గిరిజనుల ఆరాధ్య దైవం

Wed,January 11, 2017 01:11 AM

హైమన్ డార్ఫ్ నాగోబా జాతరలో ఏర్పాటుచేసిన గిరిజన దర్బార్ నేటికీ కొనసాగుతున్నది. అయితే అధికారులు, ప్రజాప్రతినిధులు దీనిపై పూర్తిస్థాయిలో దృష్టిసారించడంలే దు. దీంతో చాలా సందర్భాల్లో వారి సమస్యలు పరిష్కారానికి
నోచుకోకుండా అలాగే ఉండిపోతున్నాయి.


పుట్టింది రాజ కుటుంబంలో అయినప్పటికీ మారుమూల గిరిజన ప్రాంతంలో పర్యటించా డు. గిరిజనులకు జరుగుతున్న అన్యాయాలపై ప్రభుత్వానికి కనువిప్పు కలిగించి వారి జీవన స్థితిగతులను అధ్యయనం చేశాడు. తన జీవితాన్ని ధారపోసి గిరిజన గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయిన మహామనిషి హైమన్‌డార్ఫ్. లండన్ విశ్వవిద్యాలయానికి చెందిన మానవ శాస్త్ర అధ్యాపకుడు ఆయన. 1909, జూలైలో జన్మించాడు. లండన్ విశ్వవిద్యాలయంలో మానవ పరిణామశాస్త్రంలో డాక్టరేట్ పొందాడు. నేపాల్, పిలిప్పీన్స్, భారతదేశంలో ఆదివాసుల జీవన విధానాన్ని అధ్యయనం చేశారు. ఆయన మన దేశంలోని ఈశాన్య ప్రాంతంలో పర్యటిం చి ఆదివాసులపై పరిశోధనలు చేశారు. నాగరిక సమాజానికి దూరంగా, అభివృద్ధికి అందనంతగా తమ జీవితాలను గడుపుతున్న ఆదివాసీలను చూసి హైమన్ డార్ఫ్ తీవ్రంగా కలత చెందారు.

ఆర్థికంగా, సామాజికం గా, సాంస్కృతికంగా వెనుకబడిన తెగలకు ఒక ప్రత్యేక స్థానాన్ని కల్పించాలని సంకల్పించారు. 1940లో ఆసిఫాబాద్ ప్రాంతంలో కుమ్రం భీం నిజాం నిరంకుశత్వం, దోపిడీ విధానాలపై తిరుగుబాటు లేవదీశాడు. సాయుధ దళాలను పంపి కుమ్రంభీంను అప్పటి నిజాం సైన్యం జోడేఘాట్ వద్ద కాల్చి చంపింది. గోండుల్లో చెలరేగిన అలజడి, అశాంతిని మాత్రం నిజాం ప్రభుత్వం అణిచివేయలేకపోయింది. అశాంతికి కారణాలను విశ్లేషిస్తూ తగిన సూచనలివ్వాల్సిందిగా అప్పటి నిజాం ప్రభుత్వం మానవశాస్త్ర ఆచార్యుడైన హైమన్ డార్ఫ్‌ను కోరిం ది. పరిశీలన కోసం వచ్చిన ఆయన గోండుల దైన్యాన్ని చూసి కరిగిపోయింది ఆ సమస్యల పరిష్కారాన్ని అన్వేశిస్తూ ప్రస్తుత జైనూర్ మండ లం మార్లవాయి గ్రామంలో ఏండ్ల తరబడి ఉన్నాడు.

హైమన్ డార్ఫ్ పుణ్యమాని గోండులకు భూమిపై హక్కు, పట్టాలు లభించాయి. వారి అభివృద్ధి కోసం తొలిసారిగా నిజాం ప్రభుత్వం చట్టా లు కూడా చేసిందంటే కచ్చితంగా అది హైమన్ డార్ఫ్ పుణ్యమే. మార్లవాయిలో దాదాపు పన్నేండ్ల పాటు ఆదివాసీల్లో ఆదివాసీగా మారి వారి జీవిత సారాన్ని తెలుసుకున్నారు. గుడిసెల్లో నివసిస్తూ వారి భాషను నేర్చుకున్నారు. ఆదివాసీ జీవితాలను పరిశోధించడమే కాకుండా వారి లో ఒకడిగా మెదిలాడు. డార్ఫ్ కుటుంబానికి, గోండు సమాజానికి మధ్య అవినాభావ సంబంధం ఏర్పడింది. ఆదివాసీల సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారానికి ప్రభుత్వానికి ఎప్పుటికప్పుడు నివేదికలు పంపించేవారు. ఆదివాసీల అభివృద్ధికి సూచన చేయడమే కాకుండా వారికోసం అనేక ప్రామాణిక గ్రంథాలు రాశారు. ద గోండ్స్ ఆఫ్ ఆదిలాబాద్ గ్రంథంలో ఆదివాసీల జీవనవిధానం, వారి సంస్కృ తి, సంప్రదాయాన్ని వివరించారు. ఆదివాసీలకు భూమి, అడవి, నీటిపై పూర్తి అధికారం ఉండాలని, ఉన్నత విద్య కోసం శిక్షణ సంస్థలు ఏర్పాటు చేయాలని, ఆరోగ్య సంస్థలు అందుబాటులో ఉండాలని, ప్రభుత్వ సంక్షే మ పథకాలను వారికి నేరుగా అందించాలని ప్రభుత్వానికి సూచించారు.

ఆదివాసీల విన్నపాలను అక్కడికక్కడే పరిష్కారం చేసేందుకు జోడేఘా ట్, కేస్లాపూర్ జాతరల్లో దర్బార్ ఏర్పాటు చేయాలని, ఆదివాసీల సం స్కృతి, సంప్రదాయాలను పరిరక్షించాలని కోరారు. గోండు భాషను పరిరక్షించాలని ఆదివాసీల న్యాయస్థానాలైన రాయి సెంటర్లను అభివృద్ధి చేయాలని, ఆదివాసీలు సాగుచేస్తున్న భూములకు పట్టాలివ్వాలని స్పష్టం చేశారు. వారి సమగ్ర అభివృద్ధి కోసం ఎన్నో సిఫార్సులు చేశారు. హైమన్ డార్ఫ్ దంపతులు గిరిజన జీవన సరళిపై తమ పరిశీలను 3650 పేజీల్లో, వంద గంటల చలన చిత్రాల్లో పది వేలకుపైగా ఛాయచిత్రాల్లో నమోదు చేశారు. గిరిజన అభివృద్ధి అంటే కేవలం వేషభాషలు మార్చుకునే ఆధునీకీకరణ కాదని, వారి సాంస్కృతిక సంప్రదాయాలను కొనసాగిస్తూనే విద్యార్జన ద్వారా మేథోపరమైన అభివృద్ధిని సాధించడమని, తమ తదుపరి తరం వారిని ఉన్నత తీరాలకు తేర్చడమని హైమన్ డార్ఫ్ దంపతులు తెలిపేవారు.

ఆయన సతీమణి ఎలిజబెత్ బర్నార్డో లండన్‌లో పుట్టి పెరిగినప్పటికీ తన భర్తతో పాటు ఏండ్ల తరబడి ఆదిలాబాద్ అడవుల్లో కాలినడకన తిరుగుతూ హైమన్ డార్ఫ్‌కు పరిశోధనలో తోడ్పడింది. ఆదివాసీల సమస్యలను మాతృదృష్టితో అవగాహన చేసుకొని ఆ సమస్యల పరిష్కారాని కి తాను సైతం పై అధికారులకు రాసి సేవచేసిన వనిత. 1987లో ఆమె హైదరాబాద్‌లో కన్నుమూశారు. నాకు ఆవిడకు అర్థవంతమైన జీవితం గడిచింది గోండుల మధ్యనే. మేం కలిసి నివసించిన మార్లావాయి గ్రామంలో గోండుల ఆచారం ప్రకారం అంత్యక్రియలు జరుగాలని హైమన్ డార్ఫ్ చెప్పారు. ఆ మేరకు హైమన్ డార్ఫ్ మరణానంతరం అతని కుమారుడు నికోలస్ హైమన్‌డార్ఫ్ లండన్ నుంచి అస్థికలను 2012, ఫిబ్రవరి 25న తన తల్లి బెట్టి హైమన్ డార్ఫ్ సమాధి పక్కనే సమాధి చేశారు.
Kola

అర్ధ శతాబ్దం కిందట హైమన్ డార్ఫ్ దంపతులు గిరిజనులపై చేసిన పరిశోధనలు, జటిల సమస్యలకు సూచించిన పరిష్కారాలు మార్గదర్శనం, అనుసరణీయం. ఇంగ్లాండుకు తిరిగి వెళ్లిన తర్వాత కూడా హైమన్ దంపతులు తరచూ మార్లావాయి కి వచ్చి వెళ్లేవారు. పరిస్థితులు మెరుగుపడకపోవడంతో చింతించేవారు. హైమన్ డార్ఫ్ నాగోబా జాతరలో ఏర్పాటుచేసిన గిరిజన దర్బార్ నేటికీ కొనసాగుతున్నది. అయితే అధికారులు, ప్రజాప్రతినిధులు దీనిపై పూర్తిస్థాయిలో దృష్టిసారించడంలే దు. దీంతో చాలా సందర్భాల్లో వారి సమస్యలు పరిష్కారానికి నోచుకోకుండా అలాగే ఉండిపోతున్నాయి. గిరిజనులు పూర్తిస్థాయిలో అభివృద్ధి చెంది వారిని అన్నిరంగాల్లో ముందుకు తీసుకువెళ్లినప్పుడే హైమన్‌డార్ఫ్ ఆత్మకు శాంతి చేకూరుతుంది.
(నేడు హైమన్‌డార్ఫ్ 30వ వర్ధంతి)

830
Tags

More News

VIRAL NEWS