అభివృద్ధికి అడ్డంకిగా ఎన్నికలు

Thu,January 12, 2017 12:59 AM

ఒకేరోజు ఎన్నికలు జరుపుకొని మరుసటి రోజు ఎన్నికల ఫలితాలు విడుదల చేసే ప్రభుత్వానికి డబ్బు, సమయం ఆదా అవుతుంది. అలాగే పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు అయిపోయిన నెలకు, రెండు నెలలకు కానీ దేశం మొత్తం ఒకేసారి జిల్లా, మండల, గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుపుకోవాలి. ఎన్నికలు దేశమంతా ఒకేసారి లేదా రాష్ర్టానికి ఒకరోజు చొప్పున అన్ని రాష్ర్టాలు వారివారి ఎన్నికల పనులు పూర్తి చేసుకోవాలి.

మన దేశంలో ఎప్పుడూ ఏదో ఒక ప్రాంతంలో ఎన్నికలు జరుగుతూనే ఉంటాయి. ఎన్నికలనగానే గుర్చొచ్చేది సామాన్యులు పడే ఇబ్బందు లు. ఎలక్షన్ కమిషన్ కోడ్, లౌడ్ స్పీకర్లు, రోడ్‌షోలు.. ఇవన్నీ నాణేనికి ఒకవైపు అయితే ఎన్నికలు అయిపోయేదాక ఎలాంటి అభివృద్ధి పనులు జరుగకపోవడం అనేది అతి పెద్ద సమస్య.
ఇప్పుడు ఐదు రాష్ర్టాల ఎన్నికలు వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం దేశ బడ్జెట్ ప్రవేశపెట్టాలి. మరి ఆ బడ్జెట్ ఎన్నికలను ప్రభావితం చేసే అవకా శం ఉన్నది. కాబట్టి ఎన్నికలు అయిపొయేదాక బడ్జెట్ ప్రవేశపెట్టొద్దని ప్రతిపక్షాలు, ఎన్నికల్లో నిలబడే అభ్యర్థులు కొందరు కోరుతున్నారు. వారి అభ్యర్థనకు స్పందిస్తూ ఎన్నికల కమిషన్ కూడా కేంద్ర ప్రభుత్వాన్ని బడ్జెట్ ఎం దుకు వాయిదా వేయకూడదని అడిగింది! అయితే దేశం లో 29 రాష్ర్టాలుంటే ఐదు రాష్ర్టాల కోసం మిగతా 24 రాష్ర్టాల్లో అభి వృద్ధి పనులు జరుగకూడదా? ఇదెక్కడి న్యాయం?

సరే వేరేలా ఆలోచిద్దాం. అధికారం ఉం ది కదా అని కేంద్ర ప్రభుత్వం ఐదు రాష్ర్టా ల ఎన్నికల ముందు బడ్జెట్ ప్రవేశపెట్టి తద్వారా విజయావకాశాలను పెంచుకోవాలనుకోవడం ఏం న్యాయం?
అయితే ఎన్నికలు వచ్చిన ప్రతీసారి అభివృద్ధి ఆగిపోవడం, ప్రజలు కష్టాలు పడటం సాధారణమైపోయింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరంతరం ఎదుర్కొంటున్న సమస్య ఇది. ఒకసారి సర్పంచి ఎన్నికలు వస్తా యి, ఇంకోసారి మున్సిపల్ ఎలక్షన్లు వస్తాయి, ఇంకోసారి మండల పరిషత్ ఎన్నికలు.. ఇలా ఎన్నికలు వస్తూనే ఉంటాయి. ఈ ఎన్నికలు వచ్చిన ప్రతిసారి ప్రజలు నాయకత్వాన్ని ఎన్నుకోవడం ఎంత ముఖ్యమో, ఎన్నికల ఖర్చు, ప్రజల ఇబ్బందులు, అభివృద్ధి ఆగిపోవడం ఒక సమస్య లాగా తయారైంది. ఈ పరిస్థితికి కారణం స్వాతంత్య్రం వచ్చినప్పటి మన ఎన్నికల విధానం. దీన్ని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ప్రపంచంలో మొదటిసారి ఎన్నికలు 17వ శతాబ్దంలో జరిగాయి. అప్పటినుంచి అవసరాలను బట్టి ఎన్నికల విధానం, ఎన్నికల్లో అవలంబిం చాల్సిన పద్ధతులు మారుతూ వచ్చాయి. ఇప్పుడు ఎన్నికల విధానాన్ని మార్చుకునే అవసరం వచ్చింది. దేశ జనాభాను, ఇక్కడి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ప్రజలు ఇబ్బంది పడకుండా దేశవ్యాప్తంగా ఎన్నికలు ఒకేసారి జరిగే విధంగా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి.

పరిస్థితులు మారాయి, మన దేశం కూడా ప్రపంచంతో పోటీ పడాలి. అమెరికా, బ్రిటన్ వంటి దేశాల్లో ఒకేరోజు ఉదయం ఐదు గంటల నుం చి రాత్రి పది గంటల వరకు ఎన్నికలు జరుగుతాయి. మరుసటి రోజు ఉద యం ఎవరు గెలిచారో తెలిసిపోతుంది. ఇలా చేయడం వల్ల తర్వాతి ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటు చేయబోతున్నారో ప్రపంచానికి తెలిసిపోతుంది. అలాగే దేశ ఆర్థిక, అంతర్జాతీయ సంబంధాల్లో ఎలాంటి స్తంభన ఎర్పడదు. మన దేశ పరిస్థితులు అమెరికా లాంటి దేశాలతో పోల్చితే కొం చెం భిన్నమైనా మన దేశంలో కూడా ఒకేరోజు అసెంబ్లీ, పార్లమెంట్, ఎమ్మెల్సీ ఎన్నికలు జరుపుకోలేమా?

2014 జనరల్ ఎన్నికలు ఏప్రిల్ 7న మొదలైతే మే 16న ఫలితాలు విడుదల చేయడం జరిగింది. అయితే ఈ నెలన్నర రోజులు విదేశీ పెట్టుబడులు రావు. ఆర్థిక లావాదేవీలు పెద్దగా జరుగవు. ఆర్థికవ్యవస్థ మొత్తం కుంటుపడిపోతుంది. ప్రజలుగా మనకు కానీ ఈ దేశానికి కానీ ఈ పరిస్థి తి మంచిది కాదు. మరోవైపు అభివృద్ధిని కాంక్షించే ప్రభుత్వం కోసం పెట్టుబడులు పెట్టే విదేశీ సంస్థలు ఎదురుచూస్తాయి. పెట్టుబడులు పెట్టే వారిని వేచిచూసే విధంగా చేయడం దేశానికి, దేశపౌరులుగా మనకు మంచిది కాదు. ఇలాంటి పరిస్థితుల్లో పెట్టుబడులు వెనక్కి వెళ్లే అవకాశం ఉంటుంది. ఈ పరిస్థితులు దేశానికి మంచిది కాదు. కాబట్టి తదుపరి ప్రభుత్వం ఎవరు అని ఎంత త్వరగా తెలిస్తే దేశ ఆర్థిక పరిస్థితి అంత మెరుగ్గా ఉంటుంది. అందుకే అగ్రరాజ్యం అమెరికా, బ్రిటన్ వంటి దేశా ల్లో ఎన్నికలు ఒకేరోజు జరుగుతాయి. మరుసటి రోజు ఉదయం ఫలితా లు వచ్చేస్తాయి.

ఇలా ఒకేరోజు ఎన్నికలు జరుపుకొని మరుసటి రోజు ఎన్నికల ఫలితాలు విడుద ల చేసే ప్రభుత్వానికి డబ్బు, సమయం ఆదా అవుతుంది. అలాగే పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు అయిపోయిన నెలకు, రెండు నెలలకు కానీ దేశం మొత్తం ఒకే సా రి జిల్లా, మండల, గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుపుకోవాలి. ఎన్నికలు దేశ మంతా ఒకేసారి లేదా రాష్ర్టానికి ఒకరోజు చొప్పున అన్ని రాష్ర్టాలు వారి వారి ఎన్నికల పనులు పూర్తి చేసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడగానే ఎన్నికలంటే కష్టంగానే ఉంటుంది. కానీ నిత్యాగ్నిహోత్రం లాంటి మన ఎన్నికల విధానాన్ని నిస్వార్థంగా మార్చాలంటే ఇలా చేయాల్సిందే.
srujan
title="srujan"/>
ఇలా చేస్తే.. మళ్లీ ఐదేండ్ల దాకా ప్రభుత్వాలు ఎలాంటి ఎన్నికల ఒత్తిడి లేకుండా పనిచేసుకోవచ్చు. అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో ఉప ఎన్నికలు వస్తే అభివృద్ధి పనుల మీద ఆంక్షలు లేకుండా ఎన్నికల కోడ్ ఉండేలా చూసుకోవాలి.

897
Tags

More News

VIRAL NEWS