ఒక్క సెట్టు పూలు!

Tue,January 10, 2017 01:29 AM

కుక్కలు చింపిన విస్తరి చేసుకుంటారు... ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం పతాకస్థాయిలో ఉన్నపుడు ఒక ఆంధ్ర మిత్రుడు అన్నమాట. ఉక్రోశంతో అన్నాడో..ఆలోచనతో అన్నాడో తెలియదుగానీ ఓ రీజనూ చెప్పాడు. మీ దగ్గర భిన్నత్వం ఎక్కువ. ఒకడు లెప్ట్ అంటే ఇంకొకడు రైట్ అంటాడు. సైద్ధాంతిక రాద్ధాంతాలూ వీధి పోరాటాలు ఎక్కువే.. తెలంగాణ వచ్చినా నిలబెట్టుకోలేరు అన్నాడు.

నిజమే.. ఒక ప్రముఖమైన కోర్సును పరిచయం చేయటం తప్పు కాదు. కానీ దాన్ని ఏ రకంగా నిర్వహించారు? కోచింగ్ దరఖాస్తులు కొనడానికి అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాముదాకా బిచ్చగాళ్లలాగా రోడ్లమీద క్యూలు కట్టే స్థాయికి తల్లిదండ్రులను దిగజార్చారు. ఇన్ని అప్లికేషన్లు మాత్రమే అని కోటా పెట్టారు.


లేదు చూలు లేదు. అపుడే ఆ తెలంగాణ కావాలి అని ఒకడంటే, ఈ తెలంగాణ కావాలని ఇంకొకడు వాదిస్తున్నాడు. అదే మా దగ్గ ర సమైక్యాంధ్ర అంటే సమైక్యాంధ్రే. లెప్ట్ అయినా రైట్ అయినా.. అని ఉదాహరణ చెప్పాడు. ముక్తాయింపుగా చెప్పింది ఏమంటే తెలంగాణ కోసం అంతా ఏకోన్ముఖంగా పోరాడుతున్నట్టు కనిపిస్తున్నా..లోలోపల ఎవరి ఎజెండాలు వారికి ఉన్నయి. ఇవే రేపు మీకు గుదిబండలు అవుతాయి అని..!

తెలంగాణ వచ్చిందంటే ఫలానా హక్కులను గౌరవిస్తుందనుకు న్నం..అన్నారో మేధావి. ఏ హక్కులు.. ఎటువంటి హక్కులు? అని అడుగవద్దు. అక్కడ దబాయింపులు తప్ప జవాబులుండవు. మీటింగులకు కూడా అడ్డుకుంటారని అనుకోలేదు మరో మేధావి ఫిర్యాదు. ఏ మీటింగు. అంతర్గత ఎజెండాలేమిటి అని అడుగలేం. వాళ్లతో వాదించనూ లేం. తెలంగాణలో కూడాఎదురు కాల్పులు ఉంటాయనుకోలే దు టీవీ గొట్టాల ముందు ఇంకో విస్మయాత్మక అభివ్యక్తీకరణ. బాలారిష్టాలే దాటని రాష్ట్రంలో అలాంటి పరిస్థితి తేవాల్సిన పరిపక్వత వచ్చిం దా? అనే ప్రశ్న కేవలం అరణ్యరోదన. ఎందుకంటే.. వాళ్లు తెలంగాణ కావాలనుకున్నది అందుకోసమే కాబట్టి. ఇవాళ విచ్చలవిడి భూసేకరణను సాగనివ్వం అంటున్నారో పంతులుగారు. పూర్వాశ్రమంలో ఈయనా ఆ తానులోని పోగే... కాబట్టి వింతేంలేదు. ఇపుడు కొత్త చట్టం మీద ఢిల్లీకి కూడా వెళ్లి ఆపిస్తారట. చెప్పేదేముంది? కొందరి పనే అదిగదా!

శస్ర్తోపజీవినాం కలహమన్తరేణ భక్తమపి భుక్తం న జీర్యతి ఆయుధోప జీవులకి కలహం లేకపోతే తిన్న అన్నం కూడా జీర్ణం కాదు. అవును రాష్ట్రంలోని కొందరు శస్ర్తోపజీవులకు ఇవాళ కార్యక్షేత్రం ప్రాజెక్టులు. ఒకనాడు తెలంగాణ ఉద్యమ వేదికల మీద నీళ్లు, ప్రాజెక్టు ల గురించి గొంతు చించుకున్నవాళ్లే వీళ్లంతా. అయినా ఇవాళ ఓ పంతులుగారు ప్రాజెక్టులకు వ్యతిరేకంగా రాష్ట్రమంతా కాలుకు బలపం కట్టుకుని తిరుగుతున్నారు. ఈ మధ్య అకారణమో సకారణమో ఆయన ఒకరోజు దీక్ష చేశారు. విరమించారు. దీక్ష విరమణ ఓ లెక్కల పంతులుగారి చేతుల మీద చేయించుకున్నారేమో.. తన దీక్ష వల్ల రెండు లాభాలు కలిగాయని లెక్కలు వేసుకున్నారు.

ఒక్క సెట్టు పూల లెక్క అందరం కూడినం..అని సంబురపడ్డరు.
నిజమే. అన్నీ ఒక్క చెట్టు పూలే. ప్రాజెక్టుల దగ్గరి నుంచి ప్రతి విషయంలో రాద్ధాంతం చేసినవే. ఇవన్నీ ఒక్క దగ్గర చేరి ఏం చేస్తయో అర్థం చేసుకోవటం కష్టం కాదు. దీక్ష విరమిస్తూ పంతులుగారు ప్రసంగించారు. మొహమాటం ఏమీ లేదు.. నేరుగానే ప్రభుత్వం మీద యుద్ధప్రకటనలు.. అసెంబ్లీని కూడా మినహాయించలేదు. సరే.. భూ నిర్వాసితులను ఆ ఎమ్మెల్యే ఇట్లన్నడు.. ఈ కలెక్టరమ్మలు అట్ల అరిచిండ్రు. మంత్రులు ఇట్ల బెదిరించిండ్రు.. వంటి డైలాగులకు కొదువ లేదు. ఉద్యమాల్లో తిరిగే వారికి ఎదుటి వాళ్లను విలన్లుగా ఫోకస్ చేయటం కోసం దృశ్యవచనాలు, వచనదృశ్యాలు ఆవిష్కరించటం మంచినీళ్ల ప్రాయం.

ప్రభుత్వానికి ప్రతినాయక పాత్ర లక్షణాలు ఆపాదించడానికి .. పాపం ఇండియా సాహిత్యంలో దొరుకలేదేమో అక్కడెక్కడికో పోయి ఓ కొటేషన్ తీసుకువచ్చి చెప్పారు.
ఒక గవర్నమెంటు నిర్బంధానికి దిగుతుందంటే ఆ గవర్నమెంటు తనమీద తాను నమ్మకం కోల్పోయిందని..అర్థం అని ఫ్రెంచి ఫిలాసఫర్ అన్నారట. నిజమే..కానీ విషయం ఏమిటంటే అక్కడి ప్రజాస్వామ్యంలో నీతి-నిజాయితీ ఉంది. హుందాతనం ఉంది. మన దగ్గర ఉన్నట్టు అక్కడ గుండుసూది పార్టీలు...దబ్బనం పార్టీలు లేవు. జేబుల్లో రాళ్లు పెట్టుకువచ్చి కాల్పుల సంఘటనలకు కుట్రలు చేయరు. కాబట్టి ఇక్కడ ప్రభుత్వాలు భిన్నంగానే వ్యవహరించాల్సి ఉంటుంది. పైగా మన ట్రాక్ రికార్డు ఏమన్న సామాన్యమైందా? 2001నుంచి చిన్న విధ్వంసం లేకుండా సాగిన తెలంగాణ ఉద్యమంలో ఎవరు ప్రవేశించా క.. ఎలాంటి విపరీత దుందుడుకు పద్ధతులు పుట్టుకు వచ్చాయో ఇవాళ హైదరాబాద్ మీద సెక్షన్-8 కత్తి వేలాడటానికి ఎవరి చర్యలు కారణమయ్యాయో కొంచెం లోతుగా చర్చిస్తే తెలుస్తుంది.

పంతులుగారు చివర్లో చెప్పారు. పాక్కుంటనన్న పోరాడుతనని... నరుడికంటే నడక నేర్పాలిగానీ..పాముకు పాకుడు నేర్పాలా? పుట్టుకతోనే వస్తది... భారతదేశంలో పామరుడు కూడాఈ విషయం చెప్తడు. మరి ఫ్రెంచి ఫిలాసఫీలో ఈ పాయింట్ ఎవరన్న చెప్పారో లేదో..మనకు తెలియదు!

దాదాపు మూడు దశాబ్దాల కిందట మూడక్షరాల మహమ్మారి ఒకటి తెలుగు రాష్ర్టాల మీద దాడి చేసింది. నెలకు లక్షల రూపాయల జీతం కూడా వస్తదట..అని తల్లిదండ్రులను ఊరించిన ఓ కోర్సు రాష్ట్ర ప్రజలకు పరిచయం అయింది. దాన్ని పరిచయం చేసిన మహానుభావులు తమ మీడియా మిత్రుల నెట్ వర్క్ ద్వారా ఇంటర్వ్యూలు, ప్రత్యేక కథనాల ద్వారా దేశం మొత్తం మీద పదివేల సీట్లు కూడా సరిగాలేని ఆ కోర్సు కోసం ఇక్కడ లక్షల మందిని గంగవెర్రులెత్తించారు.

నిజమే.. ఒక ప్రముఖమైన కోర్సును పరిచ యం చేయటం తప్పు కాదు. కానీ దాన్ని ఏ రకం గా నిర్వహించారు? కోచింగ్ దరఖాస్తులు కొనడానికి అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాముదాకా బిచ్చగాళ్లలాగా రోడ్లమీద క్యూలు కట్టే స్థాయికి తల్లిదండ్రులను దిగజార్చారు. ఇన్ని అప్లికేషన్లు మాత్రమే అని కోటా పెట్టారు. వాస్తవానికి అది కేవలం ప్రవేశపరీక్షకు సిద్ధం చేసే శిక్షణ. అంటే ప్రధాన విద్య కాదు. సామాజిక బాధ్యత కలిగిన వారు దాన్ని ముఖ్య విద్యకు విఘాతం లేకుండా నిర్వహించాలి. కానీ ఏం చేశారు? భోజనానికీ సమయం ఇవ్వనంత హోంవర్క్. ఇంటర్ విద్య కోచింగ్ స్థాయికి.. కోచిం గ్ ప్రధాన విద్య స్థాయికి మారిపోయింది.

ఇవాళ ఈ మూడక్షరాల కోర్సు ఎన్ని లక్షలమం ది తల్లిదండ్రుల కన్నీళ్లు తాగుతున్నదో తెలుసా? పిల్లలను చదివించడానికి ఎంతమంది తల్లిదండ్రు లు చెమటను రక్తంగా మార్చుకుంటున్నారో తెలు సా? ఎన్ని సుఖాలను త్యాగం చేస్తున్నారో.. ఎన్ని కనీస అవసరాలను వాయిదాలు వేసుకుంటున్నారో తెలుసా? ఎన్ని అప్పులు చేసి వాటికి మిత్తీలు కట్టి గుండెలమీద భారం మోస్తున్నారో తెలుసా? అప్పులే తెస్తున్నారో.. ఆస్తులే కరిగించుకుంటున్నారో.. తప్పులే చేస్తున్నారో. చదివించటం కోసమే పిల్లలను కంటున్నట్టు తల్లిదండ్రులు మారిపోతే...చదువుకోవటం కోసమే పుట్టినట్టుగా ఇటు పిల్లలు బతుకుతున్నారు.

ఈ కోర్సు హాస్టల్ కోచింగ్ ఫీజు కోసం ఎకరంన్నర పొలం అమ్మే పత్రం మీద సంతకం చేస్తూ ఆవిడ కండ్లలో తిరిగిన నీటి సుడులు, కాలే జీ కౌంటర్‌లో ఫీజు కట్టేముందు నోట్లు లెక్కపెడుతున్నపుడు నా చేతిలో పుట్టిన వణుకు తాలూకు ఉద్వేగం ఇప్పటికీ నా మస్తిష్కంలో తాజాగానే ఉంది. పొలం పోయింది. సీటు రాలేదు. ఇవాల్టికీ పుట్టింటికి వెళ్లే బస్సులో ఆవిడ కుడివైపు సీట్లో కూర్చోదు. ఎందుకంటే ఊళ్లోకి వెళుతుంటే ఆ వైపే ఆమె అమ్మేసిన పొలం ఉంది. తప్పనిసరై కూర్చోవాల్సి వస్తే తల వంచి కళ్లు మూసుకుంటుంది. కళ్లు తుడుచుకుంటుంది. ఆ రోజంతా మా మధ్య మౌనమే. ఒకరి ముఖం ఒకరు చూసుకోలేనంత గిల్టీనెస్ చెప్పాడు సహచర పాత్రికేయ మిత్రుడు.

మేమేం పిలిచి చేరమన్నామా? అని అడుగవచ్చు. కానీ మన దేశం లో తల్లిదండ్రులు పిచ్చోల్లు. అమాయకులు. పిల్లలను పిచ్చిగా వెర్రిగా ప్రేమిస్తారు. లక్షల రూపాయల జీతం తీసుకునే స్థాయికి పిల్లలు చేరుతారంటే.. శరీరంలో సగం కోసి ఇమ్మన్నా పరాపరా కోసి ఇచ్చేస్తారు. ఇంత సున్నితమైన సంబంధాలతో ముడిపడిన అంశం మీద ఎంత జాగ్రత్తగా వ్యవహరించాలి. సామాజిక బాధ్యత తెలిసి ఉంటే ఒక్కనాడైనా ఇలాంటి వేలం వెర్రి వద్దు.. దేశం మొత్తం మీద ఈ కోర్సులో ఇన్ని సీట్లు మాత్రమే ఉంటాయి.. ఇంత మందికి మాత్రమే వస్తాయి... మంచి జీవితానికి ఇంకా ఇన్నిన్ని కోర్సులున్నా యి..అని చెప్పిఉండాలి. ఎన్నడన్నా అలాంటి మాటలు మీ నోటినుంచి వచ్చాయా? మానవీయత అంటే ఆకలితో ఉన్నవాడిని చూపిం చి సెం టిమెంటు పిండటం కాదు ... అమాయకులను ఆశల పల్లకీ ఎక్కించి మోసం చేయకుండా ఉండ టం కూడా!ఇవాల వేదిక మీద సాగిసాగి నీతులు చెప్తున్న లెక్కల పంతులూ.. నిన్నా మొన్నటిదాకా జరిగిన రైతు ఆత్మహత్యల చిట్టాలో మీరు పెంచి పోషించిన ఈ మూడక్షరాల భూతానికి ఉన్న ఖాతా ఎం త? ఆ భూతం కార్పొరేట్ రూపం తీసుకుని ఈ రాష్ట్ర ప్రజల నుంచి పిండిన డబ్బు ఎన్ని వందల వేల కోట్లు? చదివి బాగుపడ్డ వారందెరు? చదివించి బతుకులు తాకట్టు పడ్డ వారెందరు? ఇది చాలదా? ఇంకా రీయింబర్స్‌మెంటు అంటూ ప్రైవేటు రంగానికి ఇంకా దోచిపెట్టడానికి గోచి బిగింపులెందుకు?
pointblank4sgv@gmail.com
-సవాల్‌రెడ్డి

1057
Tags

More News

VIRAL NEWS