ఒక్కడే సూర్యుడు

Thu,January 12, 2017 12:57 AM

సాహితీ మిత్రదీప్తిలో అపురూప కిరణాలతో విజృంభించిన నేస్తం! పేరులో అహిమకరుడున్నా నీవెప్పుడూ హిమకరుడవే!
చండ్ర ప్రచండమైన కవితా కిరణాలను వెదజల్లినా వెన్నకన్న మెత్తని మనసున్న ఓ ప్రభాకరన్నా!
జగిత్యాలలోని పూర్ణిమ నీ చెవిలో ఏం ఊదిందని కరీంనగర్‌లో శిల్పివైతివి?
Alisetti-Prabhaka
title="Alisetti-Prabhaka"/>
కరీంనగర్‌లోని శిల్పి నీకేం నూరిపోస్తే నగరం ఎడారిని వెతుక్కుంటా పోతివి!
జీవన సమరంలో నీకు తోడున్న వాళ్ళను ఒంటరి తనానికి అప్పగించేసి సంక్షోభగీతాన్ని సార్థకం చేసినవ్!
సిటిలైఫ్‌ను రక్తరేఖలతో చిత్రించి, ఎర్రపావురమై ఎగిరిపోయినవ్!
నీ చురకలు తగిలినోళ్ళు మాత్రం ఇప్పటికీ ఉలికి పడుతనే ఉన్నరు!
చలికాలం నెగళ్ళలో నీ మంటల జెండాలు ఇంకా కవోష్ణాన్ని వెదజల్లుతూనే ఉన్నయ్!
ఎంతమంది ప్రభాకర్‌లు పుట్టుకొచ్చినా నిన్ను మరిపించలేరు నేస్తం!
ఒక సూర్యుడ్ని మరో సూర్యునితో పోల్చగలమా?!
- దోరవేటి(నేడు అలిశెట్టి ప్రభాకర్ జయంతి, వర్ధంతి)

754
Tags

More News

VIRAL NEWS