేవారు. మూడు-కేవలం తెలంగాణ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునేవారు.ఉద్యమంలో పాల్గొనే వారిలో ఎవరేమిటన్నది ఉద్యమ కాలంలో అంత స్పష్టంగా తెలిసిరాదు.

రైతు దేశానికి వెన్నెముక,అన్నదాతే కాడు. ఉపాధ్యాయుడు, జ్ఞానదాత కూడా. కనుక తాను వీలైనంత పరిహారం కోరవచ్చుగాని ప్రాజెక్టులే వద్దనడు. రాజకీయ స్వప్రయోజనాల కోసం చతురమైన రీతిలో రకరకాల సాకులు చెప్పి అడ్డుపడే
నాయకుల వలె వ్యవహరించడు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నపుడు ఏ విధంగానైతే స్వప్రయోజనాలను, తెలంగాణ సామూహిక ప్రయోజనాలను కలగలిపి చూసాడో, అదే స్పృహను రాష్ట్రం ఏర్పడిన గత రెండున్నరేండ్లుగా కూడా చూపుతున్నాడు.

ఉద్యమ కాలంలో ఎవరేమిటన్నది తెలియకపో వటానికి రెండు కారణాలుంటాయి. మొదటిది-అప్పుడది ఒక వెల్లువ కావటం. అందరికి సంబంధించిన అన్ని ప్రయోజనాలు ఆ వెల్లువలో కలగలిసిపోయి సాగటం. ఎవరి ప్రయోజనాలకు వాటిగా ప్రత్యేక గుర్తింపులున్నా, అవి ప్రత్యేక పాయలుగా ఉండవు. మౌలిక ఉద్యమంలో ఒదిగిపోతాయి. సమస్య మౌలికంగా పరిష్కారమైనప్పుడు ఆయా విడివిడి సమస్యలు కూడా పరిష్కా రం కాగలవని భావిస్తాయి. కనుక పైన పేర్కొన్న మూడు విధాలైన వారూ ఆ మహా వెల్లువలో కలగలిసి పోయి భాగస్వాములవుతారు. కాని వారిలో నిజంగా ఎవరేమిటన్నది తెలిసేది ఉద్యమాలు తమ లక్ష్యా న్ని చేరుకున్న తర్వాతి కాలంలోనే.

ఇక్కడ సందర్భవశాత్తు తెలంగాణను ప్రస్తావించాము గాని, ఇదే స్థితి దాదాపు అంతటా కన్పిస్తుంది. ఉదాహరణకు భారతదేశపు స్వాతంత్రోద్యమాన్ని తీసుకోండి, లేదా ఏదైనా కమ్యూనిస్టు విప్లవాన్ని. ఒకటి ఒక చివరన ఉంటే, మరొకటి మరొక చివరన ఉన్నది. అయినా వాటిలోనూ ఈ మూడు భిన్న ధోరణులున్నాయి. లక్ష్యం చేరిన తర్వాత క్రమంగా అవన్నీ నిజరూపాలలో ముందుకు వచ్చాయి. ఆ చర్చలోకి వెళ్లేందుకు ఇది సందర్భం కాదు గనుక పక్కన ఉంచి, తెలంగాణ విషయం చూద్దా ము. రాష్ట్రం ఏర్పడి ఇప్పటికి రెండున్నర సంవత్సరాలు గడిచాయి. మనకు ఉద్యమంలో పాల్గొన్న వారున్నారు, పాల్గొనని వారున్నారు, వ్యతిరేకించిన వారున్నారు. మొత్తానికి వీరందరూ అంతిమంగా కొత్త రాష్ట్రపు పౌరులయ్యారు. పైన చెప్పుకున్నట్లు, రాష్ట్రం ఏర్పడి రెండున్నర సంవత్సరాలు గడిచింది. ఈ కాలంలో ఎవరు ఏ విధంగా తేలారన్నది ప్రశ్న.

ఇది ప్రశ్న కావటమెందుకు అన్నది మనం విచారించవలసిన ఒక విషయం. రాష్ట్రం ఏర్పడిన రెండున్నరేండ్ల అనంతరం ఎందువల్ల ప్రశ్న అవుతున్నదనేది మరొక విషయం. ఇది ప్రశ్న కావటం ఎందుకంటే, తెలంగాణ భవిష్యత్తు పురోగతికి దీనితో సంబంధం ఉన్నది. రాష్ట్రం కోసం ఉద్యమం జరుగుతున్న కాలంలో మొదట పేర్కొన్న మూడు విధాలైనవారు ఉండటం వేరు. ఏ ఉద్యమంలోనైనా అదొక సహజస్థితి. అప్పటికి గల వివిధ నేపథ్య పరిస్థితులను బట్టి ఆయా వర్గాలు లేదా వ్యక్తుల ప్రయోజనాలను బట్టి దృక్పథాలను బట్టి అది జరుగుతుంది. కనుక ఇటువంటి అవగాహనతో ఆ భిన్నత్వాలను విస్మరించవచ్చు. కాని తెలంగాణ ఏర్పడటం అనే లక్ష్యాన్ని చేరుకున్న అనంతరం కూడా ఈ భిన్నత్వాలు కొనసాగటం విస్మరించలేని విషయం. అందుకే ఈ రెం డున్నరేండ్లలో ఎవరు ఏ విధంగా తేలారన్నది ప్రశ్న అవుతుంది. వాళ్లు అట్లా తేలటానికి, తెలంగాణ భవిష్యత్తు పురోగతికి సంబంధం ఉన్నది గనుక.

రాష్ట్రం ఏర్పడిన రెండున్నర సంవత్సరాల తర్వాత ఎందుకు ప్రశ్న అవుతున్నది అంటే యథాతథంగా అందుకేదో ప్రత్యేకత ఉందని కాదు. కాని, రాష్ట్రం ఏర్పడిన వెనుక ప్రజలు మొదటి ప్రాతినిధ్య శాసనసభను ఎన్నుకుని, ఆ సభ గడువు సగకాలం గడిచినందున ఇది సమీక్షకు తగిన సమయం అవుతున్నది. అందువల్ల, పైన పేర్కొన్న మొదటి ప్రశ్నను, ఈ రెండవ ప్రశ్నను కలిపి చూస్తూ, ఆ మూడు రకాలైన వారిలో ఎవరు ఏ విధంగా తేలారో అర్థం చేసుకునేందుకు ప్రయత్నించాలి. ఇటువంటి ప్రయత్నాలలో కొత్తదనం ఏమీ లేదు. భారత స్వాతంత్రోద్యమాన్నే గమనిస్తే, వలసపాలనా కాలంలోని వేర్వేరు రాజకీయ, ఆర్థిక-సామాజిక వర్గాలు ఆ ఉద్యమంలో పాల్గొన్న, లేదా పాల్గొనని తీరెటువంటిది? పాల్గొన్న, లేదా పాల్గొనని, లేదా వ్యతిరేకించిన వివిధ పార్టీల లక్ష్యాలేమిటి? వీరంతా స్వాతంత్య్రానంతరం ఏయే విధాలుగా మారారు? ఎవరు చెప్పిన దానికి ఏ విధంగా కట్టుబడి, ఏ విధంగా అందుకు విరుద్ధంగా వ్యవహరించారు? అనే సమీక్షలు మనకు అనేకం ఉన్నాయి.

ప్రత్యక్షంగానో, పరోక్షంగానో అనేక చరిత్రలు, అధ్యయనాలలో ఇవి కన్పిస్తాయి. కానీ తెలంగాణకు సంబంధించి ఇది ఇంకా ఉన్నట్లు లేదు. అక్కడక్కడ ఏవైనా క్లుప్తమైన ప్రస్తావనలు ఉంటే ఉండవచ్చు. కాని ఈ కోణంపైనే దృష్టిపెట్టి చేసిన పరిశీలనలు కన్పించవు. రెండున్నర సంవత్సరాలు అందుకింకా తగినంతకాలం కాదేమో తెలియదు. కాని, జరుగుతున్న వాటిని చూడగా అది అవసరమనిపిస్తున్నది. ఎవరు ఏ విధం గా తేలుతున్నారో తెలంగాణ ప్రజలకు తెలియవలసిన అవసరముంది. కనీసం ప్రాథమికంగానైనా తమకు డిమాండ్ల హక్కు, హక్కుల హక్కు తో పాటు బాధ్యతల హక్కు కూడా ఉంటుందని, ఈ రెండు హక్కులు కలిపి ఒకటి జంట సంస్కృతి అవుతాయని గుర్తిస్తున్నది ఎవరు?

కొన్ని ఉదాహరణలు పేర్కొందాం. తన విధి బాధ్యతలను మాత్రం నెరవేర్చకుండా ప్రజలను సతాయిస్తూ, ప్రభుత్వ కార్యక్రమాలను కుంటుపరుస్తూ, లంచాలు గతంలో వలెనే పిండుతూ పోయే ఒక ఉద్యోగి, లేదా అధికారి. ఇంచుమించు ఇదే విధంగా వ్యవహరించే ఒక ఉపాధ్యాయుడు, లేదా వైద్యుడు. కాంట్రాక్టుకు తీసుకున్న పనులు నాణ్యతతో చేయని ఒక కాంట్రాక్టరు. తమ రాజకీ య ప్రయోజనాల కోసం నీటి పారుదల ప్రాజెక్టులను, ఇతర అభివృద్ధి కార్యక్రమాలను రకరకాలు గా అడ్డుకునే ఒక నాయకుడు, క్షేత్రస్థాయి వాస్తవాలతో ప్రజల మనోభావాలతో నిమిత్తంలేక వ్యక్తిగత ఊహాలోకంలో విహరించే ఒక పట్టణ మేధావి, డిమాండ్ల సంస్కృతి మినహా బాధ్యతల సంస్కృతి ని అలవరచుకోని ఒక సంఘ నాయకుడు. ఇటువంటి వారంతా మొదట పేర్కొన్న మూడు తరగతులలో దేనికిందకు వస్తారు? బాధ్యతలు కూడా ఒక హక్కు అని వీరు అర్థం చేసుకుంటున్నారా?

ఏ ఉద్యమంలోనైనా వైయక్తిక ప్రయోజనం లక్ష్యాలను పూర్తిగా కాదనలేం. అది వాస్తవాలతో నిమిత్తంలేని శుష్క ఆదర్శవాదమవుతుంది. కాని వైయక్తికానికి సామూహికంతో విడదీయరాని సం బంధం ఉంటుంది. ఇది గుర్తించవలసిన విషయం. దీనిని సబ్జెక్టివిటీ టు ఆబ్జెక్టివిటీ అనవచ్చు. అందు లో సబ్జెక్టివిటీ అంతర్థానం కాదు. కానీ ఆబ్జెక్టివిటీ తో గల సంబంధాన్ని గుర్తించి దానితో ఇమిడిపో యి, అందుకు లోబడి ఉంటుంది. తెలంగాణ ఉద్య మం సహా ఏ ఉద్యమంలోనైనా కన్పించేది అదే. కానీ ఒకసారి ఉద్య మ లక్ష్యం నెరవేరిన తర్వాత ఈ సామూహికతా సూత్రాన్ని విస్మరించి వైయక్తిక ప్రయోజనాన్ని ముందుకు తేవటం వల్లనే సమస్యలు తలెత్తుతున్నాయి. ఇది అంతటా జరిగినట్లే తెలంగాణలోనూ జరుగుతున్నది.

ఒక రైతు ఉంటాడు. తనకు నీరు కావాలనుకోవటంలో వైయక్తికత ఎంత ఉందో సామూహికత అంత ఉంది. రెండింటికి గల విడదీయరాని సంబంధం తనకు తెలుసు గనుక వైయక్తికంగా ఆలోచించను కూడా లేడు. తనది డిమాండ్ల సంస్కృతి ఎంతో, బాధ్యతల సంస్కృతి కూడా అంత. తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి లక్ష్యం ఎంత ఉందో, ఆదర్శం కూడా అంత ఉందని తనకు ఎవరూ చెప్పనక్కరలేకుండా సహజమైన రీతిలో, అనుభవంతో, ఇంగితజ్ఞానంతో కలిగిన స్పృహ. దీనినే బాధ్యతల సంస్కృతి అంటున్నాము. బాధ్యతను తన పట్ల, సమాజం పట్ల కూడా నెరవేర్చటమన్న మాట.

రైతు దేశానికి వెన్నెముక, అన్నదాతే కాడు. ఉపాధ్యాయుడు, జ్ఞానదాత కూడా. కనుక తాను వీలైనంత పరిహారం కోరవచ్చుగాని ప్రాజెక్టులే వద్దనడు. రాజకీయ స్వప్రయోజనాల కోసం చతురమైన రీతిలో రకరకాల సాకులు చెప్పి అడ్డుపడే నాయకుల వలె వ్యవహరించడు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నపుడు ఏ విధంగానైతే స్వప్రయోజనాలను, తెలంగాణ సామూహిక ప్రయోజనాలను కలగలిపి చూసాడో, అదే స్పృహను రాష్ట్రం ఏర్పడిన గత రెండున్నరేండ్లుగా కూడా చూపుతున్నాడు. కాని అనేకులు, ఉద్యమానంతర కాలం లో, తమ నిజరూపంలో బయటకు వస్తున్నారు. వారికి డిమాండ్ల సంస్కృ తి కొనసాగటం మినహా బాధ్యతల సంస్కృతి అలవడటంలేదు. అది కొం దరు ఉద్యోగులు, టీచర్లు, వైద్యులు, కాంట్రాక్టర్ల వంటివారు కావచ్చు. చెత్తను ఇప్పటికీ వీధుల్లో పారబోసి, హరితహారం మొక్కలు తమ ఇంటిముందే ఉన్నా ఎండబెడుతున్న పౌరులు కావ చ్చు. అధికారం కోసం తహతహలాడే రాజకీయ నాయకులు, ఇతరులు కావచ్చు. కింది కార్యకర్తలను, జనాలను ఇంధనంగా ఉపయోగించుకొని స్వప్రయోజనాలు నెరవేర్చుకునే ఛప్పన్నారు సంఘాల నాయకులు కావచ్చు.
Ashok
title="Ashok"/>
ఇటువంటి వారి వైయక్తిక ప్రయోజనాలతో, డిమాండ్ల సంస్కృతిలో తెలంగాణకు సమస్య లే దు. రాష్ట్రం అందరినీ ఆదరిస్తుంది. కాని వారు వైయక్తికానికి సామూహికతతో గల సంబంధాన్ని, డిమాండ్ల సంస్కృతితో పాటుగా బాధ్యతల సం స్కృతిని కూడా అలవరచుకోవలసిన అవసరాన్ని గుర్తించి వ్యవహరించకపోవటమే సమస్య అవుతున్నది. ఉద్యమకాలంలో వలెనే తర్వాత కూడా ఇటువంటి స్పృహ, సంస్కృతి కొనసాగటం తెలంగాణ అభివృద్ధికి చాలా దోహదం చేస్తుంది.

938
Tags

More News

VIRAL NEWS